ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిల్ నందలి స్త్రీలు పద్నాలుగవ భాగము

✳ *బైబిల్ నందలి స్త్రీలు* ✳

  (పద్నాలుగవ భాగము)

2⃣3⃣ 🌹 *సప్పీరా* 🌹 

*సాతాను మాట విన్నందుకు*
*చావువాత పడ్డ స్త్రీ*

*సప్పీరా అంటే* *మాణిక్యం అని భావం. సప్పీరా భర్త పేరు  అననీయ* 
    
💥 *యెరూషలేములో*
   *ఓ ప్రత్యేక సంఘటన‌*

యేసుప్రభువు ఆరోహణా నంతరం పదిరోజులకు   *వాగ్దానం చేయబడ్డ పరిశుద్దాత్ముడు శిష్యుల మీదికి వచ్చాడు పరిశుద్దాత్ముడుశిష్యులను తన ఆధీనంలో వుంచుకొని వాళ్ళను ఆధ్యాత్మికంగా తీవ్రమైన మార్పుకు గురిచేశాడు*
*ఎవరూఊహించని*
*ప్రేమాను రాగాలు వాళ్ళలో ప్రజ్వరిల్లాయి*
*అంతకుముందెన్నడు ఎరుగని ఓ సహవాస బంధాన్ని అనుభవించా రు*
ప్రతిరోజూ విశ్వాసులు దేవాలయంలో కలుసుకుంటున్నారు.
వాళ్ళు ఏకత్వాన్ని అభిలషించారు.అందరు కల్సి తింటున్నారు.
వాళ్ళ భావాల్లో ,
*సంభాషణల్లో దేవుడే కేంద్ర స్థానం వహిస్తున్నాడు*

అలాంటి పరిస్థితుల్లో *సాంఘికతారతమ్యాలు*
బాధాకరంగా వుంటాయి ఇతరులు తీరని అవసరాలలో కొట్టు మిట్టాడుతూ వుంటే ఓ వ్యక్తి తన ఆస్థి అంతస్థుల్ని
ఎలా అనుభవించి సుఖించగలరు?

చదువుతాను ఇతరుల్ని ఇష్ట పెట్టేందుకు ఇష్టపడ్డ ప్రజలు అప్పుడప్పుడే తలెత్తిన ఉద్యమం లో చేరి తమ ఆస్తుల్ని అమ్మి ఉంచడం చూచినా నేరాలు ఉండబట్టలేక ఆ ఉద్యమంలో చేరారు.
💥   *ఆదిసంఘం*
ఏసుక్రీస్తు ఆది సంఘము విశ్వాసంలో అంతరంగి కంగా కట్టుబడి ఉంది. సంఘం సభ్యులు తమ బాహ్యపరిస్థితుల్లో సమానంగా ఉన్నారు ఎందుకంటే ధనం వున్న వాళ్ళు లేని వాళ్ళ కోసం తమ ఆస్తుల్నిఅమ్మివేశారు.

💥 *బర్నబాసు*(యోసేపు)

వీళ్ళందరిలో ఘనతకెక్కిన వాడు  *బర్నబాసు* అని పిలువబడ్డ  యోసేపు.
*ప్రోత్సహ కారకుడు* అని అతని పేరుకు గల భావం. ఆయన కూడా సరిగ్గాఅలాగేజీవించాడు.
తన పొలాన్ని అమ్మి ఆ ధనాన్ని అపోస్తులుల పాదాల చెంతకు తెచ్చాడు. ప్రజలంతా బర్నబాను గూర్చి, బర్నబామాదిరి జీవితాన్ని గూర్చి ఆయా విధాలుగాచెప్పుకోసాగారు. భూసంబంధమైన ఆస్తిపాస్తులుఅశాశ్వితాలని సంఘసభ్యులుఆధ్యాత్మికం గా ఆలోచించసాగారు.
అననీయ సప్పీరాలను
 సైతం మైమరిపించిన అద్భుత కార్యాలు క్రీస్తు నామములో జరుగు తున్నాయి. *ఇరుగుపొరుగు వాళ్ళను చూచి వీళ్ళుకూడా తమ హృదయాల్లో సమ్మతించి తమంతటతాముగా ఇతరుల్ని అనుసరించేందుకు ముందుకు వచ్చారు* బర్నబాసు ,ఇతరులతో సమానంగా ఉండాలని భావించారు.
*వాళ్ళ పొలాన్ని అమ్మివేసి ఆ ధనాన్ని దైవకార్యం కోసం ఇవ్వాలని నిర్ణయించడం మహత్కార్యం*

సాతాను ఇంకెంతమాత్రం క్రైస్తవాభివృద్దిని సహించలేక పోయాడు.

అననీయ సప్పీరాల హృదయాల్లోకి *సాతాను* ఒక్కసారి తొంగి చూసాడు.

💥  *వాళ్ల హృదయా అభిలాష బర్నబాసు లాంటి ఇతర క్రైస్తవుల ప్రమాణం కంటే కొంచెం తక్కువ స్థాయిలో ఉండడం సాతాను గమనించాడు*
 వాళ్ళ హృదయాల్లో ద్వంద ఉద్దేశాలు ఉండటం గమనించాడు. *ఒకవైపు మంచి చేయాలని ఆశించారు. మరోవైపు ఇతరులు వాళ్ళను  మెచ్చుకోవాలని  కూడా ఆశించారు*
అననీయ సఫ్పీరాలు పేదల్ని  ప్రేమించడమే కాక తమకు కీర్తి,ఘనత,ప్రతిష్టలు కావాలనిబహుగాఆశించారు.వాళ్ళ  ఉద్దేశ్యంలో ఓ భాగం ఆధ్యాత్మికంగా లేదు. ఇప్పుడు వాళ్లు వృద్దులై లేనందువల్ల భావి జీవితాల విషయంలో భయం పట్టుకొనివుంటుందనుకుంటాన
💥 *అననీయ,సప్పీరా*
*హృదయాల్లోకిసాతాను*
కారణమేదైనా వాళ్ళు అమ్మే నా పొలం వల్ల వచ్చిన ధనంలో కొంత దాచి పెట్టుకోవాలని పథకం వేసుకున్నారు భార్యాభర్తలిద్దరూ సమ్మతించి అనుకున్న విధంగా  పని ముగించారు.
పేతురు, అననీయ దగ్గర్నుండి ఆ సొమ్ము స్వీకరించేటప్పుడు అందులో మోసం ఉందని గ్రహించాడు.
*అననీయా! అమ్మగా వచ్చిన ధనంలో కొంత దాచిపెట్టుకుని  పరిశుద్దాత్మునికి అబద్దాలు  చెప్పే విధంగా మీ హృదయాల్లో సాతాను ఎందుకు ప్రవేశించాడు?* అంటూ పేతురు గర్జించాడు. పేతురు వాళ్ళ మోసాన్ని
బయట పెట్టాడు.
 అననీయ తన హృదయంలో  సాతానుకు తావిచ్చాడు.
ఆదిదంపతులు ఆదాము అవ్వలా సాతాను మోసానికి తలవంచారు.
(అపొ.కా.3:1-8 )

💥       *పరిశుద్ధాత్ముణ్ణి     మోసగించడం*

దేవుని మోసగించడం తో సమానం అని పేతురుకు తెల్సు. *ఈ ఆస్తిని మీది*
*అమ్మాల్సింది,లేనిది,*
*నిర్ణయించాల్సిందికూడా*మీరే ఎంత ఇవ్వాలో నిర్ణయించాల్సింది కూడా మీరే. అలాంటప్పుడు ఇంతటి దుష్కార్యం ఎందుకు చేశారు*?
మీరు మాకు అబద్ధం చెప్పడం లేదు
*దేవునితోనే అబద్ధం ఆడుతున్నారు* అంటూ
అననీయను అడిగాడు.
(అపొ.కా.4:5 )
పేతురు మాటలకు అననీయ అక్కడిక్కడికే పడి *మరణించాడు*
వెంటనే అక్కడున్న కొంతమంది యువకులు అననీయ శవాన్ని బట్టలతో తీసుకెళ్లి పాతిపెట్టడం చూసిన ప్రజలు *భయభ్రాంతులయ్యారు* ఎరుషలేము ఆరోజుల్లో చాలా చిన్న పట్టణము దేవాలయ ప్రాంగణంలో ఏ భాగంలో నైనా చాలా కొద్ది సమయంలో మూడు గంటలైనా భర్త తిరిగి రాకపోయేసరికి విషయం తెలుసుకునేందుకు బయలుదేరా ఆమె గదిలో ప్రవేశించి తిరిగి కూర్చున్నారు అడుగుల దూరం నుండి వినపడుతుంది
వెంటనే అక్కడున్న కొంతమంది యువకులు అననీయ శవాన్ని బట్టలతో తీసుకెళ్లి పాతిపెట్టడం చూసిన ప్రజలు భయభ్రాంతులయ్యారు.

💥    *సప్పీరా మరణం*

యెరూషలేము ఆరోజుల్లో చాలా చిన్న పట్టణము దేవాలయ ప్రాంగణంలో ఏ భాగంలో నైనా చాలా కొద్ది సమయంలోనడచిరావచ్చు
*మూడు గంటలైనా భర్త తిరిగి రాకపోయేసరికి విషయం తెలుసు కునేందుకు బయలు దేరింది సిప్పీరా* ఆమె గదిలో ప్రవేశించేటప్పటికి జరిగిన ఘోరాన్ని గూర్చి పేతురు,అపోస్తులులు మాట్లాడుకుంటున్నారు.
అననీయాను పాతిపెట్టిన యువకులఅడుగులుదూరం నుండివినపడుతుంది.
వెంటనే అక్కడున్న కొంతమంది యువకులు అననీయ శవాన్ని బట్టలతో తీసుకెళ్లి పాతిపెట్టడం చూసిన ప్రజలు భయభ్రాంతులయ్యారు.

💥   *సప్పీరా మరణం*

యెరూషలేము ఆరోజుల్లో చాలా చిన్న పట్టణము దేవాలయ ప్రాంగణంలో ఏ భాగంలో నైనా చాలా కొద్ది సమయంలోనడచిరావచ్చు
*మూడు గంటలైనా భర్త తిరిగి రాకపోయేసరికి విషయం తెలుసు కునేందుకు బయలు దేరింది సిప్పీరా* ఆమె గదిలో ప్రవేశించేటప్పటికి జరిగిన ఘోరాన్ని గూర్చి పేతురు,అపోస్తులులు మాట్లాడుకుంటున్నారు.
అననీయాను పాతిపెట్టిన యువకులఅడుగులుదూరం నుండివినపడుతుంది.

జరిగిన విషయమై  ఎవ్వరూ సప్పీరాకు చెప్పలేదు. భర్త ఎదుర్కొన్న పరీక్షను ఆమె కూడా ఎదుర్కోవలసిందే. పేతురు సఫీరాతోమాట్లాడసాగాడు. *మీరు, అంత సొమ్ముకే ఆ స్థలాన్ని అమ్మారా? సత్యం చెప్పమని కచ్చితంగా అడిగాడు* దేవుడు సఫ్పీరాకు మరో అవకాశం ఇస్తున్నాడు. *సప్పీరా తన భర్త అయిన అననీయ కు సహకారిగా ఉండలేకపోయింది* (సామెతలు 31:12).
భార్యగా భర్త మీద ఎలాంటి మంచి ప్రభావం చూపలేక పోయింది. పాపాన్ని ఆపలేక పోయింది. ఫలితంగా తాను కూడా భర్త మరణ విషయంలో అపరాధిగాలెక్కించబడింది
సఫీరా కూడా సాతాను శక్తికి లొంగి పోయింది అందువలననే పేతురు ప్రశ్నకు సమాధానంగా *అవును అంతకే అమ్మితిమని* చెప్పింది.
(అపో.కా. 5:8)
*దైవఆత్మనుపరీక్షించేందుకు నీవును, నీ భర్త ఎందుకు ఈ కార్యము చేయసంకల్పించారు* ? అని పేతురు కోపంతో మండి పడ్డాడు. 
(అపో.కా. 5:9)

💥 అననీయ,సప్పీరాలు తాము చేస్తున్నది  పాపమని తెల్సికూడ ఆ పని చేశారు. *ఆ పాపంతో ఆడుకున్నారు* ఆ *పాప ఫలితంగా సప్పీరా కూడ మరణించింది* అంతలో ఆ యువకులు అక్కడికొచ్చి 
*సప్పీరాను కూడ పాతిపెట్టడానికి తీసికెళ్ళారు*

👉🏾సప్పీరా క్రైస్తవసమాజానికి ఒక భయాన్ని మిగిల్చి పోయింది.
*అననీయ, సప్పీరాలు తేలిక భావంతో చూచిన దేవుడు పరిశుద్ధుడు*

*ఆయనదహించుఅగ్ని*
(హెబ్రీయులు 12:29)

*ఆయనకు ఏ ప్రాణి కూడాదాచిపెట్టబడలేదు* *దేవుని దృష్టికి అంతా* *బహిరంగంగాకనిపిస్తోంది* (హెబ్రీయులు 4:13)

*అననీయా,సప్పీరాల మోసం దేవునికి తేటగా కనిపించింది.వాళ్ళు చేసిన మోసానికి వెల చెల్లించాల్సి వచ్చింది*
*సారాంశము:*
*మనము దేవుని ముందు ఏదియునూ దాచి పెట్టలేము.*

 
2⃣4⃣ ♻ *దైవభయము కలిగిన స్త్రీ*  👰

♻ *పిలాతు భార్య చాలా వుత్తమురాలు దైవభీతి కలిగిన స్త్రీ*
         
యేసుక్రీస్తు సిలువ వేయబడుటకు ముందు అన్యాయపు తీర్పు పొందిన వాడై అధిపతియైన *పొంతిపిలాతుకు*
అప్పగింపబడ్డాడు. ప్రధానయాజకులు,పెద్దలును ఆయన మీద నేరము మోపి పిలాతు నొద్దకు పంపిరి.న్యాయపీఠం పై కూర్చున్న పిలాతు మూఢ నమ్మకం గల పిరికివాడు.
యేసుకు మరణశిక్ష విధించే భాధ్యత తననెత్తిన వేసుకున్నందుకు ఇష్టపడలేదు.

పిలాతు తానే స్వయంగా యేసు నిర్థోషి అని పదే పదే చెప్పాడు.పిలాతుకు *ఆయన యందు ఏ నేరమూ కనబడలేదు*

 తమకు తెలిసిన ఒక వ్యక్తికి శిక్ష విధించ మన్న ఒత్తిడితో కఠిన మనసును  క్రూరత్వాన్ని ప్రదర్శించి 
*తమ చట్టాలకు, దేవుని చట్టాలకు విరుద్దంగా ప్రవర్తించాడు*


*పిలాతు భార్య చాలా వుత్తమురాలు దైవభీతి కలిగిన స్త్రీ*

*ఆపదనుండి తప్పించుకొను జ్ఞానము కలిగిన భార్య*

*కార్యేషు మంత్రి*
ఇది ఒక స్లోకములో చెప్పబడినట్లు భార్య భర్తకు సలహా నిచ్చు సందర్బములో
 *మంత్రివలె వుండవలెనట*.రాజు వద్ద మంత్రి తెలివి గల సలహా నిచ్చుట ద్వారా ఆ రాజ్యము ఎంత చక్కగా పరిపాలించబడుతుందో.

అదే విధంగా సలహాలిచ్చు భార్య కుటుంబములో వున్నట్లయితే 
ఆ కుటుంబము వున్నత స్థితిలో రూపొందుతుంది.

పిలాతు భార్య
 *ఆ *నీతిమంతుని జోలికి పోవద్దు* అని కబురు పంపినపుడు పిలాతు చాలా భయపడివుండవచ్చు.
తాను న్యాయపీఠము మీద కూర్చున్నాడు.
*న్యాయమే తీర్చాలి కానీ అన్యాయపు తీర్పు చెప్పవలసి వచ్చింది*
ఒకవైపు దుష్టులైన ప్రజల ఒత్తిడి, మరొకవైపు భార్య కబురు.ఏమీచేయ లేక పిలాతు 
 *ఆ నీతిమంతుని*
*రక్తమును *గూర్చి నేనునిరపరాధిన*
*అని నీళ్ళు తీసికొని* *చేతులు కడుగు కొని*
వారి ఇష్టమునకు ప్రభువును అప్పగించివేసి
తనకు రావలసిన శిక్ష నుండి తప్పించు కున్నాడు.
కానీ దుర్మార్గులైన 
ఆ ప్రజలు
*వాని రక్తము మా మీదను ,మా పిల్లల మీదను వుండును గాక*
అని తరతరాల వరకు శిక్షకు పాత్రులైరి!
మనము ప్రభువును గూర్చి
వారి ఇష్టమునకు ప్రభువును అప్పగించివేసి
తనకు రావలసిన శిక్ష నుండి తప్పించు కున్నాడు.
కానీ దుర్మార్గులైన
అన్ని తరతరాల వరకు 
శిక్షకు పాత్రులైరి.

👉🏾మనము ప్రభువును ఎన్నిసార్లు అప్పగించుచున్నాము ?
*మనక్రియలవల్లను*
*మనప్రవర్తన ద్వారాను*
*ఎన్నోసార్లు ప్రభువునకు*శిలువ* *వేయుచూ*
*శాపమునకు*
*గురి అవుచున్నామా* ?
ఒకసారి మనలను మనం పరిశీలించు కుందాము.
పిలాతు భార్య పేరు బైబిల్ గ్రంథమందు వ్రాయబడ
లేదు, గానీ పిలాతు భార్యగాపరిగణించ బడుటచే ఆమె చేసిన సత్కార్యములను గురించి బైబిల్ లో వ్రాయబడింది.

తెలివి గల భార్య గురించి
(సామెతలు31:10-31) లో
గుణవతియైన భార్య ముత్యముకంటే అమూల్యమైనది.

పిలాతు భార్య ప్రభువు నీతిమంతుడని కల ద్వారా 
తెలుసుకొన్నది.అంత
మత్రమే కాదు .తన *కుటుంబానికి రావలసిన కీడు నుండి తప్పించుకున్నది*

👉🏾 యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము.

👉🏾 అటువంటి భార్య      దొరికిన వానికి మేలు దొరికెను అని బైబిల్ గ్రంథమందు వ్రాయబడి వుంది . పిలాతు భార్య 
*ప్రభువు నీతిమంతుడని ప్రచురించింది*

అట్టి భాగ్యమును మనము కూడ కలిగి ఆయన కృపను మెండుగా పొందాలని కోరుకుంటున్నాను.


పిలాతు న్యాయపీఠము మీద కూర్చుండి యున్నప్పుడు అతని భార్య 
 "  *నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు* "
*ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను* (మత్తయి27:19)
పిలాతు,రోమా సామ్రాజ్యము  నియమించిన యూదయ గవర్నరు! ఇతడు *పొంతి కుటుంబీకుడు*.
ఇతను గవర్నరుగా నియమింపబడక ముందు  *సైన్యాధికారిగా పనిచేసెను*

ఇతడు కైసరులో కాపురముండెను.ఇది యెరూషలేముకు పశ్చిమోత్తరంగా 47 మైళ్ళ దూరములో వున్న అందమైన నగరము.
కైసరులో గవర్నరుకు బంగ్లా వుంటుంది. సిబ్బంది వుంటుంది.మరియు కైసరయ రోమా దేవాలయములకు,విలాసభవనములకు ,తోటలకు,
ప్రసిద్ది చెందినది.
*పిలాతు హోదాలో మంచి అధికారము కలిగిన స్థితిలో వున్నాడు*

*పిలాతు భార్యపేరు బైబిల్లోవ్రాయబడలేదు*

 గానీ ఆమె పేరు  *ప్రొకులా అని చరిత్ర చెప్పుచున్నది.ఈ పిలాతు భార్య గొప్ప అధికారికి పత్నిగా వున్నప్పటికి, అనేక ఆడంబరాల మధ్య నివాసం చేస్తున్నప్పటికీ 
*సువార్తవినుటకు ఆశక్తి కలిగినదిగా వున్నది*
ఈమె రోమా దేవాలయము లను,విలాసభవనాలను, కాలక్షేపము చేయుట యందు,ఆనందించే వ్యక్తిగా కనబడలేదు.
*గానీ దేవుని వెదికే వ్యక్తిగా వున్నది*
*ఆమె యేసుక్రీస్తును గురించి వినినప్పుడు ఆయన బోధ వినే గుంపులో వుండెడిదని చరిత్ర చెబుతున్నది*

*యేసుక్రీస్తు బోధ వినిన ఈమె  నీతిమంతుని గానూ,రక్షకునిగానూ గుర్తించినది* కనుకనే తీర్పు తీర్చబడుటకు యేసుక్రీస్తు పిలాతు ముందున్నాడని ఎరిగి నప్పుడు  
*నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు  ఈ ప్రొద్దు* *ఆయనను గురించి కలలో* *మిక్కిలి* *బాధపడితినని*,
*అతని యొద్దకు* *వర్తమానము పంపెను*

*ఆమె క్రీస్తును రక్షకుడుగా నీతిమంతుడుగా గుర్తించుటయే గాక*
న్యాయపీఠము మీద కూర్చున్న తన భర్తకు ఆ సంగతి తెలియజేసే *ధైర్యశాలిగా* ఉన్నది.
ఈ పిలాతుభార్య భయంకరమైన శిక్షకు గురి కాకుండునట్లు,యేసుక్రీస్తుజోలికి పోవద్దని హెచ్చరించెను.పిలాతు భార్య *లేఖనములు ఎరిగినది*  కనుక సర్వలోక పాప పరిహారము నకై క్రీస్తును శిలువకు అప్పగించిన కారణముగా యూదా ప్రజలు హింసించునట్లు తన కర్తయైన పిలాతును బట్టియే జరుగునని ; తద్వారా తన కుటుంబమునకు శాపము కలుగునని కల ద్వారా తెలుసుకున్న పిలాతు భార్య కలవరపడింది.


*పిలాతు భార్యయొక్క లక్షణాలు*
 *ఆమె ఉత్తమరాలుగా , దైవభీతిగల స్త్రీగా కనబడుచున్నది*
తన మనవిని అంగీకరించునా?లేదా? అని పిలాతు భార్య ఆలోచించలేదు. గానీ
సంగతి తెలియజేయుట 
*తన భాధ్యత* అని గుర్తించింది.
*తన భర్తను,తనను,తన కుటుంబమును ఘోర ప్రమాదము నుండి తప్పించుకొనుటకు పాటుపడింది*

పిలాతు తన భార్య సలహా మేరకు, తాను తీర్చిన తీర్పు మేరకు *యేసుక్రీస్తు నిర్థోషి*  అని గుర్తించి ;
యేసుక్రీస్తును విడిపించ దలచెను గానీ   *ప్రజలకు భయపడి తన పదవి పోవునేమోనని విచారించెను*

పోవునేమోనని విచారించెను.అయితే పిలాతు  *అల్లరి ఎక్కువగు చున్నదే గానీ తన వలన ప్రయోజనమేమియూ లేదని గ్రహించి, నీళ్ళు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని 
*ఈ నీతిమంతుని  రక్తమును గూర్చి నేను నిరపరాధిని,మీరే చూచుకొనుడని చెప్పెను* 
(మత్తయి 27:24 )
గానీ తన హృదయమును 
కడుగ గలిగిన క్రీస్తు రక్తమందు విశ్వాసముంచ లేదు.కనుక పిలాతు చివరికి పిచ్చివాడై ఆత్మహత్య చేసుకొని చచ్చెనని చరిత్ర చెప్పుచున్నది.
అయితే     
*పిలాతు భార్యయైన* *ప్రొకులా మంచి*
*క్రైస్తవరాలిగా మారినట్లు* చరిత్ర చెప్పుచున్నది*

కనుకనే *పిలాతు భార్య క్రీస్తును గురించి సాక్ష్యమిచ్చి కొనియాడబడిన స్త్రీలలో చేరినది*
సేకరణ:
*శ్రీమతిజె.విమలకుమారి*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...