✨💥💫 *క్రిస్మస్* 💥 ✨💫
( మొదటి భాగము)
*దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు*. (లూకా 2:11)
🎄 *క్రిస్మస్ అంటే? *
క్రీస్తును ఆరాధించడం. క్రైస్ట్ అంటే క్రీస్తు . మాస్ అంటే ఆరాధన కాని నేటి, "క్రైస్ట్ మాస్ లో క్రైస్ట్ మిస్" అయిపోతున్నాడు.
కారణం? నేటి క్రిస్మస్!!
"ఇంటి పైన స్టార్ 💫 ఇంట్లో బార్" లా మారిపోయింది.
🎄 *నేటి క్రిస్మస్*?
🏠 *1. ఇంటి క్రిస్మస్: *
ఇంటి శుభ్రం
👗 *2. ఒంటి క్రిస్మస్ *
క్రొత్త బట్టలు
🥘 *3. పంటి క్రిస్మస్ *
వండుకొని తినడం
వీటికే పరిమితం.
క్రీస్తుఆరాధనా కాస్త క్రిస్మస్ సెలబ్రేషన్స్లా మారిపోయాయి. వాటిలో వేసే డాన్సులు రికార్డింగ్ డాన్స్ కి ఎంతమాత్రం తీసిపోవు. అదేంటి అంటే? దావీదు నాట్యం చెయ్యలేదా? అంటూ క్లారిఫికేషన్. దావీదు నాట్యం చేసిన సందర్భం వేరు. నాట్యం చేసినా? ఆయన ఒక గ్రూపు తయారుచేసి స్టెప్పులు నేర్చుకొని నాట్యం చెయ్యలేదు.
క్రిస్మస్ ఎందుకింత వికృత రూపం దాల్చుతుంది? కారణం ఒక్కటే? ఆయన జన్మించి రెండు వేల సంవత్సరాలు దాటిపోయినా? నేటికీ మన హృదయాల్లో జన్మించక పోవడమే.
ఒకరేమో క్రిస్మస్ చెయ్యకూడదంటారు.
మరొకరేమో చేసి తీరాలంటారు. కాని ఒక్కటి మాత్రం గుర్తుంచుకో! దేవునికి దగ్గరయ్యే పని ఏదయినా చెయ్యి. దేవునికి దూరమయ్యే పని ఏదీచెయ్యొద్దు. ఇంతకీ ఈ క్రిస్మస్ నిన్ను దేవునికి దగ్గర చేస్తుందా? దూరం చేస్తుందా?
🎄 *క్రిస్మస్ అంటే? *
క్రీస్తు పేరుతో వ్యాపారమా? అట్లానేవుంది కదా?
🔹ప్రపంచ చరిత్రలో ఎక్కువ వ్యాపారం జరిగేది క్రిస్మస్ దినాల్లోనేనట.
🔹ఎక్కువ మద్యం అమ్ముడుపోయేది క్రిస్మస్ దినాల్లోనేనట.
🔹క్లబ్ లు , ఫబ్ లు, రెస్టారెంట్లు రద్దీగా వుండేది క్రిస్మస్ దినాల్లోనేనట.
క్రిస్మస్ పేరుతో క్రీస్తుని ఆరాధించడం మాని, క్రీస్తునే అమ్మేసుకొంటున్నాము. ఇస్కరియోతు యూదా క్రీస్తుని 30 వెండి నాణెములకు అమ్ముకున్నాడు గాని, మనమయితే 3 నాణెములకే అమ్మేస్తాము.
🔸పేరుకు మాత్రమే క్రిస్మస్ ఆరాధించు కొనేది మాత్రం "మనకు మనమే".
🔸మన టేలంట్ చూపించుకోవడానికి క్రిస్మస్ ను వేదికగా మలచుకొంటున్నాం.
🔸క్రిస్మస్ ఆరాధనలో సినిమా పాటలకుసహితం డాన్స్ చేసే భయంకరమైన స్థితికి దిగజారిపోయాం.
*ఒక్కమాటలో చెప్పాలంటే? * క్రిస్మస్ లో, కనీసం క్రిస్మస్ ట్రీ కి, క్రిస్మస్ తాతకిచ్చిన ప్రాధాన్యత కూడా క్రీస్తుకు ఇవ్వలేక పోతున్నాం. ఆరాధించాల్సిన దేవుని సంగతే మరచిపోతున్నాం. దీనికేనా మనం క్రిస్మస్ అని పేరు పెట్టుకున్నది?
🔸ఆరాధించే మనసులేకపోతే?
🔸ఆరాధించడం చేతకాకపోతే?
చేతులు కట్టుకొని కూర్చోవడం శ్రేయస్కరం. అంతేగాని, క్రిస్మస్ పేరుతో ఆయన అద్భుతమైన త్యాగాన్ని లోకంలో నవ్వులుపాలు చేసే ప్రయత్నం చెయ్యొద్దు.
అందుకే ఆయన అంటున్నాడు. మిమ్మును బట్టియే కదా నా నామం అన్య జనుల మధ్య దూషించ బడుచున్నది? అవును! మన ఆరాధన ఆయనను దూషణ పాలుచేసేదిగా కాకుండా, ఆయనకు మహిమ తెచ్చేదిగా వుండి, అనేక మంది అన్య జనులను రక్షణ లోనికి నడిపించేదిగా వుండాలి.
ఇదెప్పుడు సాధ్యం? ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడు మాత్రమే. నీ హృదయం ఆయనకింకా దూరంగానుందా? నేడే ఆయనను చేర్చుకో! నీ జీవితంలో అనేక క్రిస్మస్ లు దొర్లిపోయాయేమో? కనీసం ఈసారి అయినా నిజమైన క్రిస్మస్ ను ఆరాధన చెయ్యగలవా? నేడే ప్రియరక్షకుని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం! క్రిస్మస్ తెచ్చే శాంతిని, సమాధానాన్ని అనుభవిద్దాం! ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి