📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚
✨ *విప్లవం గురించిన అద్భుత వాస్తవాలు*✨
👉 *విప్లవం అనే మాట ఈ దినాల్లో మామూలు మాట అయిపోయింది. మనందరిలో విప్లవం రావలసిన పరిస్థితి గురించి ఆలోచిద్దాం. మనందరము మన తల్లిదండ్రుల వద్ద నుండి ఏదో ఒక మతాన్ని వారసత్వంగా పొందాము. మరియు ఆ మతముతో పాటు కొన్ని అభిప్రాయములను కూడా పొందాము. ఈ అభిప్రాయాలు అనేక మందిని వారికి చిన్నతనము నుండి బోధింపబడిన వాటిని ప్రశ్నించకుండా ఉండేలా చేస్తున్నవి.*
👉 *శాస్త్రానికి సంభందించిన విషయంలో, మానవుడు ఎప్పుడూ తన పూర్వులు చెప్పిందే నమ్మినట్లయితే ఈ పాటికి అభివృద్ధి ఉండేది కాదు. ఒక ఉదాహరణ గురించి ఆలోచించండి. కొన్ని వేల సంవత్సరాల వరకు, భూమి విశ్వానికి మధ్యలో ఉన్నదని సూర్యుడు, ఇతర నక్షత్రాలు భూమి చుట్టూ పరిభ్రమిస్తున్నవని మానవులు నమ్మేవారు. కాని 450 సంవత్సరాల క్రితం కొపెర్నికస్ అనే పేరుగలతడు తన పూర్వులు నమ్మిన దానిని గూర్చి ప్రశ్నించి వారు నమ్మినది తప్పని ఋజువు చేసాడు. మతానికి సంబంధించిన విషయంలోనే, అయ్యో, ప్రజలు గ్రుడ్డిగా వారి తల్లిదండ్రులు లేక పూజారులు చెప్పినవి నమ్ముతారు. నీ గురించి ఏమిటి? నీ మతపరమైన నమ్మకాలు ఏమిటి? అవన్నీ కేవలం నీ యొక్క పూర్వికుల నుండి గ్రుడ్డిగా వారసత్వంగా వచ్చినవా? లేక దేవుని గుర్చి, నిత్యత్వం గూర్చి నీ స్వంత ఆలోచనా జ్ఞానంతో ఆలోచించి, నీకు నీవుగా ఒప్పుకున్న వాటిని గూర్చి నిశ్చయత కలిగి ఉన్నావా?*
👉 *యేసుక్రీస్తు ఇప్పటివరకు ప్రపంచం చూచియున్న వారిలో గొప్ప విప్లవాత్మకమైనవాడు. ఎందుచేతనంటే ఆయన మానవుని లోపటనుండి మార్పు చేయడానికి వచ్చారు. ఎప్పుడైతే మానవుడు ఈ విధమైన అంతరంగిక మార్పును అనుభవిస్తాడో అప్పుడు బాహ్యమైన మార్పు దానికదే కలుగుతుంది. మనం మొదట సమస్యయొక్క మూలము గూర్చి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక వైద్యుడు ఒక రోగికి చికిత్స చేసేటప్పుడు బాహ్యమైన లక్షణాలకు మాత్రమే చికిత్స చేయడు. అతడు రోగానికి చికిత్స చేస్తాడు. ఉదాహరణకు కేన్సరు (రాచపుండు) వ్యాధితో భాదపడుతున్న ఒక వ్యక్తి ఆకలి లేదని ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఏ వైధ్యుడైనా కేన్సరుకు చికిత్స చేయకుండా కేవలం ఆకలి లేనందుకు మందు ఇచ్చినట్లయితే అతడు వట్టి మూర్ఖుడు అవుతాడు. అలాగునే ఎవరైతే మన సమస్యలకు బాహ్యమైన విప్లవాత్మక మార్పు పరిష్కారం అని ఆలోచిస్తారో వారుకూడ అటువంటి పొరపాటు చేసేవారే అవుతారు. వారు లక్షణాలను మాత్రం పోయేలా చేయటనికి ప్రయత్నించుతారు. కాని వ్యాధి మాత్రం అలాగునే నిలిచి వుంటుంది.*
👉 *మానవునిలో మార్పు రానంతవరకు ప్రపంచము, సంఘము ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లేదు.*
💫 *దేవుని కే మహీమ కలుగును గాక అమెన్*✨
💐 *మీ స్నేహితులకు షేర్ చేసి మీ వంతు దేవుని పని చేయ్యండి*💐
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి