📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚
*పరిశుద్ధ గ్రంధం - పోలికలు*
♻ *పాలు*:
శిశువు బలము పొందుకొని, జీవించాలంటే? పాలు ఎంత అత్యవసరమో? ఆత్మీయ శిశువు అభివృద్ధి చెందాలంటే? *వాక్యమనే పాలు * అంతే అవసరం.
క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై, నిర్మల మైన వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి.
1 పేతురు 2:3
♻ *తేనె*:
తేనె కన్నా మధురమైనది ఈ లోకాన లేదనుకుంటాము. కానీ, దాని కంటే మధురమైనది దేవుని వాక్యము.
నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనెకంటె తీపిగా నున్నవి.
కీర్తనలు 119:103
♻ *రొట్టె (ఆహారం)*:
ఆహారం క్షయమైన శరీరాన్ని మాత్రమే జీవింపజేస్తుంది. కానీ వాక్యమైన జీవాహారం అక్షయమైన ఆత్మను జీవింపజేస్తుంది.
అందుకాయనమనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును
మత్తయి 4:4
♻ *అగ్ని*:
అగ్ని స్వచ్ఛ మైనది, పవిత్రమైనది. దేవుని వాక్యము కూడా అట్లాంటిదే.
నా మాట అగ్నివంటిదికాదా?
యిర్మియా 23:29
♻ *సుత్తె*:
బండలను బ్రద్దలు చెయ్యాలంటే? సుత్తె కావాలి. బండలుగా మారిన మన హృదయాలను బ్రద్దలుచేసి, సరి చెయ్యాలంటే? వాక్యమనే సుత్తె తప్పక కావాలి.
నా మాట .....
బండను బద్దలుచేయు సుత్తెవంటిది కాదా?
యిర్మియా 23:29
♻ *అద్దము*:
నీ బాహ్య రూపాన్ని సరి చేసుకోవడానికి అద్దము కావాలి. నీ అంతరంగాన్ని సరిచేసుకోవాలంటే? వాక్యమనే అద్దము తప్పకకావాలి.
ఎవడైనను వాక్యమును వినువాడైయుండి దానిప్రకారము ప్రవర్తింపనివాడైతే, వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని పోలియున్నాడు.
యాకోబు 1:23
♻ *ఖడ్గము*:
శత్రువును జయించాలంటే? ఖడ్గము ధరించాల్సిందే. మన ప్రధాన శత్రువైన సాతానును జయించాలంటే? వాక్యమనే ఆత్మ ఖడ్గము ధరించాల్సిందే.
దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది.
హెబ్రీ 4:12
వాక్యమను ఆత్మఖడ్గమును ధరించు కొనుడి.
ఎఫెసి 6:17
♻ *విత్తనము*:
ఫలించాలంటే? విత్తనం కావాలి. ఆత్మీయంగా ఫలించాలంటే? వాక్యమనే విత్తనం కావాలి.
విత్తనము దేవుని వాక్యము.
లూకా 8:11
♻ *నీరు*:
దేహమునకంటిన మురికిని శుభ్రపరచు కోవాలంటే? నీరు కావాలి. హృదయానికి అంటిన మురికిపోవాలంటే? వాక్యమనే నీరు కావాలి.
నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.
ఎఫెసి 5:27
పాలు, తేనె, రొట్టె, అగ్ని, సుత్తె,
అద్దము, ఖడ్గము, విత్తనము, నీరు వంటి వాక్యాన్ని ధ్యానించి, సరిచేసుకొని, అనుసరించగలిగితే? ఆ వాక్యము నీకు నెమ్మదినిస్తుంది! ఆదరిస్తుంది! సరిచేస్తుంది! ప్రోత్సహిస్తుంది! జీవింపజేస్తుంది! ఆ నిత్య రాజ్యానికి చేర్చ గలుగుతుంది.
ఆ దివ్య గ్రంధాన్ని ధ్యానిద్దాం!
అట్టి రీతిగా జీవిద్దాం!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి