ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

విలియం కెరీ గారి జీవితంలోని కొన్ని సంఘటనలు..

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚



♻️ *విలియం కెరీ గారి జీవితంలోని కొన్ని సంఘటనలు....*⬇️

➡️ విలియం కెరీ గారి జీవితము అసాధారణ చరిత్ర. ఆయన భక్తి, విశ్వాసము, సువార్త పరిచర్య, ప్రార్ధన జీవితము, బైబిల్ పరిశోధన, భాషల పరిజ్ఞానము మన ఊహలకందదు. సువార్త ప్రచురణ యందలి విశేషాసక్తి మనకు కనువిప్పు కలిగిస్తుంది. "ఫాదర్ ఆఫ్ మోడ్రెన్ మిషన్స్" అని పేరుగాంచిన విలియం కెరీ, తన పరిచర్యను పరిమళింప చేసాడు. మత సంస్కర్తగా, సంస్కృత బాషా పండితుడుగా, బెంగాళీ బాషా పండితుడుగా కళాశాలలో సాటిలేని పాండిత్యము సంపాదించుకొన్నాడు. అన్నిటికంటే తాను నమ్మిన యేసు క్రీస్తును గూర్చి తాను నివసిస్తున్న జనుల మధ్య ప్రకటించాడు. అందుకే ఆయన జీవితములో "గడ్డి ఎండును, పువ్వు రాలును అయితే దేవుని వాక్యము నిత్యము నిలుచును" అను వాక్యము నెరవేరింది.

👉 విలియం కెరీ భారత దేశంలో 40 సం.లు ఘనమైన సేవ చేసాడు. తన జీవిత కాలములో 750 మంది యేసు క్రీస్తును ప్రభువుగా రక్షకునిగా అంగీకరించారు. తన జీవితములో విజయ వీరుడుగా తీర్చ బడ్డాడు. 

❇️ *ఆయన సాధించిన కార్యాలు ఎన్నో ఉన్నాయి.*⤵️

➡️ 1) బైబిల్ అంతటిని 40 భాషల్లో తర్జుమా చేసాడు.

➡️ 2) 1800-1818 : బెంగాళీ భాషలోనికి బైబిల్ ను ముద్రించాడు.

➡️ 3) ముద్రణ యంత్రాన్ని, కాగితపు పరిశ్రమను స్వంతంగా తయారు చేసాడు.

➡️ 4) మొదటి ప్రాథమిక పాటశాలను స్థాపించాడు.

➡️ 5) హిందూ స్త్రీలకు, బాలికలకు విద్యా సంస్థలు నెలకొల్పాడు.

➡️ 6) వైద్య పరిచర్య ప్రారంభించాడు.

➡️ 7) క్రైస్తవ మత గురువుల అభ్యాసము నిమిత్తము వేదాంత కళాశాల స్థాపించాడు.

➡️ 8 ) 30 క్రైస్తవ మిషన్ స్టేషన్లు రూపొందించాడు.

➡️ 9) వ్యవసాయ రంగము నిమిత్తము నూతన పద్దతులు రూపొందించాడు.

➡️ 10) సంస్కృతంలో నున్న యితిహాసములను ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేసాడు.

➡️ 11) రామాయణ, మహాభారతములను ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేసాడు.

➡️ 12) బైబిల్ ను సంస్కృతంలోనికి తర్జుమా చేసాడు.

➡️ 13) 1800  సం.లో మొదటి విశ్వాసికి బాప్తీస్మం యిచ్చాడు.

➡️ 14) సతీసహగమనం రూపు మాపుటకు నాటి సంస్కర్తలతో కలిసి కృషి చేసి, మాన్పించాడు. (1767-1827 వరకు 70,000 వితంతువులు అగ్నికి ఆహుతి అయ్యి బుగ్గి పాలయ్యారు.

➡️ 15) దేవాలయ వ్యభిచార వృత్తిని అదుపులోనికి తెచ్చారు.

💠 *విలియం కెరీ గారి జీవితములోని కొన్ని ఘట్టాలు :*⤵️

👉 జననం : ఆగస్ట్ 17, 1761

👉 బాప్తిసం : అక్టోబర్ 5, 1783

👉 సువార్త సేవకు ప్రయాణము : జూన్ 13, 1793

👉 కలకత్తాలో చేరుట : నవంబర్ 11, 1793

👉 బైబిల్ బెంగాళీ బాషలోనికి తర్జుమా : 1800
 
👉 మొదటి విశ్వాసి బాప్తీస్మం : డిసెంబర్ 28, 1800

👉 బైబిల్ తర్జుమా : 1818 

👉 సిరంపూర్ కళాశాల స్థాపన : 1821

👉 సతీసహగమనం రద్దు : డిసెంబర్ 4, 1829

👉 ప్రభువు సన్నిధికి చేరుట : జూన్ 9, 1834

👉  *"దేవుని నుండి గొప్ప కార్యాలు కనిపెట్టుము దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టుము"*

సేకరణ :

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...