ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రపంచ జాతుల ఆవిర్భావం

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 ♻️ *ప్రపంచ జాతుల ఆవిర్భావం*♻️   👉జలప్రళయం గతించిన తరువాత నోవహు కుమారులైన షేము,హాము,యాపేతుల వంశావళి నుండి ప్రపంచంలోని వివిధ దేశాలు జాతులు ఉద్భవించాయి. ఆదికాండం 10వ అధ్యాయం లో ఈ  విషయాలన్నీ గమనించగలం. ప్రపంచ దేశాల  ఆవిర్భావం నోవహు కుమారులనుండే జరిగింది.    👉జలప్రళయం తర్వాత చరిత్ర నిర్మాతలు నోవహు కుమారులే. వీరి నుండి వచ్చిన జనంగాలే ఆ తదుపరి ప్రపంచమంతా వ్యాపించారు. 👉   *షేము* షేము  సంతానాన్ని సెమిటిక్కులు అంటారు. వీరు గురించిన అధ్యాయాన్ని సెమిటిజం అంటారు. వీరు కొండ ప్రాంతాంల్లో నివాసం ఉండేవారు. ఆసియా వారు వీరి నుండి వచ్చిన వారు. 👉 ఆదికాండం 10వ అధ్యాయం 21- 30 వరకు హేమ సంతానముల గురించి వ్రాయబడింది. 👉 షేము సంతానంలో గుర్తింపదగిన వారు ఎందరో ఉన్నప్పటికీ అతి ప్రాముఖ్యమైన వారు కొందరున్నారు.    ఏలాము =ఇరాన్     అష్షూరు = ఉత్తర ఇరాక్     అర్పక్షదు= సిరియా 👉 అర్పక్షదు సంతానంలో సరిగ్గా పదవ తరం నుండి అబ్రహాము వచ్చెను. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఈ సంతానము నుండి వచ్చెను గనుక ఇది ప్రత్యేకమైనద...

పురవస్తూ తవ్వకాల్లో బయటపడ్డ మూడు వేల స౦వత్సరాల క్రిత౦ నాటి పురాతన పాత్రపై కనిపి౦చిన బైబిల్ చరిత్రకు ఆధారం

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 ♻️ *పురవస్తూ తవ్వకాల్లో బయటపడ్డ మూడు వేల స౦వత్సరాల క్రిత౦ నాటి పురాతన పాత్రపై కనిపి౦చిన బైబిల్ చరిత్రకు ఆధారం...*♻️ 👉 పురావస్తు శాస్త్రజ్ఞులకు 2012⁠లో, మూడు వేల స౦వత్సరాల క్రిత౦ నాటి పి౦గాణీ పాత్ర ముక్కలు దొరికాయి. వాటిపై రాసి ఉన్న కొన్ని మాటల్ని చూసినప్పుడు పరిశోధకులు చాలా ఆశ్చర్యపోయారు. 👉  ఆ పాత్ర ముక్కలన్నిటినీ కలిపినప్పుడు వాళ్లకు కనానీయుల భాషలో రాసివున్న ఒక పేరు కనిపి౦చి౦ది. దానిపై “ఎష్బయలు బెన్ బీడా” అని రాసివు౦ది. అ౦టే “బీడా కొడుకైన ఎష్బయలు” అని అర్థ౦. పురాతన వస్తువుపై ఈ పేరు కనిపి౦చడ౦ ఇదే మొదటిసారి అని పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తి౦చారు. 👉   ఎష్బయలు అనే పేరున్న మరో వ్యక్తి గురి౦చి బైబిల్లో ఉ౦ది. అతను రాజైన సౌలు కొడుకుల్లో ఒకడు. (1 దిన. 8:33; 9:39) పురాతన పాత్రను కనుగొన్న వాళ్లలో ఒకరైన ప్రొఫెసర్ యోసెఫ్ గార్ఫి౦గ్కల్ ఇలా చెప్పాడు, “రాజైన దావీదు పరిపాలనా కాల౦లో ఎష్బయలు అనే పేరు ఉన్నట్లు, బైబిల్లో అలాగే ఇప్పుడు పురావస్తుశాస్త్ర నివేదికల్లో ఉ౦డడ౦ ఆసక్తికరమైన విషయ౦.” బైబిల్లోని విషయాలు నిజమని పురావస్తుశాస్త్ర౦ ఎ౦దుకు సమర్థిస్...

పద సమాచారం

📚 *పదం సమాచారం:*📚 👉 *కాదేషు, కాదేషు-బర్నేయ, మెరిబాకాదేషు వాస్తవాలు:* 👉 *కాదేషు, కాదేషు-బర్నేయ, మెరిబా కాదేషు అనే పేర్లన్నీ ఇశ్రాయేలు చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన పట్టణాన్ని చూచిస్తున్నాయి, ఇది ఎదోము ప్రాంతానికి దగ్గరగా ఇశ్రాయేలు దక్షిణ భాగంలో ఉంది.* 👉 కాదేషు పట్టణం ఒక నీటి ఊటగా ఉండేది. సీను ఎడారి మధ్యలో నీరు, సారవంతమైన నేల ఉన్న స్థలం. 👉 కనాను భూభాగాన్ని వేగు చూడడానికి మోషే కాదేషు బర్నేయ నుండి వేగులను పంపించాడు. 👉 ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంచారం చేస్తున్న సందర్భంలో ఇది ప్రసిద్ధమైన మజిలి. 👉 కాదేషు బర్నేయలో మిర్యామును సమాధి చేసారు. 👉 మెరిబా కాదేషు వద్ద ఇశ్రాయేలీయులకు నీరు పొందడానికి దేవుడు చెప్పిన విధంగా నీరున్న బండతో మాట్లాడడానికి బదులు ఆ బండను కొట్టడం ద్వారా మోషే దేవునికి అవిధేయుడయ్యాడు. 👉 *”కాదేషు” అనే పేరు హెబ్రీ పదం నుండి తీసుకోబడింది, అంటే “పవిత్రం” లేక “ప్రతిష్టితం” అని అర్థం.* 👉 *బైబిలు రిఫరెన్సులు:* యెహెజ్కేలు 48:27-29 ఆదికాండం 14:7-9 ఆదికాండం 16:13-14 ఆదికాండం 16:1-3 యెహోషువా 10:40-41 సంఖ్యాకాండం 20:1