ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిల్ నందలి స్త్రీలు పదమూడవ భాగము

✳ *బైబిల్ నందలి స్త్రీలు* ✳

  (పదమూడవ భాగము)

🌹 *మనపిల్లలు*  🌹
        *వారికి మన రక్షణ‌*

        *తండ్రులారా!*
*మీ పిల్లలకు కోపము రేపక     ప్రభువు* *యొక్క* *శిక్షలోను,బోధలోను*
*వారిని పెంచండి*
(ఎఫెసీ 6:4)
మానవులకు వివాహము జరిగిన తరువాత వారు కోరుకొనేది పండంటి బిడ్డను.ఎందుకనగా *బిడ్డలే వారికి ఘనత*

*సంతానము దేవుడిచ్చే బహుమానము*
ఆ బహుమానముతో తన గృహమును  నింపుకొనే వాడు ధన్యుడు. పూర్వకాలము ఎంత మంది సంతానముంటే
అంత ఘనత.
పోషించే స్తోమతు లేకున్నా
వారి సంతానమే వారి భాగ్యంగా భావించే వారు.

గర్బఫలము దేవుడిచ్చు బహుమానమైనా అది అందరికీ ఇవ్వబడు తుందా? ఆ సంతానమే లేక వేదనపొందుతున్న వారు
ఎంతమంది లేరు.?
వారి శరీరలోపము వల్లనే  బిడ్డలు కలుగక పోవచ్చు.
అటువంటివారు *సృష్టికర్తను విశ్వాసంతో హత్తుకొని వుంటే సంతాన ప్రాప్తికి మార్గము చూపగలడు*.కృంగి పోవలసిన పనిలేదు.

    *బైబిల్ లో చూస్తే*          ▪అబ్రాహాముకు      సంతానము నూరేండ్లప్రాయంలో  కలిగింది.
▪ఇస్సాకుకు 65 ఏండ్ల వయసులో సంతానం ప్రాప్తమైంది.గొడ్రాండ్రుగా నున్న అనేకులు వా‌రి వారి 
విశ్వాసమును బట్టి 
*దేవుని కృప చేత సంతానప్రాప్తులయ్యారు*.
-అబ్రహాముభార్య శారా,
-సమూయేలు తల్లి హన్నా
-సంసోను తల్లి,
-సారెపతు ఘనురాలు,
-యోహానుతల్లి ఎలీసబెతు,
వీరందరూ గొడ్రాండ్లని పేరు
పొందిన తరువాత సంతుగలవారయ్యారంటే
*దేవుని అనుగ్రహము* *వారి పక్షమున వుంది*
  కనుకనే         
💥అబ్రాహాముకు ఇస్సాకు నిచ్చితిని (యెహో24:3) అని దేవుడుచెప్పివున్నాడు
💥యాకోబు వీరు దేవుడు దయచేసిన పిల్లలు.(ఆది.కా33:5)
💥యోసేపు వీరు దేవుడు నాకనుగ్రహించెను.
(ఆది.కా 48:9)అని,
💥 యెషయా నేనునూ యెహోవా నా కిచ్చిన 
నా పిల్లలును,
(యెషయా 8:18)
అని అంటున్నారు.
మనంకూడ మనకు కలిగిన సంతానాన్ని గురించి ప్రస్తావించేటప్పుడు నాకు ఇంతవరకు  అంతమంది పిల్లలు అనేదాని కంటే *దేవుని కృపను బట్టి* *దయను వలన* *ఇంతమంది పిల్లలు అని చెప్పగలిగితే*
*దేవునికి ఘనత. మనకు ఆశీర్వాదము*

కలిగిన సంతానము ఎలా ఆశీర్వదింపబడుతుంది.
వారిని ఏ పద్దతిలో పెంచుతున్నాము అనే దానిమీద వారి భవిష్యత్తు
ఆధారపడివుంటుంది.
పరిశుద్ద గ్రంథములోని

 ♦ *పాతనిబంధనలో* *ఇస్సాకు,యోసేపు,సమూయేలు,దావీదు,ఎస్తేరు*   
♦ *క్రొత్తనిబంధనలో యేసు,తిమోతి వీరు* *తల్లిదండ్రులకు విధేయులై ఆశీర్వదింప బడిన బిడ్డలు*  అయితే..
ఏశావు,
ఏలీ కుమారులు,
సమూయే‌లుకుమారులు,
దావీదుకుమారుడైన అబ్షాలోము,
యాకోబు10మంది
కుమారులు,  
 వీ‌రు తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చినవారు.
తమ్మును తాము నష్టపరచుకొన్నవారు.
అందుకే బిడ్డలను *బాల్యదశనుంచే దేవుని సన్నిధికినడిపించాలి*
.దానికి
పెద్దలమైన మనమే మార్గ దర్శకంగా వుండాలి.
*తల్లి చేనులో మేస్తే దూడ గట్టున మేయదు*
అనే సామెత మనకు తెలుసు.అందుకు ఒక్క ఉదాహరణచాలు.
అబ్రాహాము దేవునికి విధేయుడయ్యాడు.తన కుమారుడు ఇస్సాకు కూడ
తండ్రికి విధేయుడయ్యాడు.
జనవాక్యమేమంటే...
"కుమారుని చూచి తండ్రి గుణలక్షణాలు,కుమార్తెను చూచి తల్లి గుణలక్షణాలు
చెప్పవచ్చు".ఎందుకనగా 
*బిడ్డలు తల్లిదండ్రుల యొక్క ప్రతిబింబాలే*

"మొక్కైవంగనిది మానైవంగునా" అన్న సామెత ప్రకారం ..వంకరగా
పెరిగే మొక్కకు ఒక కర్రవేసి నిలువబెట్టి కట్టినట్లయితే
అది నిటారుగా పెరిగి ఫలాలనిస్తుంది.

పిల్లలగురించి పరిశుద్ద గ్రంథములో  ఇలా వున్నాయి.
💥 దుష్టుని సంబంధులు
       (మత్తయి13:38)
💥 వెలుగు సంబంధులు
       (యోహాను12:36)
💥 శరీర సంబంధులు.
        (రోమా9:8)
💥 అవిధేయులైనవారు
    (ఎఫెసీ2:2;5:6;కొల3:6)
💥 ఉగ్రతా పాత్రులు
      (ఎఫెసీ 2:2)
💥అపవాది సంబంధులు
      (1యోహాను3:8-9)
💥వాగ్దానమును బట్టి 
     పుట్టినవారు (గల4:28)
💥 తల్లిదండ్రులను 
      అనుకరించువారు.
       (1రాజులు11:15,26)
💥 వివిధ స్వభావము గల
       వారు.(ఆది.కా25:27)
💥 మొండివైఖరి గలవారు
       (ద్వితీ.కా 21:18-21)
💥 అల్లరి,ఆటపాటలను 
        ఇష్టపడువారు.
         మత్తయి 11:16-19)
💥 మూఢత్వము కలిగిన
       వారు(సామె22:15)

ఇలా బైబిల్ లోని సందర్బా లనుబట్టితెలియవస్తున్నవి.
👉🏾స్వాభావికముగవారిలో
     వచ్చే లక్షణాలనుండి
     వారిని ఏ విధంగా దారి     
      మళ్ళించి దైవ          మార్గములోపెట్టాలో
వాక్యానుసారముగా             ధ్యానించాలి.

మన బిడ్డలను దేవుని సన్నిధిలో నిత్యము ఎదుగునట్లు వారికి వాక్యము బోధించాలి.
త్రోవను నేర్పాలి.
క్రీస్తను బండకు వేసి కొట్టాలి
వాక్యమనే క్రీస్తును గూర్చి మాట్లాడాలి.వారిని దేవునికిసమర్పించాలి.
అప్పుడే  మన కుటుంబము భూలోకములోనే పరలోకముగా అనుభవించవచ్చు.

 🌹 *అవిధేయతవలనశ్రమలు* 🌹

*హాగరు*
తన అవిధేయత వలన శ్రమల పాలైంది.(ఆది16:6)

*ఫరో*
ఫరో అవిధేయతతో చేసిన పాపము వలన ఇంటిలో  శ్రమలు(ఆది12:17)

*అభీమెలెకు*
రాజు అవిధేయతతో చేసిన పని వలన ఇంటిలో శ్రమ
(ఆది20:18)

*ఫరో ఉద్యోగస్తులు*
ఫరో వద్ద తప్పుచేసిన ఉద్యోగస్తుల అవిధేయత  వలన చెరసాలపాలైరి
(ఆది40:1)

దేవుని యెడల *భయభక్తులు లేకుండుట* బాధలకు శ్రమలకు కారణము.(యిర్మియ 2:19)

*దావీదు* జనసంఖ్య లెక్కపెట్టి యిశ్రాయేలు ప్రజల మీదికి శ్రమతెచ్చెను.
అవివేకము వలన చేసితినని ఒప్పుకొనెను.
(2సమూయేలు24:10)

*సౌలు*
 సమూయేలు రాక కొరకు ఎదురు చూడకుండ 
అవివేకపు పని చేసి తన రాజు పదవిని పోగొట్టుకొనుటకు కారకుడాయెను.
(1సమూయేలు 13:13)

*యూదరాజు*
ఐగుప్తురాజుతన శత్రువుల మీదికి వెళ్తుండగ యూదా రాజు అవిధేయతతో కోరి గొడవకు వెళ్ళి ఐగుప్తురాజు చేతిలో మరణించెను.
(2దినవృ35:20-24)

తనకు పట్టని జగడమును బట్టి *రేగువాడు* దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొన్న వానితో సమానుడు.
(సామెతలు 26:17)

సేకరణ:
*శ్రీమతి విమలకుమారి*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...