ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిల్ ఉన్న మొత్తం కొండలు మరియు పర్వతములు వివరములు.

బైబిల్ ఉన్న మొత్తం కొండలు మరియు పర్వతములు వివరములు...
🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶🔶
1. అరారాతు పర్వతము 
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
నోవహు నిర్మించిన ఓడ జలప్రళయము తరువాత
టర్కీలోగల ఈ పర్వతముపై నిలచినది. ఆదికాండము 8:4 

2. అరేయొపగు కొండ
🔺🔺🔺🔺🔺🔺🔺🔺
ఏథెన్సు పట్టణములోగల ఈ కొండపై అపొస్తలుడైన
పౌలు సువార్త బోధించెను. అపొ 17:18-33 

3. ఏబాలు కొండ 
💠💠💠💠💠💠💠💠
సమరయ ప్రాంతములోగల ఈ కొండపైనుండి ఇశ్రాయేలీయులనుగూర్చి (అవిధేయులైన వారినిగూర్చి) శాపవచనములు ప్రకటించ
బడెను. ద్వితీ 11:29; 27:9-13 

4. ఒలీవ చెట్ల కొండ 
💚💚💚💚💚💚💚💚
(యెరూషలేముకు తూర్పువైపున గలదు)
అ. దావీదు అభ్షాలోమునుండి పారిపోయి ఈ కొండకు చేరెను.2 సమూయేలు 15:30 

ఆ. ఈ కొండయెద్ద ప్రభువైన యేసు యెరూషలేము పట్టణ విషయమై యేడ్చెను. లూకా 19:41 

ఇ. ప్రభువైన యేసు చిట్టచివరిగా ప్రసంగించినది ఈ కొండయొద్దనే.మత్తయి 24-25 

5. కర్మలు పర్వతము- 
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
గలిలయ సముద్రమునకు పశ్చిమ దిక్కునగల ఈ పర్వతముపై ఏలీయా బయలు దేవతా ప్రవక్తలతో సవాలు చేసెను.1 రాజులు 18:19 

6. గిలాదు కొండ 
🧡🧡🧡🧡🧡🧡🧡
గలిలయ సముద్రమునకు ఆగ్నేయమునగల ఈ కొండపై యాకోబు మరియు లాబానులు తమ నిబంధన చేసికొనిరి. ఆది31:20-49 

7. గిల్బోవ పర్వతము 
💓💓💓💓💓💓💓💓💓💓
ఈ పర్వతమునొద్ద ఫిలిపీయుల చేతిలో సౌలు అపజయ మొందెను. మరియు అతని కుమారులైన యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవలు చంపబడిరి. 1 సమూయేలు 31:1-6 

8. గెరిజీము కొండ లేక పర్వతము 
🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤🖤
ఏబాలు కొండకు ఎదురుగాగల ఈ కొండపై
నుండి ఇశ్రాయేలీయులనుగూర్చి (విధేయులైనవారినిగూర్చి) దీవెన వచనములు
ప్రకటించబడెను. మరియు కొంతకాలము తరువాత ఈ పర్వతముపై సమరయులు తమ దేవాలయమును నిర్మించిరి. ద్వితీ. 11:29; యోహాను 4:20, 21

9.గొల్గొతాకొండ
💚💚💚💚💚💚💚💚
కపాల స్థలమను అర్ధమిచ్చు ఈ కొండపై రక్షకుడు సిలువ వేయబడెను.మత్తయి 27:33 

10.తాబోరు కొండ 
🌀🌀🌀🌀🌀🌀🌀
నజరేతుకు తూర్పువైపున గలిలయలోగల ఈ కొండపై నుండి దెబోరా మరియు బారాకులు దిగివచ్చి సీసెరాను ఓడించిరి.
న్యాయాధిపతులు 4:6-15 

11. నజరేతు కొండ 
🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄
ప్రభువైన యేసు యొక్క స్వస్థలమైన ఈ పట్టణములో కోపిష్టులైన జన సమూహము యేసును తమ పట్టణము కట్టబడిన కొండ చివరికి తీసికొనిపోయి ఆయనను క్రిందకు పడద్రోయవలెనని తలంచిరి. లూకా 4:29 

12. నెబో శిఖరము
✳️✳️✳️✳️✳️✳️✳️✳️
యొర్దాను నదికి తూర్పువైపునగల పిస్గా కొండ యొక్క శిఖరాగ్రప్రదేశము ఈ నెబో శిఖరము. ఈ శిఖరమునకెక్కిమోషే ఇశ్రాయేలీయులకు
వాగ్దానము చేయబడిన దేశమును చూచెను. 
ద్వితీ. 3:27; 34:1-4 

13.పిస్గా కొండ - 
🔥🔥🔥🔥🔥🔥🔥
మొర్దాను నదికి తూర్పువైపునగల ఈ కొండపైనుండి బిలాము ఇశ్రాయేలీయులను శపించుటకు ప్రయత్నించెను. మరియు ఈ కొండపైనే
మోషే పాతి పెట్టబడెను.
సంఖ్యాకాండము 22-24; ద్వితీ. 34:5, 6 

14. మోయాబువద్దగల సున్నతి గిరి
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
ఈ కొండవద్ద యెహోషువ ఇశ్రాయేలీయులలో
సున్నతి పొందనివారికి రాతికత్తులతో సున్నతి చేయించెను. యెహోషువ 5:3 

15. మోరీయా పర్వతము
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
అబ్రాహాము ఇస్సాకును ఇంచుమించుగా బలి అర్పించినది ఈ పర్వతము పైననే మరియు సొలొమోను దేవుని మందిరమును నిర్మించినది
కూడా ఈ పర్వతము పైననే.
ఆదికాండము 22:2; 2 దిన. 3:1 

16. రెఫీదీము దగ్గరనున్న కొండ 
🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡
ఇశ్రాయేలీయులు తమకు వాగ్దానము చేయబడిన
దేశమునకు ప్రయాణము చేయుచూ మార్గమధ్యములో ఈ కొండవద్ద
అమాలేకీయులతో జరిగిన మొట్టమొదటి యుద్ధములో గెలుపొందిరి.
నిర్గమకాండము 17:8-16 

17. లెబానోను పర్వతము 
💗💗💗💗💗💗💗💗💗💗
సొలొమోను దేవుని మందిర నిర్మాణముకొరకు ఇచ్చటి నుండి దేవదారు మ్రానులను తెప్పించెను.
1 రాజులు 5:6-14 

18. సీనాయి పర్వతము 
💜💜💜💜💜💜💜💜
ఇది హోరేబు పర్వతము యొక్క శిఖరాగ్ర ప్రదేశము.
ఇచ్చటనే మోషే దేవునియొద్దనుండి పది ఆజ్ఞలు స్వీకరించెను. నిర్గ20:1-17 

19. షోమ్రోను కొండ 
💙💙💙💙💙💙💙💙💙
షెమెరునొద్దగల ఈ కొండను ఇశ్రాయేలు రాజైన ఒమీ
నాలుగు మణుగుల వెండికి కొని, దానిపై తన క్రొత్త రాజధాని నగరమును కట్టించి, షెమెరు అనునతని పేరును బట్టి ఆ పట్టణమునకు షోమ్రోను అను
1 రాజులు 16:24

20. షోమ్రోను పట్టణమునకు దగ్గరగల కొండ -
💥💥💥💥💥💥💥💥💥💥💥💥
ఈ కొండపై ఏలీయా తనను
బంధించుటకు వచ్చిన ఇద్దరు పంచ దశాధిపతులను, వారి వందమంది సైని
కులను ఆకాశమునుండి అగ్ని కురిపించి దహింపజేసెను. 2 రాజులు 1:9-12 

21. హకీలా మన్యములోగల కొండ - 
💖💖💖💖💖💖💖💖💖💖
సౌలు నిద్రించుచుండగా దావీదు అతనిని
చంపక అతని తలగడ దగ్గరనున్న యీటెను, నీళ్ల బుడ్డిని తీసికొని వెళ్లి ఈ కొండ శిఖరముపై నిలచి సౌలుతో మాట్లాడెను. 
1 సమూయేలు 26:11-25 

22. హెర్మోను కొండ 
🤎🤎🤎🤎🤎🤎🤎🤎
నజరేతు గ్రామమునకు నైఋతి దిక్కునగల ఈ కొండపై నుండి ప్రభువైన యేసుక్రీస్తు రూపాంతరము చెందెను.మత్తయి 17అధ్యా 

23. హోరు కొండ 
💟💟💟💟💟💟💟💟
కాదేషు బర్నేయకు ఈశాన్యమునగల ఈ కొండపై అహరోను మృతినొందెను.
సంఖ్యాకాండము 20:25-29 

24. హోరేబు పర్వతము
✨✨✨✨✨✨✨✨✨ 

అ. ఈ పర్వతముపై ఒక మండుచున్న పొదనుండి మోషే తన కర్తవ్యమును స్వీకరించెను.
నిర్గమకాండము 3:1 

ఆ. ఇచ్చటగల ఒక బండనుండి మోషే నీళ్లు రప్పించెను. నిర్గమ. 17:6 

ఇ .సీనాయి పర్వతముమీద మోషే నలుబది దినములుండినప్పుడు అతని కొరకు ఇశ్రాయేలీయులు ఇచ్చటనే వేచియుండిరి.
నిర్గమ. 32-33 

ఈ.ఏలీయా ప్రవక్త యెజెబెలుకు భయపడి పారిపోయి ఈ పర్వతమునకు చేరెను.
1 రాజులు 19:8 

సేకరణ....
హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...