ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మన పిల్లలను క్రమశిక్షణ లో పెచ్చుట.

✳ *మన పిల్లలను క్రమశిక్షణ లో పెచ్చుట...✍*

''బుద్ధి వచ్చునని నీ కుమారుని *శిక్షింపుము* అయితే వాడు చావవలెనని కోరవద్దు'' సామెతలు 19:18.

మన పిల్లలను  *క్రమశిక్షణ* లో దిద్దుబాటు చెయ్యవలసి వచ్చినప్పుడు మనకు ఎంతో కృప మరియు జ్ఞానము కావలెను. 
దేవుడు మనలను శిక్షించునట్లు వారి యొక్క శాశ్వతమైన మంచిని కోరి *ప్రేమతో మరియు జాలితో* వారిని మనము శిక్షించవలెను.

 *తల్లులైన వారు పిల్లలను శిక్షించుట వారి భర్తల చేతులలోనే పూర్తిగా వదిలి వేయకూడదు.* 

 పిల్లలను తల్లులైనవారు ఎప్పుడు శిక్షింపక పోయినట్లయితే దానిని వారి బలహీనతగా పిల్లలు చూచుట చేత వారిపై తల్లులకుండిన అధికారాన్ని వారు పోగొట్టు కొందురు.
*తల్లులైన వారు పిల్లలను ఏఏ విషయములలో శిక్షించవలెను మరియు వేటిని వారు పట్టించుకొనకుండా ఉండవలెననేది తల్లులైన వారు తెలుసు కొనవలెను.*
 
👉దీని విషయములో 
తల్లుల మనసుల్లో ఉండవలసిన ముఖ్యమైన సూత్రము పిల్లల వలన కలుగు వస్తు సామాగ్రి నష్టము కంటె వారిలో ఏర్పడే క్రైస్తవ సద్గుణములను ముఖ్యమైనవిగా ఎంచవలెను. 

తల్లులకు నిత్యమైన విలువలు గూర్చి సరియైన అవగాహన ఉండవలెను.పిల్లలు తల్లులైన వారి యెడల దురుసుగా ఉండినట్లయితే లేక 
కావాలనే అబద్ధములు మాట్లాడి నట్లయితే వాటిని,
 పిల్లలు అనుకోకుండా పగలగొట్టిన ఖరీదైన వస్తువు కంటె తీవ్రమైన అంశముగా పరిగణించవలెను.పిల్లలను క్రమ శిక్షణలో పెట్టునప్పుడు తల్లులైన వారు
🔹 *కోపము,*
🔹 *అసహనము* మరియు
🔹 *చిరాకు*
 అంతటిని దూర పర్చుకోవలెను. 
తల్లులు పిల్లల నెప్పుడు కోపముతో శిక్షించకూడదు. 

*తల్లులైన వారు అందరు ఈ విషయములో గతములో తప్పిపోయినవారే. కాని పశ్చాత్తాప పడి ప్రభువును క్షమించమని అడిగి, భవిష్యత్తులో పిల్లలను ప్రేమతో సరిదిద్దుటకు కృపను ఇమ్మని అడుగవచ్చును.*

కొంతమంది తల్లులు పిల్లలకు శిక్షగా శారీరక పని అప్పచెప్తారు. 
పిల్లలకు ఎప్పుడైనను శిక్షగా *బరువైన శారీరక పని చెప్పకూడదు.* 

👉 *వారు ఇంటిలో పనులను ఒక బాధ్యతగా చేయుట నేర్చుకొనవలెను తప్పితే ఒక శిక్షగా కాదు.* 

👉 అదేవిధంగా కొంతమంది తల్లులు పిల్లలకు శిక్షగా భోజనం పెట్టకుండా పస్తు పెడతారు . అది చాలా పెద్ద తప్పు. భోజనము పెట్టడం మానకూడదు.

👉 తల్లులైన వారు పిల్లలను ఏదైనా అవిధేయతకు శిక్షిస్తామని చెప్పినట్లయితే, వారు చెప్పిన మాటకు వారు  కట్టుబడి ఉండవలెను. లేకపోయినట్లయితే తల్లుల బెదిరింపులు వట్టివే అని తెలుసుకొనుట చేత తల్లులైన వారు వారి మాటలపై పిల్లల దృష్టిలో గౌరవమును పోగొట్టుకొందురు. 
అయితే తల్లులు వారికి ఇస్తామని చెప్పిన కఠిన శిక్షను బట్టి ఒకవేళ పిల్లలలో మార్పు వచ్చిన పరిస్థితిని బట్టి శిక్షను తేలికైనదిగా చెయ్యవచ్చును. 
లేదా *పిల్లలు వారు చేసిన దానికి వారు పూర్తిగా పశ్చాత్తాపపడి విచారిస్తున్నట్లు తల్లులు చూసినట్లయితే ఇస్తామని చెప్పిన శిక్షను రద్దు చెయ్యవచ్చు కూడా.* 

👉 *దేవుడు కూడా నీనెవె వారు పశ్చాత్తాపపడుట చూచి వారిపై కనికరము చూపి తాను విధింతునన్న శిక్షను మానివేసెను (యోనా 3వ అధ్యాయము)*. 
దేవుడు మనలను ఉగ్రతతోను మరియు దయతోను చూచుచుండెను. గనుక తల్లులు కూడా పిల్లలతో అట్లే ఉండవలెను.

👉 *బెల్టునో బెత్తమునో ఉపయోగించుట మాత్రమే శిక్షించుట కాదు.* 
అది అసలు మంచిది కానేకాదు. వారిని ఆటలు ఆడుకోకుండా చెయ్యవచ్చు లేక కొద్దిసేపు పడకపై మౌనముగా పరుండమని చెప్పవచ్చును. 

👉 *అలా చెయ్యుటకూడా వారు ఏదైనా తప్పుచేసినప్పుడు ఆ శిక్ష వారి హృదయాలతో మాట్లాడును.*
👉పిల్లలను ఎప్పుడైనను కనికరము లేకుండా శిక్షించకూడదు. 
మన చేతులను పిల్లలను కొట్టుటకు ఉపయోగించ కూడదు. వాక్యములో చెప్పినట్లు సామెతలు 23:13,14 

''నీ బాలురను *శిక్షించుట* మానుకొనకుము *బెత్తముతో* వాని కొట్టిన యెడల వాడు చావకుండును. *బెత్తముతో* వాని కొట్టిన యెడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు.'' 
▪బెత్తము వాడుట ను అదైనా కేవలం భయపెట్టుటకే.
▪ అంతేకాని ఎప్పుడు వాతలు తేలే బెత్తం వాడకుడదు
▪ *మన చేతులు పిల్లలను సంరక్షించుటకు ఇవ్వబడినవి. కొట్టుటకు కాదు.* 
▪దాని అర్థము వాటి ద్వారా మన ప్రేమను చూపుటకు ఇవ్వబడెను. 

 *''బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలోనుండి తోలివేయును''* సామెతలు 22:15.

*పిల్లలు 12 సంవత్సరములు దాటి 13 అనగా టీనేజి వచ్చిన  తరువాత వారిని శారీరకముగా శిక్షించుట మానవలెను.* 
పిల్లలను 1 సంవత్సరము వయసు నుండి 12 సంవత్సరముల వయసు వరకు శిక్షించినట్లయితే అటు తరువాత సాధారణముగా శిక్షించవలసిన అవసరము ఉండదు. గనుక వారు చిన్న వారుగా ఉండిన సంవత్సరములను, వారిని క్రమశిక్షణలో పెంచుటకు మరియు దేవుని మార్గములలో నడిపించుటకు ఉపయోగించ వలసియున్నది.

🔸 *ముఖ్యంగా పిల్లలను ఇతరుల యెదుట ఎప్పుడు శిక్షించ కూడదు.* 
🔸అది వారిని బహిరంగముగా అవమాన పర్చుట అవుతుంది. 
🔸అది వారి శిక్షను రెట్టింపు చేయుట అవుతుంది. 
🔸మనము వారికుండిన ఆత్మ గౌరవమును ఎప్పుడు 
గౌరవించవలెను.   
🔸పిల్లల తప్పిదములకు ప్రక్కకు తీసుకు వెళ్లి శిక్షింపవచ్చును. 

👉 *అవిధేయతను* మరియు  *దురుసుతనమును* ఎప్పుడు వెంటనే సరిదిద్దుట మంచిది. 
అటువంటి విషయములను వెంటనే సరిదిద్దక పోయినట్లయితే వారు ప్రమాదకరమైన విపరీత ప్రవర్తనకు పోయి వారు పెద్దవారైనప్పుడు వారిని వారు నష్టపర్చుకొందురు. అప్పుడు వారిని సరిదిద్దుటకు చాలా ఆలస్యమైపోవును. 

👉 *కొందరు తల్లిదండ్రులు ఇతరులకు వారి పిల్లలను చాలా కఠినముగా పెంచుతున్నామని తెలియ జేయుటకు బహిరంగముగా శిక్షించుదురు. ఇది మనుష్యుల నుండి గౌరవమును కోరుకొనుటయై యున్నది మరియు అది దేవుని దృష్టికి అంగీకారముకానిది.*

👉తల్లి మరియు తండ్రి వారి పిల్లల క్రమశిక్షణలో *ఐక్యత కలిగి యుండవలెను*. తండ్రి బిడ్డలను శిక్షిస్తున్నప్పుడు తల్లి వారిని కాపాడాలని ప్రయత్నించి నట్లయితే కాలము గడిచే కొద్దీ తల్లి పిల్లలను నాశనము చేయు అవకాశమును తీసుకొంటున్నట్లే.

👉పిల్లలను శిక్షించిన తరువాత, 
🔹వారు క్షమింపబడినారనే ధైర్యాన్ని వారికి మనము తెలియజేయవలెను. 
🔹వారు చేసిన పొరపాట్లు ఏవిధముగా సరిచేయబడునో వారికి నేర్పించవలెను. 
🔹 *కాని వారు చేసిన పొరపాట్లను తిరిగి తిరిగి వారికి జ్ఞాపకము చెయ్యకుండా మనము జాగ్రత్తపడవలెను.*
🔹 కొందరు తల్లులు అట్లు పిల్లల చేసిన తప్పులను మరియు దానికి వారు అనుభవించిన శిక్షను మరల మరల వారికి జ్ఞాపకం  చేయుదురు. 
🔹 *దాని వలన వారి పిల్లలు మరింత నిస్పృహకు గురికాగలరు.*

👉మన పిల్లలకు మనము బహుమతులు ఇవ్వవలసిన సమయములు కూడా ఉంటాయి. 
▪మనకు మనము కొన్నిటిని కాదనుకొన్నపుడు దేవుడు కూడా మనకు బహుమతులిచ్చును.
▪ అబ్రాహాము తనను తాను ఉపేక్షించుకొని లోతు తనకు కావలసిన భూమిని ఎంచుకొనుటకు అవకాశమిచ్చి నప్పుడు దేవుడు వెంటనే అబ్రాహామునకు బహుమతి ఇచ్చెను (ఆది 13వ అధ్యాయము). 

▪అదే విధముగా మన బిడ్డలు మంచిగా ఉండి మరియు ఏదొక విధముగా వారిని వారు ఉపేక్షించు కొన్నప్పుడు వారికి *బహుమతులిచ్చుట మంచిది.*
🔹 వారి పుట్టిన రోజులకు లేక
🔹 వారు అస్వస్థులైనప్పుడు లేక వారు ఆసుపత్రిలో ఉండినప్పుడు వారికి ఏమైనా కానుకలు ఇవ్వవచ్చును.

కొన్ని సందర్భాలలో మన పిల్లలను అతిగా శిక్షించి తరువాత బాధపడి దానికి బదులుగా ఏదొక కానుక ఇచ్చి వారిని మరపు చెయ్యుటకు చూచుదుము. అట్లు ఎప్పుడో ఒకప్పుడు చేస్తే మంచిదే. కాని అదొక అలవాటు అయిపోయి నట్లయితే, మన పిల్లలకు మనమిచ్చే శిక్షపై భయము పోవుటను మనము గమనించగలము. అందువలన వారు మంచిగా నుండుటకు ప్రయత్నించిన వేరొక సమయములో వారికి ఏదైనా బహుమతి యిచ్చుట మంచిది.

👉మన పిల్లల విషయములో ఏవైనా *తీవ్రమైన సమస్యలు* వచ్చినప్పుడు ఆ బిడ్డలు పుట్టినప్పుడు మనకు
కలిగిన సంతోషమును, బిడ్డను ఇచ్చినందుకు దేవుని యెడలనున్న కృతజ్ఞతను కలిగి  ఉండవలెను. 

👉కాని బిడ్డను పొందడమనేది వెలకట్టలేని ఆధిక్యత అని తల్లులు ఎప్పుడు మరచి పోకూడదు. అనేక మంది భార్యలు అటువంటి ఆధిక్యత లేక ఒక బిడ్డను పొందుటకు దేనినైనా ఇచ్చువారు ఈ లోకములో ఎందరో ఉన్నారు.

👉గనుక ఎంత ఖరీదైనా, నాగలిపై నుంచిన చెయ్యిని తియ్యకుండా ఉంచుదుమని నిశ్చయించు కోవాలి. మరియు *మన ఇళ్లల్లో ప్రతి విషయము సాఫీగా వెళ్లుటకు తల్లులైన వారు చెయ్యగలిగినదంతా చేయ్యాలి.* 

👉  *తల్లులైన వారు దేవునితో ఎక్కువ సమయాన్ని గడిపి ఆయనతో దగ్గరగా నడచినట్లయితే, దేవుడు వారికి చక్కని జ్ఞానం నూతన బలము పొందునట్లు చేసి మనమెప్పుడు ఆత్మీయముగా వారిని ఎప్పుడూ తాజాగా ఉండునట్లు చేయును.*

*''నీ కుమారుని శిక్షించిన యెడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనస్సుకు ఆనందము కలుగజేయును'' సామెతలు 29:17.*

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...