ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్* ( పదమూడవ భాగము)

✨💫🌟^క్రిస్మస్*  🌟💫✨
   ( పదమూడవ భాగము) 

*జ్ఞానులు:*
వీరు తూర్పు దేశానికి చెందిన వారు.

*రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ నున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూచి, ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. *(మత్తయి 2:1,2)

🐲మన జ్ఞానము దేవుని జ్ఞానమునకు అందదు. దానికి జ్ఞానులే ప్రత్యక్ష సాక్షులు. 

తూర్పు దేశమునుండి బయలుదేరిన జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఎడారులు, కొండలు, లోయలు, గుట్టలగుండా వారి ప్రయాణం సాగిపోతుంది. రోజులు, వారములు, నెలలు గడచిపోతున్నాయి, ఇంకా ఎంత కాలం? ఎంత దూరం ప్రయాణం చెయ్యాలో? ఈలోపు వారు యెరూషలేము చేరుకున్నారు. ఒక పెద్ద రాజభవనం వారి కంటపడింది. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 

కారణం? ఈ లోక జ్ఞానం ప్రకారం రాజు, రాజు కుటుంబంలోనే జన్మిస్తాడు. 

అంతవరకు నడిపించిన నక్షత్రాన్ని ప్రక్కనబెట్టి, స్వంత నిర్ణయంతో రాజ భవనంలోనికి ప్రవేశించారు. జ్ఞానులు తీసుకున్న స్వంత నిర్ణయం ఎంత మూల్యం చెల్లించిందంటే? ఆ దినాలలో రెండు సంవత్సరముల లోపు వయస్సుగల మగ పిల్లలందరినీ హేరోదు చంపించడానికి కారణమయ్యింది. 

దేవుని మార్గాన్ని విడచి మనం తీసుకున్న ఎట్లాంటి నిర్ణయాలైనాసరే? మనతో పాటు మన కుటుంబం, సంఘం, సమాజం కూడా భారీమూల్యం చెల్లించాల్సిందే? కాని, వారు మార్గంతప్పినా, తిరిగి మరళా ఆనక్షత్రాన్ని అనుసరించి గమ్యం చేరుకోగలిగారు. మన జీవిత ప్రయాణంలో ఎక్కడ తప్పిపోయామో? దేనికి ఆకర్షించబడి దేవునికి దూరమయ్యామో? ఈ క్రిస్మస్ దినాలలో ఒక్కసారి మనకు మనమే పరిశీలన చేసుకుందాం! సరి చేసుకొని, మన గమ్యమైన నిత్యరాజ్యం వైపు సాగిపోదాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

https://www.facebook.com/1879080455534861/posts/3327638910679001/?d=n

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...