✳ *బైబిల్ నందలి స్త్రీలు* ✳
(తొమ్మిదవ భాగము)
1⃣5⃣ 💁🏻♀ *సిప్పోరా* 💁🏻♀
యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.అని సామెతలు31:30లో వ్రాయబడి యున్నది కదా!
ప్రాముఖ్యత కల్గిన స్త్రీలలో *సిప్పోరా* ఒకరు.
ఈమె ఐగుప్తు దాస్యమునుండి ఇశ్రయేలీయులను
తన ప్రజలను విమోచించుటకు యెహోవా దేవుడు ఏర్పాటు చేసికొనిన
*గొప్ప నాయకుడు మోషే భార్య సిప్పోరా*
మిద్యాను వంశము.
మిద్యానుదేశమునకుచెందిన దైనను ,హెబ్రీయుడైన మోషేకు అన్ని విధాల సహకరించి వన్నెకెక్కిన స్త్రీ.
ఐగుప్తీయుని చంపిన మోషే
పారిపోయిమిద్యాను దేశములోనిలిచిపోయినాడు.ఆ విధముగ మిద్యాను దేశమునకు చేరిన మోషే
మిద్యొనీయురాలైన సిప్పోరాను వివాహమాడుటలో దైవ సంకల్పము కలదని నమ్మాలి.
*యెహోవా ఆజ్ఞ లేనిదే ఏదీ*జరగదుకదా*
మిద్యాను యాజకుడైన రగూయేలు కుమార్తెలను కాపరుల నుండి కాపాడిన
మోషే గురించి తమ తండ్రికి వివరించి నందున
వారి తండ్రి మోషేను వారితో నివసింపమని కోరి, సమ్మతించిన మోషేకు
తన కుమార్తయైన సిప్పోరాను భార్యగా చేసినాడు.
అప్పటికి మోషే వయస్సు 40 సంవత్సరములు.
(అ.కా.7:35)
మరియొక40సంవత్సరములు మోషే తన మామ మందను మేపుతూ *గెర్షోము* అను కుమారునికితండ్రియైనాడు
మోషే మామ వద్ద శెలవు తీసుకొని భార్యసిప్పోరాను
అతని కుమారుని గాడిదపై
నెక్కించుకొని ఐగుప్తంనకు బయలుదేరాడు.
మార్గమధ్యములో యెహోవా మోషేను చంపజూచినపుడు మిద్యాను యాజకుని పెంపకము నుండి వచ్చిన
సిప్పోరా దేవుని ఆగ్రహమును గ్రహించిన *సిప్పోర వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి* *అతని పాదముల *యొద్ద అది పడవేసి నిజముగా నీవు నాకు* *రక్తసంబంధమైన*
*పెనిమిటివైతివనెను*
అంతట ఆయన అతనిని
విడిచెను.(నిర్గమ4:25)
*దేవుని నిబంధనను సకాలములో జ్ఞప్తికి తెచ్చుకొని అట్లం జరిగించి తన భర్త ప్రాణమును రక్షించుకొనిన దైవ భయమును కల్గిన స్త్రీ సిప్పోరా*
*ఇశ్రాయేలీయుల నాయకుని ప్రాణమును దక్కించుకొని ఇశ్రాయేలీయుల విమోచన కు కారణమైనది సిప్పోర*
దేవునియందు భయభక్తులు కలిగినవారికి
తన మార్గములను తెలియజేయుదునని వాగ్దానము చేసిన దేవుని మనసు ఎరిగినది.
మోషేనుచంపజూచుటలోని మర్మమును వెంటనే గ్రహించినది.
*ఎంతటి గొప్ప స్త్రీ*
మోషే ఇశ్రాయేలీయులకు
చేసినదంతయూ యిత్రోకు తెలియ జెప్పుటకు మోషే తన భార్యయైన సిప్పోరాను,తన ఇరువురు కుమారులను తన మామవద్దకు పంపునట్లు
నిర్గమ కాండములో18:1-2
లో చూడగలము
ఇత్రో వారిని మరల అరణ్యములో యెహోవా పర్వతము వద్ద బస చేసిన మోషే వద్దకు తోడుకొని వచ్చినాడు.
*ఇశ్రాయేలీయుల విడుదల కార్యక్రమములో,ఐగుప్తు శ్రమలలో ,తిరుగు ప్రయాణములో ఎన్నో కష్టనష్టముల కోర్చి అన్ని విషయములలోను తన భర్తకు తోడుగా నిలచినది*
💥కుమార్తెగా తన తండ్రి యిత్రోచిత్తముచొప్పుననూ
💥తన భర్తకు తోడుగా నిలచినది.
💥దేవుని బిడ్డగా యెహోవా చిత్తమును నెరవేర్చిన స్త్రీ సిప్పోరా.
అపోస్తలుడైన పౌలు ఎఫసీ పత్రిక 5:23 లో చెప్పిన రీతిగ
"క్రీస్తు సంఘమునకు శిరస్తై
యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్తై వున్నాడు"
అను విషయమును
*తన ప్రతి అడుగులో జ్ఞప్తియందుంచుకొని తన శిరస్తై యున్న మోషేకు వన్నె తెచ్చిన స్త్రీ సిప్పోరా*!
*గనుక మనమును అట్టి* *అణుకువ కలిగిన స్త్రీ వలె*
*జీవించుటకు* *పరిశుద్దాత్ముడు మనందరికి*
*తోడై యుండులాగున*
*ప్రార్థించుదము*
ఆమెన్
1⃣6⃣ 🌹 *మనోహ భార్య* 🌹
విశ్వాస వీరునిగా పేర్కొనబడిన సంసోను యొక్క తల్లి చిరస్మరణీయు రాలు.ఈమె పేరు బైబిల్ లో
పేర్కొనబడ లేదు.
ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రయేలీయులను రక్షించడానికి *సాధనగా*
దేవుడు సంసోనును వాడు
కున్నాడు.అలాంటి వ్యక్తికి జన్మ నివ్వడానికి దేవుడు *మనోహ భార్యను* ఏర్పరచు కున్నాడు.
దేవుని కార్యానికి తన వంతు విధేయతను చూపిన మనోహ భార్య ఆదర్శవంతురాలైన మరపురాని మహిళ.
💥 *దేవదూతదర్శించిన గొడ్రాలు మనోహ భార్య*
మనోహ "దాను"వంశీయు డు.జోర్యా పట్టణస్థుడైన
మనోహకు సంతానము లేదు.....అతని భార్య గొడ్రాలై కానుపు లేక యుండెను.(న్యాయా13:2)
గొడ్రాలుగా వున్నపుడు ఆమె దేవుని వైపు తన లోటు నిమిత్తము దేవుణ్ని ప్రార్థించి నపుడు దేవదూత దర్శించాడు.
మనోహ భార్య ఆత్మీయు
రాలు.ఆమె భర్త కూడ ప్రార్థనా పరుడే
(న్యాయా13:8,9)
యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై
*ఇదిగోనీవుగొడ్రాలవు.నీకు కానుపు లేక పోయెను.అయితే నీవు గర్బవతివై కుమారుని కందువు అని చెప్పాడు*(న్యాయా13:3)
ఆమె సంతోషానికి అంతులేదు.కీర్తనాకారుడు స్తుతించినట్లే ఆమె కూడ స్తుతించి వుంటుంది.
💥 *దైవ జనుణ్ని గుర్తించిన స్త్రీ*
ఆ స్త్రీ తన భర్త వద్దకు వచ్చి -దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను. అతని రూపము దేవదూతల రూపమును పోలినదై బహు భీకరముగా వుండెను.అతడు ఎక్కడి నుండి వచ్చెనో నేనడుగ లేదు.అతను తన పేరు నాతో చెప్పలేదు. (న్యాయా13:6)ఆ వ్యక్తి ఎవరో ఎక్కడి నుండి వచ్చాడో తెలియక పోయినా అతని తీరుని బట్టి అతని సందేశాన్ని బట్టి
మనోహ భార్య అతను దైవజనుడని గుర్తించింది.
దేవుడు తన దూతను ఎప్పుడు ఒక వ్యక్తి దగ్గరకు పంపిస్తాడు ? (హెబ్రీ12:28)
లో చెప్పబడినట్లు ఒక వ్యక్తి దేవునికి ప్రీతికరమైన సేవ
చేసినప్పుడే కదా!
💥 *భర్తతో కలిసి ప్రార్థించిన స్త్రీ* (న్యాయా13:9)
మనోహ భార్యను దేవదూత దర్శించిన తరువాత మనోహ
నా ప్రభువా నీవు పంపిన దైవజనుడు మరల మా వద్దకు వచ్చి మాకు పుట్టబోయే ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనోదానిని
దయచేయుమని యెహోవాను వేడుకొనెను.
(న్యాయా13:8) మాకు నేర్పునట్లు అని మనోహ ,అతని భార్య ప్రార్థిస్తున్నారు.
యెహోవా దూత-ద్రాక్షావల్లి నుండి పుట్టినదేదియూ తినకూడదు. ద్రాక్షారసమునైనను,మధ్యమునైనను,త్రాగకూడదు,అపవిత్రమైనదేదియు తినకూడదు.(న్యాయా13:13,14)
💥 *భర్తతో కలిసి బలి అర్పించిన స్త్రీ*
(న్యాయ 13:19-21)
తమను దర్శింప వచ్చిన దైవజనునితో మేము
*ఒక మేకపిల్లను సిద్దపరచి తెచ్చేంతవరకు అతనిని ఆగుమని* మనోహ అడిగెను.
నీవు దహన బలి అర్పించాలని ఆశిస్తే అది యెహోవాకే అర్పించు అన్నాడు.
మనోహ దేవునికి అర్పించిన దహనబలి జ్వాలల్లో పరలోకానికి ఆరోహణమయ్యాడు
(న్యాయా13:15-20)
*దహనబలి అర్పించడ మన్నది కృతజ్ఞతకు సూచనగా వుంది*
💥 *విశ్వాసంతో భర్తను ధైర్యపరచిన స్త్రీ*
అప్పటి వరకు మనోహ అతణ్ణి మానవుడని తలంచాడు. దేవదూత అని తెలుసు కొని చాలా భయపడ్డాడు.
*మనం తప్పక చనిపోతాం అంటున్నాడు* అయితే
అతని భార్య అతన్ని ధైర్యపరచింది.
*దేవునిలో తన విశ్వాసాన్ని నోటితో ధైర్యంగా ప్రకటిస్తోంది*
💥 *దేవుని నియమా లను పాటించిన స్త్రీ*
గర్బవతులైన స్త్రీలకు అనేకమైనఅభిరుచులు,
కోరికలువుంటాయి.అయితే ఆమె దైవ సంతతి కోరిన ఆత్మీయురాలు.అందువల్ల ఆమె దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం జీవించింది (న్యాయా13:13-14)
ఆమె ప్రతి విధమైన *అపవిత్రతకు దూరంగా వుంది*
ఆమె తన పుత్రునికి *సంసోను* అని పేరుపెట్టింది సంసోనుఅంటే *సూర్యుని పోలినవాడు*
లేక *ప్రకాశించువాడు*
అని అర్థము.
దేవదూత ఆజ్ఞాపించినట్లు
ఆమె సమస్త విషయాలకు లోబడింది.అందువల్ల సంసోనును పొందింది.
💥 *దేవునిపద్దతిలో*
*కుమారుణ్ని పెంచినస్త్రీ*
(న్యాయా13:5)
నీవు గర్బవతివై కుమారుని కందువు.అతని *తల మీద మంగల కత్తి* వేయకూడదు.
*ఆ బిడ్డ గర్బమున* *పుట్టినది మొదలుకొని దేవునికి వ్రతము* *చేయబడిన వాడై*
*ఫిలిష్తీయుల చేతిలోనుండి*
*ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని* ఆమెతో అనెను.
సంఖ్యా కా 6:3-8 లో *నాజీరు* గురించి చెప్పబడింది.
*వ్రతం చేయబడి నాజీరు చేయబడిన వారు మద్యంకానీ, ద్రాక్షారసం కానీ త్రాగ కూడదు.తల వెంట్రుకలు కత్తిరించుకో కూడదు.శవాన్ని *ముట్టుకోకూడదు*
*అపవిత్ర పరచుకో కూడదు*
మనోహ భార్య తన కుమారుణ్ని అలాగే పెంచింది.ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీ యులను రక్షించ మొదలు పెట్టిన రోజున మనోహ భార్య ఎంతో సంతోషించి వుంటుంది.
బిడ్డలను సరియైన మార్గంలో మళ్ళించాల్సిన భాధ్యత తల్లిదండ్రులదే.
జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును.
బుద్దిలేని కుమారుడు తన తల్లికి ఎంతో దుఃఖము పుట్టించును
(సామెతలు10:1)
1⃣7⃣ 👩⚖ *అబీగయీలు*👩⚖
ఫిలిష్తీయుడైన గొల్యాతును,అతని జనాంగ మును
దావీదు హతము చేసిన సందర్బములో స్త్రీలు
*సౌలునకువేల కొలదియు*
*దావీదునకు పదివేలకొలదియు* అని
స్తుతులు పాడినందున
సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపి చంపనాలోచన చేసి అతనిని తరుమ నారంభించినాడు.
దావీదు ..సౌలురాజు నుండి తప్పించుకొని పొలములోనూ(20:21) అరణ్యములోను,(24:1) గుహలలోను(22:1) దాగుకొనుచూ వచ్చెను.
దావీదు కొండ స్థలములో దాగుకొనియుండగా కర్మెలులోనిమాయోనునందు *బహుభాగ్యవంతుడైన నాబాలు* తన గొర్రెలకు
బొచ్చు కత్తిరించు చున్నాడని విని తన పనివారిని పది మందిని నాబాలు నొద్దకు పంపి
*గొర్రెలకాపరులు తమ యొద్ద నున్నపుడు వారికి కీడు చేయక వారికున్నదేదియూ పోగొట్టుకొనకుండ ఎట్లు మేలు చేసిరో అతనితో చెప్పమని* అయితే
*నాబాలు* *చర్యలను బట్టిచూడగా* *మోటువాడునూ,దుర్మార్గుడునై యుండెను*
*నాబాలు అనే మాటకు హెబ్రీభాషలోబుద్దిహీనుడు*
అని అర్థము.
దావీదు చేసిన మేలును
మరచిపోయి మేలునకు ప్రతిగా కీడుచేయ నుద్దేశించి *దావీదుఎవడు*?
*తమ యజమానులను వదలి పారిపోయిన దాసులు అనేకులు వున్నారు* దావీదు సౌలు నుండి పారిపోయి తిరుగుచున్న విషయమును ఎగతాళి
చేసినాడు.దోషముసౌలు
దైననూ బుద్దిహీనుడైన నాబాలు దావీదును నిందించినాడు.పనివారి ద్వారా దావీదు తెలుసుకొని తనను *నిందించినందుకు* నాబాలునకు కలిగిన దానియంతటిలో
ఏదియూ పోకుండ ఈ అరణ్యములో అతని ఆస్థినంతటిని కాయుచూ మేలుచేసినందుకు ప్రతిగా
అపకారము తలపెట్టి నందుకు కోపావేశుడై బాధపడి *నా బాలుకు వున్నవారిలో ఒక మగపిల్లవానినైను తెల్లవారునప్పటికి నేనుండనియ్యనని యెహోవా దేవుని పేర ప్రమాణము చేసి కత్తిధరించి 400 మందితో
కలిసి బయలుదేరాడు.
ఒక పనివాడు *నాబాలు భార్య యైన అభీగయీలు* తో జరిగిన విషయము చెప్పుచూ, *పొలములో దావీదు మనుషులు తమ కెట్లు సహాయము చేసిరో*!
గొర్రెలను కాయుచున్నంత సేపు వారు రాత్రింబగళ్ళు వార
వీరి చుట్టూ ఎలా ప్రాకారముగ నిలిచిరో సాక్షమిచ్చినారు. *దావీదు తలపెట్టిన కీడును గురించి కూడ చెప్పి చేయవలసిన దానిని గురించి ఆలోచించమని కూడ చెప్పినారు*
*అబీగయీలు*అను ఆ స్త్రీ*సుబుద్దిగలదై*
*రూపసియై యుండెను*
1సమూయేలు 25:3)
నాబాలు బుద్దిహీనుడైవుండగా అతని భార్య సుబుద్ది గలదై సుబుద్దితో ఆలోచించి రానున్న అపాయము తప్పించుటకు
తాను చేయవలసిన దానిని
క్రమబద్దీకరించినది.
*అరణ్యములో తలదాచుకున్నదావీదునకు మొదటి *సమస్య ఆహారము* మోటువాడును,దుర్మార్గుడునూ,బుద్దిహీనుడైన తన భర్తతో ఆమె ఏమియూ చెప్పలేదు.
*దావీదునకును తనతో నున్న వారికి సరిపడు ఆహారము సిద్దము చేసి,గార్దభముల మీద వేయించి న కంటె ముందుగా పోవలసినదిగా
తన పని వారికి ఆజ్ఞ ఇచ్చినది. ఆమె బయలుదేరి దావీదును కనుగొనిన వెంటనే నాబాలు చూపిన తిరస్కారానికి ప్రతిగా
*గార్దభము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదమంలు పట్టుకొనినది*
ఎంత తగ్గింపు ,
ఎంత వినయము,విధేయతలు!
*కాళ్ళుపట్టుకొనిన వారిని కరుణింపక మానుదురా*
తన భర్త తప్పును తనదిగా భావించి క్షమించమని భావించినది.
*కోపోద్రిక్తుడైన దావీదును శాంతింపజేయు ఉపశమనమును కలిగించు మాటలతో నాబాలు దుర్మార్గతను నిరసించినది*
యెహోవా జీవము తోడు ,నీ జీవముతోడని,
ప్రమాణము చేసి "నీ శత్రువులను ,నా యేలిన వాడవైన నీకు కీడుచేయ
నుద్దేశించు వారునూ నాబాలు వలె నుందురు గాక" అని అనుటను బట్టి
మేలునకు ప్రతిగా కీడు చేయ నుద్దేశించిన నాబాలు మరణమునకు
పాత్రుడని దావీదు ఉద్దేశముతో ఏకీభవించినది.
అబీగయీలు
నా ఏలినవాడవగు నిన్ను
ఇశ్రొయేలీయంలమీద అధిపతిగా నిర్ణయించిన తరువాత
*రక్తాపరాధము అతని* *చేతికి అంటకూడదని*
*కోరుకొనినది*
చివరగా యెహోవా నా యేలినవాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగు
నన్ను జ్ఞాపకము చేసుకొమ్మని వేడుకొనినది.
బుద్దిమంతురాలైన అబీగయీలు మాటలను బట్టి దావీదు నేను పగ తీర్చుకొనకుండగను *ఈ దినమున ప్రాణము *తీయకుండగను*
*నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము *నొందుదువుగాక* అని *దీవించినాడు*.
*ఆమె తెచ్చిన వాటిని స్వీకరించినాడు*
నాబాలు భయము చేత గుండె పగిలి రాతి వలె బిగుసుకొని పోయినాడు.*
*పది *దినములైన తరువాత* *యెహోవా మొత్తగా* *నాబాలు చనిపోయినాడు*
ఈ సంఘటనంతటిలో ఎంతో *ఓర్పు,వినయము,*
*సుబుద్ది చూపిన అబీగయీలును* ఆమె చేసిన విన్నపమును జ్ఞాపకము చేసికొనినాడు.
*ఆమెను తన భార్యగా చేసుకున్నాడు*
జ్ఞానవంతురాలు తన ఇల్లు
కట్టును.(సామె14:1)అను వాక్యము ఆమె యందు నెరవేరినది.
*బుద్ది సంపాదించు కొనువాడు తన ప్రాణమునకు ఉపకారి* అని (సామెతలు19:8)లో
చెప్పబడినట్లుగా *ఆమె తన ప్రాణమునకు* *ఉపకారము*
*చేసుకొనినది*
అట్టి బుద్ది విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమైయున్న
మన రక్షకుని యందు *విశ్వాసముతో బుద్దిని* *సంపాదించుకొనిన స్త్రీలవలె వుండవలెనని ప్రభువు*ఆకాంక్షను నెరవేర్చుదాము*
సేకరణ:
*శ్రీమతిజె.విమలకుమారి*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి