📚 *పదం సమాచారం:*📚
👉 *కాదేషు, కాదేషు-బర్నేయ, మెరిబాకాదేషు వాస్తవాలు:*
👉 *కాదేషు, కాదేషు-బర్నేయ, మెరిబా కాదేషు అనే పేర్లన్నీ ఇశ్రాయేలు చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన పట్టణాన్ని చూచిస్తున్నాయి, ఇది ఎదోము ప్రాంతానికి దగ్గరగా ఇశ్రాయేలు దక్షిణ భాగంలో ఉంది.*
👉 కాదేషు పట్టణం ఒక నీటి ఊటగా ఉండేది. సీను ఎడారి మధ్యలో నీరు, సారవంతమైన నేల ఉన్న స్థలం.
👉 కనాను భూభాగాన్ని వేగు చూడడానికి మోషే కాదేషు బర్నేయ నుండి వేగులను పంపించాడు.
👉 ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంచారం చేస్తున్న సందర్భంలో ఇది ప్రసిద్ధమైన మజిలి.
👉 కాదేషు బర్నేయలో మిర్యామును సమాధి చేసారు.
👉 మెరిబా కాదేషు వద్ద ఇశ్రాయేలీయులకు నీరు పొందడానికి దేవుడు చెప్పిన విధంగా నీరున్న బండతో మాట్లాడడానికి బదులు ఆ బండను కొట్టడం ద్వారా మోషే దేవునికి అవిధేయుడయ్యాడు.
👉 *”కాదేషు” అనే పేరు హెబ్రీ పదం నుండి తీసుకోబడింది, అంటే “పవిత్రం” లేక “ప్రతిష్టితం” అని అర్థం.*
👉 *బైబిలు రిఫరెన్సులు:*
యెహెజ్కేలు 48:27-29
ఆదికాండం 14:7-9
ఆదికాండం 16:13-14
ఆదికాండం 16:1-3
యెహోషువా 10:40-41
సంఖ్యాకాండం 20:1
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి