ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సిప్పోరా

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚




*సిప్పోరా*


*సిప్పోరా అనే మాటకు పిచ్చుక అని అర్థం*



👉 *ఈమె మిద్యానీయుడైన ఇత్రో కుమార్తె*

మోషే ఒకానొక సమయములో తన జీవితము తారుమారై
మతిలేనివాడై మిద్యాను దేశమునకు పారిపోయాడు.

అటువంటి సమయంలో సిప్పోరా జీవితములోనికి ప్రవేశించి
అతని జీవితానికి *చక్కని బాటగా* నిలిచింది.



   👉   *భర్తను బలపరచి ప్రోత్సహించే భార్య*

మనము మోషేను గురించి చెప్పుకున్నంతగా *అతని భార్య అయిన సిప్పోరా* గూర్చి చెప్పుకోక పోయినా ప్రతి పురుషుని వెనుక అతనిని బలపరిచే భార్య వుంటేనే తప్ప ఆ పురుషుడు గొప్పవాడు కాలేడు అని చాలా మంది
చెప్తూ వుంటారు

అది నిజం కూడ.

బహుషా ఈ సిప్పోరా కూడ మోషే జీవితంలో అంత గొప్ప పాత్ర పోషించే వుంటుంది

ఎందుకంటే ఒకానొక సమయంలో మోషే తన కుమారుని సున్నతి విషయములో  దేవుడు మోషను చంప చూడగా *సిప్పోరా* ఆ సంగతి గ్రహించి అతని కుమారునికి సున్నతి చేసి మోషేను మరణం నుండి తప్పించి నట్లుగా  మనము చూస్తు న్నా ము.
(నిర్గమ4:25)




 👉  *సిప్పోర పరోక్ష సేవ*

*తన  భర్త  తీరిక  లేకుండ సేవ  చేస్తున్నప్పుడు*
*అతని సేవకు ఏనాడు అడ్డు లేదు*
అందుకే మోషే అంత గొప్ప సేవ చేయగలిగాడు

ప్రతి పురుషుని వెనుక *ఇటువంటి స్త్రీ కలిగి వుండుట ఎంత ధన్యత*

ఈ రోజుల్లో తన భర్త సేవ చేస్తుంటే
సహకరించవలసిందిపోయి
ఎంతోమంది భార్యలు ఆటంకమౌతున్నారు

సిప్పోరా దేవుని గురించి
ఎరిగి వున్నదో లేదో తెలియదు కానీ మేము దేవుని ఎరుగుదుము నేడు చెప్పుకుంటున్న స్త్రీలకంటె సిప్పోర తన భర్త పట్ల తన భాధ్యతను ఎంతో చక్కగా నిర్వర్తించినట్లుగా చూస్తున్నాము

*సిప్పోరా మోషేతో* *జీవించినంత కాలం అతని* *తోడునీడగా నిలిచిందేకానీ *తన పరిధి దాటి ఏనాడూ ప్రవర్తించలేదు*




👉 *సిప్పోరాగొప్పదనం*

ఒక సమయములో మోషే
సీనాయి పర్వతముపై నలువది రోజులు గడపవలసి వచ్చినపుడు.
ఆ నలువది దినములు ఈమె పిల్లలను పెట్టుకొని ఒంటరిగ ఎలా గడప గలిగిందో
ఆలోచన చేస్తేనే ఆమె గొప్పతనం అర్థమౌతుంది.
పరిస్థితులన్నిటిని తట్టుకొని
మోషేకు ఇబ్బంది లేకుండ ,తొను ఇబ్బందిపడినా తన సంసారాన్ని ముందుకు నడిపించింది. సాధారణంగా *భర్త గొప్పవాడయితే భార్యకూడ పేరు ప్రఖ్యాతలే కోరుకుంటుంది.వాటికోసమే తపిస్తుంది*




 👉 *గుణవతియైనభార్య*

అయితే సిప్పోర అందుకు భిన్నంగా వుంది...

*తన భర్త ఎంత గొప్పవాడు అయినప్పటికీ*
*తాను మాత్రం ఆ పేరుప్రఖ్యాతలకు దూరంగావుంది*
 అది ఆమెలోని గొప్పతనం అని చెప్పవచ్చు

*ఇటువంటి భార్యను కలిగి యుండుట ముత్యము కంటే అమూల్యము*

*గుణవతియైన భార్య తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టును*

(సామెతలు31:27)

*గుణవతియైన భార్య తన ఇంటివారికి వెలితి కలుగనీయదు*
(సామెతలు31:11)

*గుణవతియైన భార్య తన ఇంటి లాభప్రాప్తి కొరకు బహుగా కష్టపడి పని చేయును*
(సామెతలు31:27)

ఈ అంశము చదువు ప్రతి స్త్రీ సిప్పోరాలా భర్తను *ఆత్మీయంగానూ*
*సేవలో* *ప్రోత్సాహకరంగా*
వుండి మంందుకు నడిపించి దీవెనకరంగా వుండేలా ఆ
ప్రభువు సహాయము చేయునుగాక. ఆమెన్*




💫 *దేవుని కే మహీమ కలుగును గాక అమెన్*✨




💐 *మీ స్నేహితులకు షేర్ చేసి మీ వంతు దేవుని పని చేయ్యండి*💐

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...