*బైబిల్ లో మరియ లెంతమంది*
💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠
కొత్త నిబంధన చదువుతూ ఉంటే మొదటి శతాబ్దపు పాలస్తీనాలో అనేక మంది మరియలున్నట్టు గమనిస్తాం. మరియ అనే పేరు ఆ రోజుల్లో సర్వసాధారణమైందిగా ఉన్నది.
1.యేసు తల్లియైన మరియ నజరేతు అను ఊరు
(లూకా 1:26)
2.బేతనియలోనున్న మార్త, లాజరుల సహోదరి మరియ (యోహాను 11:1 అధ్యా) (యోహాను 11:38-42) యేసు మరణానికి ముందు ఈమె ఆయనను అత్తరుతో అభిషేకించింది (యోహాను 12:3)
3.మగ్దలేనే గ్రామానికి చెందిన మరియు (లూకా 8:2,3) ఈమెలో నుండి యేసు ఏడు దెయ్యాలను వెళ్లగొట్టాడు. యేసు సిలువ మరణం ఈమె దగ్గరగా చూసింది. ఆయన పునరుద్దానానికి మొదటి సాక్షి (మార్కు 15:40; 16:9)
4.యాకోబు, యోహానుల తల్లి మరియ
ఆమె యేసును శిలువ వేసినప్పుడు అక్కడే ఉన్నది. మరొక స్త్రీ అని పేర్కొన్నది ఈమె అయి ఉంటుంది (మత్తయి 27:61; 28:1)
5.క్లోపా భార్య మరియ (యోహాను 19:25)
6.మార్కు తల్లి మరియ బర్నబా బంధువు
(అపో.కా 12:12) (కొలసి 4:10)
7.రోమ్ నగరానికి చెందిన మరియ
పౌలు అతడి అనుచరుల కోసం కష్టపడి పనిచేసిన స్త్రీ (రోమా 16:6)
ఇంతమంది యూదా స్త్రీలకు మరియు అనే పేరు ఎందుకు పెట్టినట్టు? హీబ్రులోని మిరియామ్ అనే పేరుకు గ్రీకు భాష రూపమే మరియ. ఇశ్రాయేలు చరిత్రలో మిరియామ్ చాలా ప్రాముఖ్యమైన స్త్రీ.
మిరియామ్ మోషే అక్క (సంఖ్య 26:59) ఇశ్రాయేలులో మొట్టమొదటి ప్రవక్తి (నిర్గమ 15:20)
ఇశ్రాయేలీయుల జాతిని ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి నడిపించడానికి దేవుడు ఎన్నుకున్న బృందం ఆమె. ఆమె సోదరుడు మోషే, అహరోనులు (మీకా 6:4)
మిరియామ్ తన తమ్ముని బాల్యంలో మరణం నుండి కాపాడడంలో గొప్ప తెగువ చూపింది (నిర్గమ 2:4-7)
తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వెన్నంటి వస్తున్న ఫరోసైన్యమును తప్పించుకుని ఎర్ర సముద్రం దాటిన మీదట ప్రజలు ఉత్సవ ధ్వనిలోనూ, స్తుతి చెల్లించుటలోను నడిపించింది (నిర్గమ 15:20,21)
అయితే ఒక సందర్భంలో మాత్రం ఆమె మోషేకు వ్యతిరేకంగా మాట్లాడింది. ఫలితంగా దేవుని తీర్పుకు గురై కుష్ఠురోగి అయ్యింది, ఏడు రోజుల శిబిరం వెలుపల ఉన్నది. తర్వాత స్వతతపడి సామాజంలో ప్రవేశించింది (సంఖ్య 12:1-15)
ఆమె వ్యాధితో ఉన్నప్పుడు, ఆమె తిరిగి వచ్చి స్తుతులతో నడిపించే దాక ప్రజలంతా ఒకచోట చేరి సమిష్టిగా ఉన్నారు (సంఖ్య 12:15)
సేకరణ:
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి