ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఫిబ్రవరి, 2021లోని పోస్ట్‌లను చూపుతోంది

భక్తి చేస్తున్నావ్!దానిలో భయముందా?(part-1)

భక్తి చేస్తున్నావ్! దానిలో భయముందా?  ——-▫️(part-1)▫️——— భయము లేని భక్తి వలన, భక్తిలేని భయము వలన కలిగే ప్రయోజనం శూన్యం. భయముతోకూడిన భక్తివలన శ్రేష్టమైన వాగ్ధానాలు స్వతంత్రించుకోగలము.  యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు. (కీర్తనల 34 : 9) భయభక్తులు అంటే?  🔸దేవుని పట్ల, దేవుని వాక్యముపట్ల భయముతో కూడిన గౌరవం. 🔸దేవుని మహత్యాన్ని, గొప్పతనాన్ని, అధికారాన్ని గుర్తించి ఆయనకు వ్యతిరేకంగా ఏదైనా చెయ్యడానికి భయపడడం.  భక్తికి లోటేలేదు. కానీ ఆ భక్తిలో భయములేదు. భయములేని భక్తి , భక్తిపరులం అని చెప్పుకోవడానికి పనికివస్తుందేమోగాని, ప్రభువుతో సహవాసాన్ని మాత్రం నెలకొల్పలేదు. భయములేని భక్తి, నిన్ను నీవు ఘనపరచుకోవడానికి పనికివస్తుందేమోగాని, ఆ భక్తి అన్యజనులమధ్య దేవుని నామాన్ని ఘనపరచలేదు సరికదా, దూషణ పాలు చేస్తుంది.  👉మెడలో బంగారపు సిలువ  👉“యేసే గృహాధిపతి” అనే బోర్డులు  👉గోడలకు వాక్యాలు  🔸దేవుని మందిరానికి వెళ్లడం  👉దశమభాగాలివ్వడం  👉సేవకులకు ఆతిధ్యమివ్వడం  👉పేదవారికి సహాయపడడం  ...

భక్తి చేస్తున్నావ్!దానిలో భయముందా?(part-2)

భక్తి చేస్తున్నావ్! దానిలో భయముందా?  ——-▫️(part-2)▫️——— *భయభక్తులు అంటే?* 🔸దేవుని పట్ల, దేవుని వాక్యముపట్ల భయముతో కూడిన గౌరవం. 🔸దేవుని మహత్యాన్ని, గొప్పతనాన్ని, అధికారాన్ని గుర్తించి ఆయనకు వ్యతిరేకంగా ఏదైనా చెయ్యడానికి భయపడడం.  అంతరంగంలో లేని భక్తి, బాహ్యంగా ప్రదర్శించినంత మాత్రాన, అది నిజమైన భక్తి కానేరదు. (రోమా 2:28,29) “భయపడకుడి” అనే మాట పరిశుద్ధ గ్రంధములో 366 సార్లు ఉందని చెబుతారు. అంటే లీపు సంవత్సరమును కూడా విడిచిపెట్టకుండా, రోజుకొకసారి ప్రభువు “భయపడకుడి” అనే  వాగ్ధానం మనకిచ్చినట్లయ్యింది. మనమేమో, ఆ వాగ్ధానమిచ్చిన దేవునికే భయపడడం మానేసాము.  *దేవునికి భయపడే వానిలో వుండే లక్షణాలు:* 🔸పశ్చాత్తాపము  🔸పవిత్రత  *పవిత్రత:* పవిత్రత అంటే? శరీరానికి, ఆత్మకును ఎట్లాంటి కల్మషము అంటకుండా జీవించడం.  నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది.                -1 పేతురు 1 : 14 ♻️ *యోసేపుగారికి గల పవిత్ర జీవితం* యోసేపు ఐగుప్తులో బానిసగా జీవితాన్ని జీవిస్తున్నాడు. పోతీఫరు భార్య అ...

శ్రమల కాలం (Lent Days).

✳ *అంశం: శ్రమల కాలం (Lent Days).. ✍* *ఈ బుధవారంతో ఉపవాసకాలం మొదలవుతుంది.*  👉 *ఈ శ్రమల దినములను అందరూ ఆచరిస్తూ, ఎక్కువ సమయం ప్రార్ధనలో గడుపుతూ, క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ, ఆధ్యాత్మికంగా పెరగడానికి ఈ శ్రమల కాలం ఎంతో ఉపయోగపడును.*   క్రీస్తు నందు ప్రియమైనవారలారా, మేము *ఈ 40 రోజులు* అధ్యాత్మికముగా మరింతగా బలపడడానికి కూడుకొంటున్నాము అనడంలో తప్పు లేదు.  కాని   *“అధ్యాత్మికముగా బలపడుతున్నాము అనే భ్రమలో దేవుని వాక్యానికి విరుద్ధముగా పనులు చెయ్యడం సరిఅయినది కాదు” అదే ఈ సందేశము యొక్క ఉద్దేశ్యము.* 👉 ఒక రోజు యేసు క్రీస్తు యెరూషలేము పట్టణముకు వెళ్తున్నప్పుడు ఆకలిగొని ఒక అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు. దానికి ఆకులు ఉన్నాయి కాని పండ్లు మాత్రం లేవు. అప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు ఆ చెట్టును శపిస్తాడు, తరువాత ఎండిపోతుంది. వాస్తవానికి అది పండ్ల కాలమే కాదు (మార్కు a11:14) అయినప్పటికీ యేసు క్రీస్తు ఆ చెట్టును శపిస్తాడు.  👉 *దీని నుండి ఒక పాఠం నెర్చుకోనవచ్చు. చాలా మంది విశ్వాసులు కూడా కేవలము కొద్ది కాలము మాత్రమే క్రీస్తు నందు ఫలిస్తారు, ఆ కొద్ది కాలం మాత్రమే దేవునికి భక్తులు...

లెంటు లో మొదటి రోజు భస్మ బుధవారం

*లెంటు లో మొదటి రోజు భస్మ బుధవారపు వాక్య  లెంటు వసంతకాలం ఉపోద్ఘాతం :- లెంటు అనేది చలికాలం తర్వాత వసంతకాలం లో నేల పగుళ్ళను చిల్చు కొని విత్తనాలు మొక్కలు గా బయటకు వచ్చి పూలు పూసి వికసించే కాలం నే లెంటు అంటారు. అయితే వసంతకాలానికి లెంటుకాలానికి ఉన్న సంబంధం ఏమిటి ? భస్మ బుధవారం ఎలా నిర్మయిస్తారు. భస్మ బుధవారం , లెంటు దినాలు, నలభై అను సంఖ్య గురించి కొన్ని సంగతులు పరిశిలిద్దాం 1. *లెంటు కాలం* పరమ : 2 : 12 దేశంలో పాపురం కూత వినబడుతూ ఉందని వేచియుండే దు:ఖసమయం అవతరించిందని తాను వస్తున్నానని ముఖం చూడని మ్మని స్వరం వినబడ నిమ్మని తనను కలుసుకోవడానికి సంఘ వధువును సిద్ధపడమని ప్రభువు చెప్తున్నాడు ఇదే ప్రభువు కొరకు లెంటు లోని సిద్ధ పాటు దేశమంతట పువ్వులు పూసియున్నవి పిట్టలు కోలహాలము చేయ కాలం వచ్చెను. పాపురస్వరం మన దేశంలో వినబడు చున్నది. 2. *లెంటు మరియు వసంత కాలానికి ఉన్న సంబంధం* లెంటు అనేది పాత ఇంగ్లీషు పదం lencten నుండి వచ్చినది లెంటు అనగా వసంత కాలంలో అప్పటి వరకు నేలలో దాగి ఉండిన విత్తనాలు , మొక్కలుగా మారి నేలను చీల్చుకుని బయటకు వచ్చి ఎదిగి పూత పువ్వులు కాయగా మారడం అని మనం చెప్పవచ్చు అనగా హృదయం దు:ఖం...