ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము


✳ *భక్తి గల స్త్రీలు* ✳


 1⃣ *ధన్యురాలైన మరియ*  


(మొదటి భాగము )


*యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*

 సామెతలు31:30


బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.


 ♻ *ఆరుగురు మరియలు* ♻


ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన 

*ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము.


1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ 

స్పష్టముగా గుర్తింపబడినది.


💥2 *మగ్దలేనేమరియ*

లోనుండిఏడుదయ్యములు

వెళ్ళగొట్టబడినవి.

మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2)

గుర్తించుటకు 

*మగ్ధలేనే*

అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు.


💥 3.అపోస్తులుడైన

యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది.

యోహాను19:25,

మత్తయి27:56,మరియు మార్కు15:40

పోల్చి చూచినట్లయితే

చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25)

యేసు తల్లి అయిన మరియ  సహోదరి

మత్తయి 27:61 మరియు

28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు

యోహాను19:25

ఉన్నట్లు క్లోపా భార్య అనిగాని పిలువబడినది.

ఆమెను గూర్చి ఎప్పుడు చెప్పబడినను ,తన కుమారులలో ఒకరు గాని లేక ఇద్దరిని గూర్చి గానీ వచ్చిన సందర్బములోనే చెప్పబడినది.


💥4.మార్త మరియు లాజరు సహోదరియైన *బేతనిమరియ* ఆమె పేరుతో లూకా10:39,42

యోహాను11:1,2,19,20,28,31,32,45;12:3;

మత్తయి26:7;

మార్కు14:8,9;

చెప్పబడినది.


💥5.బర్నబా సహోదరియు

మరియుయోహాను,మార్కు

(John Mark) తల్లి అయిన *మరియ*

అపొ.కా.12:12; ఈమె పేతురు సోదరి.


💥6.రోమా పట్టణములో  పౌలుకు సహాయం చేసిన

*మరియ* రోమ16:6;


బైబిల్ చదవరులకు ఎందరు మరియలో ఎరుగుట కష్టము.కనుక

ఈచిన్న ప్రయత్నముతో మీకు అవగాహన కలిగించడం జరిగింది.


  🌹 *ధన్యురాలైన మరియ*  🌹


ధన్యురాలుగా దీవింప బడిన మరియ  ఈ యొక్క అంశములో *మరియ* వివిధ  దృక్పథములతో వ్యవహరించబడ్డది. 


దేవుని యెడల ఆమెకు

గల వినయ విధేయతలను 

కేంద్రీకరిస్తూ..

మరియ అల్పురాలైన యూదా బాలిక అయినను దేవుడు,తన కృపా కనికరములచే, లోకరక్షకుని ఈ లోకానికి తెచ్చుటలో ఏర్పరచబడిన పాత్రగా వాడుకున్నాడు.


 💥 *క్రీస్తు జనన వాస్తవము*


ఊహించనటువంటి సంకట  సమయాలలో మానవాళి యొక్కమొర్ర  ఏమిటంటే ఎందుకు? మరియు ఎట్లు?, కానీ మానవజాతికి సృష్టి కర్త మరియుప్రతిపరిస్థితిని 

ఆధీనంలో ఉంచుకున్న 

దేవుడు *తానెవరైనది* ప్రత్యుత్తరం ఇస్తూ ప్రకటించుకున్నాడు.

 *మత్తయి మరియు లూకా సువార్త లోని మొదటి అధ్యాయాలలో* ప్రాంతములలో క్రీస్తు జనన వృత్తాంతములలో,ఈ

యొక్క వాస్తవం బయలు పరచబడినది.  దూత యేసేపు తో(మత్తయి1:18) 

జెకర్యా తో (లూకా 1:13)  మరియు 

మరియ తో (లూకా1:2 8)  చెప్పిన,ఊహించనటువంటి వర్తమానాలను మనము చదువుతున్నాము.


 ఒక వృద్ధునికి ఒక కన్యకు తెలియపరచబడ్డ ఈ వర్తమానాలు, ఆత్రుతలకు, "ఇది ఏలాగు జరుగును" అను గొప్ప ప్రశ్నకు మార్గాన్ని ఏర్పరచింది. "ఆయన ఎవరైనది" మరియు "వెనుక ఎవరున్నది" అన్న వింతైన సంఘటనలలో 

(మత్తయి 1:2 0) (లూకా1:20)  దేవుని యొక్క ప్రత్యుత్తరము బయలుపరచబడినది.


 💥 *దేవుని ప్రణాళిక*


క్రీస్తు జన్మననుసరించి మత్తయి మరియు లూకా వివిధ దృక్పధాలతో అగుపరచారు.  దేవుని ప్రణాళిక మరియు  మానవాళి పై ఆయనకుగల అత్యున్నతమైన ప్రేమను గురించి వారు మాట్లాడుతున్నారు. వారిద్దరూ రాసినది మనము జాగ్రత్తగా పరిశీలించిన యెడల వాటిలో గల బేదాలు ఒక  ప్రాముఖ్యమైన పాత్ర వహించిన మరియపై కేంద్రీకరింపబడినట్లు మనము కనుగొనగలము.


1. మత్తయి ఈ సంఘటనను ఏసేపు ను దృష్టిలో నుంచుకొని వ్రాశాడు లూకా మరియను దృష్టిలో ఉంచుకొని రాసాడు.


 2. మత్తయి అబ్రహం మొదలుకొని వంశావళి క్రమాన్ని వ్రాశాడు లూకా దానిని ఆదాము నుండి మొదలు పెట్టాడు. 


3. మత్తయి ఈ ప్రవచనాలు నెరవేర్చ బడడం దృష్టిలో ఉంచుకొని వ్రాసాడు. లూకా క్రీస్తు జననంప్రవచనాల శ్రేణితో  ప్రారంభించబడిన దృక్పథంతో వ్రాసాడు

 (లూకా 1:26—38, 1:46—55, 1:67—70 మరియు 2:27—35) లూకా కూడ  ప్రవచనాల నెరవేరును ఇమిడ్చి రాసాడు. 


రెండు వార్తలు కూడా ప్రకృతికి అతీతమైన క్రీస్తు పుట్టుక గురించి అనగా ఒక కన్యకకు జన్మించడం, మరియు జ్ఞానులు క్రీస్తును దర్శించడం, దూతలు గొల్లలతో మాట్లాడడం ద్వారా సువార్త సర్వసామాన్యమైనదిగా  సుచింపబడుచున్నది.


*మిరియాము*

అను పదమునకు (హెబ్రీ) *మరియ*(అనునది గ్రీకు పదము) అనగా అర్థం *హెచ్చింపబడుట*


💥 *ఘనపరచిన మరియ*


 తన్ను ఘనపరచు వారిని దేవుడు ఘనపరుస్తాడు. మరియ ఏవిధంగా దేవుని ఘనపరచి ఆయనకు సమర్పించుకున్నదో చూద్దాం.


💥 *పురికొల్పించేరాక*


(లూకా 1:26,27)

గలిలయప్రాంతములో ఒక మూల నున్న నజరేతను ఊరిలో మరియజీవించెను. ఇది ఒక పుణ్య స్థలంకాదు,  మరియు అభ్యాసము చేసే స్థానము అంతకంటే కాదు. వాస్థవానికి అది *అన్యజనుల యొక్క గలిలయ* గా తృణీకరీంప బడినది.అదే *నజరేతులోనే గాబ్రియేలు దూతఆమెకు ప్రత్యక్షమయ్యింది* ఎంత దూరము,ఏస్థానమన్నది దేవునికి అననుకూలము కాదు. ప్రజలపై ఆయనకు పక్షపాతము లేదు. 

పరిస్థితులు, పరిసరాలు ఏవైనను కూడాఇతరులను ప్రోత్సహించుటకు దేవుడు తన ప్రజలను పంపుతాడు. *మనము ఆయనకు విధేయులమైన యెడల, తన సమయంలో దేవుడు తన కార్యాన్ని తన మార్గంలో ఆయన మహిమార్థమై జరిగిస్తాడు*


💥 *అసాధారణమైన ఎంపిక*

లూకా 1:28—34

ఒక ప్రత్యేక ఉద్దేశము కలిగి, ఒక ప్రత్యేకమైన స్థలానికి, ప్రత్యేక గ్రామానికి, ఒక ఇంటికి దేవుని దూత పంపబడినది.ఒకప్రత్యేకమైన కార్యము నిమిత్తము ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకొనుటకు *ఏసుక్రీస్తుతల్లిగాకన్యయైన మరియను ఎన్నుకొనుటలో దేవుని యొక్క శ్రేష్టమైన ఎంపిక ఎంతో అద్భుతమై నది* మరియ ఎవరు ఎరుగని నిరహంకారియైన పల్లెటూరి బాలిక. ఆమె పలుకుబడి గల వ్యక్తి కాదు. *దేవుడు తన ఉద్దేశాలనునెరవేర్చుట లోమనయొక్కనేపథ్యాన్ని త్రోసిపుచ్చుతాడు. కానీ మనము దేవునితో అనుదినము నడుచుట లో మన సంపూర్ణ విధేయత,  ఆయనకు కావాలి*


💥 *మరియ విశ్వాసము*


(లూకా 1:35 —38)

 ఆమె ద్వారా లోక రక్షకుడు రాబోతున్నాడని దూత తెలియ పరచినప్పుడు ఆమె భయపడింది. ఆమె హృదయంలోకలవరపడింది. ఊహించలేనటువంటి దేవుని ప్రణాళిక ఆమెకు అర్థం కాలేదు. ఆమె లేదు దేవునియందు అపనమ్మక ము ఉంచలేదు. ఇంకను హెచ్చరించ వలసినదిగా  ఆమె తన కోరికను వ్యక్తపరచింది.   అవిశ్వాసంతో దీనికి నిమిత్తము లేదు. *దేవుడు తన మార్గముల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా) తన సాక్షం ద్వారా  దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు తన ప్రణాళికను నిర్వహిస్తాడు* 


మనము మరియొక తలంపును గాని, వ్యతిరేక తలంపులను గాని కలిగియుండకుండునట్లు *దేవుడుతనవాగ్దానాలను వ్యక్తిగతంగా దృఢపరుస్తాడు*


💥 *ఉత్తమమైన నిబద్ధత*

(లూకా 1: 38) 

ఎప్పుడైతే దేవుడు మన సందేహాలను తీరుస్తాడో, మనము ఎన్నుకోవలసినది ఒకటే ఆయనకు మనలను మనము సమర్పించు కొనుట. మనము ఇది చేయుటకు ఎప్పుడైతే తీర్మానించుకొంటామో అప్పుడు అది మన జీవితాలలో గొప్పసమర్పణ చేకూరుస్తుంది. 

*కన్య యైన మరియ సమాజములో విమర్శను ఎదుర్కొనవలసి వస్తుంది. దేవునికి ఇది తెలుసు.  కానీ మరియ తన దృష్టిని దేవుని మీద కేంద్రీకరించింది*  

అందుకే ఆమెచెప్పగలిగింది 

*నీ మాటచొప్పున నాకు జరుగును గాక* అని (లూకా1:38) దేవునిపై మనకు గల భక్తి మరియు ఆయన వాక్యానుసారంగా క్రమబద్దమైన నడక, నడి మార్గంలో మనం నిలుచున్నప్పుడు, తక్షణమే తీర్మానాలను తీసుకొనుటలో దోహదపడుతుంది.  చివరికి మనము తీర్మానాలను చేసినప్పుడు అవి మనకు తృప్తిని కలిగిస్తాయి. 


💥 *స్తుతింపదగిన వ్యాఖ్యానము*

 (లూకా 1:39 - 45) 

మెస్సీయ యెక్క తల్లిగా నుండుట మరియకు ఎంతగొప్ప ఘనత!  


*స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు*


 అనగా అర్థము నీవు *స్త్రీలందరిలోఅధికంగా ఆశీర్వదింపబడిన దానవు అను మాటలను వినుట ఎంతో గొప్ప దన్యత*

 మరియు "నా ప్రభువు యొక్క తల్లి" అని చెప్పు అని చెప్పుటలో  ఎలీసబెతు దీనిని దృడ పరిచింది. తద్వారా *ప్రభువైన యేసు యొక్క ఉన్నతమైన దైవత్వాన్ని కేంద్రీకరించింది*

ఎవరైతే ఆయనకి చిత్తానికి సమర్పించుకోవడానికి సిద్ధపడి యున్నారో, వారిపై   ఇది దేవుని యొక్క విశ్వాస్యతనుప్రతిబింబింప జేస్తుంది. 


      *క్రీస్తు పుట్టుకను ఆయన చిత్తానికి మరియ సమర్పణను మనము జ్ఞాపకం చేసు ఉన్నప్పుడు మనలను మనము దేవునికి సమర్పించు కుందాం. దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు మనము ఎటువంటి భయాన్నైనా ఎదుర్కొనవచ్చు*

           *దైవాశ్శీస్సులు*


సేకరణ:

*శ్రీమతిజె.విమలకుమారి*







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...