✳ *బైబిల్ నందలి స్త్రీలు* ✳
(పన్నెండవ భాగము)
2⃣2⃣ *ప్రభువైన యేసుక్రీస్తును ఘనపరచిన తల్లి*
💥 *ఎలీసబెతును దర్శించిన మరియ*
మరియమ్మబంధువురాలైనా ఎలీసబెతు, తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి యున్నట్లుగా దూత చెప్పిన మాటల ద్వారా మరియ గ్రహించింది.
మరియ సిద్ధపడి యూదా ప్రదేశములోని,కొండసీమలో ఉన్న గ్రామానికి వెళ్లి, జెకర్యా ఇంటిలో ప్రవేశించి *ఎలీసబెతుకు వందనం చేసింది*
*మరియ యొక్క వందన వచనం వినగానే* *ఎలీసబెతు* *గర్భంలోని శిశువు* *గంతులువేశాడు*
అప్పుడు
ఎలీసబెతు పరిశుద్ధాత్మ తో నిండుకొనినదై ఇలా అంది
*స్త్రీలలో నీవు దీవెన పొందిన దానివి నీ గర్భఫలము ఆశీర్వదింపబడును*
నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుటకు నాకెలా ప్రాప్తించెను? ప్రభువు ఆమెకు తెలియ జేయించిన మాటలు నెరవేరు తీరుతుంది.
*నమ్మినఆమె*
*ధన్యురాలు*
అప్పుడు, మరియ ప్రభువును,ఇలాస్తుతించడం ఆరంభించింది...
*నా ప్రాణం ప్రభువును ఘనపరచుచున్నది*.
*నా రక్షకుడైనదేవునిలో*
*నా ఆత్మ ఆనందిస్తోంది*
*ఎందుకంటే రాబోయే తరం వాళ్ళు, స్త్రీలలో కెల్లా సంతోషవంతురాలని పిలిచేట్టు, దీనురాలి నైన నన్ను ఆయన సృష్టించాడు అని స్తుతి కీర్తన పాడింది*
*పుట్టబోయే బిడ్డకు తల్లి అయినను ఆయన రక్షకుడని, తనకూ రక్షకుడవసరమని మరియ గ్రహించింది.*
*ఆయనకు భయపడేవారి మీద, ఆయన కనికరము తరతరములకు ఉండునని*
*ఆయన తన చేతితో పరాక్రమ కార్యాలు చేస్తాడని*
*గర్విష్టుల హృదయ ఆలోచనలను బట్టి ఆయన వారిని చెదరగొట్టి వేస్తాడని*.
*బలవంతులను సింహాసనముల నుండి పడద్రోసి దీనులను హెచ్చిస్తాడని.*
*ఆకలి గొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి, ధనవంతులను వట్టి చేతులతో పంపివేశాడు.*
*అబ్రహాము నకును అతనిసంతానమునకును చేసిన వాగ్దానం మేరకు తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశాడు*
*నిందకు పాలైన పరిస్థితులలో ప్రభువును స్తుతించుటకన్యఅయిన* *మరియయొక్కగొప్ప*
*విశ్వాసం*
తనకు తన స్వగ్రామంలో నున్న పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలీదు.
కానీ ఆమె తన బంధువు రాలైన ఎలీసబెతు ఇంటిలో మూడు నెలలు ఆమెతో కూడా ఉండి తిరిగి తన ఇంటికి వెళ్లినట్లుగా తెలుస్తోంది (లూకా1: 56)
సామాన్యంగా స్త్రీల మైన మనము మనకు కలిగిన నిందలలో బాధలలో ప్రభువును స్తుతించలేము, అది మనకు అసంభవం, పైగా ప్రభువు మీద సణుగుతూ ఉంటాము.
*మరియ వలె మనం ప్రతి పరిస్థితిలో ప్రభువును స్తుతించాలి ఆయనను ఘనపరచాలి*
♻ *జ్ఞానవంతురాలు* ♻
పూర్వకాలము నుండికొన్ని కుటుంబాలలో,సంఘములో,సమొజములో స్త్రీని చిన్నచూపుచూస్తున్నారనేది సత్యం.
దేవుడు తన చిత్తానుసారముగ నరుడు
ఒంటరిగా వుండుట ఇష్టములేక ఆదాము పక్కటెముకను తీసి స్త్రీనిగా చేసి ఆదామునకు *సాటియైన సహకారిగ*
ఇచ్చెను.పురుషుడు తనను తాను ఏలాగు ప్రేమించుకొనునో అలాగే భార్యని ప్రేమించాలని తెలియ జేశాడు.
జ్ఞానవంతురాలు ఇల్లు
కట్టును.(సామెతలు14:1)
లోకసంబంధమైన ఇల్లే కాదు .విశ్వాసముతో *క్రీస్తనే బండ మీద*
ఆదర్శవంతమైన ఇల్లు కట్టును.
*దేవుడిచ్చు జ్ఞానముతో ఇల్లుకట్టబడితే అది వివేచన వలన స్థిరపరచబడుతుంది*.(సామె24:3) అంటే ఆమె చేసిన ప్రతి పని కుటుంబానికి అభివృద్దికలిగిస్తుంది.
🔹తన పిల్లల్లో సద్గుణాల
ను అభివృద్ది చేస్తుంది.
🔹దేవునిమార్గంలోకుటుం
బాన్ని నడిపించుటకు
తన శక్తి సామర్థ్యాలను
వినియోగిస్తూ ఎన్నెన్నో
త్యాగాలు చేస్తూ,
ఎంతోశ్రమిస్తూ,
*తనఆరోగ్యాన్ని*
సహితంలెక్కచేయకుండ
*ప్రాణాన్ని సహితం*
*పణంగా పెట్టి*
*కుటుంబమును*
(*భర్త,బిడ్డలను)
ఆ ఇంటిని, స్థిరంగా
వుంచు తుంది స్త్రీ
🔹సుబుద్దిగలభార్య
యెహోవా యొక్క దానం
(సామె19:14)
🔹యోగ్యురాలు తన
పెనిమిటికి కరీటము
(సామె12:4)
🔹రాజైన లెమూయేలుకు
అతని తల్లి నేర్పిన ఉపదేశించిన మాటలను సామెతలు 31వ అధ్యయములో చక్కగా పొందు పర్చినారు.
భార్య అనే మాటను *WIFE* అంటారు.
మరి ఒక్క సారి
ఆ మాటను ధ్యానిద్దాము.
*W isdom*
*I ndustry*
*F aithfull*
*E ntertain*
గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది
ముత్యము కన్న అమూల్యమైనది.
సామెతలు 31:10
*Wisdom*
జ్ఞానమనే సుగుణము కలిగి భర్తకు బిడ్డలకు అనుదిన జీవితములోను
ఆధ్యాత్మిక జీవితములోను
మాదిరిగా జీవిస్తూ ఆశీర్వాదకరముగ వుండాలి.
అనేది దేవునికి సంబంధించినది.
*ఎవరికైన జ్ఞానము కొదువయై వున్న యెడల దేవుని అడిగిన యెడల *ఆయన ఎవరినీ గద్దించక*అడుగు ప్రతి వానికి* *ధారాళముగ దయచేయును*
(యాకోబు1:5)
*ఈ జ్ఞానము ముత్యము కన్న శ్రేష్ఠమైనది*
.విలువ గల సొత్తు.ఈ లాటి జ్ఞానము ప్రతీ స్త్రీ పొందుకోవాలి.
*Industry*
ఆమె చీకటిలో లేచి తన ఇంటి వారికి భోజనము సిద్దపరచును.తన
పనికత్తెలకు బత్తెము ఇచ్చును.నడుకట్టుచేత
నడుమును బలపరచుకొని
చేతులతో బలముగా పనిచేయును.
ఆమె తన ఇంటివారి నడతను బాగుగా కనిపెట్టును.పని లేకుండ భోజనము చేయదు.
దీనిని బట్టిఎంతభాద్యతగా
తన గృహనిర్వహణ చేయు
చున్నదో తెలియు చున్నది.
*Faithfull*
అట్టి స్త్రీ తన పెనిమిటి యందు నమ్మికయుంచును
అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. (సామె31:11)
*యిద్దరు జతపనివారుగా* దేవుని సేవలో ముందుగా సాగుతూ బిడ్డల్ని దేవునిలో నడిపిస్తూ అంతము వరకు
దేవునికి నమ్మకముగా ఉందురు.ప్రభువు కూడ
సువార్త నిమిత్తము ఇద్దరు చొప్పున లోకములోనికి పంపెను.
*Entertain*
ఆమె బ్రతుకు దినములన్నియూ అతనికి
మేలు చేయును గాని కీడు చేయదు (సామె 31:12)
జ్ఞానము కలిగి ఆమె తన నోరు తెరచును.
కృపగల ఉపదేశములను బోధించును.
*యెహోవా యందు* *భయభక్తులు కలిగిన స్త్రీ మాత్రమే* *కొనియాడబడుతుంది*
(సామె 31:30) ఇవి ఎన్నడూ మనము మరువకూడదు.
*ఒక కుటుంబానికి స్త్రీ యొక్క ప్రేమానురాగాలు*
*ఎంతో అవసరము*
*భార్య ఫలించు ద్రాక్షావల్లి అయితే*
*ఆమె బిడ్డలు*
*ఒలీవ మొక్కలు*
నాటి నుండి నేటి వరకు విధేయురాలై పరిచర్యలో
పాలుపంచుకొనుటలో ప్రేమానురాగాలతో కుటుంబాన్ని నింపి ప్రధాన
పాత్రగా వాడుకొంటున్న ఆ
*దేవాదిదేవునికి మరియొకసారి వందనాలు*
*చెల్లిద్దాము.*👏
♻ *నమ్మకమైన క్రైస్తవ స్త్రీ* ♻
ప్రభువును నమ్మిన *క్రైస్తవ స్ర్రీలు* ఎలా వుండాలని ఆయన కోరుచున్నాడో
తెల్సుకుందాం.
*ఎలా వుండాలి*
1తిమోతి2:9-15
-అణకువ,
స్వబుద్ది,
తగుమాత్రపు వస్ర్తాలు.
సత్ర్కియలు అనేఅలంకరణ,
దైవభక్తి గలవారు.
మౌనముగ వుండాలి.
సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి.
విశ్వాసము,ప్రేమ,
పరిశుద్దుల యందు నిలకడ
రక్షింప బడాలి.
*ఎలా వుండకూడదు*
ఎక్కువ జడలు,
బంగారము,
ముత్యములు
మిగుల వెలగల వస్త్రాలు
ఆదేశింపకూడదు
(పురుషులువున్నపుడు)
అధికారము చేయకూడదు.
మోసపరచకూడదు.
*ఉదాహరణగా*
రోమా16:1-12
*ఫీబే* వలె సంఘానికి
పరిచర్య చేయాలి.
సేవకు రాండ్రను చేర్చుకొని
ఆమె కావలసిన సహాయము చేయాలి.
భక్తులకు,విశ్వాసులకు
సహాయురాలై వుండాలి.
అపొ.కా9:36
*దొర్కా* వలె మంచి
శిష్యురాలిగా ,సత్ర్కియలు,ధర్మకార్యాలు,బహుగా చేయాలి.
మంచి సాక్ష్యము కలిగివుండాలి.
తీతు2:3
కొండెములు చెప్పకూడదు,
మత్తుకలిగించునవి తీసుకొనకూడదు,
ప్రవర్తన యందు భయభక్తులు కలిగివుండవలె
స్వబుద్దికలిగి ,పవిత్రులుగా ఇంటవుండి పనిచేసుకుంటూ.. మంచివారుగా మంచి ఉపదేశం చేయువారుగా
వుండాలి.
యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ వలె వుండాలి.
*సంఘములో స్త్రీలు *చేయగలిగినపరిచర్యలు*
ప్రార్థన చేయుట
పాటలు పాడుట
పత్రికలు పంచుట
సాక్ష్యము చెప్పుట
సండేస్కూలునడిపించుట
వ్యక్తిగత సువార్త పరిచర్య
సేవకురాలకు సహాయముచేయుట
మందిరము శుభ్రము చేయుట
వాయిద్యాలు వాయించుట.
ప్రతి సత్కార్యములు చేయబూనాలి
*రూతు*
భక్తిగలవారితో స్నేహంచేసి
హత్తుకొనివుండాలి.
*దేవుడు*
స్త్రీలకిచ్చిన ప్రాధాన్యత,
స్త్రీలకిచ్చిన భాద్యత
స్త్రీలకిచ్చిన భయభక్తులూ,ప్రేమ ఓర్పు,సహనము,దయ
వీటన్నిటి గురించి మనము ఆయనకు స్తోత్రములుట చెల్లిద్దాము.ఆమెన్
సేకరణ:
*శ్రీమతిజెవిమలకుమారి*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి