⚡️💫✨*క్రిస్మస్* ✨💫⚡️
(పదియవ భాగము)
🕯 *క్యాండిల్ సర్వీస్:*
క్రిస్మస్ ఆరాధనలో మనలను ఆకర్షించే కార్యక్రమాలలో ఇదొకటి.
అందరూ చీకట్లో క్యాండిల్స్ వెలిగించు కుంటారు. మనమయితే మిరుమిట్లు గొలిపే కాంతిని ఆపేసి, చీకటిని సృష్టించుకొని, దానిలో క్యాండిల్స్ వెలిగిస్తాము.
అద్భుతమైన సంగీతంతో, పాడుతూ, అందరూ వెలిగించిన క్యాండిల్స్ పట్టుకుంటే చూడడానికి చాల అందముగా వుంటుంది కదా! . కాని, దీని వలన ఆయనకు మహిమ గాని, మన జీవితాలకు ఆశీర్వాదం గాని ఏదయినా ఉందా?
అసలు దీని ఆంతర్యమేమిటి?
*"పెద్ద అడవిని తగులబెట్టడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు." * ప్రపంచాన్ని వెలిగించడానికి, వెలుగు చున్న ఒక్క క్రొవ్వొత్తి చాలు. *ఆయన తాను ఒక క్రొవ్వొత్తిలా నీకోసం నాకోసం కరిగిపోయి మనకు వెలుగిచ్చాడు.*
క్యాండిల్ సర్వీస్ లో ఒక్క క్యాండిల్ వెలిగించి ఆ క్యాండిల్ ద్వారా కొన్ని నిమిషాల్లో సభలో నున్న వారందరి క్యాండిల్స్ వెలిగించ బడతాయి.
అంటే?
🔸వెలిగించ బడిన నీవు మరొకరిని వెలిగించాలి.
🔸రక్షించ బడిన నీవు మరొకరిని రక్షించాలి.
🔸సమాధానం పొందుకున్న నీవు, ఆ సమాధానాన్ని మరొకరి పంచాలి.
ఇదే జరిగితే?
🔸లోకంలో ఇంకా అంధకారం మిగిలి ఉండేదా?
🔸రక్షించబడనివారంటూ వుండేవారా?
🔸సమాధానంలేకుండా ఉండేదా?
క్యాండిల్ సర్వీస్ పేరుతో ఏదో పది నిమిషాలు అట్లా సంతోష పడుతున్నాంగాని, దానిలోని ఆంతర్యాన్ని గ్రహించి, అనుసరించలేక పోతున్నాం. కాదంటారా?
ఆలోచనకై ఒక్కమాట! మనము రక్షించబడి ఎంతకాలమయ్యింది? ఆ రక్షణ జ్వాల మన ద్వారా ఎంతమందికి ప్రసరించ బడింది?
సందర్భం కాకపోయినా, క్యాండిల్ అనే సరికి మరొక విషయం గుర్తొచ్చింది. నేనొకసారి బెత్లెహేము వెళ్ళినప్పుడు మన వాళ్ళంతా క్యాండిల్స్ పట్టుకొని క్యూ లో వున్నారు. వీళ్ళంతా ఎందుకు వెలిగిస్తున్నారు? అది వారికే తెలియదు. అందరూ వెలిగిస్తున్నారు కాబట్టి వీళ్ళూ చేస్తున్నారంతే.! ఇదే హైందవ సహోదరులు చేస్తే? దీపారాధన, విగ్రహారాధన అంటాము. మరి మనము చేసేది ఏంటో?
అంధకారంలో ఉన్నవాడికి క్యాండిల్ వెలిగించి దారి చూపావు అంటే అర్ధముంది. కాని, లోకానికే వెలుగై యుండి, కోటి సూర్యులకు మించిన తెజోమయునికా? నీవు ఈపని చేసేది. ఇంతకంటే విగ్రహారాధన మరొకటి ఉందా? వద్దు! సరిచేసుకుందాం! మన హృదయాలను ఆయన వెలుగుతో నింపుకొని నిజమైన ఆరాధన చేద్దాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి