🌳💫✨⚡️క్రిస్మస్💫✨🌲🌟
—- (14వ భాగము) —-
🌟*జ్ఞానులు* (3)
🔺*ఆరాధించారు*
తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మత్తయి 2:11
జ్ఞానులు వచ్చి తల్లియైన మరియను ఆ శిశువును చూచారు. కాని, సాగిలపడి పూజించింది (ఆరాధించింది) "యేసయ్యను మాత్రమే". మరియను కాదు.
నీ హృదయం దేవునితో నిండిపోయినప్పుడు నీ హృదయంలోనుండి వచ్చే చిన్న మూలుగు కూడా ఆరాధనే. నేటి దినాల్లో ఆరాధనకు అర్ధం మారిపోయింది. ఆరాధించే మనసు దూరమయ్యింది.
👉చెవులు దద్దరిల్లే సౌండ్స్ తో మ్యూజిక్ తో డాన్స్ చేస్తూ , అన్ని పాటలు కలిపిపాడేస్తే దానికి "ఆరాధన" అని పేరు.
👉 ఆరాధన అనేది పదినిమిషాలకు పరిమితమైనది కాదు. ఇది నిరంతర ప్రక్రియ.
మద్యలో ఈ డాన్స్ ఏంటి అంటే? మరళా దావీదు దగ్గరకు వెళ్లి పోతారు. డాన్స్ కి మాత్రం దావీదును వాడుకుంటారుతప్ప, దావీదు కలిగియున్న పశ్చాత్తాపంలో లేసు మాత్రమైనా వీరి జీవితాల్లో కనిపించదు.
ఈలోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాధించిన వారు, జ్ఞానులుగా పిలువబడినవారు మేమెందుకు? ఆ శిశువు ముందు సాష్టాంగపడాలి? అని అనుకోలేదు. కారణం? ఆయన ఎమైయున్నాడో వారు అర్ధం చేసుకోగలిగారు. ఆయన ఏమయ్యున్నాడో దానిని బట్టి ఆయనను గొప్పచెయ్యడమే "నిజమైన ఆరాధన."
ఆరాధించలేక పోతున్నామంటే? అసలు ఆయన ఏమైయున్నాడో మనకింకా అర్ధం కాలేదేమో? ఇంతవరకూ, అర్ధం చేసుకొనే ప్రయత్నమూ చెయ్యలేదేమో? ఇంకెప్పుడు అర్ధమయ్యేది? గడిచిన ప్రతీ క్షణం నిన్ను మరణానికి మరింత దగ్గరకు చేరుస్తుంది. గడ్డి పువ్వులాంటి ఈ జీవితం ఎప్పుడు వాడిపోతుందో? ఎప్పుడు రాలిపోతుందో? నీటి బుడగ వంటి ఈ జీవితం ఎప్పుడు పగిలిపోతుందో?
అవును! ఆయన రాకడెప్పుడో? నీ ప్రాణం పోకడెప్పుడో? ఎవరికీ తెలుసు? ఆరాధించే అనుభవం లేకపోతే? ఆ నిత్య రాజ్యంలో చేరలేము. కనీసం, నేడైనా ఒక్క క్షణం ఆలోచించు. ఆయన ఏమైయున్నాడో? అర్ధం చేసుకుందాం! ఆరాధిద్దాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
https://www.facebook.com/1879080455534861/posts/3329448133831412/?d=n
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి