యేసు ప్రభువు ఆయా సందర్భాలలో చేసిన ప్రార్థనలు✍️
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
1. మొర్దాను నదిలో బాప్తిస్మము పొందినప్పుడు ప్రార్థించెను. (లూకా 3:21)
2. ఇంకను చీకటి ఉండగానే ఏకాంత స్థలముకు వెళ్ళి ప్రార్థించెను.(మార్కు 1:35)
3. అరణ్యములోనికి వెళ్ళి ప్రార్థించెను.(లూకా 5:16)
4. శిష్యులను ఎన్నుకొనుటకు ముందు, రాత్రంతా ప్రార్థించెను. (లూకా 6:12)
5. ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకురండి... అని చెప్పుటకు ముందు ప్రార్థించెను. (మత్తయి 11:25-27)
6. అయిదు రొట్టెలు - రెండు చేపలు పంచి పెట్టుటకు ముందు ప్రార్థించెను.(యోహాను 6:11)
7. అయిదు రొట్టెలు - రెండు చేపలు పంచిపెట్టిన తరువాత ప్రార్థించెను.(మత్తయి 14:23)
8. శిష్యులకు ప్రార్థన నేర్పుటకు ముందు ప్రార్థించెను. (లూకా 11:1-4)
9. నేనెవరినని జనులు చెప్పుకొనుచున్నారని అడుగుటకు ముందు ఒంటరిగా ప్రార్థించెను.
(లూకా 9:18)
10. రూపాంతరము పొందుటకు ముందు ప్రార్థించెను. (లూకా 9:28, 29)
11. శిష్యులు దయ్యములను నీనామమున వెళ్లగొట్టితిమని చెప్పిన సందర్భములో.
(లూకా 10:21)
12. చిన్న పిల్లల కొరకు చేతులుంచి ప్రార్థించెను. (మత్తయి 19:13)
13. సమాధిలో ఉన్న లాజరును బ్రతికించుటకు ముందు ప్రార్థించెను.(యోహాను 11:41, 42)
14. యెరూషలేములోని మందిరములో ప్రార్థించెను. (యోహాను 12:27, 28)
15. ప్రభురాత్రి భోజనము ముందు ప్రార్థించేను. (మత్తయి 26:26, 27)
16. పేతురు కొరకు ప్రార్థించెను.(లూకా 22:31, 32)
17. శిష్యుల కొరకు ప్రార్థించెను.(యోహాను 17:1-26)
18. గెత్సెమనేలో చెమట రక్తమగునంతగా ప్రార్థించెను. (లూకా 22:39-44)
19. సిలువపై తనను హింసించిన వారిని క్షమిస్తూ, ప్రార్థించెను. (లూకా 23:34)
20. ఎమ్మాయు గ్రామములో ఇద్దరు శిష్యులతో ప్రార్థించెను. (లూకా 24:30)
“శరీరధారియైయున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను
మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి,భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను.” (హెబ్రీ 5:7)
హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి