*బైబిల్ లో కనిపించే అబద్ధములు మరియు మోసములు* 💠💠💠💠💠💠💠💠💠💠💠💠💠 1️⃣. సాతాను "మీరు చావనే చావరు" అని చెప్పి హవ్వను మోసగించెను - *(ఆది 3:4)* 2️⃣. అబ్రాహాము తన భార్యయైన శారా "తన సహోదరి" అని చెప్పి ఫరోకు అబద్ధం చెప్పెను *(ఆది 12:13,18,19)* 3️⃣. అబ్రహము తన భార్యయైన శారా "తన చెల్లెలు" అని చెప్పి అబీమెలెకుకు అబద్ధం చెప్పెను *(ఆది 20:2, 8,9)* 4️⃣. శారా దేవునితో "నేను నవ్వలేదని" అబద్ధం చెప్పెను *(ఆది 18:15)* 5️⃣. "నేను ఏశావు అను నీ జేష్టకుమారుడును" అని చెప్పి యాకోబు ఇస్సాకును మోసగించెను *(ఆది 27:19)* 6️⃣. ఇస్సాకు తన భార్య అయిన రిభ్కా "నా సహోదరి" అని చెప్పి అబీమెలెకును అబద్ధం చెప్పెను *(ఆది 26:7)* 7️⃣. లాబాను రాహేలుకు బదులు లేయాను ఇచ్చి యాకోబును మోసగించెను *(ఆది 29:18-26)* 8️⃣. యాకోబు యొక్క కుమారులు యోసేపు యొక్క విచిత్రపు నిలువుటంగీ యాకోబుకు చూపించి "ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో, కాదో గుర్తుపట్టుము" అని చెప్పి మోసగించిరి *(ఆది 37:32)* 9️⃣. పోతీఫరు భార్య "నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీదాసుడు నన...