✳ *బైబిల్ నందలి స్త్రీలు* ✳
(నాలుగవ భాగము)
4⃣ 🌹 *రెబ్కా* 🌹
*ఓ శక్తిమంతమైన స్త్రీ*
రెబ్కా నాహోరు రక్తసంబంధియైన బెతూయేలు కుమార్తె.
హారాను పట్టణ నివాసి.
అబ్రాహాము మరీ వృద్దుడై తన కుమారుడైన *ఇస్సాకు* వివాహానికి అవసరమైన అన్నింటినీ సిద్దంచేయనారంభించినాడు.
పెండ్లి కుమార్తెను వెదకి వుంచాడు.తన ఇంటిని నడిపించే నమ్మకమైన దాసుడు ఎలియాజర్ని ఈ పని మీద నియమించాడు.
అతడుఅబ్రహాముస్వదేశమైన *మెసపొటోమియాలోని హారాను పట్టణానికి* వెళ్ళాడు.ఒడిదుడుకులు లేని వివాహ జీవితానికి
రక్తసంబంధుల అమ్మాయి సరిపోతుందని అనుకున్నాడు అబ్రాహాము.
ఒకవిధమైనమనస్తత్వం,
అవగాహనా శక్తి వాళ్ళకు వుంటుందని ఆశించాడు.
అబ్రాహాము కానాను ప్రజలమధ్యనివసిస్తున్నప్పటికీ ఓ కానాను స్త్రీని ఇస్సాకుకు భార్యగా చేయడానికి ఒప్పుకోలేదు.
(ఆది.కా.9:22-27)
వాళ్ళు అన్యులు,ఇస్సాకు దేవుని ఆరాధించరు.
*అవిశ్వాసిని వివాహం చేసుకోవడందేవునిదృష్టికి సరైనవిషయంకాదు*
2కొరింథి 6:14)
దేవుడు ఇస్సాకుకు భార్యను ఏర్పాటు చేసి వుంచాడని అబ్రహాము నమ్మాడు యావదాస్తిని కుమారుని కివ్వగలడు కానీ
*భర్తను సరిగ్గా అర్థము చేసుకొని మసలుకోగల భార్యను ఇవ్వాల్సింది దేవుడే*
*ఓ గుణవంతురాలైన భార్య దేవుని హస్తాలనుండివచ్చే ఆశీర్వాదం,బహుమానం*(సామె19:14, 18:22)
అబ్రాహాము తన కుమారునికి
సరైన స్త్రీని వెదికేందుకు దేవుడు తన దూతను ముందుగా పంపుతాడనే
వాగ్దానంతో తన దాసుడు ఎలియాజరును
ఉత్సాహపరచి పంపాడు
(ఆది.కా 23:20)
550 మైళ్ళదూరం ప్రయాణం చేసి *అబ్రాహాము తమ్ముడైన నాహోరు కాపురమున్న హారాను పట్టణము* చేరుకున్నాడు.ఆ సేవకుడు ఆ స్థలం చేరుకున్న వెంటనే
మొదట సహాయం చేయమని దేవునికి ప్రార్థించాడు.ఆ తర్వాత
జనసమ్మర్థమున్న బావి
దగ్గరకువెళ్ళాడు.
ప్రొద్దుక్రుంకు తోంది. అప్పుడే స్త్రీలు నీళ్ళు చేదుకోవడానికి వస్తారు.
ఎలియాజరు సులభంగా తెలుసుకోవడానికి
ఓ గుర్తుకోసం ప్రార్థించాడు.
*ఏ చిన్నది నాకూ నా ఒంటెలకు నీళ్ళు*
*పోయడానికి ముందు* *కొస్తుందో ఆమె ఇస్సాకుకు*
*నిర్ణయించిన భార్య* ఈ ప్రార్థన అతని కార్యదీక్షకు
తార్కాణంగా నిలిచింది.
అతని ప్రార్థనకు జవాబుగా ఆ చిన్నదాని స్వభావము కూడ తెలుస్తయని అతడు ఊహించాడు.
పది ఒంటెలకు నీళ్ళు చేదడమంటే చిన్నపనికాదు
అవసరమైనశరీరబలం,మంచిఆరోగ్యం కావాలి.
దేవుని వాగ్దానుసారం ఎంతో మందికి తల్లి కావల్సిన ఈమె ఆరోగ్యవంతురాలం,
శక్తిమంతురాలై వండాలి.
💥 రెబ్కాకున్న మరో స్వభావం *స్నేహభావం,సేవాశక్తి ఇస్సాకు భార్యకు అవసరం* ఆమె భర్తతో చేయవలసిన దాంపత్య జీవితములోతన నిపుణత,
సమర్థతఉపయోగపడతాయి. అబ్రహాము సేవకుడు తననుతాను ప్రార్థన ముగించకముందే ఓచిన్నది
నీళ్ళకడవ భుజాన వుంచుకొని తన కళ్ళ ఎదుటనిలువబడింది.
ముక్కుపచ్చలారని యువతి .
*ఇస్సాకుకు పెండ్లికుమార్తె లభించింది*
ఒంటెలన్నీ తృప్తిగా నీళ్ళు తాగేందుకు చాలా సమయంపట్టింది.పనికాగానే బంగారుబహుమానాల్ని ఆమెకు అందించాడు.అతని ప్రార్థనలో అబ్రాహాము పేరువినగానే పరిగెత్తుకెళ్ళి ఇంట్లో చెప్పింది.
కుటుంబస్థులు రిబ్కాతో
*ఆమనిషితోవెళ్తావా?* అన్నప్పుడు *వెళతాను* అని సమాధాన మిచ్చింది.
నాహోరు సహోదరుడు అబ్రాహాము ప్రదర్శించిన విశ్వాసములో కొంత నాహోరు మనుమరాలైన రిబ్కా ప్రదర్శించింది.
దేవుని చిత్తాన్ని గ్రహించిన *రిబ్కా* తిరుగు మాట్లాడక అబ్రాహాము విధేయురాలైంది.తన భర్త ఎలాటివాడైతే అలా సర్దుకుపోవడానికి తన జీవితాన్ని సిద్దపరచుకుంది
రిబ్కా.
💥 ఇస్సాకు గుడారానికి దూరంగా వున్న పొలంలో
దేవునితో మాట్లాడడానికి వెళ్ళాడు.ఎలియాజరు రాక
కోసం ఎదురుచూస్తున్నాడు ఇస్సాకు.
*ఒంటెలకుఎదురుగావస్తున్న వ్యక్తి తన కాబోయే భర్త ఇస్సాకు* అని తెలియగానే ఆమె ముసుగు వేసుకుంది.
తూర్పు దేశ స్త్రీలు *వివాహమయ్యే దాకా*
*తమ ముఖాలను పెళ్ళికుమారునికి చూపించ కూడదు*.
💥 రిబ్కాను చూడగానే ఇస్సాకుకు తన తల్లి గుర్తుకొచ్చింది. శారాలా రిబ్కా కూడ తెలివైన, శక్తిగల, ధృఢచిత్తురాలు,
చాలా అందమైన స్త్రీ.
*స్త్రీలో ఇస్సాకు ఆశించిన అన్ని హంగులూ,రిబ్కాలో వున్నాయి*
అతడు ఆమెను ప్రేమించాడు.
ఆమె అతణ్ని ప్రేమించింది.
💥 చరిత్ర కట్టుకథల కంటె
ఆశక్తిదాయకంగావుంటుంది
ఎందుకంటే చరిత్రలోని వ్యక్తులు రక్తమాంసాలతో జీవించినవాళ్ళు.
వాళ్ళకు మనోఉద్వేగాలు,ఆశనిరాశల అనుభవాలున్నాయి.
💥 దేవుని స్నేహితుడూ విశ్వాసులకు స్నేహితుడు.
💥 యూదుల విశ్వాసానికి
పితృసమానుడైన అబ్రాహాము చరిత్రలో ,
తెలియబడని *రిబ్కా* అనే ఓ యువతి చోటుచేసుకుంది.
💥 *వాగ్దానమయమైన*
*భవిష్యత్తు గవినిలో ఆమె ప్రవేశించింది*
*రిబ్కా ఓ శక్తివంతమైన స్త్రీ*
*రెబ్కాసమస్తాన్నితన*
*హస్తాల్లోకితీసుకుంటుంది*
ఇస్సాకు సిరియావాడైన బెతూయేలు కుమార్తెయు ను సిరియా వాడైన లాబాను సహోదరి యునైన *రిబ్కాను పెండ్లిచేసి* కొన్నప్పుడు నలుబది (40) సంవత్సరముల వాడు.
ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య యైన *రిబ్కా గర్భవతి ఆయెను*.
ఆమె గర్భములో శిశువులు ఒకనితో నొకడు పెనుగు లాడిరి గనుక ఆమె ఈలాగైతే నేను బ్రదుకుట యెందుకని అనుకొని యీ విషయమై యెహోవాను అడుగ వెళ్లెను. అప్పుడు యెహోవా ఆమెతోనిట్లనెను
రెండు జనములు నీ గర్భములో కలవు.రెండు జనపదములు నీకడుపులో నుండిప్రత్యేకముగావచ్చును. ఒక జనపదముకంటె ఒక జనపదము బలిష్టమై యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను.
(ఆది.కా.25:21:23)
*ఏశావు*
********
**పెద్దకుమారుడుఏశావురోమపుష్ఠి కలిగినవాడు*.
శారీరకంగా మానసికంగా
మొరటువాడు.ఎప్పుడూ బయటి ప్రపంచంలో నివసించాలనుకొనే వేటగాడు.అతడు తెచ్చిపెట్టే వేటమాంసం ఇష్టపడే ఇస్సాకు *ఏశావును* మెచ్చుకొని ఇష్టపడేవాడు.
*యాకోబు*
**********
చిన్నవాడు *యాకోబు*
బలహీనుడు.కానీ యుక్తిపరుడు.ఎప్పుడూ ఇంట్లోనే వుండేవాడు.తల్లి
చాటున పెరిగినవాడు.
*రిబ్కా స్వభావము*
********************
పిల్లలు పుట్టక మునుపు దేవుడు చెప్పిన మాటల ఆధారంగా రిబ్కా యాకోబును అతిగా ప్రేమించింది.ఆమె తన ప్రణాళికా విషయంలో దేవుని సంప్రదించలేదు.
80సంవత్సరాలు వృద్దురాలైనప్పటికీ రిబ్కా తన జ్ఞానాన్ని త్వరిత గతిలో పనులు చేయడం లాంటి స్వభావాన్ని పోగొట్టుకో లేదు.చురుకైన, తెలివైన రిబ్కా దేవుని కేంద్రమైన యాకోబును ఇస్సాకు ఆశీర్వాదాన్ని పొందుకొనేలా చేసింది.
*ఇస్సాకు*
**********
ఇస్సాకు వంద
సంవత్సరాల ముదుసలి చావుకు సిద్దమయ్యాడు
అబ్రాహాము ద్వారా తాను పొందిన ఆశీర్వాదాల్ని దేవుని మాటకు వ్యతిరేకంగా
ఇప్పుడు తన
పెద్ద కుమారునికి అంద జేయాలను కున్నాడు.
తండ్రి కొడుకుల మధ్య ఈ
గంభీరసన్నివేశంభోజనంతో ముడిపెట్టబడింది.
ఆది.కా.17:1-8,21)
*రిబ్కా జాగ్రత్త పడింది* పొరపాటు జరగబోతోంది.
పుత్రులు పుట్టక ముందే పెద్దవాడు చిన్నవాడిని సేవిస్తాడిని.
ఇస్సాకు తన సొంత పథకం ప్రకారం దేవుని వాగ్దానం నెరవేరకుండ వుండేలా ప్రయత్నించాడు.
*యాకోబును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడో రిబ్కాకు అర్థమైంది*
దేవుని ఆజ్ఞల్ని ఏశావు
లెక్కపెట్టడని రుజువైంది.
దేవుని దృష్టిలో అతిపవిత్ర మైన జేష్టత్వాన్ని అమ్ము కున్నాడు.
(ఆది.కా.25:29-34)
అంతేకాదు అన్యస్త్రీని వివాహమాడాడు. వీటన్నిటినీ చూచి తల్లిదండ్రులువిచారించారు
యాకోబు యుక్తిగా మోసంతో జేష్ఠత్వాన్ని పొంది తప్పుచేసినా అందులో అతనికి విశ్వాసముంది.
*ఏశావు కంటే యాకోబు జీవితమే దేవునికి కేంద్రంగా వుంది*
ఇది తెలియని రిబ్కా అంతా తన చేతుల్లోకి తీసుకోవడం దురదృష్టకరం
ఒకప్పుడు తెలియని భవిష్యత్తులోకి ప్రవేశించే సమయంలో దేవునికి కావలసిన విశ్వాసమున్న *రిబ్కా* ఈనాడు యాకోబుకు సహాయం చేయాలని తాపత్రయ పడ్తుంది. *మానవ సహాయం లేకుండనే ఈ రోజు యాకోబు జీవితంలో ఒక వాగ్దానాన్ని నెరవేర్చగల శక్తి దేవునికి వుంది అని నమ్మలేకపోయింది రిబ్కా*
తన భర్తతో ఈ విషయాన్ని చర్చించేందుకు వచ్చిన అవకాశాన్ని వినియోగించు కో లేదు.అవసరం కొద్దీ ఒకరి కొకరు సమీపం కావాల్సిన అవకాశం జారిపోయింది.
*ఆలోచనారహితంగా తన భర్తను , ఏశావును మోసగించాలని నిర్ణయించు కుంది*
*అనుకున్న కార్యాన్ని సాధించేందుకు ఎంత త్యాగానికైన సిద్దపడింది రిబ్కా*
దేవుని శాపానికి భయపడనంతగా ఆమెకూ దేవునికీ మధ్య దూరం ఏర్పడిపోయింది.
తండ్రి కోరిక ప్రకారం ఏశావు రుచి గల భోజనాన్ని తండ్రికోసం సిద్దపర్చి తీసుకొచ్చేలోపల యాకోబు ఆశీర్వాదాన్ని దొంగిలించాడు.
*రిబ్కా తాను విజయం* *సాధించినట్లు తృప్తిపడింది*
*కానీ అది నిజం కాదు ఆమె ఓడిపోయింది*
*ఆమె మోసపు క్రియ ఇస్సాకుకు తీరని దుఖాఃన్ని కలుగజేసింది*
*ఇస్సాకు పేరుకు అర్థం* *నవ్వుతూవుండేవాడు*"
*నవ్వుతూ వుండేవాడని ఆ పేరుకు అర్థం*
*నవ్వడానికి అనుకూలమైన పరిస్థితులు ఇంకెంత మాత్రమూ లేవు*.
*యాకోబు మోసం*
*****************
తమ ప్రేమకు పాత్రుడైన ముద్దుల కుమారుడు యాకోబును ఆమె ప్రమాదం తెచ్చిపెట్టింది. ఆమె (తల్లి) సహాయంవల్లే
*అబద్దమాడి తండ్రిని మోసగించాడు*
వేటాడ్డంలో దేవుడే సత్వర విజయాన్ని అనుగ్రహిం చాడని తండ్రికి అబద్దం చెప్పాడం ద్వారా
*యాకోబు దైవనామాన్ని అవమానించాడు*.
యాకోబు నిమిషాల్లో పెద్ద *మోసగాడయ్యాడు*
*మోసం చేయడంలో తన తల్లికి తీసిపోడు*
(ఆది.కా. 30:37-43)
ఇంత పాపానికి ఒడగట్టినా
*దేవుడు తన అత్యంత కృపతో యాకోబును దీవించాడు*
కానీ యాకోబు సొంతంగా *ఆశీర్వాదాన్ని సంపాదించలేక పోయాడు*
మోసానికి మోసమే ప్రతిఫలమని,భవిష్యత్తులో
యాకోబు అనుభవపూర్వకంగా తెల్సుకొని ఎంతో బాధ ననుభవించాడు.
రిబ్కా చేసిన మోసం వల్లే ఏశావు యాకోబును చంపడానికి సిద్దపడ్డాడు.
*మోసం మరో మోసానికి దారి తీసింది*
తల్లిదండ్రులను ,గృహాన్ని ,విడిచి పారిపోవాల్సి వచ్చింది.
*రిబ్కా వాగ్దానము*
ఏశావు కోపం చల్లారాక యాకోబును పిలిపిస్తానని
తన గొప్పదనాన్ని అంచనా వేసుకుంది రిబ్కా ఆ వాగ్దానాన్ని నెరవేర్చలేక పోయింది.
*యాకోబు తిరిగీ వచ్చేంతవరకు ఆమె జీవించలేదు* భార్యకోసం బయటకు వెళ్ళే సమయంలోనే ఆమె తన ముద్దుల కుమారుడు యాకోబును చివరిసారిగ చూచింది.
(ఆది.కా 28:1-4)
*20 సంవత్సరాల* తరువాత యాకోబు తిరిగి వచ్చాడు.
(ఆది 31:41)
ఏశావుతో సంధి చేసుకున్నాడు.తన తండ్రి అప్పటికి జీవిస్తున్నాడు.
💥 *రిబ్కా సమస్తాన్ని తన చేతుల్లోకి తీసుకోవడం*
**********************
💥దేవుని చేత ఏర్పరచబడి,ఇస్సాకు భార్యగా అతి జాగ్రత్తగా ఎంచుకోబడ్డ రిబ్కా దేవుడు ఆశించిన విధంగా మసలుకోలేదు.
ఆరంభంలో అంతాబాగానే వుంది.
💥 అంతంలో రిబ్కా దేవుని ఆశ్రయించడంమాని నిరుత్సాహంతో కృషించిపోయింది.
(కీర్తనలు 27:14, 37:34)
💥ఆమె తరపున దేవుడు
పోరాడాల్సింది బదులు తానే తన.సమస్తాన్ని చేతుల్లోకి తీసుకుంది రిబ్కా
(ద్వితీ 1:30, నిర్గ 14:13)
💥 దేవునిలో విశ్వాసం వుంచిన వాళ్ళు తొందరపడనవసరం లేదనే
విషయాన్ని రిబ్కా విస్మరించింది.(యెషయ 28:16)
💥 ఆయనను ఆశ్రయించిన వాళ్ళ కోసం ఏమి చేస్తాడో ,ఏమి చేయగలడో చూపించడానికి అవకాశం ఇచ్చేందుకు రిబ్కా వెనుకాడింది.
(యెషయ 64:4)
భార్య భర్తను గౌరవించాలి.
తన భర్త బాగోగులు చూసుకోవడమే స్త్రీ యొక్క ముఖ్య ఆశయమై యుండాలి.
తన జీవిత కాలమంతట్లో ఆమె అతనికి మేలు చేస్తుంది కానీ కీడు చేయదు(సామెతలు 31:1)
*దైవాశ్శీస్సులు*
సేకరణ:
*శ్రీమతిజె.విమలకుమారి*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి