*బైబిల్ లో కనిపించే అబద్ధములు మరియు మోసములు*
💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠
1️⃣. సాతాను "మీరు చావనే చావరు" అని చెప్పి హవ్వను మోసగించెను - *(ఆది 3:4)*
2️⃣. అబ్రాహాము తన భార్యయైన శారా "తన సహోదరి" అని చెప్పి ఫరోకు అబద్ధం చెప్పెను *(ఆది 12:13,18,19)*
3️⃣. అబ్రహము తన భార్యయైన శారా "తన చెల్లెలు" అని చెప్పి అబీమెలెకుకు అబద్ధం చెప్పెను *(ఆది 20:2, 8,9)*
4️⃣. శారా దేవునితో "నేను నవ్వలేదని" అబద్ధం చెప్పెను *(ఆది 18:15)*
5️⃣. "నేను ఏశావు అను నీ జేష్టకుమారుడును" అని చెప్పి యాకోబు ఇస్సాకును మోసగించెను *(ఆది 27:19)*
6️⃣. ఇస్సాకు తన భార్య అయిన రిభ్కా "నా సహోదరి" అని చెప్పి అబీమెలెకును అబద్ధం చెప్పెను *(ఆది 26:7)*
7️⃣. లాబాను రాహేలుకు బదులు లేయాను ఇచ్చి యాకోబును మోసగించెను *(ఆది 29:18-26)*
8️⃣. యాకోబు యొక్క కుమారులు యోసేపు యొక్క విచిత్రపు నిలువుటంగీ యాకోబుకు చూపించి "ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో, కాదో గుర్తుపట్టుము" అని చెప్పి మోసగించిరి *(ఆది 37:32)*
9️⃣. పోతీఫరు భార్య "నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీదాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నాయొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను" అని తన భర్తకు యోసేపును గూర్చి అబద్ధము చెప్పెను *(ఆది 39:17,18)*
1️⃣0️⃣. ఫరో "నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి, అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదను అని మోషేకు అబద్ధం చెప్పెను *(నిర్గమ 8:8,15)*
1️⃣1️⃣. దావీదు వెఱ్ఱివానివలే నటించి ఆకీషు రాజును మోసగించెను *(1 సమూ 21:13)*
1️⃣2️⃣.రాహాబు అను వేశ్య యెహోషువ పంపిన వేగుల వారిని దాచి "ఆ మనుష్యులు నా యొద్ధకు వచ్చిన మాట నిజమే, కానీ వారు చీకటి పడుచుండగా వెళ్ళిపోయిరి" అని యెరికో పట్టణ సైనికులకు అబద్ధం చెప్పెను *(యెహో 2:4-5)*
1️⃣3️⃣. మీకాలు తన తండ్రియైన సౌలును మోసగించెను *(1 సమూ 19:13-17)*
1️⃣4️⃣. సౌలు "నా పెద్ద కుమార్తెయైన మేరబును నీకిత్తును" అని దావీదును మోసగించెను *(1 సమూ 18:17-19)*
1️⃣5️⃣. అననీయ, సప్పీరాలు పేతురుకు అబద్ధములు చెప్పి, పరిశుద్ధాత్ముని మోసపుచ్చుటకు ప్రయత్నించిరి *(అపో.కా 5:1-6)*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి