ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

క్రీస్తు విరోధి ఎవరు. బైబిలు ఇచ్చే జవాబులు

*క్రీస్తు విరోధి ఎవరు?*

*బైబిలు ఇచ్చే జవాబు*

క్రీస్తు విరోధి కేవలం ఒక వ్యక్తో లేదా ఒక సంస్థో కాదు. ఎందుకంటే “అనేకులైన క్రీస్తు విరోధులు” ఉన్నారని బైబిలు చెప్తుంది. (1 యోహాను 2:18) అయితే “క్రీస్తు విరోధి” అనే గ్రీకు పదానికి “క్రీస్తు వ్యతిరేకి (లేదా క్రీస్తుకు బదులు)” అని అర్థం. క్రీస్తు విరోధులు ఏమి చేస్తారంటే:

యేసే క్రీస్తని (మెస్సీయ) లేదా ఆయన దేవుని కుమారుడనిఒప్పుకోరు.—1 యెహాను 2:22.

దేవుడు అభిషేకించిన క్రీస్తును వ్యతిరేకిస్తారు.—కీర్తన 2:1, 2; లూకా 11:23.

తామే క్రీస్తు అన్నట్లు నటిస్తారు.—మత్తయి 24:24.

క్రీస్తును అనుసరించేవాళ్లను హింసిస్తారు. అయితే తన అనుచరులను హింసిస్తే తననే హింసిస్తున్నట్లు యేసు భావిస్తాడు.​—అపొస్తలుల కార్యములు 9:5.

దేవుని నియమాలు పాటించకుండా మోసాలు చేస్తూ పైకిమాత్రం తాము క్రైస్తవులమని చెప్పుకుంటారు.​—మత్తయి 7:22, 23; 2 కొరింథీయులు 11:13.

క్రీస్తు విరోధులు ఏమి చేస్తారో చెప్పడమే కాకుండా, అలాంటి వాళ్లందర్నీ బైబిలు “క్రీస్తు విరోధి” అని పిలుస్తోంది. (2 యోహాను 8) మొదటిసారిగా క్రీస్తు విరోధులు అపొస్తలుల కాలంలో కనిపించారు. అయితే వాళ్లు ఇప్పటివరకు చురుకుగా ఉన్నారు. ఇలా జరుగుతుందని బైబిలు ముందుగానే చెప్పింది.—1 యోహాను 4:3.

*క్రీస్తు విరోధులను ఎలా గుర్తుపట్టవచ్చు?*

వాళ్లు యేసు గురించిన తప్పుడు బోధలను ప్రచారం చేస్తారు. (మత్తయి 24:9, 11) ఉదాహరణకు, త్రిత్వంగురించి బోధించేవాళ్లు లేదా యేసు సర్వశక్తిగల దేవుడని చెప్పేవాళ్లు “తండ్రి నాకంటె గొప్పవాడు” అని చెప్పిన యేసు బోధల్ని వ్యతిరేకిస్తున్నట్లే.​—యోహాను 14:28.

దేవుని రాజ్యం పనిచేసే విధానం గురించి యేసు చెప్పినదాన్ని క్రీస్తు విరోధులు ఒప్పుకోరు. ఉదాహరణకు, క్రీస్తు మానవ ప్రభుత్వాల ద్వారా పరిపాలిస్తున్నాడని కొంతమంది మతనాయకులు చెప్తారు. కానీ వాళ్లు చెప్తున్నదానికి, యేసు చెప్పినదానికి పొంతన కుదరడం లేదు. యేసు ఏమి చెప్పాడంటే, “నా రాజ్యము ఇహసంబంధమైనది కాదు.”—యోహాను 18:36.

యేసు తమ ప్రభువని చెప్పుకుంటారు కానీ రాజ్యసువార్తను ప్రకటించమని యేసు ఇచ్చిన ఆజ్ఞతో సహా ఏ ఆజ్ఞనూ వాళ్లు పాటించరు.​—మత్తయి 28:19, 20; లూకా 6:46;అపొస్తలుల కార్యములు 10:42.


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...