ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జులై, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

ఎందుకిలా వ్రాయబడిందో తెలిస్తే చెప్పండి?

📖 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📖    📓 *ఎందుకిలా వ్రాయబడిందో తెలిస్తే చెప్పండి?*  👉  బైబిల్ గ్రంథమందు ఆశ్చర్యకరమైన ఈ విషయాన్ని  మీరెప్పుడైనా గమనించారా? ఎందుకు దేవుడు ఈ విధంగా ఎందుకు వ్రాయించారో! 👉 అదేమనగా..... బైబిల్ నందు 117 వ కీర్తన అతి చిన్న అధ్యాయము, 119 వ కీర్తన అతి పెద్ద అధ్యాయము. బైబిల్ నందు గల మధ్య అధ్యాయము ( the center chapter of the Bible) ఏదో మీకు తెలుసు?  👉అదే 118వ కీర్తన. 118వ కీర్తన ముందు 594 అధ్యాయములు, 118వ కీర్తన తరువాత 594 అధ్యాయములు కలవు. 👉ఈ అధ్యాయములను కలిపితే అనగా 594+594=1188 అనే సంఖ్య వస్తుంది.  👉విచిత్రమేమనగా బైబిల్ నందు గల మధ్య వచనము (The center verse of the Bibili) కీర్తన 118:8 ఈ వచనము మనిషిపట్ల దేవునికి ఉన్న చిత్తాని తెలియజేస్తుంది. 👉అదేమిటంటే  **"మనుష్యులను నమ్ముకొనుటకంటే యెహోవాను ఆశ్రయించుట మేలు." ** 👉కనుక మనం మనుష్యులని నమ్ముకొని మోసపోక యెహోవాను ఆశ్రయించి సమృద్ధి జీవాన్ని పొందుకొందా... అదే దేవుని చిత్తం

పిల్లల్ని నడపవలసిన 7 మార్గాలు

✍ పిల్లల్ని నడపవలసిన 7 మార్గాలు             ఈ కరోన  సమయములో పిల్లలందరూ ఇంటిదగ్గరే ఉంటారు. ఈ సమయములో పిల్లల్ని సరైన మార్గములో ఎలా పెంచాలి,  దైవ మార్గములో ఎలా పెట్టాలో వాక్యానుసారముగా ధ్యానిద్దాము. *1. ప్రార్ధన చేయాలి:-*               "నీవు లేచి రేయి మొదటిజామున మొఱ్ఱ పెట్టుము.... నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము" ( విలాప 2:19). మనము సామాన్యముగా అనేక విషయాల గూర్చి ప్రార్ధన చేస్తాము. వ్యక్తిగత, కుటుంబ, సంఘ ప్రార్ధనలో పాలు పొందవచ్చు గాని, మన స్వంత బిడ్డల విషయమై ప్రత్యేకముగా ప్రార్ధించడానికి ఒక సమయం అంటూ కేటాయించిన వారు ఎంత మంది ఉన్నారు?        యోబు చూడండి " వారి వారి విందు దినములు పూర్తి కాగా... తన కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనపించి, వారిని పవిత్ర పరిచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను.. (యోబు 1:5)". వీళ్ళు పసిపిల్లలు కాదు, ఎదిగినవారే కావున పాపము చేయుటకు అవకాశము ఉంది, కాబట్టే నిత్యము యోబు వారి ని...

క్రైస్తవ_ఆణిముత్యం_పులిపాక_జగన్నాధం"" గారి క్లుప్త చరిత్ర*

💠 *జీవిత చరిత్రలు* 💠 #క్రైస్తవ_ఆణిముత్యం_పులిపాక_జగన్నాధం"" గారి క్లుప్త చరిత్ర*  "పులిపాక జగన్నాధం" గారు అనే భక్తుడు దేవుని కోసం చాలా చాలా కష్టపడ్డారు, సేవచేశారు, ఎన్నో గొప్ప గొప్ప పాటలు వ్రాసారు. అందులో కొన్ని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో ఉన్నాయి.  ఆయన జీవితం కోసం క్లుప్తంగా తెలుసుకుందాము.  *పులిపాక జగన్నాధం గారు తూర్పుగోదావరి జిల్లా కొనసీమకు చెందిన శ్యామలదేవి అనే లంకలో పుట్టారు.* సెప్టెంబర్ 14- 1826  *ఈయన ""వైష్టిక బ్రాహ్మణ"" కులంలో పుట్టారు.* ఈయన తలిదండ్రులు చిన్న వయస్సు నుంచే ఈయనకు వేద మంత్రాలు, వేద గ్రంధాలు నేర్పించారు. వీరు బాగా నిష్ఠగా ఉండేవారు..  *చదువుకోసం క్రైస్తవ మిషనేరి స్కూల్ లో చడవాల్సి వచ్చింది.* ఈయన క్రైస్తవ ఉపాధ్యాయులను ఏదోరకంగా అవమానించినట్టు మాట్లాడేవారు... రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టేవాడు...  *గార్డెన్ దొరగారు అనే ఆయన జగన్నాధం గారికి ఒక బైబిలు ని ఇచ్చారు కానీ ఆ బైబిలుని 7సం|| పక్కన పెట్టేసారు.* కొంతకాలం  తర్వాత అనుకోకుండా   మాములుగా చదువుదాం అని బైబిలు ని తీసి చదవటం ప్రారంభించారు  *అన్ని శాస్త్రాలు చదివిన జగన్నాధం గ...

బైబిలు లో ఒక""ధైర్యవంతురాలైన #స్త్రీ""ఉన్నాది.

📖 *బైబిలు లో  ఒక""ధైర్యవంతురాలైన #స్త్రీ""ఉన్నాది.*?? ఈమె భర్త ఒక రాజు దగ్గర #గృహానిర్వాహకుడిగా పనిచేసేవాడు. ఆ రాజు చాలా దుర్మార్గుడు, చెడ్డవాడు. ఈ రాజుని మన "#యేసుప్రభువే"   '#నక్క' అని సంభోధించాడు. అంత చెడ్డవాడు ఈ రాజు. బాప్తిస్మము ఇచ్చే యోహానుని కూడా చంపించేసిన క్రూరుడు ఈ రాజు. మన ప్రభువును కూడా తృణీకరించి, అపహసించిన దుర్మార్గుడు ఈ రాజు. ఈ రాజు దగ్గర పనిచేస్తున్న ఆ గృహానిర్వాహకుడి భార్య (ధైర్యవంతురాలైన స్త్రీ) యేసుక్రీస్తు వలన ఒక వ్యాధి విషయంలో స్వస్థత పొందింది. అప్పటినుంచి గొప్ప విశ్వాసిగా మారి క్రీస్తుప్రభువుకు, ఆయన శిష్యులకు పరిచారము చేయటం ప్రారంభించింది. నా యజమానునికి ఇష్టం లేని మనిషికి నేను పరిచర్య చేస్తున్నాను, *ఈ విషయం తెలిస్తే  రాజు నన్ను చంపేస్తాడేమో అని ఒక్కసారి కూడా భయపడని ధైర్యవంతురాలు ఈ స్త్రీ.* తనకు కలిగిన ఆస్తితో ప్రభువుకు పరిచర్య చేసేది. *తన చుట్టూ ఆపదలు పొంచివున్నా, మరణ భయాలు నీడ వలే తనను వెంబడిస్తున్నా కానీ ఏనాడు ప్రభువుకు దూరం అవ్వని గొప్ప విశ్వాసి ఈ స్త్రీ.* కొన్ని రోజుల గడిచిన తరువాత *ప్రభువును సిలువ వేసి చంపేశారు.* శిష్యుల...

ప్రపంచంలోనే అతి చిన్న బైబిల్... చదవాలంటే మైక్రోస్కోపు ఉండాల్సిందే

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 💠 *🔬ప్రపంచంలోనే అతి చిన్న బైబిల్... చదవాలంటే మైక్రోస్కోపు ఉండాల్సిందే!*🔬 👉 *ప్రపంచంలో అత్యంత చిన్నదైన బైబిల్ ను టెక్నీన్-ఇజ్రాయెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజిస్ శాస్త్రవేత్తలు రూపొందించారు.* 👉  ఈ బైబిల్ సైజు (4.76 మిమీ) సెంటీమీటర్ లో సగం కంటే తక్కువ. సిలికాన్ నానో చిప్ తో ఈ నానో బైబిల్ ని తయారు చేశారు. ఈ నానో బైబిల్ లో గ్రీకు బైబిల్ లోని  భాగాలను ముద్రించారు. 👉   నోవహు భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను ఎలా అయితే జతల చొప్పున తన ఓడ లోనికి ప్రవేశపెట్టాడో, అలాగే ఇప్పుడు శాస్త్రవేత్తలు గ్రీకు బైబిల్ లో ఉన్న 1.2 మిలియన్ అక్షరాలను ఒక పెన్ కి ఉన్న కొన కంటే చిన్నగా ఉండే ఒక చిన్న మైక్రోచిప్  డిస్క్ లో క్రోడీకరించడం జరిగింది,దీన్నే నానో బైబిల్ అంటారు,ఈ నానో బైబిల్ ని చదవడానికి ఒక "ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ " తప్పనిసరి... 👉  ఈ బైబిల్ లో ఒక్కో అక్షరం 0.18 మైక్రాన్లు అంటే ఒక మీటర్ లో 1.80 కోట్ల వంతు సూక్ష్మంగా ఉంటుంది, అందుకే ఈ బైబిల్ ను మైక్రోస్కోపు కింద పెట్టి చదువుకోవాల్సిందే. 👉  చాలా చిన్న మైక్రోస్పెస్ లో ఎంత డేటాను స్టోర్ చే...

విలియం కెరీ గారి జీవితంలోని కొన్ని సంఘటనలు..

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 ♻️ *విలియం కెరీ గారి జీవితంలోని కొన్ని సంఘటనలు....*⬇️ ➡️ విలియం కెరీ గారి జీవితము అసాధారణ చరిత్ర. ఆయన భక్తి, విశ్వాసము, సువార్త పరిచర్య, ప్రార్ధన జీవితము, బైబిల్ పరిశోధన, భాషల పరిజ్ఞానము మన ఊహలకందదు. సువార్త ప్రచురణ యందలి విశేషాసక్తి మనకు కనువిప్పు కలిగిస్తుంది. "ఫాదర్ ఆఫ్ మోడ్రెన్ మిషన్స్" అని పేరుగాంచిన విలియం కెరీ, తన పరిచర్యను పరిమళింప చేసాడు. మత సంస్కర్తగా, సంస్కృత బాషా పండితుడుగా, బెంగాళీ బాషా పండితుడుగా కళాశాలలో సాటిలేని పాండిత్యము సంపాదించుకొన్నాడు. అన్నిటికంటే తాను నమ్మిన యేసు క్రీస్తును గూర్చి తాను నివసిస్తున్న జనుల మధ్య ప్రకటించాడు. అందుకే ఆయన జీవితములో "గడ్డి ఎండును, పువ్వు రాలును అయితే దేవుని వాక్యము నిత్యము నిలుచును" అను వాక్యము నెరవేరింది. 👉 విలియం కెరీ భారత దేశంలో 40 సం.లు ఘనమైన సేవ చేసాడు. తన జీవిత కాలములో 750 మంది యేసు క్రీస్తును ప్రభువుగా రక్షకునిగా అంగీకరించారు. తన జీవితములో విజయ వీరుడుగా తీర్చ బడ్డాడు.  ❇️ *ఆయన సాధించిన కార్యాలు ఎన్నో ఉన్నాయి.*⤵️ ➡️ 1) బైబిల్ అంతటిని 40 భాషల్లో తర్జుమా చేసాడు. ➡️ 2) 1800-1818 :...

క్రైస్తవులలోని కొందరు విశ్వసిస్తున్న నుదిటి వ్రాతలు(తల రాతలు) వాక్యానుసారమా

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 💠 *క్రైస్తవులలోని కొందరు విశ్వసిస్తున్న నుదిటి వ్రాతలు(తల రాతలు) వాక్యానుసారమా?*💠 1️⃣) భూమి మీద ఒక వ్యక్తి తక్కువ వయస్సులోనే చనిపోయినా, తక్కువ కులంలో పుట్టినా, కడు పేద కుటుంబములో జన్మించిన, ఆడవారిగా జన్మించి కష్టాలు పడుతున్నా, తను కోరుకున్నది నెరవేరకపోయిన వీటి అన్నిటికి కారణము మన “నుదిటి మీద రాతే(తల రాతే) అన్న భావన ప్రజలలో నాటుకుపోయింది. 2️⃣) ఒక నూతన జంట వివాహము తరువాత విహార యాత్రకు బయలుదేరినప్పుడు driver నిర్లక్షం వల్లనో, మితి మీరిన వేగం వల్లనో ప్రమాదము సంభవించి వరుడు మరణిస్తే ఆ మరణించిన వరుడి తల్లికి ఒకే బిడ్డ అయితే ఆ తల్లి తన బిడ్డ శవం ముందు కుర్చుని పలికే రోదన ధ్వనులలో ఎక్కువ శాతం దేవుడినే ధుషిస్తూ, శాపనార్ధాలు పెడుతూ – దేవుడా లోకములో ఇంత మంది బిడ్డలుండగా నీకు నా బిడ్డే కనిపించాడా? అన్యాయముగా నా బిడ్డను పొట్టన పెట్టుకున్నావు కదయ్యా అని అంటూ విధవరాలుగా మారిన నవ వధువును ఉద్దేశించి నీ రాత బగలేదమ్మా, ఇది దేవుడు రాసిన రాతే, విధి వ్రాతను తప్పించుకోవడము ఎవరి తరం గాదు అనే మాటల సందర్భాన్ని మనము గమనించొచ్చు. 3️⃣) ఒక్కొకరికి ఒక్కో రకమైన తల రాతను దేవుడు వ్రా...

పరిశుద్ధ గ్రంధం - పోలికలు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *పరిశుద్ధ గ్రంధం - పోలికలు* ♻ *పాలు*: శిశువు బలము పొందుకొని, జీవించాలంటే? పాలు ఎంత అత్యవసరమో? ఆత్మీయ శిశువు అభివృద్ధి చెందాలంటే? *వాక్యమనే పాలు * అంతే అవసరం.  క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మల మైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.       1 పేతురు  2:3 ♻ *తేనె*: తేనె కన్నా మధురమైనది ఈ లోకాన లేదనుకుంటాము. కానీ, దాని కంటే మధురమైనది దేవుని వాక్యము.  నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి.           కీర్తనలు 119:103 ♻ *రొట్టె (ఆహారం)*:  ఆహారం క్షయమైన శరీరాన్ని మాత్రమే జీవింపజేస్తుంది. కానీ వాక్యమైన జీవాహారం అక్షయమైన ఆత్మను జీవింపజేస్తుంది.  అందుకాయనమనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును              మత్తయి 4:4 ♻ *అగ్ని*:   అగ్ని స్వచ్ఛ మైనది, పవిత్రమైనది. దేవుని వాక్యము కూడా అట్లాంటిదే.  నా మాట అగ్నివంటిదికాదా?  ...

విలియం కాల్గేట్

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 🌴విలియం కాల్గేట్☘️ విలియం కాల్గేట్ ఈ పేరు వినగానె సుమారు ప్రపంచంలో ఉన్న ప్రతిదేశంలోను,ప్రతిరాష్ట్రంలోను,ప్రతిజిల్లాలోను,ప్రతిగ్రామంలోను ఇతను తయారు చేసిన "కాల్గేట్"టూత్ పేస్ట్ వాడని వారుండరు. విలియంకాల్గేట్ తండ్రిపేరు రాబర్ట్ కాల్గేట్.ఇతను వ్రృత్తిరీత్య వ్యవసాయ దారుడు.రాబర్ట్ కాల్గేట్ చాల తెలివైనవాడు.రాబర్ట్ కాల్గేట్ బార్యపేరు మేరి.వీరికి ముగ్గురు పిల్లలు ఇద్దరు కుమారులలో ఒకడు విలియం కాల్గేట్.క్రీ"శ 1783సం"జనవరి25న జన్మించినాడు.వీరి కుటుంభం అతి పేదస్థతిలో ఉండేది. 💥క్రీ"శ"1795 మార్చి నెలలో ఇంగ్లాండ్ నుండి అమేరికాకు వచ్చి "హార్ట్ ఫోర్"వచ్చి స్థిరపడ్డారు. అయితే విలియం కాల్గేట్ వయస్సు పెరిగే కొద్దీ స్వంత వ్యపారం చేయలని 19 వ ఏట నిర్ణయించుకొన్నాడు. ప్రారంభంలో సోప్స్,క్యాండిల్స్ వ్యపారము చేశాడు. కొన్ని సం"రాలకే తీవ్రమైన నష్టం వచ్చి అతని ఫ్యాక్టరీ మూతపడిపోయింది. 💥విలియం కాల్గేట్ యేసుక్రీస్తు ను స్వంత రక్షకునిగా అంగీకరించుట:- ✨తన ఊరు దగ్గర పడవ నడిపే కెప్టెన్ సువార్త చెప్పి రక్షణలోనికి నడిపించి,కొన్ని సూచనలు తెలియ జ...