ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్* ( రెండవ భాగము)

✨💥💫 *క్రిస్మస్* 💥 ✨💫 
         ( రెండవ భాగము) 

యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. మత్తయి 2:2 
          

🌟 స్టార్ (నక్షత్రం):
(స్వయంగా ప్రకాశించేది)

ఈలోకంలో చాలా స్టార్స్ వున్నాయ్. 
💫 సూపర్ స్టార్ 
💫టెరా స్టార్ 
💫మెగా స్టార్ 
💫ఈ స్టార్స్ గా పిలువబడే  వారిని వెంబడించేవారు లోకంలో కోకొల్లలు. 
👉 ఈ స్టార్స్ వెలుగులో ఉన్నవారిని చీకటిలోనికి తీసుకెళ్తారు తప్ప, చీకటిలోనున్న వారిని వెలుగు లోనికి నడిపించలేరు. 

అయితే, ప్రకాశ మానమైన నక్షత్రం ఒకటుంది. అది,
✨ ప్రకాశించింది. 
✨ అత్యానందాన్నిచ్చింది
✨ దారి చూపించింది. 
✨ గమ్యం చేర్చగలిగింది. 

యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువచుక్కయునై యున్నాను. ప్రకటన  22:16

💮 ఆ స్టార్ మన ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు.

⭐️ ఈ స్టార్ కున్న 5 కోణాలు, 
ప్రియ రక్షకుని 5 గుణగణాలను తెలియజేస్తున్నాయి. 
🔺ఆశ్చర్యకరుడు 
🔺ఆలోచనకర్త 
🔺బలవంతుడైన దేవుడు 
🔺నిత్యుడగు తండ్రి 
🔺సమాధానకర్త
          యెషయా 9:6 

ఇంతకీ నీ గమ్యమేమిటి?
ఏ స్టార్ ని వెంబడిస్తున్నావ్?

 💥 ఈ లోకంలో స్టార్స్ ని నీవు కలవాలంటే? నీకు ఎప్పటికీ అనుమతి దొరకక పోవచ్చు. 
కాని, ఈ స్టార్ నిన్ను కలసుకోడానికి దివి నుండి భువికి దిగి వచ్చింది. 

💥 ఈ లోకంలో స్టార్స్ నిన్ను 
నలిపేస్తారు. కాని, ఈ స్టార్ నీకోసం నలిగిపోయింది. 

దివి నుండి దిగి వచ్చిన స్టార్ ను వెంబడించ గలిగితే? 
🔹ఆశ్చర్య క్రియలు నీ జీవితంలో అనుభవిస్తావ్.
🔹నీ ప్రతీ పరిస్థితిని పరిష్కరించుకోగల ఆలోచన దొరుకుతుంది. 
🔹నీ బలహీన సమయాల్లో ఆయనే నీ బలం.
🔹నిత్యమూ నీకు తండ్రిగా ఉంటాడు.
🔹నీ జీవితమంతా సమాధానమే. 

ఇదెప్పుడు సాధ్యం? 
👉ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడు మాత్రమే.
👉ఆ స్టార్ ను వెంబడించినప్పుడు మాత్రమే.

నీ హృదయం ఆయనకింకా దూరంగానుందా? నేడే ఆయనను చేర్చుకో! ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...