ఇజ్రాయెల్ దేశ ఆవిర్భావం –వారి ప్రాముఖ్యత బైబిలు ప్రవచనాల నెరవేర్పు.
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
👉యాకోబునకు దేవుడు ఇశ్రాయేలుగా పేరు మార్చాడు
.
👉సృష్టి కర్తయైన దేవుడు అబ్రహముకు వాగ్దనం చేసి ఆది17 అధ్యయం వారి సంతానం యైన (యాకోబు) నుండి వచ్చిన జనాంగమే ఇశ్రాయేలీయులు.
👉ఈ ఇశ్రాయేలీయులు 12గోత్రములుగా ఉండేవారు ఆదికాండము 49:28 ఈ 12 గోత్రాల ప్రజలు ఒకే రాజ్యము (దేశము) గా ఒకే రాజు కింద కనాను దేశములో ఉండేవారు.
👉అయితే క్రీ.పూ. 10 వ శతాబ్దములో సోలోమెాను చనిపొయిన తరువాత ఈ 12 గోత్రముల ప్రజలు రెండు రాజ్యాలుగా చీలిపోయారు.
ఉత్తరాన ఉన్న 10 గోత్రములు కలిపి “ఇశ్రాయేలు రాజ్యముగా”,
దక్షిణాన ఉన్న 2 గోత్రములు (యూదా,బెన్యామీను అర్థ గోత్రము) “యూదా రాజ్యముగా” ఏర్పడ్డారు.
(ఈ ఇశ్రాయేలీయులు రెండు రాజ్యాలుగా ఎప్పుడు విడిపోయారు అనేది 1 రాజులు 11, 12 అధ్యాయాలలో మనము చదవవచ్చు.)
👉ఈ విధముగా దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయులు రెండు రాజ్యాలుగా విడిపోయిన తరువాత “ఇశ్రాయేలు రాజ్యాన్ని” 19 మంది రాజులు క్రీ.పూ. 10వ శతాబ్దము నుండి క్రీ.పూ.700 వరకు పరిపాలించారు.
👉తరువాత దేవుడు వారు చేసిన పాపాలను బట్టి వారిని చెరకు అప్పగిస్తాడు. అలా క్రీ.పూ.7వ శతాబ్దములో ఇశ్రాయేలు 10 గోత్రాల వారు చెల్లా చెదురు అవుతారు, అన్యులలో కలిసిపోతారు, అనేక దేశాలకు వలసగా వెళ్తారు.
👉అలా క్రీ.పూ.7వ శతాబ్దము నుండి అన్య రాజుల క్రింద పరిపాలించాబడుతూ ఉండేవారు. (2 రాజులు 17వ అధ్యాయము)
ఇక మిగిలిన యూదా రాజ్యంలో ఉన్న 2 గోత్రముల వారిని 20 మంది రాజులు క్రీ.పూ.10వ శతాబ్దము నుండి క్రీ.పూ. 586 వరకు పరిపాలించారు
👉అయితేవీరు చేసిన పాపములను బట్టి దేవుడు వీరిని బబులోను రాజుకు అప్పగిస్తాడు. అలా యూదులు 70 సంవత్సరాలు బబులోనుకు చెరగా కొనిపోబడతారు.
తరువాత మరలా యూదులు తిరిగి యేరుషలేముకు వచ్చినప్పటికీ కొంతమంది యూదులు బబులోనులోనే ఉండిపోయారు.
👉యూదులు యేరుషలేములో తమ సొంత దేశంలో ఉన్నప్పటికీ వారు అన్య రాజుల క్రింద పరిపాలించబడుతూ ఉండేవారు.
👉ఎప్పుడూ ఎదో ఒక రాజు యేరుషలేమును ఆక్రమించుకొని వారిని చిత్ర హింసలకు గురిచేసేవారు.
👉అలా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దము నుండి యూదులకు రాజు లేడు, స్వాతంత్ర్యం లేదు. అన్య రాజుల హింసలకు తట్టుకోలేక యూదులు యెరూషలేము నుండి అనేక ఇతర దేశాలకు వలస వెళ్ళేవారు.
👉అలా వలస వెళ్ళిన యూదులను వివిధ దేశాలలో చిత్ర హింసలకు గురి చేసేవారు. 20 వ శతాబ్దములో జర్మనీ దేశములో హిట్లర్ యూదులను రోజుకు 20 వేల మంది చొప్పున 60 లక్షల మంది యూదులను గ్యాస్ చాంబర్స్ లో బందించి, గ్యాస్ వదిలిపెట్టి దారుణముగా చంపించాడు.
👉ప్రపంచములో ఉన్న అన్ని జాతులకంటే యూదులు బాగా తెలివి కలిగిన వారని వారిని నిర్మూలము చేస్తే ఆర్యులే ప్రపంచములో అందరికంటే ఎక్కువ తెలివి కలిగిన వారిగా ఉంటారని హిట్లర్ యూదులను నిర్మూలము చెయ్యడానికి పూనుకున్నాడు.
👉యూదు జాతికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త Albert Einstein ను కూడాచంపడానికి ప్రయత్నించాడు హిట్లర్, అప్పుడు Albert Einstein అమెరికా వెళ్లి అక్కడ స్థిరపడ్డాడు.
👉అలాంటి పరిస్థితిలో యూదులు ఉండేవారు. ఇశ్రాయేలు 12 గోత్రముల వారు తమ రాజ్యాన్ని, సొంత దేశాన్ని పోగొట్టుకొని ప్రపంచ వ్యాప్తముగా చెల్లా చెదురయ్యి ఎందుకు ఇన్ని చిత్ర హింసలు అనుభవించారు? అందుకు కారణం వారు చేసినా పాపాలే.
👉నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనే ఆజ్ఞని మీరి అన్య దేవతల తట్టు తిరగడం వారు చేసిన ఘోర పాపం. 2 రాజులు 17:7-23 అయితే రెండు రాజ్యాలుగా విడిపోయిన 12 గోత్రాలను, ప్రపంచ వ్యాప్తముగా చెల్లా చెదురయిపోయిన ఆ జనాన్ని సమకూర్చి ఒకే రాజ్యముగా చేస్తానని దేవుడు క్రీ.పూ. 6,7,8 వ శతాబ్దాలలో ప్రవక్తల ద్వారా ముందే వ్రాయించాడు.
👉యెహేజ్కేలు 37:15-23; 36:24; 11:17-19; వచనాలు, యెషయా 11:11-13; 43:5-7 యిర్మియా 16:14,15 యెహేజ్కేలు 37:21-22 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా ఏయే అన్యజనులలో ఇశ్రాయేలీయులు చెదరిపోయిరో ఆ యా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చటనుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొనివచ్చి వారికమీదట ఎన్నటికిని రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండ కుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీయుల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి, వారికందరికి ఒక రాజునే నియమించెదను.
👉దేవుడు బైబిలులో చెప్పినట్లు గానే తన ప్రవచనాన్ని క్రీ.శ. 1948 మే 14న నెరవేర్చాడు. 1948 మే 14న ఇశ్రాయేలీయులకు స్వాతంత్ర్యం వచ్చింది, వారి స్వంత దేశం వారికి తిరిగి వచ్చింది.
👉కొంతమంది పోరాట యోధులు ప్రపంచమంతా చెదిరి ఉన్న యూదులందరూ తిరిగి తమ మాతృభూమికి రావాలని పిలుపునిచ్చారు.
👉అప్పుడు ఇశ్రాయేలు దేశం బ్రిటిషు వారి ఆధీనములో ఉంది. వారందరి పిలుపు మేరకు ప్రపంచమంతటా ఉన్న ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి 1948 మే నెలలో ఇశ్రాయేలు దేశం చేరుకున్నారు.
👉1948 మే 14వ తేదీన ఇశ్రాయేలు దేశంలోని “TelAviv”నగరంలోని మ్యూజియంకు ఐక్య రాజ్య సమితి సభ్యులంతా చేరుకొన్నారు.
👉కాసేపు తరువాత David Ben-Gurion ఇశ్రాయేలు దేశం ఆవిర్భవించిందని ప్రకటన చదివాడు. ఇశ్రాయేలు జాతీయ గీతం ఆలపించబడినది. వెంటనే అమెరికా అద్యక్షుడు Harry S. Truman ఇశ్రాయేలు దేశాన్ని గుర్తించినట్లు ప్రకటించాడు.
👉ఎందుకనగా ఐక్య రాజ్య సమితి సాధారణ సభ తీర్మానం ప్రకారం ఇశ్రాయేలు దేశం ఏర్పడినది.
👉దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్పిన ప్రవచనం నెరవేరినది. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం భౌతికముగా తిరిగి జన్మించినది.
👉ఈరోజు వారికి ఒక జాతీయ పతాకం, రాజ్యాంగ చట్టం, పార్లమెంటు ఉంది. ప్రధాన మంత్రి, మంత్రిమండలి ఉంది.
👉రక్షణ దళం, బలమైన సైనిక వ్యవస్థ ఉంది. మహా దేవుని పట్టణమైన “యేరుషలేము” ముఖ్య పట్టణముగా వుంది.
👉కాబట్టి బెనె నోవాహు సమాజములో అందరు ఐక్యత కలిగి దేవుని పూర్ణ హృదయంతో ప్రేమిస్తు దేవుడు అనుగ్రహించిన రక్షణను చివరి వరకు కాపాడుకుంటూ అనేకులను దేవుని ధర్మం వైపు నడిపిద్దాము.
👉అట్టి కృప దేవుడు మన అందరికి దయచేయును గాక, ఆమెన్. ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను కీర్తనలు 102:16 భయపడకుము, నేను నీకుతోడైయున్నాను
👉తూర్పునుండి నీ సంతానమును తెప్పించెదను పడమటినుండి నిన్ను సమకూర్చి రప్పించెదను.
👉అప్పగింపుమని ఉత్తరదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. బిగ బట్టవద్దని దక్షిణదిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను.
👉దూరమునుండి నా కుమారులను భూదిగంతమునుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించినవారిని నా నామము పెట్టబడిన వారినందరిని తెప్పించుము నేనే వారిని కలుగజేసితిని వారిని పుట్టించినవాడను నేనే. యెషయా 43:5-7 ఈ వాక్యం దేవుడు మా యొక్క హృదయాలలో భద్రపరచును గాక.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి