ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మానవుని యొక్క అవసరము

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚



🌈 *మానవుని యొక్క అవసరము గురించిన అద్భుత వాస్తవాలు*




👉   మానవునికి అన్నిటికంటె గొప్ప అవసరమేది? అది తిండా లేక గృహమా లేక ఉద్యోగమా?
మానవుడు చనిపోయిన తరువాత అతనికి ఏమవుతుంది. అతడికి కావలసినంత తిండి, ఉండటానికి స్థలము, ఉద్యోగము తన జీవిత కాలమంతా ఉండినా, చావు మాత్రమే మానవుని ఉనికికి ఆఖరా? కాదు.

👉   *భూమిపైన జీవితం నిత్యత్వానికి ఉపోద్ఘాతము లాంటిది.*

👉   మనం ఇక్కడ భూమిపై అర్హత నిశ్చయింపబడే కాలములో (ప్రోబిషన్ పీరియడ్ లో) ఉన్నాము. మరియు దేవుడు మనలను గమనిస్తున్నాడు. మన నిత్యత్వము ఎలా ఉంటుందో భూమిపై మన జీవితము నిర్ణయిస్తుంది. దేవునికి మన ప్రతి ఒక్కరి జీవితంలో యదార్థత ఏమిటో తెలుసు. మనం మన స్నేహితులను మన మంచితనం గురించి మభ్యపెట్టవచ్చు. కాని దేవునిని మభ్యపెట్టలేము. దేవుని దృష్టిలో అందరము నేరం చేసిన వారమే, ఎందుచేతనంటే మనమందరము ఆయన యొక్క ఉన్నతమైన మరియు పరిశుద్ధమైన ప్రమాణాలకు తక్కువగా ఉంటున్నాము. మానవుడు దేవునితో సహవాసం చెయ్యటానికి సృష్టించబడ్డాడు. అది అతడు నెరవేర్చలేనట్లయితే అతడు భూమిపై ఉనికి కల్గి ఉండుటలో ఆయన తొలి ఉద్దేశాన్ని నెరవేర్చడం లో తప్పిపోయినట్లే.

👉   అతడి పైనున్న పాపం యొక్క అపరాధము తీసివేయబడనట్లయితే దేవునితో ఈ సహవాసాన్ని ఎప్పుడును అనుభవించలేడు. ఇది మానవుని యొక్క గొప్ప అవసరం. ఎలాగు మన పాపం యొక్క అపరాధం తీసివేయబడుతుంది

👉   కేవలం మన యొక్క పాపాలను గూర్చి విచారపడితే చాలదు. నేను న్యాయస్థానంలో బ్యాంకు దోపిడీని గురించి శిక్షింపబడినట్లయితే మరియు న్యాయాధిపతి నా తండ్రి అయితే నేను చేసిన పనికి విచారపడినంత మాత్రాన ఆయన నన్ను వెళ్ళిపోనివ్వడు. ఆయన న్యాయ స్థానంలో న్యాయాధిపతిగా కూర్చుని ఉన్నాడు. కనుక నేను విచారిస్తున్నప్పటికి మరియు ఆయన నన్ను తన కుమారునిగా ప్రేమిస్తున్నప్పటికి నేను చేసిన నేరానికి ఆయన నన్ను తప్పనిసరిగా శిక్షించాల్సివుంది.

👉   మనము దేవునిని ఒక న్యాయవంతుడుగా నమ్మినట్లయితే ఆయన తప్పనిసరిగా మానవమాత్రుల కంటె ఎక్కువ న్యాయవంతుడు. అప్పుడు ఆయన మనం విచారించినంత మాత్రాన లేక ఆయన మనలను ప్రేమించినంత మాత్రమున ఏ విధంగా మనలను వెళ్ళిపోనిస్తాడు? న్యాయం శిక్షను అవశ్యంగా ఆడుగుతుంది.

👉    అయితే నా తండ్రి నాకు సహయం చెయ్యటానికి న్యాయస్థానంలో ఒక విధంగా చేయగలడు. చట్ట ప్రకారం నాకు ప్రాయశ్చిత్తంగా ఒక లక్ష రూపాయలు జరిమానా అయినట్లైతే, నాకు తీర్పు ఇచ్చిన తరువాత. ఆయన కష్టపడి సంపాదించిన సొమ్ములో ఒక లక్షరూపాయలు తీసుకుని నాకిచ్చి నా కుమారుడా! ఇదిగో డబ్బు, వెళ్ళి నీ జరిమానా కట్టి స్వతంత్రుడవుకా అని చెప్పవచ్చు. ఒక న్యాయాధికారిగా నన్ను శిక్షించవచ్చు మరియు ఒక తండ్రిగా అప్పుడు ఆ శిక్షను చెల్లించవచ్చును.

👉   ఇదే దేవుడు చేసింది. ఒక న్యాయాధికారిగా మనందరిని మన పాపాలను బట్టి నిత్య మరణంలోనికి పంపాలి. కాని ఆయన మనలను ప్రేమించాడు. కాబట్టి యేసుక్రీస్తు అనే వ్యక్తి రూపంలో భూమిపైకి దిగివచ్చి ఆ శిక్షను ఆయనే చెల్లించాడు.క్రీస్తు మన పాపాల కొరకు చనిపోయినాడు.

👉   కాని ఇప్పుడు మనం చేయవలసింది కొంత వుంది. ఎప్పుడు నాతండ్రి న్యాయస్థానంలో డబ్బును నాకు ఇవ్వజూపాడో, అప్పుడు నేను తీసుకోననట్లయితే నేను స్యతంత్రుడను కాలేను. క్రీస్తు ద్వారా దేవుడు మనకు ఇవ్వజూపుతున్న క్షమాపణ సరిగా అటువంటిదే. అది మనం స్వీకరించవలసివుంది. మనము దానిని అంగీకరించనట్లయితే, దాని నుండి ఉపయోగాన్ని పొందలేము




💫 *దేవుని కే మహీమ కలుగును గాక అమెన్*✨



💐 *మీ స్నేహితులకు షేర్ చేసి మీ వంతు దేవుని పని చేయ్యండి*💐

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...