ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిల్ నందలి స్త్రీలు ఎనిమిదవ భాగము

✳ *బైబిల్ నందలి స్త్రీలు* ✳


  (ఎనిమిదవ భాగము)


 1⃣2⃣ 🌹  *హుల్దా*  🌹  


*దైవ విరుద్దమైన దేశాన్ని దేవునివైపుమళ్ళించడంలో   సాయపడ్డ స్త్రీ*


*హుల్దా ఓ ప్రవక్త్రి* దేవుని చేతిలో బూరగా వాడబడ్డ స్త్రీ.ఆమె ఓ గృహిణి అవ్వడం వల్ల , లభించిన

*ప్రత్యేకపిలుపు*.

ఆమెను సమాజానికి ఆవల వుంచలేదు.

*హుల్దా* *అంటే ముంగిస అని అర్థము*

అయినా  అదృష్టవశాత్తు 

ఆమె తన స్వభావంలో ఈ భావాన్నిఅలవర్చంకోలేదు.సిగ్గుతో ముడుచుకుపోయే అడవి పిల్లి లాంటి కళ్ళుగల చిన్న జంతువును పోలిన గుణాలేవీ ఆమె జీవితంలో కనబడవు.

తన ఒప్పింపు ప్రకారము ధైర్యముగా మాట్లాడ గల

నిర్భయంగా కార్యాచరణ లో పెట్టగల మనుష్యులు *హుల్దా* నాటి రోజు ల్లో అవసరమయ్యారు.


యోషీయా రాజు యొక్క వస్త్రశాల అధికారియైన 

*షల్లూముభార్యహుల్దా*

వివాహితగా ఆమె తన భర్తను అనుదినం అనురాగంగా చూచుకొంది.

పిలుపును ఆచరణలో పెట్టేందుకు ఆమె వివాహం ఆటంకం కాలేదు. రెండు

బాధ్యతలను అవినాభావ సంబంధమున్నట్లుగా ఆమె 

గమనించింది.

అదే సమయంలో ఇశ్రాయేలులో మరి 

*ఇద్దరు మగ ప్రవక్తలు వున్నారు.వారు* *యిర్మీయా,జెఫన్యాలు*

(యిర్మియా25:3-7)

(జెఫన్యా 1:1-67) 

వీరు దేవుని తట్టు తిరగమని ప్రజల్ని ప్రాధేయ 

పడు తున్నారు.

ఇశ్రాయేలీయులు దేవుణ్ని

విడిచిపెట్టారు.వాళ్ళింకెంత మాత్రమూ వాళ్ళకు విధేయత చూపడం లేదు.

మొదట్లో దైవభీతిగల మంచిరాజుల పాలనలో ఉన్నంతకాలం బాగా జరిగిపోయింది.యెహోవాకు యధార్థంగా జీవించిన దావీదు రాజు పాలనలో దేవుడు ఇశ్రాయేలును బహుగా ఆశీర్వదించాడు.

ఆ తర్వాత భక్తిప్రపత్తులకు మారుపేరైనసొలొమోను పాలనలో ఇశ్రాయేలు పేరు 

లోకమంతా వ్యాపించింది.

సొలొమోను రాజు గొప్పజ్ఞాని.ఇతడు 

దావీదు రాజు కుమారుడు.

తర్వాత కాలంలో ఇశ్రాయేలీయులు 

క్రమ క్రమంగా ఆధ్యాత్మికంగాచెడిపోయారు.వీరంతా ఇష్టపూర్వకంగానే విగ్రహారాధికులయ్యారు.

అయిష్టంగా ఎవ్వరూ చెయ్యలేరు.

(2దినవృత్తా33:1-25)


ఆలయనిర్మాణానికి కొద్దిదూరంలోనే *హుల్దా* *న్యాయస్థానాన్ని ఆరంభించింది* యెరూషలేములో నూతన భాగమైన ఆ ప్రదేశంలో ప్రతి

రోజూ ఆమె ప్రభువును గూర్చి సలహాలను ఇస్తూవుండేది.


ఇశ్రయేలీయులు ఎంత దిగజారి పోయినా దేవుణ్ణి విచారించే ప్రజలు కొద్దిమంది అయినా వున్నారు.

*హుల్దా* తన విధుల్ని నిరాటంకంగా, బహాటంగానూ, నిర్వహిస్తోంది.ఇతర ప్రవక్తలు దాచుకున్నట్లు *హుల్దా* దాచుకోనవసరం లేకుండపోయింది.

అనేక సంవత్సరాలతర్వాత మొట్టమొదటిసారిగా దేవుణ్ణి ప్రేమించి సేవించిన రాజు యూదారాజుగా వచ్చాడు.

*అతడుయోషియారాజు*

ఇతడు పితరుడైన దావీదు అడుగుజాడల్లో నడిచి దైవశాసనాన్ని జాగ్రత్తగా పాటించి వాటినుండి దూరంకాలేదు.నిస్సందేహంగా తన ప్రభావంవల్లనే తనకు దేవుని యెడల ఇంతటి *సమర్పణా జీవితం అలవడింది*


యూదా రాజైన యోషీయా

 ఆలయ మరమ్మత్తులకై పనివారిని నియమించి తప్పుడు దేవతల బలిపీఠాన్ని పడద్రోసి, విగ్రహాల్ని చూర్ణంచేసి ఆ దేశాన్ని శుభ్రపర్చ నారంభించాడు.


మరమ్మత్తులకు అవసరమైన డబ్బు వెలికి తీస్తుండగా *మోషే ధర్మశాస్త్రం ఆలయంలో *ప్రధాన యాజకుడైన హిల్కీయాకు*  దొరికింది.

(2దినవృత్తా 34:14,15)


నూతనంగా కనుగొన్న గ్రంథం విషయంలో దైవచిత్తాన్నికనుగొనేందుకు 

మనుష్యులు హుల్దా దగ్గరకు వచ్చారు. దేవుని వాక్యం ప్రచురించేందుకు

పురుషులు ఆయనను ఎక్కువకాలం సేవించారు.

*ఇప్పుడాయన ఒక స్త్రీని ఉపయోగించుకుంటున్నాడు* ఓ స్త్రీగా ఆమె పురుషులతో పోటీపడడం 

మంచిదికాదని సరిగ్గా భావించిన హుల్దా.

*ఆమె స్త్రీ అయినందువల్ల*

*తన బాధ్యతల నుండి తప్పించుకొనే ప్రయత్నం*

*చేయలేదు*

తన సాధనంగా

పనిచేయగల వ్యక్తికోసం* దేవుడు కనిపెడ్తున్నాడు.

యెహోవా *స్తుతింపబడతాడు*

నూతనంగా కనుగొన్న గ్రంథం విషయంలో దైవచిత్తాన్నికనుగొనేందుకు 

మనుష్యులు హుల్దా దగ్గరకు వచ్చారు. దేవుని వాక్యం ప్రచురించేందుకు

పురుషులు ఆయనను ఎక్కువకాలం సేవించారు.

*ఇప్పుడాయన ఒక స్త్రీని ఉపయోగించుకుంటున్నాడు* ఓ స్త్రీగా ఆమె పురుషులతో పోటీపడడం 

మంచిదికాదని సరిగ్గా భావించిన హుల్దా.

*ఆమె స్త్రీ అయినందువల్ల*

*తన భాద్యతల నుండి  తప్పించుకొనే ప్రయత్నం*

*చేయలేదు*

*తనసాధనంగా*

*పనిచేయగలవ్యక్తికోసం* *దేవుడుకనిపెడ్తున్నాడు*

*యెహోవాస్తుతింపబడతాడు* 

అనిహుల్దా భావించింది.

రాజు దొరికిన గ్రంథాన్ని లెక్కచేయక గ్రంథాలయం లో పెట్టాడు.


💥 కనుగొనబడ్డ గ్రంథ ప్రాధాన్యతను గుర్తించి *హుల్దా ఏమీ దాచకుండ ఆమె పెదవుల మీదుగా దేవుడేమాట్లాడుతున్నందు వల్ల* 

ఆమె వ్యక్తుల్ని లెక్కలోకి తీసుకోలేదు.

ప్రవక్త్రినిగా ఆమె చెప్పే విషయాలకు విలువ వస్తుంది.(2దినవృ34:23-24)


దేశం ,జాతి మొత్తం సర్వనాశనం కాబోతున్నట్లు

ఆమె ప్రవచించింది.

వారు దైవవాక్యాన్ని విరోధం చేసి దేవునికి విరోధులయ్యారు.


ఏదిఏమైనా చివరితీర్పు తప్పలేదు.ఇశ్రాయేలీయులనేక తరాలవాళ్ళు భావభరితమైనపాపంచేరు.         *హుల్దాకాలం నాటి* *ప్రజలు అనేక* *సంవత్సరాలు దైవకృప పొందారు*


💥  *హుల్దా పేరు చరిత్రలో వెలిగించింది*

ఆమె జీవిత ప్రభావం చాలా దూరం వెళ్ళింది.

ఆ పేరుతో *దైవవాక్యాన్ని  బోధించడంతో దేశ రాతనే స్వాధీనంలో వుంచింది*.


 💥 హుల్దాకు దేవుని వాక్యం తెల్సు అందువల్ల ఆమె ఇతరులకు ఆ వాక్యాన్ని బోధించి ప్రోత్సహించింది.


💥 ఇతర ప్రవక్త్రీ, ప్రవక్తల్లా

హుల్దా  భవిష్యత్ విషయాలనుగూర్చిఅందలి

రహస్యాలను గూర్చి 

బహిర్గతం చేయలేదు.

తరతరాలుగా దేవుడు వినియోగించిన విధానంలో 

దైవచిత్తాన్ని తెలియజేసే పనిలో  ఆమె నిమగ్నమై పోయింది. ఇశ్రాయేలు ప్రజలకు, ఇశ్రాయేలు దేశానికీ  దైవ చిత్తాన్ని 

ఆమెఆపాదించింది.

పోగొట్టుకున్నసత్యాల్న్తితిరిగీ కనుక్కోవడంతో ఆమె ప్రజలతో సహకరించింది.

ప్రజలు దైవవాక్యంలో ఆసక్తి చూపుతూ,ఆ వాక్యాన్ని వింటూ,చదువుతూ,

పఠిస్తూ ధ్యానిస్తూవుంటే అద్బుత కార్యాలు జరగనారంభించాయి.


💥 అందరు స్త్రీలలాగ *హుల్దా ఒకస్త్రీమాత్రమే*

అయినా దేవుని వాక్యం పట్ల ఆమె సమర్పణ. దానికికట్టుబడిఉండేందుకు *ఆమెలో ఉన్న ధైర్యం పురుషుల్నిఅధికమించేట్లు చేశాయి.*

ఆమె జీవితంలో అవకాశం ప్రజ్వరిల్లినప్పుడు ఆమె సిద్దంగా వుంది.


💥ఓ స్త్రీగా పురుషులతో పోటీపడడంమంచిదికాదని సరిగ్గా భావించింది హుల్దా.

ఆమె స్త్రీ అయినందువల్ల తన బాధ్యతల నుండి తప్పించుకొనే ప్రయత్నం చేయలేదు.

*తన సాధనంగా పనిచేయగల వ్యక్తికోసం దేవుడు ఎన్నుకున్న స్త్రీ ఈమె*


💥 యెరూషలేములో హుల్దా న్యాయస్థానాన్ని ఆరంభించి ప్రతిరోజూ ఆమె

ప్రభువును గూర్చి సలహాలను ఇస్తూవుండేది.


💥 తన విధులను నిరాటంకంగానూ బహాటంగానూ నిర్వహించింది.ఇతర ప్రవక్తలులా ఒత్తిడులను దాచుకున్నట్లు హుల్దా దాచుకో నవసరం లేకుండ పోయింది.

👉🏾  *దైవ  విరుద్దమైన*

       *దేశాన్నిదేవునివైపు*

         *నడిపించడంలో*

         *సహకరించిన స్త్రీ*

  (2దినవృత్తా 34:23,24

      34:1-21 ;   35:1-19)


1⃣3⃣ 🙍🏻‍♀🌺 *రాహాబు* 🌺🙍🏻‍♀


రాహాబు అనే పేరుకు

అర్థం *గర్వం* లేక విశాలత అని అర్థం.యెరికో పట్టణంలో *వేశ్యగా జీవితాన్ని గడిపిన(* అన్యురాలు రాహాబు

ఈమె తన ఇల్లు అందరికీ కన్పించే విధంగా పట్టణ ప్రాకారం మీద నిర్మించు కుంది.స్వేచ్చగా విచ్చలవిడిగా జీవితాన్ని గడిపింది.ఎలాంటి వారినైనా చేర్చుకోగలిగిన గృహం రాహాబుది.

ఇలాంటి రాహాబు ఇశ్రాయేలీయుల జీవంగల *దేవుడైన యెహోవా తన ప్రజల పక్షముగా చేస్తున్న అద్బుత కార్యాల గురించి* విని ఆయనే *నిజమైన దేవుడని* *నమ్మి,ఆయనపై ఆధారపడి,దేవుడు తన కిచ్చిన  ఒకే ఒకే* *అవకాశాన్ని సద్వినియోగ పరచుకొని,రక్షింపబడి యేసు వంశావళిలోనే స్థానం పొందగలిగిన* *ధన్యురాలైంది*


💥 *యెరికోలోవేశ్యగా*

 *జీవించిన రాహాబు*

(యెహోషువ2:1)

యెరికో అనే మాటకు *సువాసన గల స్థలము* అని అర్థం.

యెరికో పట్టణం మోసకరమైన జీవితానికి 

సాదృశ్యంగా ఉంది.

రాహాబు జీవితంకూడ అలాగే వుంది.పైకి అందంగా ఆకర్షనీయంగా వుంది.యితే లోపల ఆమె హృదయం చెడి పోయింది.

రాహాబు పూర్తిగ లోక సంబంధి1యోహాను2:16) 


          తనది కాని దానిని అశించే హృదయం ఆమెది.

ఇతరుల పతనంతో తన్ను  ఎదిగించుకొనే జీవిత విధానం ఆమెది.ఆత్మను గూర్చిన చింతలేని జీవితం ఆమెది.

*రాహాబుజీవితవిధానం;*-పని చేసి కష్టపడి సంపాదించకుండానే  సుఖమయ జీవితాన్ని గడిపిందామె. అందువల్ల తననుతాను మోసగించుకొని కఠిన హృదయం కలిగి దేవునికి దూరస్తురాలై జీవించిం దామె.లోకాధిపతి బయల్జెబూబు చేతిలోని కీలు బొమ్మయై తన జీవితంలో దేవునికి చోటివ్వని స్త్రీ ఆమె.


💥   *జీవం గల దేవునికి                 భయపడిన రాహాబు*

(యెహోషువ2:1-24)

యెహోషువ యెరికోను వేగు చూడటానికి ఇద్దరు మనుషులనుపంపించాడు.

ఆ దేశ 

సైనిక బలాన్నీ,

ప్రజల్నీ, 

భూములనూ,

 సంపదల్నీ,

అంచనా వేయడంవారిపని.

వేగు చూసి ఆ దేశం మీదికి దండెత్తి దాన్ని స్వాధీనం చేసుకోవాలని వారి ఉద్దేశం.

క్రొత్త ప్రదేశమైన ఎరికోలో సులభ ప్రదేశం దొరికేది రాహాబు దగ్గరే. కాబట్టి ఆ వేగులవారు రాహాబు దగ్గరకు వెళ్ళారు.

అయితే రాజుకు  విషయంతెలిసింది.వారిని

పట్టివ్వమని రాహాబుకు కబురు పంపాడు.అయితే దేవునికార్యాలనువిని యెహోవాకుభయపడిన రాహాబు దేవుని ప్రజలకు సహాయపడాలని తలంచి వారిని మిద్దెమీద జనుప కట్టెలో దాచి పెట్టింది.

   💥        *దైవజనులను తప్పించిన రాహాబు*

మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే వారెక్కడి నుండి వచ్చిరో నేనెరుగను చీకటిపడు చుండగా గవిని వేయబడు ఆ మనుష్యులు వెలుపలకు వెళ్ళిరి.

వారెక్కడికి వెళ్ళిరో నేనెరుగను.మీరు శీఘ్రముగా తరిమితిరా... పట్టుకొందురు(యెహోషువా 2:4-5) అని చెప్పింది.

తరుమవచ్చిన వ్యక్తులు వెళ్ళి పోయిరి.

*జీవం గల దేవుడు యెహోవా*

 ఇశ్రాయేలీయుల పక్షాన వున్నాడని గ్రహింంచిన తన శక్తి మేర వారికి సహాయ పడాలని తలంచింది అయితే రాహాబు అబద్దము చెప్పింది

   💥         *రక్షణ పట్ల ఆశక్తి కలిగిన రాహాబు*

యెరికోను ఆక్రమించుకోనున్న ఇశ్రయేలీయుల చేతిలో నుండి వారు తప్పించబడాలని,నాశనం నుండి తాను రక్షించ బడాలని కోరింది రాహాబు.

గవిని తలుపులు వేయబడిన తర్వాత రాహాబు తాను దాచిన మనుషుల యొద్దకు వచ్చి

*మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును‌ క్రింద భూమి యందునూ దేవుడే*.....అంటోంది.

(యెహో2:11) ఆయన ముందు ఎవరికీ ధైర్యం ఉండదు.

యెహోవా ఈ దేశం మీ కిస్తారనినాకుతెలుసు.మీ

వల్ల మాకు భయం కలుగుతోంది.

నేను మీకు ఉపకారం చేశానుకదా! దాన్ని బట్టి నన్నూ,నా తల్లిదండ్రులను,

నా అన్నదమ్ములను రక్షించండి.అని వేడుకొంది.


కుటుంబమంతా రక్షింపబడాలనే  రాహాబు కోరిక ఎంత ఉత్తమమైనది.


💥           *రక్షణ మార్గాన్ని అంగీకరించిన రాహాబు*


తమను దాచినందుకు గాను ఆమెను ఆమె కుటుంబాన్ని *కాపాడతామని వేగులవారు ఆమెకు* *వాగ్దానం చేశారు.*

ఆ ఇంటి కిటికీకి ఎర్రని దారం కట్టుకో మని చెప్పినారు.వెంటనే రాహాబు కిటికీకి ఎర్రని దారంకట్టింది(యెహో2:21)

నిజానికి వారు సైన్యంతో దండెత్తి రావడానికి సమయం పడుతుంది.అయితే నాశనదినం వచ్చేదాక రాహాబు తన సమయాన్ని వ్యర్థ పరచక రక్షణ మార్గాన్ని వెంటనే అమలు జరిపింది.

*దేవుడు ఇశ్రాయేలీయులను యెరికోకు అప్పగించిన రోజున రాహాబు కుటుంబీకులు రక్షింపబడ్డారు*.మిగతా పురుషులు,స్త్రీలు,పిల్లలు,

పశువులు చంపబడి ఆగ్నితో కాల్చబడ్డారు.అయితే ఎర్రదారం కట్టిన రాహాబు ఇంటివారందరూ పట్టణం వెలుపలకు తీసుకు రబడ్డారు

💥       *నీతిమంతురాలిగా  *ఎంచబడిన రాహాబు*

అటువలెనే రాహాబను వేశ్యకూడ  దూతలను చేర్చుకొని వేరొకమార్గమున వారిని వెలుపలకు వేసినపుడు *క్రియల మూలముగానీతిమంతురాలని ఎంచబడెను*

(యాకోబు2:25) 

ఒకవేళ నీవు ప్రభువునుఅంగీకరించి రక్షించబడిన స్థితిలో వుంటే...........రాహాబును దేవుడు మనకు మంచి మాదిరిగ వుంచాడు.


💥  *క్రీస్తు వంశావళి లోనికి చేర్చబడిన రాహాబు* (మత్తయి1:5)

తరువాతి కాలంలోరాహాబు

శల్మాను అనే ఇశ్రాయేలీ

యుని వివాహమాడి బోయజు అనే కుమారుని పొందింది.బోయజు ఓబేదును,ఓబేదు యెష్షయిని,యెష్షయిదావీదును కన్నాడు. 

*మన రక్షకుడు*, *విమోచకుడు,మన కోసం ప్రాణం పెట్టి ,తిరిగి మూడవ* *దినానమరణాన్ని*

*సమాధినిగెలిచి లేచిన* *యేసు*ఈ దావీదు* *వంశంలోనుండేవచ్చాడు*

*రాహాబు ఎంతధన్యురాలు*

*యెహోవాను ఆశ్రయించి రక్షింపబడి హెచ్చింప* *బడింది*


సేకరణ:

*శ్రీమతిజెవిమలకుమారి*

☦ *సంపూర్ణస్వస్థత*  ☦    


సేవకుడొకరికి తీవ్రమైన గుండెపోటువచ్చింది.

అతడు మరణముతో పోరాడు చుండిననూ అత్యాశతో విశ్వాసము గలవాడై ప్రార్థించెను. తరువాత స్తుతించ సాగెను. ప్రభువు తాను పొందిన గాయములచే 

స్వస్థపరచెనని పూర్తిగా విశ్వాసముతో వుండెను.


అయినను అతనికి చెమట కారుచుండెను.నిద్రించు సమయము వచ్చినపుడు సాతాను అతనితో *నీవు నిద్రపోవద్దు ,నిద్రలోనే ప్రాణం పోతే ఏమౌతుంది ? 

వీలునామా వ్రాయవద్దా ?

నీ బిడ్డలతో చివరి సారిగా మాట్లాడవద్దా ? అని చెప్పు చుండెను.



సేవకుడైతే -నేను ప్రభువు యొద్ద ప్రార్థించి యున్నాను 

నా విశ్వాసము ఆయన యందున్నది *నేను స్వస్థత నొందితిని*. అనే నిరీక్షణతో 

నిద్రపోవు చున్నాను కనుక 

దేనిని గూర్చియూ కలవరము నొందననెను.


ఆ ప్రకారమే పసిపిల్లవానివలె నిద్రించి తెల్లవారి సంపూర్ణ ఆరోగ్యముతో లేచెను.నేటి వరకు అతను మంచి బలముతో సేవచేయు చున్నాడు.


*మీరుప్రార్థనచేయునపుడు* 

*వేటిని అడుగుదురో అవి *దొరికినవనినమ్మినయెడలమీరు వాటినన్నిటిని* *పొందుదురు*

మత్తయి21:22, మార్కు9:23, 10:52 

యోహాను10:40

మార్కు11:23


1⃣4⃣ 🌹  *ఘనురాలు* 🌹


షూనేముపట్టణంలో 

ఘనురాలైన ఒక స్త్రీని గురించి  వ్రాయబడింది.

ఆమె పేరు అక్కడ ప్రస్తావించలేదు.గానీ

*ఘనురాలుగా* ఆమె పిలువబడినట్లు చూడగలం

2 రాజులు 4;8-37 వచనాలు చదివితే తెలుస్తుంది.


ఒక రకంగా ఈమెది కూడ శారా పరిస్థితే ముసలివాడైన భర్త, బిడ్డలు లేని పరిస్థితి .అయినా తాను చేసిన పనులు గమనిస్తే ఆమె ఎందుకు *ఘనురాలు అనిపించు కుందో* అర్థం అవుతుంది.

*తనభర్తతో సంప్రదించ*

*కుండా,చెప్పకుండా*

*ఏమీచేయుట లేదు*

(2రాజులు4:9,10,22,23)

ఈ వచనాలలో చూస్తే

*తను దైవభక్తి గలస్త్రీగా*

*అర్థమౌతుంది*


తను ఏమీ ఆశించకుండా

*దైవజనుడైన ఎలీషాకు శ్రేష్ఠమైన బసను ఏర్పాటు చేసింది*

ఎలీషా ఏమి ప్రతిఫలం కావాలని అడిగినా కూడ *తనకు వున్న లోటును బయట పెట్టలేదు* అంటే

నిజానికి తనకు బిడ్డలు లేని లోటు ఒకటి వుంది.

అయినా దానికి  పదేపదే బయటకు చెప్పి తను కుమిలి పోవుట లేదు.

తను కలిగి ఉన్నవాటిని బట్టి తృప్తికలిగి ఉంది.

ఎలీషా అడిగినప్పుడు

తనకు ఏ లోటూ లేదు.

అని చెబుతుంది.(4:13,28)

*ఎంత తృప్తికరమైన జీవితంకలిగి వుందో కదా !*


*తను ఎంత నిబ్బరం కలిగిన స్త్రీ*

తన కుమారుడు చనిపోయాడని తెలుసు,

ఎవరి ప్రార్థన ద్వారా తను కుమారుని పొందుకుందో 

ఆ వ్యక్తి  దగ్గరకే నేరుగా వెళ్ళింది.

*నీవు ఆమెను ఎదుర్కొను టకై పరుగున పోయి *నీవును నీ పెనిమిటియు*

*నీ బిడ్డ యు సుఖముగ* *వున్నారా అని అడగమని తన పనివాడైన గెహజీతో*

*చెప్పి పంపెను* (4:26)

ఎదురు పడిన గెహజీకి కూడ సంగతి చెప్పి కలవర పెట్టలేదు.నేరుగా ఎలీషాను చేరి *అతని *పాదాలుపట్టుకుంది*

*ఎక్కడ సమాధానం దొరుకుతుందో ఎక్కడ *సమస్య పరిష్కరింప బడుతుందో తనకు తెలుసు*

 *ఎంత జ్ఞానం కలిగిన స్త్రీయో కదా*!!?



👉🏾 *తనుపట్టుదల*

         *కలిగినస్త్రీ*

**********************

యెహోవా జీవముతోడు 

నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా 

అతడు లేచి ఆమెతో కూడ పోయెను.తన సమస్య పరిష్కరింపబడే వరకు ఎలీషాను విడిచి పెట్టలేదు.


*స్వయంగాఎలీషావచ్చితన కుమారుణ్ని బ్రతికించే వరకు ఎలీషాను పట్టుకుంది*


 *తన సమస్యను* 

*చాక చక్యంగా*

*పరిష్కరించుకుంది*


👉🏾 *తను కృతజ్ఞత కలిగిన స్త్రీ*

ఎలిషా కాళ్ళమీద సాష్టాంగపడి తన కృతజ్ఞత

చెప్పింది. 


👉🏾మన సమస్య పరిష్కరింపబడిన తరువాత మనము కృతజ్ఞత కల్గి ఉంటున్నామా ?

*మీ కొరకు ప్రార్థించే సేవకులను పట్టించు కుంటున్నారా* ?

(2రాజులు4:9,10)


ఆమె తన భర్తను చూచి....

మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు 

భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. కావున మనము అతనికి గోడమీద ఒక చిన్న గది కట్టించి ,అందులో అతని  కొరకు మంచము,బల్ల,పీట,

దీపస్తంభమునుంచుదము.

అతడు మనయొద్దకు  వచ్చునప్పుడెల్ల అందులో బస చేయవచ్చని చెప్పెను.


సమస్య వచ్చినపుడు కన్నీరు రావడం సహజం

అయితే 

*ఆ కన్నీరు దేవుని*

*సన్నిధిలో కార్చాలి*

*అప్పుడు నీ కన్నీటికి విలువ వుంటుంది*

(కీర్తనలు 56:8)

పట్టుదల కలిగి వుండటం మంచిదే అయితే మంచివాటి కొరకు శ్రేష్టమైన వాటికొరకు పట్టుదల కల్గి వుండాలి.విరోధమైన వాటికొరకు కాదు.

*మంచిజరిగినా*,

*చెడుజరిగినా*

*కృతజ్ఞతకల్గి*వుండాలి* (కీర్త103:1,2)(ఫిలిప్పు4:6)


షూనేమీయురాలైన స్త్రీ వలె మనము కూడ అటు

వంటి మనసు కల్గి 

*దేవుని దృష్టిలో*

*ఘనురాలు* అనిపించు కొనుటకు పరిశుద్దాత్ముడు 

మన అందరికీ సహాయం చేయును గాక ఆమెన్.

సేకరణ:

*శ్రీమతిజె.వివిమలకుమారి*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...