✳ *బైబిల్ నందలి స్త్రీలు* ✳
(మూడవ భాగము)
*యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*
సామెతలు31:30
1⃣ *ధన్యురాలైన మరియ*
1-3 భాగములు
2⃣ ♻ *దెబోరా* ♻
గురించి గతపాఠం లో ధ్యానము చేశాము.
3⃣ 🌹 *హవ్వ* 🌹
*సకల మానవులకు తల్లి*
లోక ప్రజలందరికీ స్త్రీ తల్లి కనుక పురుషుడు ఆమెను
*హవ్వ* అనిపేరుపెట్టాడు.
దేవుడు.
*దేవుడు సృష్టి పరిపూర్ణమైనది*.
*తాను చేసిన సృష్టివిషయం లోపూర్తి సంతృప్తిని వ్యక్తం చేశాడు*
దేవుడు మానవుని తన రూపములో సృజించాడు.
నరుడు ఒంటరిగ వుండటం
మంచిదికాదనే విషయం మాత్రం అలాగే వుండి మిగిలిపోయింది.
*పురుషునికి తోడుగా స్త్రీ సృజింపబడ్డతరువాతనే సృష్టి క్రమం సంపూర్ణ మైంది* (ఆది.కా.1:31)
జలచరాల్ని,ఆకాశపక్షుల్ని,భూమ్మీద సంచరించే ప్రతిప్రాణినివారిని పరిపాలించమనిఅధికారాన్ని ఇస్తూ,అవసరమైన ప్రతిదీ అమర్చి *తోటమధ్యలో వున్న ఒక ప్రత్యేక అందమైన వృక్ష ఫలాలను తినవద్దనీ*
*అలా చేస్తే మరణిస్తారని దేవుడు హెచ్చరించాడు*.
దేవుని సృష్టిలో అతి కుటిలమైనది సర్పము.
ఓ రోజు తోటలో ఆమెకు ఓ స్వరం వినిపించింది
*ఈ తోటలోని ఏ చెట్టు ఫలాన్ని తినొద్దని దేవుడు చెప్పాడు ?*
అందుకు ఆ స్త్రీ సర్పంతో ఇలా అంది *తోటలోని ఫలాలనన్నిటినీ తినవచ్చు కానీ తోటమధ్యనవున్న ఈ తోటఫలాలు మాత్రం తినకూడదు అలా చేస్తే మేము మరణిస్తామని దేవుడుచెప్పాడు*
*అప్పుడు పాము స్త్రీతో*
*మీరుచావనే చావరు*
*ఆ చెట్టుఫలాలు* *తిన్నరోజున మీ కళ్ళు తెరవబడి ..మంచి-చెడూ తెలుసుకొనిదేవునిలాంటి వారవు తారని దేవునికి తెల్సు* అందుకే
ఆ పండును తినవద్దని చెప్పాడు.
అప్పుడు
ఆ స్త్రీ ఆ చెట్టు ఫలాన్ని కోసి తాను తిని తన భర్తకు కూడ ఇచ్చింది. అతను కూడ తిన్నాడు .అప్పుడు వాళ్ళ నేత్రాలు తెరవ బడ్డాయి.వాళ్ళుదిగంబరులుగావున్నామనితెల్సుకొని ఆకులతో తమ మొలల్ని కప్పుకున్నారు.
👉🏾దేవుడు *ఆదామా!ఎక్కడున్నావని* పురుషుణ్ని పిలిచాడు.
అందుకు ఆదాము *నీ స్వరం విన్నాను*
*దిగంబరినని తెల్సి నన్నునేను నీ దృష్టినుంచి దాచుకున్నాను* భయపడుతూ సమాధాన మిచ్చాడు.
*నీవు తినొద్దని చెప్పిన చెట్టుఫలాన్నితిన్నావా*
*నాకుజతగానువ్విచ్చిన*
*స్త్రీ ఆ చెట్టు ఫలాన్ని*
*నా కిచ్చింది అందువల్ల నేను తిన్నాను* అన్నాడు
ఆదాము.
👉🏾దేవుడు స్త్రీని *నువ్వు చేసిన పని ఏమిటి* ? అని అడిగాడు.
అందుకు స్త్రీ
*ఈ సర్పం నన్ను మోసగించింది.అందువల్ల తిన్నాను ప్రభూ* అని దీనంగాసమాధానమిచ్చింది.
*దేవుని తీర్పు*
****************
💥 దేవుడు సర్పాన్ని *సర్పమా! నువ్వు ఈ పని చేసినందుకు* *మృగాలకంటే*
*ఎక్కువ శపింపబడి* *కడుపుతో ప్రాకుతూ* *మన్ను తిని జీవిస్తావు*
*నీకూ,స్త్రీ సంతానానికి* *ద్వేషం రగుల్తుంది* నరపుత్రుడు నీ తల చితగ్గొడ్తాడు.నువ్వు వాడి మడిమ మీద కరుస్తావు.
💥 దేవుడు స్త్రీ వైపు చూచి *నీవుప్రసవ వేదనతో పిల్లల్ని కంటావు.నీ భర్త నిన్ను ఏలుతాడు* అని శపించాడు.
💥 దేవుడు ఆదామును చూచి *నువ్వు నీ భార్య మాట విని నా శాసనాన్ని ధిక్కరించి తినకూడని వృక్షఫలాలు తిన్నావు*
అందువల్ల నిన్ను బట్టి భూమి శాపగ్రస్తమైంది.
నీవు బ్రతుకు దినాలన్నీ కష్టించి పంట తింటావు.
చెమటకార్చి పంట తింటావు.నువ్వు మట్టితో
చేయబడ్డావు నువ్వు తిరిగీ మట్టి పాలౌతావు.
అని శపించాడు.
(అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును (మత్తయి 6:18)
💥 పాపాన్ని ఒప్పుకొనేందుకు దేవుడు వాళ్ళకు ఓ అవకాశాన్ని అనుగ్రహించాడు.
కానీ వాళ్ళు ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నారు.
▪దేవా! నీవు నాకిచ్చిన స్త్రీ ఈ పాపము చేసింది.అని ఆదాము హవ్వపై నిందవేశాడు.
▪హవ్వకూడ తాను యిష్టపూర్వకంగా ఈ పాపాన్ని చేసినప్పటికీ పామును నిందించింది.
పాము హవ్వకు మోసపు మాటలు చెప్పింది
వాస్తవమే.
అయినా *హవ్వ ఈ పాపాన్ని తాను చేసిన పాపానికి ఫలితం దేవుడిచ్చిన తీర్పుద్వారా తెలిసింది*
*అందమైన ఏదేను వనము మాత్రమే గాక లోకమంతా శాపగ్రస్తమైంది*
ఒకప్పుడు ఎంతో ఫలభరితమైన భూమి ఇప్పుడు ముళ్ళతుప్పలు
మొలిపించింది.
పశువుల మృగాలమీద ఆదాము హవ్వ లకున్న పరిపాలనా శక్తి ఇప్పుడు అదుపు తప్పింది.
*నిత్యనివాసియైన పరదైసును ఒక్కదెబ్బతో ఆదాము హవ్వలు పోగొట్టుకున్నారు*
👉🏾జీవవృక్ష ఫలాన్ని తిని ,
శాశ్వతంగా పాపులుగా జీవించకుండా త్వరగా ఇక్కడినుండి వెళ్ళిపొమ్మని
దేవుడు ఆజ్ఞాపించాడు.
(ఆది.కా.3:22,23)
*దేవుని సృష్టిని పరిసమాప్తిచేసి భూలోకానికి సంతోషకారకురాలైన హవ్వ తన అవిధేయతవల్ల*
*ఈ సంతోషాన్ని బయటకు పారవేసింది*
💥 తల్లిగా సంతోషానికి బదులు వేదన,బాధ ఆమె అనుభవించాల్సి వచ్చింది.
*సమాన సహవాసానికి బదులు,తన భర్త పరిపాలన క్రింద ఆమె వుండాల్సివచ్చింది*
హవ్వ పాపం కారణంగా ఆదాము ఆమెను ఏలాల్సి వచ్చింది.
భౌతికంగా మరణించడం కంటె ఆధ్యాత్మికంగా చావడం చాలా ధారుణంమైంది.
ఇది *దేవునితో మానవుని సహవాసాన్ని ధ్వంసంచేస్తుంది*(ఆది.కా 2:17)
ఈ విషయంలో హవ్వ తన అంతరంగంలో ఎంతో బాధపడింది.
*దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినందుకు శిక్షింపబడాల్సింది ఆదాము,హవ్వలు మాత్రమే కాదు,సాతానుకు ఇవ్వబడ్డ శిక్ష చాలా పెద్ద శిక్ష*
💥 సాతాను మనిషిని పాపం చేసేందుకు మళ్ళీమళ్ళీ పురికొల్పుతాడు.అతనిలో పాపపు కోరికల్ని ప్రజ్వలింపజేస్తాడు. ఇష్టానుసారంగ కోర్కెల్ని సాధించినప్పుడల్లా పాపం మరణాలు ప్రవేశిస్తాయి.
(యాకోబు 1:14,15)
అంతరంగంలోని పాపవాంఛలు ప్రకోపించినప్పుడు నేత్రాలతో చూసి గర్వకారణమైన లోకాశల్ని
తీర్చుకోవాలనుకునే హవ్వలాంటి స్త్రీలు ప్రతి తరంలోను ఉన్నారు.
💥 అపాయకరమైన *శోధనను ప్రతిఘటించగల*
*ధైర్యం,స్పూర్తి ఆమెలో సహజంగా వున్నాయి*.
సాతాను మాటలు విని మోసపోవాల్సిన అగత్యం హవ్వకు లేదు. *స్వయంగా నిర్ణయించ గల స్వతంత్రత,స్వేచ్చ ఆమె కున్నాయి*.సాతాను మాటలు నమ్మి వాడికి సమాధానమివ్వడం విచారకరమైన విషయం.
💥 *ఆదాము హవ్వల పాప ఫలితంగా* *మానవులకు లభించిన *ఏడుపు,బాధలు*
*ఓ క్రొత్త రాజ్యం స్థాపించ బడే దాకా వుంటాయి*.(ప్రకటన21:1,4)
అంతవరకు మనుషులు పాపంలో కొట్టుమిట్టాడు తూనే ఉంటారు.
ఆ సమయం వచ్చేదాకా హవ్వలా సులభంగా పాపంలో పడిపోవద్దని మనుషు లందరికీ
*ఓ హెచ్చరిక వుంది*.(2కొరింథీ11:3)
లోకంలోని ప్రజలందరికి తల్లియైన హవ్వ ఓ భయంకరమైనఉదాహరణగా నిలిచిపోయింది.
సాతాను మాటలు విని దేవుని ప్రేమను,ఆయన ఆజ్ఞను సందేహించి *పాపాన్ని లోకంలో ప్రవేశింపజేసిన స్త్రీ హవ్వ*
*సకల జనుల తల్లి*
ఆది.కా. -1:27,28.,
ఆది.కా-2:18,
ఆది.కా. 2:20-25,
ఆది.కా. 3:1-20.
దైవాశ్శీస్సులు
సేకరణ:
*శ్రీమతిజె.విమలకుమారి*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి