✳ *బైబిల్ నందలి స్త్రీలు* ✳
(పదకొండవ భాగము)
2⃣0⃣ 🌹 *బత్షెబ* 🌹
*బత్షెబ అత్యంతసౌందర్యవతి*.
ఆమె తండ్రి ఎలీయాము.
*ఆమె భర్త ఊరియా*
ఊరియా దావీదు యోధుల్లో ఒకడు.
*బత్షెబ భర్తయైన ఊరియా*
*రాజ సైన్యములో*
*ధైర్య సాహసాలుగల* *అధికారి*
.అతడు తన భాధ్యతల్ని యథార్థంగా నెరవేర్చేవాడు.
(2సమూయేలు 11:1-17)
అది *వసంతకాలం* రాజులు యుద్దాలకు బయలుదేరే సమయం.
సైన్యాధిపతి యోవాబును,
అతని అనుచరులును,
ఇశ్రాలీయు లందరూ అమ్మోనీయుల మీద యుద్దానికి పంపాడు. దావీదు మహారాజు యుద్దానికి వెళ్ళలేదు.
యెరూషలేము లోనే వుండిపోయాడు.
(2సమూయేలు11:1)
*ఒకరోజుప్రొద్దుగ్రుంకేవేళ* దావీదు పడక మీదనుండి లేచి రాజనగరి భవనం మీద నడుస్తూ పై నుండి క్రిందకు చూస్తూ వుండగా స్నానం చేస్తూ ఒక స్త్రీ కనిపించింది.
ఆమె సౌందర్యనికి
ఆశ్చర్య చకితుడైన దావీదు
ఆ స్త్రీ సమాచారం సేకరించడానికి ఒక దూతను పంపాడు.
రాజదర్బారునుండి పిలుపు రాగానే సహజంగా
*బత్షెబ వెళ్ళింది*
ఓ పౌరురాలిగా విధేయత చూపింది.దగ్గరకు వచ్చిన ఆమెతో శయనించాడు.
కలిగిన అపవిత్రను శుభ్రపరచుకొని ఆమె ఇంటికి వెళ్ళపోయింది.
ఈ సంఘటనకు కారణభూతురాలు
ఆమె కాదనే సత్యం నిర్వివాదాంశం.
ఫలితంగా ఆమె గర్భం ధరించింది.నేను
*గర్భవతినని* దావీదుకు వర్తమానం పంపింది.
*హిత్తీయుడైన ఊరియాను* నా దగ్గరకు పంపమని యోవాబుకు దావీదు ఆజ్ఞ పంపాడు.
ఊరియా దావీదు వద్ద కొచ్చాడు.దావీదు అతని యోగక్షేమాలు,ప్రజాక్షేమం,యుద్దసమాచారం అన్నీ తెలుసుకొని *నీవు నీ ఇంటికి వెళ్ళి అలసట తీర్చుకోమని* శెలవిచ్చాడు కానీ ఊరియా ఇంటికి వెళ్ళక యెరూషలేము లోనే
నిల్చి పోయాడు.
దావీదు యుద్దంఎక్కువగా జరుగుతున్న చోట *ఊరియానుముందుంచి అతడుహతుడయ్యేట్టు* చూడమని యోవాబుకు ఉత్తరం వ్రాసి పంపాడు.
యోవాబు పట్టణాన్ని ముట్టడిస్తుండగా ధైర్యవంతులున్న స్థలములో ఊరియాను వుంచాడు యుద్దం చేయడానికి వచ్చి సైనికుల్లో కొందరిని హతం చేశారు.
*హతుల్లో ఊరియా కూడ వున్నాడు*
ఊరియా భార్య
*తన భర్త మరణ వార్త* విని భర్త కోసం అంగలాడ్చింది.
అంగలార్పు కాలం సంపూర్ణమైన తరువాత దావీదు తన సేవకుల్ని పంపి తన రాజ నగరుకు తెప్పించుకొని,
*తనభార్యగాచేసుకున్నాడు* దావీదు.
ఆమె కొక కుమారుడు కలిగాడు. అయితే దావీదు చేసిన పని యెహోవా దృష్టికి దుష్కార్యముగా పరిగణింప బడింది. పుట్టిన బత్షెబ కుమారుడు చనిపోయాడు.
💥 దావీదు జీవితం రెండింతలు శాపగ్రస్తమై పోయింది.ఊరియా భార్యను తెచ్చిపెట్టుకొని
దేవుణ్ని అగౌరవపరచడం వల్ల దావీదు కుటుంబంలో ఎప్పుడూ యుద్దాలు జరుగుతూనే వున్నాయి.
(2సమూయేలు12:10)
వ్యభిచార విషయంలో దావీదుకూడ శిక్షార్హుడే.
💥 దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్లు తెలిసికొని
పశ్చాత్తాపపడ్డ దావీదు దేవుని సహవాసంతో, సంతోష సమాధానాలతో, నిండినవాడై 51వ కీర్తన రచించి జీవితార్థాన్ని
వ్యక్త పరిచాడు దావీదు.
*పాపక్షమాపణ పొందిన వాళ్ళకు లభించే ఆనందం ఎంత గొప్పదో* తెలియజేస్తుంది
💥 *బత్షెబ* భావాలు బైబిల్ లో వ్యక్తపరచే లా లేదు.కానీ దావీదులో కల్గిన నేరభావన, దైవక్షమాపణ స్వీకారాల్లో బత్షెబకూ పాలుపంపులున్నాయని ఊహించవచ్చు.
దేవుడు ఏర్పాటు చేసుకున్న *నాతాను ప్రవక్త దావీదు కుమారుణ్ని *యదీద్యా*
అని పిల్చాడు.అనగా *యెహోవాకు ప్రియుడు* అని అర్థం.(2సమూ12:24-25)
💥బత్షెబ ,దావీదులగాథ.
దావీదు బత్షెబ లాగా
*పాపప్రాయశ్చిత్తంపొంది*
దైవ కృపద్వారా జీవించడమనేది నేర్చుకోవడం
ప్రతి మానవునికి
ప్రోత్సాహకరమైన ప్రతీకగా నిలుస్తోంది.
💥మొట్టమొదట్లో
*బత్షెబగాథ* భయంకరమైనభిన్నధోరణిలో వుంటోంది.
*జీవితానుభవం లేని యువతి కాదామె*
మగవాడి కోరిక ఎంత త్వరగా రగులు కొంటుందో తెలిసిన వివాహిత ఆమె.
*దైవశాసనాలు తెలియని అన్య స్త్రీ కాదామె*
ప్రభువు నామం
ఘనపరచ బడే కుటుంబంలో ఆమె
జన్మించింది.
💥 బత్షెబ అనైతిక వాతావరణంలో నివసించ లేదు.తనభర్త ఊరియా గొప్ప నైతిక విలువల్ని పోషించినవాడు.రాజు గారికి యధార్థంగా వుండి
క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని జీవించాడు.
💥 నీతియుక్తమైన పవిత్ర జీవనానికి అలవాటుపడ్డ
గొప్పరాజుగా దావీదు తన ప్రజల్ని పాలించేవాడని.
అలాంటి వాడు తనను కోరుకున్నాడనీ ఆమెకు తెల్సు. అందులోఎటువంటి సందేహములేదు.
స్త్రీకి పవిత్ర దృక్పదం
దైవ పవిత్రత విషయంలో
*స్త్రీకి పవిత్ర దృక్పదం అవసరమని బత్షెబ జీవితం మనకు తెలియజేస్తోంది*
నాశనహేతువైన పాపఫలితాన్ని గూర్చి ఆలోచించి మగవాణ్ని శోధనలోకి నెట్టడమనే పాపానికి బహుదూరంగా వుండాలి.లేకుంటే ఆశీర్వాదానికి
ఆమె శాపంగా మారే ప్రమాదముంది.
💥 *యేసువంశావళికి*
*మూలకర్త బత్షెబ*
ఆమె కుమారుడు *సొలొమోను రాజ్యవారసు డవ్వడం ద్వారా బత్షెబ దైవకృప నొందింది*
జీవితంలో వ్యతిరేకదిశలో
జీవితాన్ని ప్రారంభించిన ఈ స్త్రీ దైవకృపవల్ల ఇశ్రాయేలు రాజులలో
ని *మహాగొప్పరాజుకు భార్య అయింది*
*జ్ఞానియైన సొలొమోను కు
తల్లిగా ,లోకరక్షకుడు *యేసుక్రీస్తు వంశావళికి* *మూలకర్తగా బత్షెబ ప్రత్యక్షమౌతుంది*
(1రాజులు1:11-71)
బత్షెబకు సరైన విధానమేదో తెల్సు.
కానీ దానిప్రకారము ఆమె చేయలేదు.అదే ఆమె చేసిన ఘోర పాపం.
(యాకోబు4:17)
*బత్షెబ దైవాన్ని* *అవమానించడంలో*
*దైవభీతిగల పురుషుణ్ని*
*ఆపని స్త్రీ*
దేవుని నమ్మకాన్ని తెలియజేసేదిగా వుంది
బత్షెబ ,దావీదుల గాథ.
దావీదు బత్షెబల
పాపప్రాయశ్చిత్తంపొంది,
దైవ కృపద్వారా జీవించడమనేది
నేర్చుకోవడం
ప్రతి మానవునికి ప్రోత్సాహకరమైన ప్రతీకగా నిలుస్తోంది.ఆమెన్
2⃣1⃣ 🌹 *యెఫ్తా కుమార్తె*🌹
*తండ్రిమాటను*
*నెరవేర్చిన కూతురు*
*యెఫ్తా విజయము తనది యనుకొని యెదురువెళ్ళిన యేకపుత్రిక తండ్రి మ్రొక్కును దీర్చ దేవుని కర్పణంబుగనైనకన్యక*
యెఫ్తా కుమార్తె పేరు పరిశుద్ద గ్రంథంలో ఎక్కడా చెప్పబడలేదు.కానీ ఈమె మాదిరికరమైన కుమార్తెగా నిలిచి పోయింది.
ప్రతి సంవత్సరము ఇశ్రాయేలీయుల కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్థుడైన ఎఫ్తా కుమార్తెను
ప్రసిద్ది చేయుట కద్దు.
(న్యాయా11:40)
గిలాదు వాడైన ఎఫ్తా పరాక్రమశాలి.ఇతడు ఒక వేశ్య కుమారుడు.
కుమారుడునైనందువల్ల,తండ్రిస్వాస్థ్యంలో ఇతనికి భాగమియ్యకుండ ఇతని సహోదరులు తరిమి వేశారు.అందువల్ల యెఫ్తా టోబు దేశానికి వెళ్ళి జీవించాడు. ఇతని ఏకైక కుమార్తె అక్కడనే జన్మించి వుండవచ్చు.
టోబు అంటే *ఫలవంతం*
అని అర్థం.
*యెఫ్తాఅంటేఎదిరించేవాడు*
అని అర్థం.
*యెఫ్తా దేవుని చేత నియమించబడిన న్యాయాధిపతి*
💥 *దైవభయంగల*
*తండ్రికి కుమార్తె*
తండ్ర ఇంటి నుండి వెళ్ళగొట్ట బడిన యెఫ్తా టోబుదేశంలోనివసించాడు
ఇతడు ధైర్యశాలిగా,పరాక్రమశాలిగా పేర్కొన్నాడు.
శారీరకంగానే కాక ఆద్యాత్మికంగా కూడ యెఫ్తా బలాఢ్యుడు,వీరుడు.
అమ్మోనీయుల రాజుతో యెహోవా పక్షాన వాదించాడు. గిలాదు వారు అతని దగ్గరకు వచ్చినపుడు అతడు ప్రవర్తించిన తీరు చూడండి.
అమ్మోనీయులతో యుద్దము చేయుటకు *మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన *మీదట యెహోవా వారిని నా చేతి కప్పగించిన *మీదట నేనే నీకుప్రధానుడనవుదునాన?*
(న్యాయా11;9)
యెహోవా అమ్మోనీయులను యెఫ్తా చేతికి అప్పగించి ..యెఫ్తా దేవునిలో ఎంత బలవంతుడో మనము గ్రహించగలము. అలాంటి తండ్రికి కుమార్తె ఈమె.తన తండ్రి లక్షణాలను పుణికి పుచ్చుకుని,తండ్రికి తగిన కుమార్తెగా ఈమె ప్రశస్త స్థానం ఆక్రమించింది. మన
విశ్వాస జీవితం మన పిల్లల్లో ప్రతిఫలించాలి.
💥 *తండ్రి పోరాటంలో సహకరించిన కుమార్తె*
(న్యాయా11:4-11)
ఇశ్రాయేలీయుల మీదికి అమ్మోనీయులు దండెత్తి వచ్చారు.తనను తరిమి వేసిన ఇశ్రాయేలీయులే యెఫ్తా దగ్గరకు వచ్చి తమ పక్షంగా పోరాడటానికి ఎఫ్తా ఒప్పుకున్నాడు.
*ఇదిధన్యకరమైనప్రవర్తన* యెఫ్తాతన సంగతంతా దేవునిలో సన్నిధిలో విన్నవించాడు.
యెఫ్తాదేవునితో మంచి సంబంధం కలిగి వున్నాడు.
దేవుని సన్నిధిని అనుభవించే విషయంలో వుండే రుచిని తన కుమార్తెకు తెలిపిన తండ్రి యెఫ్తా.
తన తండ్రిని బట్టి యెఫ్తా కుమార్తె యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకుంది.
💥 *తండ్రి విజయంలో సంతోషించిన కుమార్తె*
(న్యాయాధి 11:34)
*యెఫ్తాకుఒకేఒకకుమార్తె*ఆమెగాక అతనికి పిల్లలు లేరు.తన తండ్రి యెహోవా దేవుని సహాయంతో అమ్మోనీయులను జయోంచి ఇంటికి వస్తున్నపుడు తండ్రి సంతోష గానంతో నాట్యంతో దుర్కోవడానికి బయలుదేరి వెళ్ళింది.
విజయశాలిగా రానున్న తన తండ్రి కొరకు ఎదురు చూసింది ఈ కుమార్తె
💥 *తండ్రిమ్రొక్కుబడి*
*తీర్చినకుమార్తె*
(న్యాయా11:39)
నేను అమ్మోనీయులయొద్ద నుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొనుటకు నా యింటి ద్వారమునుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును; మరియు దహన బలిగా దాని నర్పించెదననెను.(11:31)
అయితే తన్ను ఎదుర్కొనటానికి వచ్చిన తన ప్రియ కుమార్తెను చూసినపుడు యెఫ్తా గుండె బ్రద్దలైంది.
అయితే ఆ కుమార్తె ఇచ్చిన
జవాబు ....నాతండ్రీ,
యెహోవా కు మాట ఇచ్చియుంటివా? నా నోటి నుండి బయలు దేరిన మాట చొప్పున నాకు చేయుము.
యెహోవా నీ శత్రువులైన
అమ్మోనీయులపై పగ తీర్చుకొని యున్నాడని అతనితో అనెను.
అయితే ఆ కుమార్తె ఇచ్చిన
జవాబు ....నాతండ్రీ,
యెహోవా కు మాట ఇచ్చియుంటివా? నా నోటి నుండి బయలు దేరిన మాట చొప్పున నాకు చేయుము.
యెహోవా నీ శత్రువులైన
అమ్మోనీయులపై పగ తీర్చుకొని యున్నాడని అతనితో అనెను.
(న్యాయా11:36)
తండ్రి మ్రొక్కుబడిని తీర్చింది ఈ కూమార్తె.
నిజానికి ఆమె అంగీకరించకపోతే
తండ్రి దేవునికి అపనమ్మకస్తుడవుతాడు.
*అర్పణ అనేది బలవంతం మీద చేయటానికి వీలులేదు*
*స్వచ్చందంగా*
*చేయబడాలి*
*యెఫ్తా కుమార్తె తన ఇష్టపూర్వకంగా బలిగా అర్పించుకుంది.*
💥 *పరలోకపు తండ్రికి అప్పగించుకున్న యెఫ్తా కుమార్తె* (న్యాయ11:38-39)
ఆమె తన చెలికత్తెలతో పోయి తన కన్యత్వమును గూర్చి ప్రలాపించెను. రెండు నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు రాగా
అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కు బడి చొప్పున ఆమెకు చేసెను.
ఆమె పురుషుని ఎరుగనే లేదు..న్యాయా11:38-40
యెఫ్తా మొక్కుబడి చూడగలము.
👉🏾 *నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్టిత మగును.మరియు దహన బలిగా దాని నర్పించెద ననెను* న్యాయా11:31,11:40
ప్రకారము యెఫ్తా కుమార్తె వివాహము చేసుకో లేదు.
అనగా *ఆమె *యెహోవాకు ప్రతిష్టింప బడింది* అలాంటి వారు ప్రత్యేకంగా జీవిస్తూ ద్రాక్షారస మద్యములను మాని ,పరిశుద్దంగా వుండాలని బైబిల్ చెబుతోంది.
(సంఖ్యా6:2-9)
విధేయత చూపినపుడు దేవుడు న నిబంధన స్థిరపరుస్తాడు.అందువల్లనే
*యెఫ్తా ఆరు సంవత్సరాలు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిగా* *నియమించబడ్డాడు*
దేవుడు మన నుండి విధేయత కోరుతున్నాడు.
ఇశ్రాయేలీయ స్త్రీలు ఇప్పటికీ యెఫ్తా కుమార్తెను బట్టి విలపిస్తుంటారు.
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను.( రోమా12:1)
మన ప్రాణ శరీర ఆత్మలను ఆయన కోరుకుంటున్నాడు.
యెఫ్తా కుమార్తె వలె మనలను మనము ఆయనకు అర్పణగా ప్రత్యేకించుకొని ప్రతిష్టించు కోవడానికి సిద్దంగా వుండాలి.
సేకరణ:
*శ్రీమతిజె.విమలకుమారి*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి