✳ *బైబిల్ నందలి స్త్రీలు* ✳
(ఏడవ భాగము)
🔟 🌹 *రూతు* 🌹
*యెహోవానుఆశ్రయించిన*
*అన్యురాలు*
"పుట్టింటినిమరచిఅత్తను
హత్తుకొనుమోయాబుకాంతన్
మెచ్చిదేవుడుమంచిబోయజు
నిచ్చె రూతుకు భర్తన్"
*రూతు* అనే పేరుకు *స్నేహం* అనీ *సౌందర్యం* అనీ *సంతృప్తి పొందినది* అని అర్థం.
రూతు నిజదేవుని ఎరుగని అన్యురాలువిగ్రహారాధికురాల .మోయిబు దేశస్థురాలు.నయోమి ఎలీమెలెకుల కుమారుడైన కిల్యోను భార్య రూతు.
(రూతు4:10)
కరువు మూలంగా నయోమి కుటుంబం బెత్లహేము నుండి మోయాబునకు వలస వెళ్ళాపోయింది
అక్కడే తన ఇద్దరు కుమారులకు పెండ్లిండ్లు
చేసింది.అయితే కొంతకాలం తరువాత తన భర్తను,ఇద్దరు కుమారులను పోగొట్టుకుంది.
(చనిపోయారు)
దేవుడు తనను శిక్షించిన విధానం గ్రహించి రూతు బెత్లెహేమునకు ప్రయాణమైనపుడు రూతు
తన అత్తను హత్తుకొని ఆమె ప్రజలయొద్దకు చేరింది.
*జీవంగల దేవుడైన యెహోవా* *సురక్షితమైన* *రెక్కల నీడను* *ఆశ్రయించింది*
*దేవుని ప్రజలతో తన జీవితాన్ని గడపిన ధన్యురాలు రూతు*
💥 *విగ్రహాలు విడచిన రూతు*
(రూతు1:16-17)
మోయాబు దేశం విగ్రహారాధనకు నిలయమైన దేశం.రూతు కుటుంబం కూడ విగ్రహారాధికుల కుటుంబమే.
*మోయాబు* అంటే *తండ్రి ఎవడు* అనిఅర్థం.
"లోతు యొక్క అక్రమసంతానమే మోయాబీయులు".(ఆది.కా19:37)
వారి దేశమే మోయాబు.
అలాంటి దేశంలో నుండి విగ్రహారాధికుల కుటుంబంలోనుండి వచ్చిన రూతులో నిజదేవుని పట్ల ఆశక్తి వుంది.రూతుకు వివాహమైన తర్వాత *తన అత్తగారి కుటుంబం ద్వారా నిజదేవుణ్ని* *తెలుసుకొని* *వుంటుంది*.
మోయాబుదేశంలో
నయోమిభర్త, ఇద్దరు
కుమారులు మరణించారు.
యెహోవా తన జనులను దర్శించాడనివిని
నయోమి బెత్లెహేమునకు ప్రయాణమైంది.అపుడు నయోమితో పాటు ద్దరు కోడండ్రైన ఓర్పా,రూతులు
కూడా బయలుదేరారు.అయితే తండ్రి ఇంటికి వెళ్ళమని నయోమి వారికి నచ్చ చెప్పింది.(రూతు1:8-14)
*ఓర్పా* అత్తను ముద్దుపెట్టుకొని తన జనులయొద్దకు ,తన దేవతల వద్దకు తిరిగీ వెళ్ళింది.
అన్యురాలైన రూతు నిజదేవుణ్ని ఆశ్రయించింది.
💥 *అత్తనుహత్తుకున్న*
*రూతు*
(రూతు1:14)
నిస్సహాయ స్థితిలో ఒంటరిగ వున్న అత్తను రూతు ఎంతగానో ప్రేమించింది.తన భర్త చనిపోగానే వివాహపు హద్దులనుండి రూతు విడిపించబడింది.అయితే రూతు తన అత్తను ఒంటరిగ విడిచిపెట్టడానికి
ఇష్టపడలేదు.
తన భర్త మరణించినా,
బావ మరణించినా,
మామ మరణించినా
తన తోడికోడలుపుట్టింటి
వెళ్ళిపోయిన,
తమను పోషించేర
వారు ఎవరు లేకున్నా
*తన అత్త నమ్మిన*
*దేవుడే తమను* ఆదరించి కాపాడతాడని.నమ్మింది*
రూతు తన పుట్టింటిని,తన ప్రజలను,తనమతాన్ని,
తన సమస్తాన్ని,విడిచి పెట్టి అత్తను వెంబడించింది.
అత్తకోడళ్ళు ఇంత అన్యోన్యంగా ఇంత ఆప్యాయంగ వుండగలిగితే
దేవునికి ఎంత మహిమ
*ఈ అత్తకోడండ్లు ఎంత మంచి సాక్ష్యము*
💥 *దేవుని ప్రజల సహనాన్ని కోరిన రూతు*
(రూతు2:11-12)
సమస్తమూ వదలిన రూతు
ఇశ్రాయేలీయుల దేవుడే నిజమైన దేవుడని ఆయన
బలమైన రెక్కలక్రింద సురక్షితంగ వుండగలనని
రూతు విశ్వసించింది.
అందుకే నయోమితో ఇలా అంటోంది- *నీ దేవుడే నా దేవుడు ,నీ జనమే నా జనము,నీవు మృతిపొందు చోటనే నేను మృతిపొందెదను*
ఇది ఎంత బలమైన తీర్మానం! ఆమె చేసిన తీర్మానం బోయజుకు తెలిసినపుడు ఆమె అతని దయను పొందగలిగింది.
దేవునితో సహవాసాన్ని కోరిన రూతు దేవుని ప్రజల సహవాసాన్ని కోరుకుంది.
💥 *శ్రమించే స్వభావం కలిగిన రూతు*
(రూతు 2:2-3)
రూతు బెత్లెహేముకు క్రొత్తదైన తమ పోషణ నిమిత్తం ఆహారం సంపాదించడానికి తన అత్త అనుమతితోపొలంలో పరిగెఏరుకోవడానికివెళ్ళింది.నిజానికి రూతు ఆహారం కోసం పని చెయ్యక పోయినా ఆమె అత్త ఏదో ఒక ఏర్పాటు చేసివుండేదే.
అయితే రూతు అత్తతో పోటీ పెట్టుకోలేదు.
*అత్తగారి వూరిలో* *పనికి పోతే నామోషికదా* అని ఆత్మ వంచన చేసుకోలేదు.
సోమరితనంగా వుండడం రూతుకు ఇష్టం లేదు.
ఉదయం నుండి సాయంత్రం వరకు పనల మధ్య పరిగె ఏరుకొని
తూమెడు యవలు సమకూర్చింది.
పరిగె ఏరడం లో కూడ
ఎంతో నిజాయితీగా వ్యవహరించిం దన్నమాట.
*సాయంత్రం వరకు కష్టపడి ఏరుకొనిన దానిని దుల్ల గొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయెను*
(రూతు2:17)
జ్ఞానంగల స్త్రీ సోమరితనం ఎరుగదు. *శ్రమించే గుణం గల రూతుకు దేవుడు బోయజుకు రూతు పట్ల దయ కలిగించి గొప్ప బహుమానమే ఇచ్చాడు*
*ఆమె ఏరుకొనుటకు* *లేచినపుడు బోయజు ఆమె పనలమధ్య* *ఏరుకొనవచ్చును.*
*మరియూ ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొనునట్లు విడిచి పెట్టుడి,ఆమెను గద్దింప వద్దని తన దాసులకు ఆజ్ఞాపించెను*
(రూతు2:15-16)
పని వారితో పాటు కుండల దగ్గర దప్పిక తీర్చుకొనే ఆధిక్యతను దేవుడు రూతు కిచ్చాడు.(రూతు2:9)
💥 *బోయజు పొలంలో నిలకడగా వున్న రూతు*
(రూతు2:23)
బోయజు రూతుకు చెప్పిన విధంగా కోతకాలం యిపోయేంతవరకు బోయజు పొలంలోనే నిలకడగా వుంది.(2:23)
బోయజు పొలంలో వుండడం వల్ల తన ఆహారం కొరత తీర్చబడగలదని రూతు నమ్మింది.మనం కూడ మన పరలోకపు బోయజును విశ్వసించి ఆయన పొలంలోనే నిలకడగా వుండాలని *దేవుని ఆశ*
విశ్వాసంలో మనం స్థిరంగా వుండాలి.
💥 *సత్పవర్తన గల*
*రూతు*
(రూతు 3:10)
రూతు యౌవనస్తురాలు.
ఓర్పా వలె మోయాబు దేశానికి తిరిగి వెళ్తే మళ్ళీ వివాహం చేసుకోవచ్చు.
అయితే దాన్ని తిరస్కరించి
యెహోవాను అనుసరించాలని నిర్ణయించుకుంది.
అత్తను హత్తుకుంది(1:4)
తన భర్త చనిపోయినా తన *అత్తకు రూతు అండగా ఆదరణగా నిలిచింది*.
జీవంగల యెహోవా రెక్కలనీడలో ఆశ్రయం కోరి వచ్చింది.అందుచేత దేవుడు ఆమెకు భద్రత కల్పించాడు.
*బోయజు ఆమె సత్ప్రవర్తనను ప్రశంసించాడు*.(2:10)
రూతు ఇతరుల పట్ల ఆకర్షితురాలు కాలేదు.
💥 *విధేయత చూపిన*
*రూతు*
(రూతు 3:4-5)
నీ సెలవైన యెడల నేను పొలము లోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక
పరిగ నేరుకుందునని నయోమితో చెప్పగా ఆమె
*నా కుమారీపొమ్మనెను*
(రూతు2:2)
అత్త అనుమతితో రూతు పొలాని కెళ్ళింది.
అక్కడ కళ్ళం వద్దనున్న బోయజు కాళ్ళ మీదనున్న బట్టతీసి పడుకొన్నట్లయితే
నీవు చేయవలసినదానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో
నయోమి తెలియజేసిన
దానికి రూతు
*నీవు శెలవిచ్చిన దంతయూ*చేసెదనని*
చెప్పి(రూతు3:4-5) నయోమి చెప్పినదెల్లా రూతు చేసింది.
*ఎదురు ప్రశ్న వేయలేదు*
తగ్గింపు స్వభావంతో ఒప్పుకొంది. అది కొంత కష్టమే.
💥 *క్రీస్తువంశావళిలో*
*చేరిన యోగ్యురాలు*
జీవం గల దేవుణ్ణి నమ్మిన రూతు తన దేశాన్ని,
తన బంధువులను,
తన దేవతల్ని వదలి.... దేవుని ప్రజలు నివసించే
బెత్లెహేముకు వచ్చింది.
తన నోటితో
*యెహోవా నా దేవుడు* అనిఒప్పుకొంది.
*ఇశ్రాయేలీయుల పద్దతి ప్రకారము తన*భర్తకు*, *సమీప బంధువైన బోయజు ద్వారా* *విడిపించబడి అతని* *ద్వారా యేసుక్రీస్తు వంశావళిలో చేరి మన పితరుడైన ఓబేదు తల్లి కాగలిగింది*
రూతు ఎంత ధన్యజీవి.
తన మాదిరికరమైన యోగ్యురాలు.
*యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము*
(సామెతలు12:4)
1⃣1⃣ 🌹 *నయోమి* 🌹
*పడిపోయి తిరిగీ*
*లేచిన విశ్వాసి*
నయోమి అనే పేరుకు అర్థం
*దేవునికి ప్రియమైనది*
ఆమె భర్త *ఎలీమెలెకు*
ఆమెకు ఇద్దరుకుమారులు.
పెద్దవాడుమహ్లోను,చిన్నవాడు కిల్యోను.భర్తతో ఇద్దరు కుమారులతో ఆమె యూదా బెత్లెహేములో దేవుని ప్రజల మధ్య నివసించేది.
ఈమెది చిన్న సంసారం
సమౄద్దితో కూడిన *రొట్టెల ఇల్లు* అయినా బెత్లెహేమును ఈమెకు దేవుడు నివాసస్థానంగా ఇచ్చాడు.యితే దేవుడు పెట్టిన పరీక్షకు నిలబడలేక
దేవుని ప్రజలకు దూరంగా వెళ్ళి నష్టపోయి తన పొరపాటును గుర్తించి ,తన దేశానికి మరల వచ్చి దేవుని చేత దీవింపబడింది
నయోమి.
💥 *రొట్టెల ఇంటిని విడచిన నయోమి*
(రూతు1:2)
దేవుడు నయోమిని ప్రేమించి అలీమెలెకును భర్తగాఇచ్చాడు.అలీమెలెకుఅంటే *దేవుని హస్తం*
రొట్టెల ఇల్లు అయిన బెత్లెహేములో కరువు వచ్చింది. ఆ కరువుకు కారణం ప్రజల పాపమే.
కరువంలోనైనా దేవుడు తనను పోషిస్తాడని నమ్మలేక బెత్లేహేమును విడచి అన్యదేశమైన మోయాబు వెళ్ళి దేవునికి అవిధేయురాలైంది.
💥 *అవిశ్వాసులను కోడళ్ళుగా తెచ్చుకున్న నయోమి.*
మోయాబు దేశానికి వెళ్ళి తన భర్తను పోగొట్టు కున్నాడు.దేవుడు తనను శిక్షించిన విధానం తెలుసుకోలేక పోయింది.
మోయిబునే స్వంతదేశంగా
ఎంచుకొని అక్కడే స్థిరపడాలని ఆశించింది.
అందుకే మోయాబు స్త్రీలైన
ఓర్పా,రూతులను కోడళ్ళుగా తెచ్చుకొంది.
మోయాబులో స్థిరపడాలనే తలంపు అధిక కీడుకేననిఠ
గ్రహించలేక పోయింది.
💥 *మాదిరికరమైన అత్త నయోమి*
(రూతు1:16-17)
నయోమి ద్వారానే ఆమె కోడలు రూతు యెహోవా దేవుడే నిజమైన దేవుడని
సర్వశక్తుడని తెలుసుకో గలిగింది.
నయోమి తన కుమారు లను కూడ పోగొట్టుకొని
తన వారి యొద్దకు బయలు దేరినప్పుడు *తన చిన్నకోడలు రూతు తనను అనుసరించింది*
అన్యురాలైన రూతు మాటలు-" నీవు నివసించు చోటునే నేను నివసింతును.
*నీ జనమే నా జనము*
*నీ దేవుడే నా దేవుడు*
నీవు మృతిపొందు చోటనే నేను మృతి పొందెదను.
*మరణము తప్ప మరేదైనను నిన్ను నన్నూ ప్రత్యేకించిన యెడల* *యెహోవా నా* *కెంత కీడైనను చేయునుగాక*
అనెను .
నయోమి రూతు ఆదర్శవంతమైన
అత్తకోడళ్ళు.
వారు ప్రేమలో బంధింపబడ్డారు.
💥 *చేదైన అనుభవం పొందిన నయోమి*
భర్తను పోగొట్టుకున్నా మోయాబును వదలని నయోమి సంవత్సరము లోపు తన ఇద్దరు కుమారులను కూడ పోగొట్టుకుని చేదు అనుభవాలను చవిచూచింది నయోమి.
💥 *దేవుని క్రమ శిక్షణకు లోబడిన నయోమి*
బెత్లెహేముకు తిరిగి వచ్చిన నయోమి దేవుని నుండి తొలగి పోకుండ విశ్వాసములో స్థిరపడింది.
దేవుని క్రమశిక్షణకు లోబడింది. బలపడింది.
స్థిరపడింది.
నయోమి తాను రిక్తురాలైన తరువాత మాత్రమే దేవుని క్రమశిక్షణను గుర్తించింది.
💥 *దేవునికి ప్రియమైన* *జీవితం జీవించిన నయోమి*
యవల కోత ఆరంభంలో నయోమి రూతు కలిసి
బెత్లెహేము చేరింది.
కోడలు పరిగె ఏరుకోవడానికి పొలానికి వెళ్ళినపుడు నయోమి రూతు భవిష్యత్తు విషయమై శ్రద్దచూపింది
ఆమెకు బంధుత్వ ధర్మము
జరిగించ గలిగి
సమీప బంధువైన *బోయజును రూతుకు తెలియ పర్చింది నయోమి*
కళ్ళం వద్దకు వెళ్ళి తనను విడిపించమని బోయజును
కోరమని రూతుకు చెప్పింది
సరియైన మార్గం చూపి తన కోడలి భవిష్యత్తుకు బంగారు బాట వేసింది నయోమి.
*రూతు బోయజుల ద్వారా ఒబేదును మనుమనిగా పొందింది*
*తన స్వాస్థ్యాన్ని తిరిగీ పొందింది*
💥 *నిరాశలో నిరీక్షణను పొందిన నయోమి*
(రూతు4:14-17)
బోయజు రూతును వివాహ
మాడాడు. వారికి ఓబేదు జన్మించాడు.రూతు దైవాశీర్వాదం వల్ల తల్లి అయింది.
ఓబేదు యెష్షయికి తండ్రి. దావీదుకు తాత అయ్యాడు
*ఓబేదు* జన్మించి నపుడు బెత్లెహేము పుర స్త్రీలు---
నిన్ను ప్రేమించిన ఏడుగురు కుమారుల కంటే నీ కెక్కువగా నున్న నీ కోడలు
ఇతని కనెను.ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి.
(రూతు4:15)
*నయోమి*: *ఇతరుల మేలు కోరుకున్న ఓ విధవరాలు*
ఎంత గొప్ప ఆదరణ. దేవుని కృప నయోమి పట్ల విస్తరించింది.
ఆత్మీయంగా దేవునికి దగ్గరైన నాడు మనము కూడ ఆయన సహాయము పొందగలము.ఆమెన్.
సేకరణ:
*శ్రీమతిజెవిమలకుమారి*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి