ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిల్ నందలి స్త్రీలు పదిహెనవ భాగము

✳ *బైబిల్ నందలి స్త్రీలు* ✳

  (పదిహేనవ భాగము)

2⃣5⃣ 🌹 *లూదియా*  🌹

*లూదియా తుయతైర పట్టణస్థురాలు* 
మరియు దేవునిఆరాధించు స్త్రీగా పేర్కొనబడెను.

ఆమె ఊదారంగు పొడిని అమ్మువ్యాపారముగలదని దానియందు మిక్కిలి లాభము సంపాదించు కొనెడిదని లేఖనములు తెలియ జేయుచున్నవి.
*లూదియా బహు పరపతిగల స్త్రీ*

ఆమెను గూర్చి అపొ.కా.16 వ అధ్యాయము మనము చదవగలము.
*దేవుడు ఏ ఆసియా రాష్ట్రంలో పౌలు ప్రవేశించకుండా చేశాడో ఆ ఆసియాలో లూదియా సొంత ఊరు తుయతైర ఉంది*
ఒకవేళ లూదియా *తుయతైలోనియూదుల ద్వారా నిజ దేవుణ్ణి గురించి విని ఆయనను* *ఆరాధిస్తుండవచ్చు*

విశ్రాంతి దినమున గవిని దాటి నదీతీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి, కూడి వచ్చిన స్త్రీలతోమాటలాడు చున్న  *పౌలు* పరిచర్యలో మొదటిగా క్రీస్తును అంగీకరించినది
*లూదియా యొక*
*నూతన విశ్వాసి యని కనబడుచున్నది*.
ప్రభువు ఆమె హృదయ
మును తెరవగా  పౌలు నూతననిబంధన మరియు ప్రభువైన యేసుక్రీస్తుని
గూర్చిఆమెకుప్రకటించాడు.
గనుక *పౌలుచెప్పినమాటల యందు లక్ష్య ముంచెను*

💥 *లూదియా* మంచి పనిమంతురాలు.మరియు వ్యాపారవేత్త కానీ దేనికివ్వవలసిన ప్రాధాన్యత దానికిచ్చెనని మనకు తేటపడుచున్నది.

💥 ఆమె ఒక వ్యాపారి అయినను దేవుని మిక్కిలి 
భక్తిపూర్వకముగా వెంబడించేదిగా వుంది.

💥 ఆమె వ్యాపారము కొనసాగించుకొనుచుండగా 
*దేవుని పట్ల ఆమె ప్రేమ మరియు భక్తి  విడువలేదు*.

💥 ఆమెయు ఆమెయింటి
వారును బాప్తిస్మము పొంది నప్పుడు, ఆమె--నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు యెంచితే, నా యింటికి వచ్చి యుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను.

💥 ఆమెయు ఆమెయింటి
వారును బాప్తిస్మము పొంది నప్పుడు, ఆమె--  *నేను ప్రభువునందువిశ్వాసము గలదాననని మీరు యెంచితే* *నా యింటికి వచ్చియుండుడని* *పౌలుతో వేడుకొని  బలవంతముచేసెను*.
దీని ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుకు మరియు పౌలు బృందము పట్ల ఆమెకున్న అంగీకార భావముస్పష్టమగుచున్నది.

💥 క్రీస్తుకొరకు ఆమె హృదయము తెరవబడగానే తన పరిచారకులకొరకు కూడ అది తెరవబడియుండెను.

💥 తత్పలితముగా ఆమెకున్న శ్రేష్టమైనవాటిలో 
పాలుపొందుకొనుటకు వారినిఆమెఆహ్వానించెను.

💥 లూదియా తన విశ్వాసాన్ని తన పనుల ద్వారా ప్రదర్శించింది.తన క్రియల చేత నమ్మకాన్ని చూపించింది
(యాకోబు2:14-19)

వారిని ఆమె బలవంత పరచెనని వాక్యము శెలవిస్తుంది.(అపొ.కా16:15)
ఈ కుటుంబము మీద అధిక భారము పెట్ట కూడదని పౌలు బహుషా ఆలోచించియుంటాడు.కానీ లూదియఎంతమాత్రమూపోనియ్యక ఆమె కనుగొనిన రక్షకుని గూర్చి మరింత తెలుసుకోవాలని 
ఆపేక్షతో వారిని బలవంత పరచెను.
*దేవుని వాక్యము నుండి మరిన్ని సంగతులు తెలుసుకోవాలని ఆమె ఆశించెను*.పౌలు మరియు ఆమె బృందము వారు ఆమె ఇంటవుంటే ఆమె అడుగు ప్రతీ ప్రశ్నకు జవాబువస్తుందని ఆమె అవసరతలవిషయమై,
వారితో కలిసి ప్రార్థనచేయవచ్చునని,
ఆమె ఆశించెను.
ఈ అవకాశమును ఎంతమాత్రము విడిచిపెట్టకూడదని ఆమె తలంచెను.నిశ్చయముగా ఆమె కుటుంబమునే 
*వీరి రాక ప్రభావితం చేయనైయుండెను*.అందుచేత ఈ అవకాశమును లూదియా విడుచుటకు ఎంతమాత్తము ఇష్టపడలేదు.

💥 *ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న లూదియాఆశక్తిపరురాలు.*
కేవలము సబ్బాతు దినమున దేవుని మందిరమునకు వెళ్ళుటయందు ఆమె తృప్తినొందలేదు.
*దేవుని గూర్చి తెలుసుకో దగిన వాటినన్నటినీ తెలుసు కోవాలని ఆమె ఆశించెను* అందుకే
దేవుని ప్రశస్తమైన సంగతులు బోధించువారిని 
తన ఇంట నుండుమని లూదియ బలవంత పెట్టింది.

 *ఆధ్యాత్మికముగ ఆమె*
మరియుఆమెకుటుంబము అభివృద్దినొందాలని 
దేవుని మార్గములయందు తర్ఫీదునొందాలని ఆమెఆశించింది
ఇలా చేయుటయందు ఆమెనుఅనుకరించుట మనకు మేలు కలుగును.

👉🏾 మనము దేవుని వెదకాలని ఆయన ఆశిస్తున్నాడు.లూదియాకు వలె క్రీస్తుకు సమీపమైన
నడత గల జీవితములు జీవించే అవకాశము మనందరికి ఉంది.ఆమెకు వలె సమయము చూసుకొని దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలిగే అనుకూలత మనందరికీ వుంది.
కేవలము మన సౌకర్యము ను చూచుకొనక ప్రభువు కొరకు జీవించుట 
మన లక్ష్యముగా పెట్టుకోవాలన్నదే         లూదియ ద్వారా మనము నేర్చుకో దగినది.ఆమెన్.

2⃣6⃣ 🌹 *దెబోరా* 🌹

*విశ్వాసముతో*
*ప్రోత్సహింపబడ్డ*
*ఓ దేశ నాయకురాలు*

దెబోరా అనే హీబ్రూ పేరుకు
*తేనెటీగ* అని అర్థము.

*దేవునిమూలంగాపలికేస్త్రీ*
ఇశ్రయేల్ నాయకుల్లో దెబోరా తప్ప స్త్రీలు మరెవరూలేరు.
లప్పీదోతునకు భార్యయైన 
దెబోరా ఇశ్రయేలీయులకు న్యాయాధిపతిగా వుండెను.
యెహోషువ,సమూయేలు మధ్య కాలములో *ఇశ్రాయేలీయులను పరిపాలించిన పండ్రెండుమంది న్యాయాధిపతుల్లో ఈమె ఒక్కతే స్త్రీ*
సాధారణంగా మగవాడు నాయకత్వ భాద్యతలు చేపడతాడు.అయితే
 ఈ భాగంలో   *ఓ స్త్రీ నాయకురాలిగా* మనం చూస్తున్నాము.
 *దేవుడెప్పుడూ* *ఒకే* *పంథాలో పని చేయడు* *ఆయన ఎంపిక ప్రకారం* *సాధనాలుగా వాడ* *బడేందుకు  ఇష్టపడే ప్రజల కోసం ఆయన* *కనిపెడుతున్నాడు*

దెబోరా *ప్రవక్త్రి* 
*దేవునికీ మానవులకు మధ్యవర్తి.దైవ వాక్కును ప్రచురించిన స్త్రీ*
అంతటి ఉన్నత స్థాయిలో వున్న ఈమె ప్రేమతోప్రజల్లో స్పృహ,జ్ఞానం,దైవసంబంధిత అవగాహన కలిగేలా చేసింది.ఆమె దేశపు
*సరళవృక్షములా*  ఆ *కాలపు స్త్రీపురుషులంద  రిలో  దెబోరా ఓ ప్రత్యేక* *స్థానంఅలరించింది*

యెహోషువ మరణం తర్వాత ఇశ్రాయేలీయులు
కనానీయులతో యుద్దం చేసేందుకు తమలోఎవరు ముందుగా వాళ్ళ మీదకు 
వెళ్ళాలోతెలియజేయమని యెహోవాను  ప్రార్థింపగా
 ఆ దేశాన్ని ముందుగా *యూదాదేశస్థులకిచ్చాను*
వాళ్ళే ముందుగావెళ్ళాలని యెహోవాదేవుడుచెప్పాడు యూదావంశస్థులు తమ సోదరులుషిమ్యోనీయులతోకలిసిపోయారు.ఈ విధంగా యూదా వంశస్థులు కనానీయులతో 
యుద్దం చేయడానికి  దండెత్తారు.యెహోవా దేవుడు వాళ్ళకు కనానీయులను,పెరిజ్జీయులను అప్పగించాడు. వారు పదివేల మందిని హతం చేశారు.యూదా దేశస్థులు యెరూషలేముపైయుద్దము చేసి దాన్ని పట్టుకొని, దోచుకొని, కాల్చి వేశారు.

💥 *ఇశ్రాయేలీయులు*

ఇశ్రాయేలీయులు జీవితం
న్యాయాధిపతులు ఎహూదు,షమ్గరు ఇంకా ఇతర ఏలికల పాలన క్రింద
80 సంవత్సరములు సిరిసంపదలు సుఖసంతోషాలతో జీవించిరి.కానీ ఇశ్రాయేలీయులు
 దేవునికి కృతజ్ఞత చూపలేక పోయారు.
*దేవునికి దూరంగాపోయి విగ్రహారాధికులైయ్యారు.*
దేవునిఅవసరంలేదనుకన్నఇశ్రాయేలీయులు ఇప్పుడు *ఫలితం అనుభవిస్తున్నారు* (న్యాయా4:2)
ఇశ్రాయేలీయులు ఇప్పుడు 
ఎఫ్రాయీము దేశంలో బేతేలు,రామామధ్యదారిలో 
వున్న సరళవృక్షముదగ్గరకు  వెళ్తున్నారు అక్కడి ప్రజలు.
ఆ చెట్టు క్రిందనే ప్రస్తుత 
*ప్రవక్త్రి* ప్రజలకు న్యాయం చెబుతూ వాళ్ళ జీవనమార్గాన్ని ఆదేశిస్తూ 
న్యాయస్థానంనడుపుతోంది
(న్యాయా4:4-5)
ఇశ్రాయేలీయుల పరిస్థితి దుర్భరమై మసకబారి పోయింది. జీవితంలో స్థిరత లేకుండ భారభరితమైంది.రాకపోకలు స్థంభించి వ్యాపారం పాక్షికంగాదెబ్బతింది.
వ్యవసాయం అతి తక్కువస్థాయికి దిగజారింది. యువతీ యువకులుస్వాతంత్య్రన్ని కోల్పోయిభయాందోళన
అశాంతి జీవితాలు గడుపు తున్నారు. హాసోరు
 పట్టణంలో నివసిస్తున్న
యాబీను రాజు ఇశ్రాయేలీయులమీద *అధికారం*
చెలాయిస్తున్నడు.అతని
*సైన్యాధిపతి  సీసెరా*
తొమ్మిది వందల యుద్దరథాలున్న గొప్ప సైన్యాన్ని నడిపిస్తున్నాడు
.(న్యాయా4:3)ఏమంటే ఏమౌతుందోనన్న భయంతో అందరూ భీతావహులై పోయారు.

 💥  *బారాకు*
బారాకు అనగా *మెరుపు*
ఇతను కాదేషు నివాసి అబీనోయము కుమారుడు.

దేవుడే శతృసైన్యాలతో పోరాడుతాడనే దృఢనమ్మకం అతనిలో కలిగింది.దేవుని కోసం వీరుడయ్యేందుకు బారాకుకు దెబోరా సహాయపడింది.
యుద్దదినం రానేవచ్చింది 
ఆమె ద్వారా అప్పుడు దేవుడు తన చిత్తాన్ని తెలియ జేశాడు.
బారాకుతో దేవుడు *వెళ్ళమనీ తాను అతడితో వుంటాననీ* చెప్పడం చాలలేదు 
బారాకుకు అతడి విశ్వాసం బలహీనమైనదని అర్థం అవుతుంది.

పది వేల మందిని సమకూర్చమని ఆజ్ఞ పంపింది దెబోరా.
సంవత్సరాల తరబడి దైవ వర్తమానికురాలిగా కృషి చేసి ప్రజల స్వాతంత్ర్యం కోసం ప్రార్థించింది.
సమయం ఆసన్నమైంది.
కార్యసాధనకు మరోవ్యక్తి అవసరం.జ్ఞానం,యుక్తి రెండింటిని వినియోగించి 
బారాకును సంప్రదించడం మంచిదని నిర్ణయించుకుంది.
ఉన్నత స్థానంలో వున్నా తనను తాను తగ్గించుకొంది
దెబోరా -బారాకుతో -లే,యెహోవా *సీసెరాను*
*నీచేతికి అప్పగించిన దినం ఇదే యెహోవా* 
*నీకు ముందుగా బయలుదేరుతాడు*
గదా!-అని చెప్పగా
పది వేలమంది మనుషు లను వెంటబెట్టు కొని 
*తాబోరుకొండ* దిగి వచ్చాడు.బారాకు వాళ్ళను హతం చేసేలా యెహోవా సీసెరాను అతని రథాన్ని 
అతని సర్వసేనల్ని భయభ్రాంతులను చేశాడు.
సీసెరా రథం దిగి కాలికి బుద్ది చెప్పాడు.బారాకు సీసెరా రథాలను,సేనను అన్యులభూభాగం వరకు 
తరిమి కొట్టగా సీసెరా సర్వ సైన్యం ధ్వంశమైంది.

దెబోరా ప్రదర్శించిన యుక్తిగల ఆధ్యాత్మిక నాయకత్వం బారాకును ఉద్రిక్తుణ్ని చేసింది.అంతకు
ముందుకంటే ఇప్పుడు బలిష్టుడైనట్టు భావించాడు
దెబోరా వల్లనే ఈ సవాలును ఎదుర్కొనే ధైర్యంన్ని పొందాడు.
దెబోరా అతనితో వుంటే చాలు.విశ్వాస ధైర్యాల్లో విశిష్టురాలిగా గుర్తించాడు.
దైవ పథకంలో వాళ్ళు సాధనలుగా వాడబడ్డారు.

ఈ అనుభవాలవల్ల బారాకు విశ్వాసవీరుల్లో చేర్చబడ్డారు. (హెబ్రీ11అద్యాయం)
💥 *బాధ్యత గల*
         *దెబోరా*  
▪దెబోరా బాధ్యతలు 
      మగవాడి బాధ్యతల
      లాంటివి.
▪దేవుడే ఆ బాద్యతల్ని 
      అప్పజెప్పాడు.
▪ ప్రజల్ని దేవుని చెంతకు       
       నడిపించేందుకు ఆమె
       నియమింపబడింది.
▪శతృవులబారినుండి 
      వారిని విడిపించేందుకు
      కూడ ఆమె నియమింప        
      బడింది.
 ▪దేశమంతాఆమెను 
     నాయకురాలిగా గుర్తిం
      చింది.
అందువల్ల దెబోరా ఆధ్యాత్మిక,భౌతిక సమస్యలకు తీర్పుతీర్చి దైవ సంబంధమైన విషయా
ల్లో,ప్రజలకు సూచన లిచ్చింది.
💥 *నాయకత్వలక్షణాలు

▪దైవ నడిపింపు ప్రకారం దెబోరా నిర్ణయాలు తీసు కొనేది.
▪ఆమె నాయకత్వానికి   ఓ రూపు సంతృప్తి వున్నాప్రజ్ఞాపాటవాలతో వివేకంతోత్యాగపూర్వకంగా తన కార్యాన్ని ఆచరణలో పెట్టింది.
▪సంవత్సరాలతరబడి దైవ వర్తమానికురాలుగా కృషి చేసి ప్రజలస్వాతంత్ర్య
కోసం ప్రార్థించింది.
▪ఇతరులను ప్రోత్సహిస్తూ నాయకత్వాన్ని ఆచరణలో పెట్టింది.
▪దెబోరా ప్రదర్శించిన యుక్తిగల ఆధ్యాత్మిక నాయకత్వం బారాకును ఉద్రిక్తుణ్ని చేసింది.అంతకు ముందుకంటె ఇప్పుడు బలిఘ్టడైనట్లు భావించాడు
▪దేవుడే తన శతృసైన్యా లతో పోరాడుతాడనే ధృఢ నమ్మకం అతనిలో కలిగించింది.
▪ విశ్వాస ధైర్యాల్లో ఆమెను విశిష్టురాలిగా గుర్తించాడు బెరాకా.
▪దేవుని కోసం 
వీరుడయ్యేందుకు బారాకుకు దెబోరా సహాయపడింది.
💥యుద్దంచేసేవిషయంలో
కూడ దైవ సూచనలిచ్చింది 
తన ప్రజలకుదైవశాసనాల్ని హెచ్చరికలుగా ఇచ్చింది.
కత్తిని కలాన్ని ఎలా ఉపయోగించాలో ఆమెకు బాగా తెలుసు.
దేవుడే తనకు ఈ సామర్థ్యాన్ని ప్రసాదించాడన్న విషయం ఆమెకు  తెలుసు.

💥 దెబోరా విజయ గీతిక 
హెబ్రీ పదాల్లో కెల్లా బహు అందమైనది.రాజులారా,యువరాజులారా,ఇశ్రాయేలు దేవుడు యెహోవాను గూర్చి నేను పాడతాను అని దెబోరా ఆలపించింది.
ప్రాచీనమైంది కూడ.ఈ పాట ఆమెలో వున్న దైవభక్తిని వర్ణిస్తోంది.
దేవుణ్ణుంచే ఆమెకు సంతోష సంతృప్తులు లభించాయి.
తర్వాత బారాకు కీర్తన ఆరంభమౌతుంది.
(న్యాయా5:1-3)
*యోహాను ప్రేమించే వాళ్ళు*శక్తివంతమైన సూర్యునిలాప్రకాశిస్తారని* బారాకు చివరి భాగంలో వర్ణించబడింది.
(న్యాయా5:31)

💥 *దెబోర జీవితం*

      దేవుడే ఆమె జీవితం లోని అసలు వాస్తవం.అదే
ఆమె రహస్యం.
దెబోరా జీవితం మిరుమిట్లు గొలిపే శక్తివంతమైనది.ఇలాంటి జీవితాన్ని  వర్ణిస్తూ సొలొమోను రాజు *పట్టపగలయ్యే దాక వేకువ వెలుగు తేజస్సుకు మించి నీతిమంతుల మార్గం ప్రకాశిస్తుంది* అని వర్ణిస్తున్నాడు.తల్లి తన పిల్లల విషయంలో ఏలాంటి శ్రద్దను ప్రదర్శిస్తుందో అలాంటి శ్రద్ద ఇశ్రాయేలు ప్రజల క్షేమం కోసం ప్రదర్శించింది.
దైవాధీనంలో వుంటూ స్త్రీ కూడ గొప్ప కార్యాలు చేయగలదని చేసిచూపింది
👉🏾 దేవునిలో విశ్వాసప్రేరణ కోరుకున్న నాయకుడు అనేక రంగాల్లో విజయం సాధించగలడు

*దెబోరా* విశ్వాసం ద్వారా ప్రేరణ పొందిన ఓ జాతి నాయకురాలు.
(న్యాయాధిపతులు 
1:1-10,4:12-16,23,24)
  *దైవాశ్శీస్సులు*
           

*శ్రీమతిజె.విమలకుమారి*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...