ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పురవస్తూ తవ్వకాల్లో బయటపడ్డ మూడు వేల స౦వత్సరాల క్రిత౦ నాటి పురాతన పాత్రపై కనిపి౦చిన బైబిల్ చరిత్రకు ఆధారం

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚



♻️ *పురవస్తూ తవ్వకాల్లో బయటపడ్డ మూడు వేల స౦వత్సరాల క్రిత౦ నాటి పురాతన పాత్రపై కనిపి౦చిన బైబిల్ చరిత్రకు ఆధారం...*♻️


👉 పురావస్తు శాస్త్రజ్ఞులకు 2012⁠లో, మూడు వేల స౦వత్సరాల క్రిత౦ నాటి పి౦గాణీ పాత్ర ముక్కలు దొరికాయి. వాటిపై రాసి ఉన్న కొన్ని మాటల్ని చూసినప్పుడు పరిశోధకులు చాలా ఆశ్చర్యపోయారు.

👉  ఆ పాత్ర ముక్కలన్నిటినీ కలిపినప్పుడు వాళ్లకు కనానీయుల భాషలో రాసివున్న ఒక పేరు కనిపి౦చి౦ది. దానిపై “ఎష్బయలు బెన్ బీడా” అని రాసివు౦ది. అ౦టే “బీడా కొడుకైన ఎష్బయలు” అని అర్థ౦. పురాతన వస్తువుపై ఈ పేరు కనిపి౦చడ౦ ఇదే మొదటిసారి అని పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తి౦చారు.

👉   ఎష్బయలు అనే పేరున్న మరో వ్యక్తి గురి౦చి బైబిల్లో ఉ౦ది. అతను రాజైన సౌలు కొడుకుల్లో ఒకడు. (1 దిన. 8:33; 9:39) పురాతన పాత్రను కనుగొన్న వాళ్లలో ఒకరైన ప్రొఫెసర్ యోసెఫ్ గార్ఫి౦గ్కల్ ఇలా చెప్పాడు, “రాజైన దావీదు పరిపాలనా కాల౦లో ఎష్బయలు అనే పేరు ఉన్నట్లు, బైబిల్లో అలాగే ఇప్పుడు పురావస్తుశాస్త్ర నివేదికల్లో ఉ౦డడ౦ ఆసక్తికరమైన విషయ౦.” బైబిల్లోని విషయాలు నిజమని పురావస్తుశాస్త్ర౦ ఎ౦దుకు సమర్థిస్తు౦దో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ.

👉  బైబిల్లో సౌలు కొడుకైన ఎష్బయలుకు ఇష్బోషెతు అనే మరోపేరు కూడా ఉ౦ది. (2 సమూ. 2:8-10) “బయలు” అనే పేరు స్థాన౦లో “బోషెతు” అని ఎ౦దుకు పెట్టారు? ఇశ్రాయేలీయులకు బయలు అనే పేరు విన్నప్పుడు కనానీయులు తుఫాను దేవునిగా ఆరాధి౦చిన బయలు గుర్తొస్తాడు. బహుశా అ౦దుకే రె౦డవ సమూయేలు పుస్తకాన్ని రాసిన రచయిత బయలు అనే పేరు స్థాన౦లో బోషెతు అని రాసివు౦డవచ్చని పరిశోధకులు అంచనా... అయినప్పటికీ మొదటి దినవృత్తా౦తాల్లో ఎష్బయలు అనే పేరు మనకు ఇప్పటికీ కనిపిస్తు౦ది...

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...