✳ *బైబిల్ నందలి స్త్రీలు* ✳
(పదవ భాగము)
1⃣8⃣ 🌹 *మీకాలు* 🌹
(ఆత్మీయుడైన భర్తను
హీనపరచిన భార్య)
మీకాలు అనే పేరుకు *దేవుని పోలినవారెవరు* అని అర్థము.ఇశ్రాయేలీ
యుల మొదటి రాజైన సౌలు చిన్న కుమార్తె *మీకాలు* ఈమె తల్లిపేరు *అహీమయస్సు*
ఈమె హృదయాను
సారుడైన
దావీదు భార్య.ఆత్మీయుడైన భర్తను దేవుడు మీకాలుకు అనుగ్రహించాడు.అయితే ఆమె జీవితంలో ఆత్మీయత లేదు.
నిజదేవుని కంటే గృహదేవతలనే
అభిమానించింది (1సమూ19:13)
దేవుడు ఆమె కిచ్చిన ప్రతి అవకాశాన్నికాలదన్నుకుది.*దైవజనుడైన*
*తన *భర్తను*
*మనస్సులో హీనపరచి* *ముఖాముఖిగా* *తృణీకరించి శాపగ్రస్తురాలై*
*మరణ పర్యంతం* *గొడ్రాలుగా* *మిగిలిపోయింది*
నిజజీవితంలో దేవుణ్ని హీనపరచింది*
ఆత్మీయ కురూపితనానికి
దృష్టాంతం మీకాలు.
💥 *విజయాలను బట్టి దావీదును ప్రేమించిన మీకాలు*
(1సమూ18:20)
దేవుడి వలన విజయుడైన దావీదును చిన్నకుమార్తె మీకా ప్రేమించింది.దావీదును మీకాలు అతని దేవుణ్ని బట్టికాదు గానీ అతని బాహ్య రూపాన్ని బట్టి ,స్థానాన్ని బట్టి,విజయాలను బట్టి ప్రేమించింది.
ఈ విషయం విన్న సౌలు సంతోషించాడు.
మీకాలు దావీదు భౌతికమైనవిషయాలను బట్టి గాక అతనికి తోడైవున్న దేవుణ్ని బట్టి అతని జీవిత భాగస్వామిని కావాలని కోరుకొని వుంటే
ఎంతగానో దీవింపబడి వుండేది.
దావీదు ఎర్రనివాడును,చక్కని నేత్రములు గలవాడునూ
చూచుటకు సుందరుడై వుండెనని చెప్ప బడింది.
💥 *దేవుని చేతిలో ఒక సాధనంగా ఉపయోగ పడిన మీకాలు*
(1సమూ19:11-17)
దావీదుకు స్వయాన మామ
అయిన సౌలు రాజే ప్రధాన శత్రువు.శతృవు నుండి దావీదును కాపాడడానికి దేవుడు మీకాలును సిద్దపరచాడు.
సౌలు పంపిన మనుషులు దావీదు ఇంటిని చుట్టుముట్టినపుడు మీకాలు *ఈ రాత్రికి నీవు తప్పించుకొనక పోతే రేపు నిశ్చయముగా చంపబడెదవు* అని దావీదును కిటికీలో నుంచి క్రిందికి దింపి తప్పించు కోవడానికి సహాయ పడింది
*దేవుడు తన మార్గాన్ని అనుసరించేవారిని ఎన్నడూ అనాథలుగా విడువడం.*
సౌలు చిన్న కుమార్తె అయిన మీకాలును దావీదు నిమిత్తము సాధనంగా వాడుకున్నాడు.
💥 *గృహదేవతలను విడువని మీకాలు*
1సమూ19:12)
దావీదుకు భార్యయైన మీకాలు గృహదేవతలను విడిచి పెట్టలేదు.దావీదును కిటికీలో నుండి దింపిన మంచం మీద గృహదేవత
బొమ్మను వుంచి అతడు రోగియై వున్నాడని తండ్రికి కబురు పంపింది.
(1సమూ19:17)ఆధ్యాత్మికంగా ఉన్నతస్థానంలో వున్న వ్యక్తితో కలిసి జీవితాన్ని పంచుకుంది గానీ తన విగ్రహాలను వదులుకోలేదు.
💥 *భర్త కొరకు*
*నిరీక్షించని మీకాలు*
(1సమూ25:44)
దావీదును హృదయంలో తృణీకరించిన మీకాలు
తండ్రి ఇష్టప్రకారము గల్లీము వాడైన పల్తీయేలును పెండ్లాడింది.
లోక మర్యాద ప్రకారం తనకు భర్త వుండాలను కొందిగానీ దావీదు కోసం నిరీక్షించలేక పోయింది.
దావీదును మరణం నుండి తప్పించి తండ్రి కోపాన్ని ఎదుర్కొంది.(19:17)
దావీదు ఎలాగూ రాడు .తన తండ్రి అతన్ని రానివ్వడు అతని కోసం తన నిండు జీవితాన్ని ఎందుకు పాడుచేసుకోవాలి ?అని
ఆలోచించుకొని దావీదుక కనుమరుగు కాగానే పల్తీయేలును వివాహమాడింది.
💥 *దావీదును తృణీకరించిన మీకాలు*
దావీదు రాజయ్యాక యెహోవా మందసాన్ని దావీదుపురంలోనకి తీసుకు వస్తున్న సమయాన దావీదు మందసం ముందు నాట్యమాడాడు
(2సమూ6:13,14) అందుకు మీకాలు తన కిటికీ నుండి చూచి మనసులో అతణ్ణి హీనపరచింది.6:16
హీనస్థితిగల పనికత్తెలు చూచు చుండగా రాజువైన నీవు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున
(6:20) దావీదు దేవుడు తనకు ఏమైవున్నాడో తెలియ పరిచాడు-
*నీ తండ్రిని అతని సంతతి ని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్నుఠ అధిపతిగా నిర్ణయించుటకై ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నే నాలాగు చేసితిని*
మీకాలు దావీదునే కాదు గానీ దేవుణ్ణే తృణీకరించింది.
నాశనానికి మార్గం తనే సిద్దం చేసుకుంది.
💥 *శాపగ్రస్తురాలిగా మిగిలి పోయిన మీకాలు*
(2సమూ6:22)
▪దేవుడు మీకాలుకు అనేక అవకాశాలిచ్చాడు.
▪నిజదేవుని ఎరిగిన భర్తనిచ్చాడు కానీ
▪అతనికష్టకాలంలో
అతన్ని మరచింది.
▪అతని కోసం నిరీక్షించక మరొకవివాహంచేసుకుంది.
▪దేవుడామెను ప్రేమించి తిరిగి దావీదు నొద్దకు రప్పించాడు.
▪అయినా మీకాలు తన జీవితంలో జీవంగల యెహోవాను రుచిచూడలేక పోయింది.
▪దేవుని సన్నిధిలో నాట్యమాడిన దావీదును
అపహాస్యంచేసి,హీనపరచి,తృణీకరించింది.
▪మరణపర్యంతం పిల్లలు కనకుండ గొడ్రాలుగానే చరిత్రలో మిగిలిపోయింది.
▪దేవునివైపుతిరగక శాపగ్రస్తురాలిగనే మిగిలి పోయింది.
మీకాలు మనందరికి ఒక హెచ్చరికగా వుంది.
*ఆత్మీయుడైన భర్తకు* *అవరోధాలు కలిగించ*
*కుండ సహకారిగా జీవించే ధన్యత కలిగి వుండాలని ప్రతీ స్త్రీని కోరుతున్నాను*.
1⃣9⃣ 🌹 *దెలీలా* 🌹
*ఓ ఆధ్యాత్మిక నాయకుణ్ణి*
*సర్వనాశనం చేసిన స్త్రీ*
దెలీలా విగ్రహారాధనకు అలవాటైన ఫిలిష్తీయులకు చెందిన స్త్రీ. నైతిక విలువల్ని అంతగా పట్టించుకోని స్త్రీ.తన శరీరానికి ఎలాంటి గౌరవం
ఇవ్వకుండా వేశ్యలా ఇష్టమైనవాళ్ళకు సమర్పిస్తూ వుండేది.
రాహేబును గురించి చెప్పినట్లు ఈమెను గురించి బైబిల్ వివరంగా చెప్పడం లేదు.(యెహోషువ2:1)
ఓ ఆధ్యాత్మిక నాయకుణ్ని
సర్వనాశనం చేసిన స్త్రీగా దెలీలా పేరు ప్రసిద్ది కెక్కింది.
ఓ స్త్రీగా తాను ఓ పురుషునికి సహచారిణిగా
జతగా ఉండేందుకు దేవునిచేత సృజింపబడింది.
అయినా దేవుని చిత్తాన్ని ఎదిరించి విచ్చలవిడిగా ప్రవర్తించి జీవితాన్ని దిగజార్చుకుంది.
పురుషునికి ప్రతిపక్షం వహించి నాశనకారిగా పేరు పొందింది.
సంసోను జీవితాన్ని అంతగా నాశనం చేసేందుకు
*సంసోను ఓ అసాధారణ*
*దైవసేవకుడు*
జన్మింపక ముందే దేవునికి సమర్పింపబడి *నాజీరు* గా ప్రసిద్దికెక్కాడు.
న్యాయాధి13:2-5;24-25)
ఇతని పొడవైన వెంట్రుకలే
అతని సమర్పణను చాటి చెప్పాయి.
ఇశ్రయేలు ప్రజలకు ఇరవై సంవత్సరాలు న్యాయాధిపతిగా వుండి వాళ్ళను పరిపాలించి న్యాయం తీర్చాడు (న్యాయాధి16:31)
*సంసోను పేరుకు అర్థం చిన్న సూర్యుడని అర్థం*
అతడు పుట్టినప్పుడు తల్లీదండ్రుల సంతోషానికి అవధులు లేవు.
శతాబ్దాల తరువాత యేసుప్రభువు జన్మ సందర్బంగా దూతలు ప్రకటించిన రీతిగాసంసోను జన్మ విధానం జరిగింది.(లూకా1:26-38)
సమ్సోను తల్లికి మొదట్లో సంతానం లేనందువల్ల *అతని జన్మ ఓ అద్బుత కార్యంగాపరిగణింపబడింది*
సంసోను పెరిగి పెద్దవాడై
దైవాశ్శీలు పొంది గొప్ప నాయకునిగా అభివృద్ది చెందాడు.
*యూదా గోత్రములో ఉద్బవించిన అతి బలశాలి అసాధారణ బలపరాక్రమములు కలవాడు*
(న్యాయాధి14:5-6;15:13:16) *శత్రువు లెవ్వరూ గెలవలేక పోయారు*
ఫిలిష్తీయుల చేతుల్లోంచి ఇశ్రాయేలీయుల్ని విడుదలగావిస్తాడని సమ్సోనును గూర్చి దేవుడు ముందే చెప్పాడు.
సంసోను బలవంతుడైనా...
*నైతికంగాబలహీనుడు*
*వట్టి చేతుల్తో సింహాన్ని చీల్చివేసిన ఆ మనిషి లైంగిక వాంచల్ని ఆధీనంలో వుంచుకోలేకపోయాడు*
దెలీలా చేతిలో పడి మరీచెడిపోయాడు.
అతడుఆమెనుపెళ్ళాడలేదు.భార్యగా ఆమెను
తన ఇంటికి తీసుకెళ్ళలేదు.
*అతడే ఆమెకు* *ప్రేమికుడుగా మారి ఆమెతో నివసించాడు*
సంసోను దెలీలతో వుంటున్న విషయం ఫిలిష్తీయ పెద్దలకు తెలిసి
దెలీలాను ఆకర్షింపజేసి సంసోను పతనానికి దారితీసే కుట్రలోకి లాగారు.
సైనికబలం ఏమీ చేయలే నప్పుడు కుయుక్తులు ప్రయోగింపబడతాయి.
దెలీల సంసోను బల ప్రయోగాన్ని తెలుసు కోవడానికి తాను చేయగల మోసం తాను చేసింది.
కపట నాటకంతో ప్రయత్నించిన ప్రతిసారీ దెలీలకు ఓటమి సంభవించింది.
ఆమె హృదయపూర్వకంగా సమ్సోను పతనం కోసం మళ్ళీమళ్ళీ ప్రయత్నించిం
ది.
ప్రేమభావాలు దెబ్బతిన్న స్త్రీ పాత్రను పోషిస్తోంది.
*మూడుసార్లు నన్ను మోసగించావు.నీ బల రహస్యాన్ని చెప్పడానికి నీవువెనకాడుతున్నావు*
(న్యాయాధి16:15)
దెలీల సంసోనును బాగా బలహీనపర్చింది.ఆమె కౌగిట్లో సంసోను మైకంలో కరిగి పోయాడు.చివరకు దెలీలాకు అసలు రహస్యం చెప్పాడు.
*నా బలరహస్యం నా పొడవైన వెంట్రుకల్లో వుంది* *నా వెంట్రుకలం కత్తోరిస్తే నేను మామూలు మనిషిగా మారతాను*
(న్యాయాధి16:17)
దెలీల ఫిలిష్తీయుల సర్దారులకు ఈ వర్తమానం
చేరవేసింది.
ఈ వర్తమానం విన్న ఫిలిష్తీ సర్దారులు డబ్బు తీసుకొని శీఘ్రముగా వచ్చారు.
తన తొడలమీద నిద్రపోతున్న సంసోను ఏడు జడలు కత్తిరించే టప్పుడు దెలీలా విజయం సాధించి నంతగా సంతోషించింది.
*వెంట్రుకలు కత్తిరింపబడి నప్పుడే దేవుడు అతడ్ని విడిచి పెట్టాడు*
( న్యాయాధి16:20)
*తనకుతానుచేసుకున్న తప్పుఫలితంగా తన బలసంపదను దైవ సన్నిధినీ పోగొట్టుకొని దీనావస్థకు గురైనాడు*
ఫిలిష్తీయులు అతడ్ని పట్టుకొని కళ్ళు ఊడబెరికి
గాజాను తీసుకొచ్చి ఇత్తడి సంకెళ్ళతో అతడ్ని బంధించారు.బంధీగృహంలో అతని చేత తిరగలి విసరజేశారు.అప్పటికి అతని తలవెంట్రుకలు మొలవడం మొదలెట్టాయి.
*దాగోనుదేవతకు*
సంసోనును బలి ఇవ్వడానికి ప్రజలంతా కూడుకున్నారు.
సంసోనును ఆట పట్టించేందుకు రెండు స్తంభాలమధ్య నిలువబెట్టి పరిహసిస్తున్నారు.గేలిచేస్తున్నారు.సంసోనుబాధతో...... *యోహోవా ప్రభువా!దయచేసి నన్ను జ్ఞాపకము* *చేసుకో* !
*ఈ ఒక్కసారి నన్ను బలపరచు* *ఫిలిష్తీయులను ఈ ఒక్కసారి ప్రతీకారం తీర్చుకోవడానికి సమ్మతించమని* ప్రార్థించాడు.
*నేను ఫిలిష్తీయులు మరణిస్తాం* అంటూ.. బలంగా రెండు స్తంభాలనూ లాగగనేఅక్కడున్నమూడువేల మందిప్రజల,సర్దారులు మరణించారట.
💥 దెలీలా దేవుణ్ని ఎరుగదనే ఒక్క సాకు మాత్రమే కనబడుతోంది.
దైవశాసనాలు ఆమెకు తెలియవు.కనీసం ఒక అన్య స్త్రీగా ఆమెకు
ఈ సాకు మిగిలింది.
జ్ఞాని సోలొమోను
సంసోను దెలీల ప్రళయాంకాన్ని వర్ణిస్తూ...
.".......................
*మనసును*
*బంధకముల వంటి* *చేతులునుకలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించు* *కొందరు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు*. అని చెప్పాడు.
(ప్రసంగి 7:26)
సొలొమోను వర్ణిస్తోన్న చెడు స్త్రీ దెలీలాకు సాదృశ్యంగ వుంది.
*వేశ్య లోతైన గుంట ఆమె* *తో సాంగత్యం చేసేవాళ్ళు ఎన్నటికీ తిరిగి రారు జీవన మార్గాన్ని వాళ్ళు చేరుకో లేరు* (సామెతలు2:19)
వేశ్యాసాంగత్యం హృదయంమీద మోసుకెళ్ళే నిప్పుల కుంపటితో సమానము.(సామె2:27)
💥 యెహోవాదేవుని ఆమె
విశ్వసించలేదు. ఆమె తన ప్రజలతో పాటు దాగోను దేవత విగ్రహాన్నిమ్రొక్కుతూ వచ్చింది. చరిత్రలో స్త్రీ స్థాయి మగవాడికంటే అతితక్కువగావున్నదేశంలో ఆమె దేశస్తులైన ఫిలిష్తీయులలో కొందరు నాయకులు ఆమె తలుపు కొడుతున్నారు.అందుకామె
సంసోనుబలరహస్యమును కనుక్కోడానికి ఉపక్రమించింది.
స్త్రీగా తాను చేయగల మోసం చేసింది.
*మొట్టమొదటి పథకం పొగడ్త* కపట నాటక మాడుతూ సంసోనును చదరంగంలో ఒక పావులా
తయారుచేసింది.
💥 దెలీలా తనతో కల్సి జీవిస్తూ,ప్రేమిస్తోన్నా
సంసోను ప్రవర్తన
*ఆమెలో భావాల్ని* *మార్చలేక పోయింది*-. ఆమెస్వభావంలో ఎలాటి మార్పూరాలేదు.సంసోనును దెలీలా మళ్ళీమళ్ళీ పడగొట్టేందుకు ప్రయత్నించింది.
💥 *భక్త పౌలు*
*కొరింథు క్రైస్తవులకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు* ఇది దెలీలాకు సంబంధించిన విషయం
వాళ్ళు ఆశించిన ప్రకారం
మనం చెడుకార్యాలు చేయకుండ వుండేందుకు
ఆ విషయాలు మనకు దృష్టాంతరంగా వున్నాయి.
(1కొరింథీ 10:6) హెచ్చరికల్ని త్రోసిపుచ్చటం తెలివైన పనికాదు.
👉🏾 *ఓ ఆధ్యాత్మిక* *నాయకుణ్ణి సర్వనాశనం చేసిన స్త్రీ దెలీలా* బైబిల్ లోని ఆమె పాత్రను తెలుసుకున్నాము.దేవుని సన్నిధిని పోగొట్టుకున్న సంసోనులా కాక మనము ఆయన ఆయన సన్నిధిని కోరుకుందాము.ఆమెన్.
*దైవాశ్శీస్సులు*
సేకరణ:
*శ్రీమతిజెవిమలకుమారి*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి