*క్రీస్తు విరోధి ఎవరు?* *బైబిలు ఇచ్చే జవాబు* క్రీస్తు విరోధి కేవలం ఒక వ్యక్తో లేదా ఒక సంస్థో కాదు. ఎందుకంటే “అనేకులైన క్రీస్తు విరోధులు” ఉన్నారని బైబిలు చెప్తుంది. (1 యోహాను 2:18) అయితే “క్రీస్తు విరోధి” అనే గ్రీకు పదానికి “క్రీస్తు వ్యతిరేకి (లేదా క్రీస్తుకు బదులు)” అని అర్థం. క్రీస్తు విరోధులు ఏమి చేస్తారంటే: యేసే క్రీస్తని (మెస్సీయ) లేదా ఆయన దేవుని కుమారుడనిఒప్పుకోరు.—1 యెహాను 2:22. దేవుడు అభిషేకించిన క్రీస్తును వ్యతిరేకిస్తారు.—కీర్తన 2:1, 2; లూకా 11:23. తామే క్రీస్తు అన్నట్లు నటిస్తారు.—మత్తయి 24:24. క్రీస్తును అనుసరించేవాళ్లను హింసిస్తారు. అయితే తన అనుచరులను హింసిస్తే తననే హింసిస్తున్నట్లు యేసు భావిస్తాడు.—అపొస్తలుల కార్యములు 9:5. దేవుని నియమాలు పాటించకుండా మోసాలు చేస్తూ పైకిమాత్రం తాము క్రైస్తవులమని చెప్పుకుంటారు.—మత్తయి 7:22, 23; 2 కొరింథీయులు 11:13. క్రీస్తు విరోధులు ఏమి చేస్తారో చెప్పడమే కాకుండా, అలాంటి వాళ్లందర్నీ బైబిలు “క్రీస్తు విరోధి” అని పిలుస్తోంది. (2 యోహాను 8) మొదటిసారిగా క్రీస్తు విరోధులు అపొస్తలుల కాలంలో కనిపించారు. అయితే వాళ్లు ఇప్పటివరకు చురుకు...