ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ప్రపంచ జాతుల ఆవిర్భావం

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚


♻️ *ప్రపంచ జాతుల ఆవిర్భావం*♻️
 


👉జలప్రళయం గతించిన తరువాత నోవహు కుమారులైన షేము,హాము,యాపేతుల వంశావళి నుండి ప్రపంచంలోని వివిధ దేశాలు జాతులు ఉద్భవించాయి. ఆదికాండం 10వ అధ్యాయం లో ఈ  విషయాలన్నీ గమనించగలం. ప్రపంచ దేశాల  ఆవిర్భావం నోవహు కుమారులనుండే జరిగింది.

  
👉జలప్రళయం తర్వాత చరిత్ర నిర్మాతలు నోవహు కుమారులే. వీరి నుండి వచ్చిన జనంగాలే ఆ తదుపరి ప్రపంచమంతా వ్యాపించారు.


👉   *షేము*
షేము  సంతానాన్ని సెమిటిక్కులు అంటారు. వీరు గురించిన అధ్యాయాన్ని సెమిటిజం అంటారు. వీరు కొండ ప్రాంతాంల్లో నివాసం ఉండేవారు. ఆసియా వారు వీరి నుండి వచ్చిన వారు.

👉 ఆదికాండం 10వ అధ్యాయం 21- 30 వరకు హేమ సంతానముల గురించి వ్రాయబడింది.


👉 షేము సంతానంలో గుర్తింపదగిన వారు ఎందరో ఉన్నప్పటికీ అతి ప్రాముఖ్యమైన వారు కొందరున్నారు.
  
ఏలాము =ఇరాన్
   
అష్షూరు = ఉత్తర ఇరాక్
 
  అర్పక్షదు= సిరియా

👉 అర్పక్షదు సంతానంలో సరిగ్గా పదవ తరం నుండి అబ్రహాము వచ్చెను. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఈ సంతానము నుండి వచ్చెను గనుక ఇది ప్రత్యేకమైనది. అబ్రహాము నుండి మూడు జనంగారు భూమి మీదకు వచ్చాయి.వారెవరనగా ఇశ్రాయేలు, ఇష్మాయేలు, మీద్యానీయులు.
     

 👉  *హము*
               వేరుశనగ ప్రాంతంలో నివసించేవారు. వీరు మైదాన వాసులు. ఆఫ్రికా వాసులు హాము నుండి వచ్చిన వారు.
ఈ సంతానంలో నిమ్రోదు ప్రఖ్యాత నొందినవాడు."యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడిగా బిరుదు సంపాదించుకున్నాడు"

👉             హాము యొక్క నాలుగు కుమారుని పేరు *'కానాను'.* ఇతని పేరును బట్టియే పాలస్తీనాకు కానాను అని పేరు వచ్చింది. కానాను అను మాటకు "ఉదా పొడి దేశస్తులు" అని అర్థం. ఎందుకనగా పూర్వ దినాలలో కారనానీయులు ఊదా పొడిని కొన్ని రకాలైన గవ్వల నుండి తీసి చుట్టుప్రక్కల దేశాలకు అమ్మేవారు. ఈ కాలనీల నుండి పెరిజ్జీలు,హివ్వీయులు, హిత్తీయులో మొదలగు వారు వచ్చారు.

కూషు            = ఇథియోపియా ప్రజల          మూలపురుషుడు

మిస్రాయీము= ఈజిప్టు ప్రజలకు మూలపురుషుడు

పూతు            =లిబియూ, మిగితా ఆఫ్రికా ప్రజలకు మూలపురుషుడు

కానాను           =కానానీయుల ఏదో మూల పురుషుడు

                 

👉  *యాపేతు*
యాపేతు కుమారుల నివాసం సముద్రతీర ప్రాంతాలు, ఉత్తరదృవ ప్రాంత భాగంలో ఉండే వారు.ఐరోపా వారు యాపేతు సంతానపు వారు.


👉       యాపేతు సంతతి నుండి వచ్చిన జాతుల ఎవరనగా

గోమెరు                            = జర్మనీ

మాగోగు,తుబాల్,మెషెక్    = రష్యా

యవాన్                           = గ్రీసు

మాదయి                          = పర్షియా

తీరసు                              = ఇటలీ

తోగర్మ                              = అర్మేనియా

తర్షీషు                              = స్పెయిన్

కిత్తీము                             = సైప్రస్

      👉👉ఈ విధంగా గమనిస్తే ఈ రోజున భూమి మీద ప్రతీ దేశం, ప్రతి జాతి, ఏవిధంగా ఉద్భవించాయో తెలియాలంటే బైబిల్ దగ్గరకు రావడం తప్పనిసరి. ప్రపంచ దేశాల ఆవిర్భావం గురించి, జాతుల గురించి ప్రజల ఆవిర్భావం మరియు వారి విధి విధానాలు గురించి బైబిల్ ఇచ్చినంత స్పష్టమైన వివరణ మరే ఇతర గ్రంథములో మనం చూడలేము. అందరి బట్టి బైబిల్ గ్రంధం మానవ చరిత్రకు ఆధారమైయున్నది. లేకపోతే ఈ జనాంగాల వివరణ మానవునికి తెలిసేది కాదు.






💫 *దేవుని కే మహీమ కలుగును గాక అమెన్*✨


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...