✳ *బైబిల్ నందలి స్త్రీలు* ✳
(ఐదవ భాగము)
5⃣ 👩⚖ *రాహేలు* 👩⚖
తల్లియైన రిబ్కాయాకోబును తన తండ్రి యైన లాబాను ఇంటికి పంపి లాబాను కుమార్తెలలో ఒక దానిని
పెండ్లాడునట్లు ఇస్సాకు అతని పంపాడు.
యాకోబు 450 మైళ్ళు ప్రయాణము చేసి తన గమ్యాన్ని చేరుకొన్నాడు.
అక్కడ గొర్రెలకాపరులు తమ మందకు నీళ్ళు పోయు ఒక బావి దగ్గర ఆగి లాబానుగురించివిచారించు
చుండగ లాబాను కుమార్తెయగు రాహేలు తన గొర్రెలకు నీళ్ళు చేది పోయుటకు యాకోబు సహాయపడి తనను గూర్చి పరిచయము చేసుకొన్నపుడు రాహేలు పరుగున పోయి తన తండ్రికి తెలియ జేసెను.
ఒక మాసము మట్టుకు లాబానుకు పని చేయుచూ
అతనితో నివసించెను.
ఆ సమయమున యాకోబు *సురూపియైన*రాహేలును* *ప్రేమించెను*
.కానీ రాహేలుకు కట్నముగా ఏడు సంవత్సరములు మట్టుకు లాబానుకు పని చేయుటకు ఒప్పందము చేసికొనెను.
*అతడామెను ప్రేమించుట వలన అది అతనికి కొద్దిదినములుగా తోచెను*
(ఆది.కా29:20)
లాబాను తన కుమార్తె
నిచ్చి పెండ్లి చేసెను. ఉదయమున
ఆమెరాహేలు కాదని *లేయా అని అతను గమనించి*
"ఈ పని ఏమని" యాకోబు లాబాను అడిగినపుడు,
*పెద్దదానికంటె ముందు చిన్నదాని నిచ్చుట తమ దేశ మర్యాద కాదని* చెప్పెను.
జేష్ట కుమారునికిరావలసిన దీవెనలను పొందుటకు యాకోబు తనతండ్రినిఎట్లు *మోసగించెనో*..లాబాను యొక్క జేష్టకుమార్తె పెండ్లాడునట్లు అతడు కూడ మోసగించబడెను.
మరి ఏడుసంవత్సరములు అతడు లాబానుకు కొలువు చేస్తే రాహేలు నిచ్చెదనని చెప్పినపుడు యాకోబు ఒప్పుకొనెను.
ఇప్పుడు యాకోబునకు ఇద్దరు భార్యలుండిరి.
*లేయాకంటె రాహేలును యాకోబు ఎక్కువగా ప్రేమించెను* అది దేవుడు చూచినపుడు దేవుడు రాహేలు గర్బమును మూసెను.ఆమె గర్బము ధరించకుండెను.
*లేయా గర్బమును దేవుడు తెరిచెను*
(ఆది.కా 29:31)
లేయాకు నలుగురు కుమారులు కలుగగా తనకు గర్బఫలమిమ్మని యాకోబు నడిగెను.ఆమె గొడ్రాలుగా వుండుటకు కారణము దేవుడని చెప్పెను.
చివరిగాలేయాయొక్క పిల్లలందరూ జన్మించిన తరువాత దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొనెను.ఆమె గర్బవతియై కుమారుని కనెను.అతనికి *యోసేపు*
అని పేరు పెట్టబడెను.
చివరిగా యాకోబు కానానుకు తిరిగి వెళ్ళవలెనని దేవుడాతనికి తెలియజేసెను.
💥 *నేర్చుకొనదగిసూత్రలు*
*రాహేలు*
*భాద్యత గలది* *కృషిచేయునది*
తన తండ్రియొక్క మందలను మేపునదిగా మొట్టమొదట మనకు కనబడుతుంది.మందను మేపునదిగా *రాహేలు *మందలయొక్క క్షేమానికి*
*సంరక్షణకు భాధ్యురాలు*
ఆమె ఏమరపుగా వుంటే కౄరమృగములు వాటిని వేటాడవచ్చును.ఎంతో భాద్యతగా తన పనిని నిర్వర్తించేది. 💥 *రాహేలు ఈర్షగలది*
యాకోబు ప్రేమలో రాహేలు తృప్తి చెందలేదు.తన సహోదరికి పిల్లలు కావాలని ఆమె యాకోబును కోరింది.
లేయాకు నలుగురు కుమారులు కలిగిన తరువాత తనకు పిల్లలు కలగక పోతే చనిపోవుట మేలని తలంచింది.
కానీ ఎఫ్రతా వెళ్ళు మార్గములో నిండు చూలాలైన రాహేలు ప్రసవించుచు ఒక కుమారున్ని కని మరణించెను.యాకోబు అతనికి *బెన్యమీను*
అను పేరు పెట్టెను.
💥 *తన కుటుంబ కలుషితము వలనరాహేలు*
*ప్రభావితురాలయ్యెను*
లాబాను మోసపూరితుడు,కఠినుడు.
దురదృష్టవశాత్తు రాహేలు యిట్టి లక్షణములను కొన్ని
కలిగియుండెను.
యాకోబు తనకు సంతానమియ్యాలని పోరాడుటలో ఆమె *కఠినురాలిగా*
*కనబడుచున్నది*
తన గర్బమును దేవుడే మూసియుంచెను.అది యాకోబు బలహీనత కాదు.
లేయా కుమారుడు రూబేను ఆమెకు
పుత్ర దాత వృక్షపు పండ్లను తెచ్చి ఇచ్చెను.
గర్బవతిగా నుండుటకు అత్యాశక్తి గలదై రాహేలు తానను కొన్నది పొందుట కొరకు యాకోబును ఒక రాత్రి లేయాకు విక్రయించి
నది.
ఆమె లేయా యెడల ఎంత కఠినముగా,మోసకరముగా
వ్యవహరించినను ఆమెకు సంతానము కలుగలేదు.
రాహేలు తన తండ్రి దేవతా విగ్రహాలను దొంగిలించి దాచిపెట్టేసింది ఆమె విగ్రహారాధన చేసినట్లు లేఖనములు చెప్పుట లేదు.
యాకోబు మాట చొప్పున ఆమె వాటిని విడిచి పెట్టినది.
మోసము,అబద్దము అనునవి భక్తిహీనుల లక్షణములు.(సామె24:8)
తండ్రి యొక్క దుష్టలక్షణములు లలో కూడ రాహేలు తనలో ఇముడ్చుకున్నది.తదుపరి
*యాకోబు యొక్కప్రేమ* ,
*నిజదేవుని యెడల అతని *కున్న భక్తి వలన ఆమె మార్పు చెందినది*
క్రైస్తవులుగా మనము దేవునికి ప్రీతికరమైన సేవకులుగా తయారగుటకు శత విధాలా ప్రయత్నించాలి.
సహవాసము కలిగి మంచి లక్షణములు అలవరచుకోవాలి.ఆమెన్.
6⃣ 🌹👱🏾♀ *లేయా* 👱🏾♀🌹
యాకోబు తల్లి సోదరుడు లాబాను యొక్క
*పెద్ద కుమార్తె *లేయా చిన్నకుమార్తె *రాహేలు*
యాకోబు తన మామ కుమార్తెను పెండ్లాడుటకు 450 మైళ్ళు ప్రయాణము చేసి పద్దారాము ఊరికి చేరుకున్నాడు. రాహేలు కొరకుఏడు సంవత్సరముల
పాటు పని చేశాడు.
గడచిన తరువాత లాబాను
ఆ ప్రాంత ప్రజలను సమకూర్చి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె లేయాను అతని దగ్గరకు పంపగా యాకోబు ఆమెతో శయనించెను.ఉదయాన్నే ఆమెను లేయాగా గుర్తించి
రాహేలు కొరకు కదా నీకు కొలువు చేశాను.ఎందుకు నన్ను మోసం చేశావు ? అని లాబానును అడగగా
పెద్ద కూతురు వుండగా చిన్నకుమార్తెకు వివాహంచేయడం ఈ దేశ ఆచారము కాదు అని జవాబిచ్చాడు.
లేయా యాకోబు పట్ల ఎంత శ్రద్ద తీసుకున్నా యాకోబు ఆమె ఏమీ కానట్టుగానే వున్నాడు.
*నన్ను ప్రేమించని వ్యక్తితో నాకు వివాహమైంది*
ఆమె దృష్టికి తన జీవితము అంధకారంగా తోచింది.తన జీవిత పరమావధి వ్యర్థమై పోయిందని ఆమె నమ్మలేక పోయింది.బహుషా నాకు కుమారుడు కలిగిన తరువాత పరిస్థితులు చక్కబడతాయని ఆశించింది.
మనసులో మరో స్త్రీని ఆరాధిస్తున్న పురుషుడు ఈమెను తన సొంత స్త్రీగా పిలువలేడు.
తాను పొందలేని ప్రేమ కోసం లేయాఆరాటపడింది
దేవుడు కోరుకున్న ఒప్పందానికి సాదృశ్యంగా
వుంది లేయా వివాహము.
వివాహ విషయంలో దైవ నిర్ణయం ఏక పత్నీ వ్రతం మాత్రమే.ఒక స్త్రీతో మాత్రమే కల్సి జీవించాలి,
(ఆది.కా1:27,2:24)
💥 *లేయా మొరను*
*విన్న దేవుడు*
లేయా విచారం ఆమెను దేవుని దగ్గరకు నడిపించింది.యాకోబు లేయాను చిన్న చూపు చూచినందువల్ల
యోహోవా ఆమెకు సంతాన ప్రాప్తి అనుగ్రహించాడని బైబిల్ చెబుతోంది(ఆది.కా29:31)
లేయా అందవిహీనత దేవుణ్ని నిరోధించలేదు.ఆమె
పై వేషం చూసి దేవుడు ఆమెకు తీర్పు చేయలేదు.
ఆయన్ను *మొరపెడుతోన్న ఆమె హృదయం వైపు చూచాడు*
లేయా జీవితంలో
అంగ వైకల్యమైనా
ఓ ప్రత్యేక విధానంలో దేవుని చేత ఆశీర్వదింప బడింది.
💥 *లేయా జీవితములో సంతానాభివృద్ది*
తన మొదటి కుమారునికి
*రూబేను*
అని పేరు పెట్టింది. *దేవుడు నా బాధను దృష్టించాడు*
అని దీని భావన.ఎవరైనా *దేవుణ్ని ఎంతైనా నమ్మచ్చు*
అని ఆమెకు బాగాతెలుసు.
దేవుని నమ్మకత్వం,ప్రేమలో అత్యంత అనుభవం గడించిన లేయా తన కుమారునికి *షిమ్యోను*
జన్మించిన సందర్బములో
ఈ నిర్బయత వెల్లడి చేసింది.
*ప్రభువు విన్నాడు* అని
*షిమ్యోను*
నామమునకు అర్థం.
తన సమస్యలను దేవునితో పంచుకొని ప్రార్థనలకు జవాబు లభించిన తరువాత బహిరంగంగా ఆయనను ఘనపర్చడం మర్చిపోలేదు లేయా
💥 *హెచ్చింపబడ్డ*
*లేయా*
*ఓ నూతనశకారంభం*
నాల్గవ కుమారుడు "యూదా" జన్మ సమయానికి
లేయా హృదయంలో యాకోబు కోసమున్న ప్రేమ కంటే దేవునిపై నున్న ప్రేమ బలవత్తరమైందిగా తయారైంది.
*ఈ సారి నేను దేవుణ్ని స్తుతిస్తాను* అని *ఆనందాశ్చర్యాలతో చెప్పింది లేయా*
(ఆది.కా.29:35)
ఆ క్షణాన్ని గూర్చిన ప్రవచనాభావాన్ని ఆమె తెలుసుకో లేక పోయింది.
💥 *యూదా పుట్టుకతో ఒక నూతన శకారంభం కాబోతున్న విషయం ఆమెకు తలియదు*
💥. *యూదా జాతి నుండి అతని వారసుల* *ద్వారా మెస్సీయా వస్తాడు ప్రతి వంశం యూదా* *నామాన్ని*
*కీర్తిస్తుంది*
💥 *మానవజాతి*
*మొత్తానికి* *ఆశీర్వాదకరంగాదేవుడు లేయానువాడుకున్నాడు*
💥 *లోకరక్షకుడు యేసుక్రీస్తు జన్మ సమయం లేయా ద్వారా నిశ్చయంగా సమీపించింది*
తానుకోరుకున్న వాటిని ఎలా పొందాలో రాహేలుకు బాగా తెలుసు. ఈ *పుత్రదాతఫలాలవల్ల*
ఈ రాత్రి యాకోబు నీతో శయనిస్తాడు అంటూ అభయమిచ్చింది రాహేలు.
(ఆది.కా30:15,16) చిన్నదైన రాహేలు ఉత్కృ ష్ట మైన
విధానంలో తన సోదరికి మేలు చేస్తొంది.మరో సారి అవహేళనకు గురైంది.
త్వరలోనే లేయా *ఇశ్శాఖారు, జెబూలూను అను ఇద్దరు కుమారులను ప్రసవించింది* ఈ రెండు పేర్లు మరోసారి దైవ ప్రేమను ప్రతి ధ్వనించాయి.
యాకోబుకు కూతుర్ని కనే ఆధిక్యత అతని భార్య లందరిలో లేయాకే దక్కింది
*ఆ కూతురి పేరు దీనా*
💥 లేయా ద్వారా
*మహత్తర స్వాస్థ్యం బయలు వెళ్ళింది*
ఇశ్రాయేలీయుల పండ్రెండు
గోత్రాలకు యాకోబు కుమార్ల పేర్లు పెట్ట బడ్డాయి. *మానవచరిత్ర* *ముగిసేదాక దేవునివిశ్వాస్యతను*
ఈ సత్యం ప్రచుర పరుస్తోంది.
లేయా తన జీవిత కాలమంతా దుఃఖంతోనే గడిపింది చివరకు ఆమెను
మక్పెలాలోని తన కుటుంబ
భూస్థాపన గుహలో పాతిపెట్టినట్లు చెప్పారు.
దైవచిత్తానికి వ్యతిరేకంగా
నిర్ణయాలు తీసుకో వద్దని *ఆమె జీవితం ప్రజల్ని హెచ్చరిస్తోంది*
దేవుడు ఓ వ్యక్తిని ఎలా దృష్టిస్తాడో లేయా జీవితం ద్వారా అవగతమవ్వడం వల్ల ఈమె జీవిత గాథ ప్రోత్సాహకరంగా ఉంది.
ఏది ఏమైనా చరిత్రలో లేయా జీవితం అత్యంత గౌరవ ప్రదమైనది.
లేయా జీవిత గాథలో హెచ్చరిక,ప్రోత్సాహం రెండూ లభిస్తాయి.
సేకరణ:
*శ్రీమతిజె.విమలకుమారి*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి