*బైబిల్ లో ఉన్న కపటోపాయములు పార్ట్ 2*
10. *దావీదుకు వ్యతిరేకంగా సౌలు యొక్క కపటోపాయము* - దావీదు ఖచ్చితముగా ఫిలిష్తీయుల చేతిలో హతమగునను దురాలోచనతో చెవులు ఫిలిష్తీయుల నూరు ముందోళ్ళను దావీదు తెచ్చినచో అతనికి తన కుమార్తెయైన మీకాలునిచ్చి పెండ్లి చేసెదనని చెప్పెను - *(1 సమూ 18:25)*
11. *దావీదుకు వ్యతిరేకంగా సౌలు యొక్క కపటోపాయము* - ఇతడు దురాలోచనతో దావీదునొద్ధకు వెళ్లి, దేవునితో తాను చేసుకొనిన మ్రొక్కుబడిని తీర్చుటకును హెబ్రోనుకు వెళ్ళుటకు సెలవిమ్మని మనవి చేసుకుని హెబ్రోనుకు వెళ్ళెను. అయితే ఇతడు వాస్తవానికి దావీదుకు వ్యతిరేఖంగా తిరుగుబాటు చేయుటకు అక్కడికి వెళ్ళెను - *(2 సమూ 15 అధ్యా)*
12. *సొలొమోనుకు వ్యతిరేకంగా అదోనియా యొక్క కపటోపాయము* - ఇతడు దావీదు తర్వాత ఇశ్రాయేలు సింహాసనమును అధిష్టించుటకు, వారసుడైన సొలోమోనుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయుటకు, రాజకుమారులను, సైన్యాధిపతులను మరియు యాజకుడైన అభ్యాతారును విందుకు ఆహ్వానించెను - *(1 రాజులు 1 అధ్యా)*
13. *నాబోతుకు వ్యతిరేకంగా యెజెబేలు యొక్క కపటోపాయము* - నాబోతు యొక్క ద్రాక్షతోటను తన భర్తయైన అహాబు స్వాధీనపరచుకొనునట్లు ఈమె నాబోతుకు వ్యతిరేకముగా అబద్ధ సాక్ష్యము చెప్పించి అతనిని రాళ్ళతో కొట్టి చంపించెను - *(1 రాజులు 21 అధ్యా)*
14. *షద్రకు, మేషాకు, అబెద్నాగో అనువారికి వ్యతిరేకంగా కొందరు కల్దీయుల యొక్క కపటోపాయము* - రాజైన నెబుకద్నేజరు ఎదుట ఈ ముగ్గురు యూదు యువకుల యొక్క మంచి పేరును, అభిమానమును చెడగొట్టుటకు దురాలోచన చేసిరి - *(దాని 3 అధ్యా)*
15. *దానియేలుకు వ్యతిరేకంగా కొందరు కల్దీయుల యొక్క కపటోపాయము* - వీరు రాజైన దర్యావేషును తప్ప మరి ఏ ఇతర దేవతలను పూజింపకూడదని ఒక శాసనము చేయించిరి. అయితే దానియేలు యధా ప్రకారం తన దేవునికి ప్రార్థన చేయుచు, ఆయనను స్తుతించుచుండెను. ఈ విషయమును గ్రహించిన కల్దీయులు కొందరు దుర్బుద్ధితో రాజైన దర్యావేషునకు మనవి చేసిరి - *(దాని 6వ అధ్యా)*
16. *నెహెమ్యాకు వ్యతిరేకంగా సన్భలట్టు యొక్క కపటోపాయము* - ఇతడు నెహెమ్యా చేయుచున్న పనిని మొదట పరిహాసం చేసి, చివరికి అతనిని చంపి, యెరూషలేము ప్రాకార పునఃనిర్మాణ పనిని ఆటంకపరిచెదనని బెదిరించెను - *(నెహెమ్యా 4,6 అధ్యా)*
17. *పారశీక దేశపు యూదులకు వ్యతిరేకముగా హామాను యొక్క కపటోపాయము* - ఇతడు మొర్ధేకై ఎడల ద్వేషముతో ప్రతీకారం తీర్చుకొనుటకు ఒక నిర్దోషమైన దినమున పారశీకదేశములోని యూదులందరిని వధించుటకు రాజైన అహష్వేరోషు చేత ఒక శాసనం చేయించెను - *(ఎస్తేరు 3 అధ్యా)*
18. *యోబుకు వ్యతిరేకముగా సాతాను యొక్క కపటోపాయము* - నీతిమంతుడైన యోబును హింసించుటకు సాతాను అతని సంపదను, కుటుంబమును మరియు ఆరోగ్యమును నాశనము చేసెను - *(యోబు 1,2 అధ్యా)*
19. *ప్రభువైన క్రీస్తుకు వ్యతిరేకముగా హేరోదు యొక్క కపటోపాయము* - ఇతడు ఇశ్రాయేలీయులపై తన అధికారము మరియు రాజ్య పరిపాలన అంతమగునని భయపడి, పసి బిడ్డగా ఉన్న క్రీస్తును చంపుటకు దురాలోచన చేసెను - *(మత్తయి 2 అధ్యా)*
20. *ప్రభువైన యేసుకు వ్యతిరేకముగా సాతాను యొక్క కపటోపాయము* - యేసు రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తిని పాపము చేయునట్లు, మరియు తనను ఆరాధించవలసిందిగా బలవంతము చేయ ప్రయత్నించెను - *(మత్తయి 4 అధ్యా)*
♻️ *ఈ విలువైన వర్తమానాన్ని మీ మిత్రులకు షేర్ చేసి మీవంతు దేవుని పని చేయండి.*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి