ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రిస్మస్ (15వ భాగము)

💫⚡️🌟✨క్రిస్మస్ 🌟⚡️✨💫
     (15వ భాగము) 

*తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి*.  మత్తయి 2:11
           

జ్ఞానులు తమ పెట్టెలు విప్పి కానుకలు సమర్పించిరి. మనమునూ మన హృదయమనే పెట్టెలు విప్పి, మన హృదయాన్ని ఆయన పాదాల చెంత క్రుమ్మరించి కానుకలు సమర్పించాలి. 

♻️ *జ్ఞానులు సమర్పించిన కానుకలలో మొదటిది "బంగారము".*

🔸పక్షులలో పావురము 
🔸జంతువులలో గొర్రెపిల్ల 
🔸రంగులలో తెలుపు 
🔸లోహములలో బంగారము "పరిశుద్దతకు" గుర్తు. 

జ్ఞానులు బంగారము సమర్పించడము ద్వారా ఆయన "పరిశుద్ధుడు" అనియు, ఆయనను ఆరాధించు వారు "పరిశుద్దతతో" ఆరాధించాలని తెలియజేస్తున్నారు. 

అయితే? మన క్రిస్మస్ ఆరాధనలో పరిశుద్దత ఎంత? ఎప్పుడూ త్రాగని వాడు సహితం సంవత్సరానికి ఒక్కసారి అన్నట్లు క్రిస్మస్ రోజే త్రాగుతున్నాడు. ఇక మనం ధరించే వస్త్రాల గురించి మాట్లాడకపోవడమే మేలు. (అట్లా అని అందరూ కాదు. ఆ కొందరే అందరిమీద ప్రభావం చూపుతున్నారు) 

మనం పాడే పాట ఎవ్వరికీ అర్ధం కాదు. కారణం? హద్దులు మీరిన సంగీతం. వీటిలో కూడా పరిశుద్దత లోపించింది. జీవంలేని సంగీత పరికరాలు దేవుని స్తుతించలేవు. ఆరాధించలేవు. ఏదయినా చెయ్యాలంటే? జీవం కలిగిన నీవేచెయ్యాలి. కాని, మనమేమో? జీవించు చున్నామన్న పేరుమాత్రం వుందిగాని జీవచ్చవాలలానే బ్రతుకుతున్నాం. ఇక డాన్స్ లు గురించి చెప్పనవసర్లేదు. డాన్స్ లు ద్వారా మనం సమాజానికి ఇచ్చే వర్తమానం ఏంటో? క్రీస్తు జన్మించినప్పుడు ఎవ్వరూ డాన్సు చేసినట్లు బైబిల్ లో కనిపించదు. 

ఇదేనా? క్రిస్మస్ ఆరాధన పేరుతో మనం సమర్పించే  "బంగారు కానుక".

♻️ *బంగారము రాజ్యాధికారమును సూచిస్తుంది*:

అందుకే ఒకరాజు మరొకరాజును దర్శించేటప్పుడు బంగారమును కానుకలుగా తీసుకువెళ్ళేవారు. షెబా దేశపు రాణి కూడా రాజయిన సొలోమోనును దర్శించడానికి వెళ్ళినప్పుడు అట్లానేచేసింది. జ్ఞానులు బంగారమును సమర్పించారు అంటే? ఆయనను రాజుగా గుర్తించారు. అందుకే ఎట్లాంటి సందేహం లేకుండా రాజైన హేరోదు దగ్గరకే వెళ్లి అడుగుతున్నారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అని. అట్లాంటి అనుభవం మన జీవితాల్లో లోపించింది. ఆయన రాజు అని చెప్తున్నాము. కేవలం అది మాటలకే పరిమితం. మన హృదయాన్ని పరిపాలించే రాజుగా ఆయనని అంగీకరించ లేకపోతున్నాం. 

మన మీద మనమే రాజుగా వుండాలని కోరుకొంటున్నాము తప్ప, మన జీవితంలో ఆయన రాజుగా ఉండడానికి ఇష్టపడలేక పోతున్నాం. కారణం? మన జీవితంలో ఆయన రాజుగా వుంటే? మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి కుదరదని. ఇంకెంత కాలం ఇట్లా? నీ జీవితంలో ఆయన రాజుగా లేకపోతే? నీ జీవితానికి సార్ధకత లేనేలేదు. సాతాను చెరలో మ్రగ్గిపోతున్న మనం, కనీసం ఇప్పటికైనా మన జీవితంలో ఆయనను రాజును చేద్దాం! ఆయన రాజరికంలో యువరాజులుగా జీవిద్దాం! 

♻️ *జ్ఞానులు బంగారం సమర్పించడంద్వారా మనపట్ల దేవుడు ఎట్లాంటి అధ్బుతమైన ప్రణాళికను కలిగియున్నాడో అర్ధమవుతుంది. *

హేరోదు యేసును చంపించే ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగా యోసేపు కుటుంబ సమేతముగా ఐగుప్తుకు వెళ్లి కొంతకాలం అక్కడ జీవించ వలసివస్తుంది. అటువంటే పరిస్థితులలో వారి జీవనాధారం ఎట్లా? అందుకే, జ్ఞానులు సమర్పించిన బంగారం వారి అవసరాలు తీర్చేదిగావుంది. 

అవును! కొన్ని సందర్భాలలో నీకు సమస్య రాకముందే పరిష్కారాన్ని ఆయన సిద్దం చేస్తాడు. మరి కొన్ని సందర్భాలలో సమస్య వచ్చిన తర్వాత ఆయన పరిష్కరిస్తాడు. 

ఇదెప్పుడు సాధ్యం? ఆయనను రాజుగా నీ జీవితములో అంగీకరించి, చేర్చుకొని, నీపై రాజ్యాధికారాన్ని పూర్తిగా ఆయనకు అప్పగించినప్పుడు. 

జ్ఞానులు వెతుక్కొంటూ ఆయన కోసం వెళ్ళారుగాని, ఆయనే వెతుక్కొంటూ నీకోసం వచ్చాడు. ఈదినమైనా ఆయనను చేర్చుకో! ఆరీతిగా మన జీవితాలను సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...