ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రైస్తవ_ఆణిముత్యం_పులిపాక_జగన్నాధం"" గారి క్లుప్త చరిత్ర*

💠 *జీవిత చరిత్రలు* 💠

#క్రైస్తవ_ఆణిముత్యం_పులిపాక_జగన్నాధం"" గారి క్లుప్త చరిత్ర*

 "పులిపాక జగన్నాధం" గారు అనే భక్తుడు దేవుని కోసం చాలా చాలా కష్టపడ్డారు, సేవచేశారు, ఎన్నో గొప్ప గొప్ప పాటలు వ్రాసారు.
అందులో కొన్ని ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో ఉన్నాయి.

 ఆయన జీవితం కోసం క్లుప్తంగా తెలుసుకుందాము.

 *పులిపాక జగన్నాధం గారు తూర్పుగోదావరి జిల్లా కొనసీమకు చెందిన శ్యామలదేవి అనే లంకలో పుట్టారు.*
సెప్టెంబర్ 14- 1826

 *ఈయన ""వైష్టిక బ్రాహ్మణ"" కులంలో పుట్టారు.*
ఈయన తలిదండ్రులు చిన్న వయస్సు నుంచే ఈయనకు వేద మంత్రాలు, వేద గ్రంధాలు నేర్పించారు.
వీరు బాగా నిష్ఠగా ఉండేవారు..

 *చదువుకోసం క్రైస్తవ మిషనేరి స్కూల్ లో చడవాల్సి వచ్చింది.* ఈయన
క్రైస్తవ ఉపాధ్యాయులను ఏదోరకంగా అవమానించినట్టు మాట్లాడేవారు...
రకరకాల ప్రశ్నలతో ఇబ్బంది పెట్టేవాడు...

 *గార్డెన్ దొరగారు అనే ఆయన జగన్నాధం గారికి ఒక బైబిలు ని ఇచ్చారు కానీ ఆ బైబిలుని 7సం|| పక్కన పెట్టేసారు.*
కొంతకాలం  తర్వాత అనుకోకుండా   మాములుగా చదువుదాం అని బైబిలు ని తీసి చదవటం ప్రారంభించారు

 *అన్ని శాస్త్రాలు చదివిన జగన్నాధం గారికి బైబిలు లోని మాటలు బాగా హత్తుకున్నాయి.*
బైబిలు ని చదవటం అలవాటు చేసుకుని కాలక్రమేణా మందిరానికి వెళ్ళటం ఆరంభించి క్రైస్తవునిగా మారిపోయారు...

 *ఇది తెలుసుకున్న జగన్నాధం గారి తల్లిదండ్రులు, రక్తసంబంధులు జగన్నాధం గారి మీద కోపడ్డారు, ప్రాధేయపడ్డారు, బెదిరించారు, ఆస్తిలో ఒక్క పైసా కూడా ఇవ్వము అని అన్నారు కానీ జగన్నాధం గారు దేవుని కోసం అన్ని విడిచిపెట్టేశారు...*

 1847 లో ఏప్రిల్ 19 న హిందూమతాన్ని, బ్రాహ్మణ కులానికి సెలవు చెప్పి దైవ సేవకు వచ్చేసారు.
*అది తెలుసుకున్న అగ్ర కులాల వారు, బ్రాహ్మణులు తమ కులానికి అవమానం తెచ్చాడు అని పగబట్టి జగన్నాధం గారిని అనేక హింసలు పెట్టారు,* అవమానించారు...
అన్నిటికి తట్టుకుని దేవునిలో ముందుకు సాగిపోయారు జగన్నాధం గారు...

 *ఈయన తన సేవలో, శ్రమలలో, ఎన్నెన్నో గొప్ప పాటలు వ్రాసారు కానీ అవన్నీ మనకు లభించలేదు కేవలం 29 పాటలు మాత్రమే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో ఉన్నాయి.*
152 పద్యాలు కూడా వ్రాసారు కానీ ఒక్కటి కూడా దొరకలేదు😔

 క్రొత్తయేడు మొదలు పెట్టెను (603 కీర్తన)
హృదయమనేడి తలుపు నొద్ద (310)
నీవే నా ప్రియుడవు యేసు ప్రభు (414)

 చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక (11).

*ఇలా ఎన్నెన్నో గొప్ప కీర్తనలు రచించారు.*
ఆ పాటలు ఇప్పటికి క్రైస్తవ సంఘాలలో మారుమోగుతూనే ఉన్నాయి.....

ఈయన విశాఖపట్నం లో నవంబర్ 4- 1896 లో ప్రభువునందు నిద్రించారు...

 *నిష్ఠగల బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి "బైబిలు" ని చదివి క్రైస్తవునిగా మారి తలిదండ్రులు, రక్తసంబంధులతో తృణీకరింపబడి దేవుని కోసం గొప్ప సేవ చేసిన క్రైస్తవ 'ఆణిముత్యం' మన "పులిపాక జగన్నాధం" గారు..*

*మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్న నేను, నువ్వు ప్రతిరోజు మానకుండా బైబిలు చదువుతున్నామా???*

 *""బైబిలు"" ని చదివి బ్రాహ్మణులు, సిక్కులు, ముస్లింలు, అనేకమంది మతాల వారు, కులాల వారు దేవునిలోకి వచ్చి గొప్ప జీవితం జీవించి మనకు మాదిరి ఉంచి వెళ్లిపోయారు.* వీరందరిని బట్టి
*""దేవునికే మహిమ కలుగును గాక""*👏👏👏

పులిపాక జగన్నాధం గారి కోసం అవసరమైతే #గూగుల్ లో చూడండి.....

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...