త్యాగం, విధేయత* ల సంగమమే “ క్రిస్మస్” -——-💥✨💫🎄⚡️——— వేసవి సెలవుల విరామ సమయం తర్వాత స్కూల్స్ మరలా ప్రారంభమయ్యాయి. నూతనంగా చేరిన విద్యార్థులను టీచర్ పరిచయంచేసుకొనే వాటిలో భాగంగా, వారి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ, మీ డాడీ ఏమి చేస్తుంటారు అంటూ ప్రశ్నిస్తే, దానికి సమధానంగా డాక్టర్, టీచర్ ...అంటూ పిల్లలు ఉత్సాహంగా సమాధానము చెప్తున్నారు. అయితే, ఒక అబ్బాయికి వాళ్ళ డాడీ ఏమి చేస్తారో తెలియక ఏడ్వడం ప్రారంభించాడు. రేపు వచ్చేటప్పుడు తెలుసుకొనిరా అంటూ టీచర్ వాడిని సముదాయించింది. ఆ రోజు స్కూల్ నుండి వాడు ఇంటికి వెళ్ళాడు. స్కూల్ బ్యాగ్ కూడా క్రింద పెట్టకుండానే, డాడీ మీరేమి చేస్తారంటూ అడగడం మొదలుపెట్టాడు. దానికి వాళ్ళ డాడీ రేపు నీకు స్కూల్ కి సెలవు కదా, నేను పనిచేసేచోటకి తీసుకొని వెళ్లి చూపిస్తానని చెప్పి, తర్వాత రోజు తీసుకొని వెళ్ళాడు. ఒక నది మీద బ్రిడ్జి ఉంటుంది, అది రెండుగా విడిపోతే, దానిలో బోట్స్ ప్రయాణిస్తాయి, లేకపోతే బ్రిడ్జి కలసివుంటే, దాని మీద ట్రైన్స్ ప్రయాణిస్తాయి. ఆ బ్రిడ్జిని ఆపరేట్ చేసే వర్క్ వీళ్ళ డాడీ చేస్తారు. ఆయనేదో ఆఫీస్ వర్క్ చేసుకొంటున...