✳ *అంశం: శ్రమల కాలం (Lent Days).. ✍*
*ఈ బుధవారంతో ఉపవాసకాలం మొదలవుతుంది.*
👉 *ఈ శ్రమల దినములను అందరూ ఆచరిస్తూ, ఎక్కువ సమయం ప్రార్ధనలో గడుపుతూ, క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ, ఆధ్యాత్మికంగా పెరగడానికి ఈ శ్రమల కాలం ఎంతో ఉపయోగపడును.*
క్రీస్తు నందు ప్రియమైనవారలారా, మేము *ఈ 40 రోజులు* అధ్యాత్మికముగా మరింతగా బలపడడానికి కూడుకొంటున్నాము అనడంలో తప్పు లేదు.
కాని
*“అధ్యాత్మికముగా బలపడుతున్నాము అనే భ్రమలో దేవుని వాక్యానికి విరుద్ధముగా పనులు చెయ్యడం సరిఅయినది కాదు” అదే ఈ సందేశము యొక్క ఉద్దేశ్యము.*
👉 ఒక రోజు యేసు క్రీస్తు యెరూషలేము పట్టణముకు వెళ్తున్నప్పుడు ఆకలిగొని ఒక అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు. దానికి ఆకులు ఉన్నాయి కాని పండ్లు మాత్రం లేవు. అప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు ఆ చెట్టును శపిస్తాడు, తరువాత ఎండిపోతుంది. వాస్తవానికి అది పండ్ల కాలమే కాదు (మార్కు a11:14) అయినప్పటికీ యేసు క్రీస్తు ఆ చెట్టును శపిస్తాడు.
👉 *దీని నుండి ఒక పాఠం నెర్చుకోనవచ్చు. చాలా మంది విశ్వాసులు కూడా కేవలము కొద్ది కాలము మాత్రమే క్రీస్తు నందు ఫలిస్తారు, ఆ కొద్ది కాలం మాత్రమే దేవునికి భక్తులుగా ఉంటారు. మిగతా రోజులలో సాతానుకు భక్తులుగా ఉంటారు. Lent Days పాటించే వారిలో కూడా కొంతమంది ఇలానే ఉంటారు. కేవలం ఈ Lent Days లో మాత్రమే ప్రార్థన చెయ్యడము, బైబిలు చదవటం, ప్రతి దినం లేదా ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళడం చేస్తుంటారు.*
👉 మరి కొంత మంది ఈ Lent Days లో మందు త్రాగను, సిగరెట్లు కాల్చను, సినిమాలు, సీరియల్స్ చూడను, బూతులు మాట్లాడను, పార్టీలు చేస్కోను, మాంసం తినను, తెలుపు రంగు వస్త్రాలు మాత్రమే వేస్కుంటాను అని ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప తీర్మానాలు చేస్తుంటారు.
*కేవలము ఈ Lent Days లో మాత్రమే పరిశుద్ధంగా జీవించాలి, మిగతా రోజులలో నా ఇష్టానుసారముగా జీవిస్తాను అంటే, ఆ అంజూరపు చెట్టు ఏ విధంగా ఎండిపోయిందో అదే విధంగా నువ్వు మరణించిన తరువాత నరకంలో పడవేయబడటం ఖాయం (మత్తయి 3:8)*
*దేవుని యందు భయ భక్తులు గలవారు సంవత్సరం అంతా కూడా పరిశుద్ధంగా జీవిస్తారు. పరిశుద్ధంగా జీవించడానికి, సమాధానం కలిగి ఉండటానికి ప్రయత్నిస్తారు*
(1 థెస్సలోనికయిలకు 4:4,5, హెబ్రీయులకు 12:14)
👉 *అంతే కాని ఒక కాలంలో మాత్రమే మేము పరిశుద్ధముగా జీవిస్తాము అని తీర్మానం చేసుకోరు.*
🌹 *లెంట్*. 🌹
లెంటును నిర్వహించే వారు
ఆచారాలకు అతీతంగా నిర్వహిస్తే అది సంఘాని కెంతో మేలు చేస్తుంది.
లెంట్ పేరిట 40 రోజులపాటు చర్చిలో కూడుకొని,ఉపవాస ప్రార్థన
చేస్తారు.
🔹 *క్రీ.శ.333* లో ఈ లెంట్ *6రోజులకు పొడిగించి పరిశుద్ద వారంగా జరుపుకొనేవారు.*
*క్రీ.శ 331* లో లెంట్....
*లెంట్ డేస్ గా మార్చి ఈస్టర్ కు ముందు రోజు శనివారమువరకు46 రోజులు జరుపుకొనేవారు.*
కొద్దికాలానికి వాటి మధ్యలో వచ్చే 6 ఆదివారాలను మినహాయించి మిగిలిన *40రోజులు* ఉపవాస దినాలుగా చేయడం ప్రారంభించారు.
*క్రీ.శ.390* లో లెంట్ డేస్ ప్రారంభాన్ని *భస్మం బుధవారంగా జరపడం ప్రారంభించారు.*
*బూడిదెకు ఓలీవనూనె కలిపి నుదిటిపై శిలువ గుర్తు వేసుకొనే ఆచారం మొదలైంది..*
👉🏾 *క్రైస్తవ మండలం కాలం భస్మబుధవారంతో మొదలై ఈస్టర్ ముందు రోజైన పరిశుద్ద శనివారంతో ముగుస్తుంది*.(ఆదివారం మినహాయించి)
✳ *భస్మ బుధవారము* ✳
*" ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు, దుఖించుచు మనః పూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి...... మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి."* (యోవేలు 2:12-13)
♻ *ప రి చ యం* ♻
నిజానికి భస్మ బుధవారం అనే పదం వ్యవహారిక పదం. దీని అధికారిక నామం *'భస్మ దినం'* [The Day of Ashes - [(నొసటిపై) బూడిద ధరించే రోజు].
👉 సరిగ్గా ఈస్టర్ / పునురుథ్థాన దినానికి 46 దినాలు ముందు వచ్చే ఈ దినం, ప్రతి సంవత్సరం ఖచ్చితంగా బుధవారమే వస్తుంది. అందుచేత దీనిని *'భస్మ బుధవారం'* అని పిలవడం పరిపాటి అయ్యింది.
*పాపముల విషయమైన పశ్చాత్తాపానికి, మారుమనుస్సుకు గుర్తుగా, ఆ దినం ఆరాధనకు వచ్చేవారు తమ నొసళ్ళపై సిలువ ఆకారంలో బూడిదను ధరించేవారు.*
🔺 *భస్మ బుధవారం ఆచరించకండి, అసలు బూడిదతో సిలువ వేసుకున్నట్లు బైబిలులో ఎక్కడైనా ఉందా?*
(మత్తయి 11:12, ఎస్తేరు 4:1, యోబు 2:8, దానియేలు 9:3) ఇలా చేసే వారు అందరూ చూపించే రిఫరెన్సులకు, చేసే పనికి అసలు సంబంధం ఉండదు.
▪ *మారుమనసు పొందితే వెళ్లి బాప్తిస్మము పొందండి*
(అపోస్తలుల కార్యములు 2:38).
▪ *తప్పు చేస్తే చేసిన తప్పు దేవుని సన్నిధిలో ఒప్పుకొనండి*
(1 యోహాను 1:19)
*ఇది వాక్యానుసారం,*
🔺 *అంతే కాని నుదుటి మీద బూడిదతో సిలువ వేస్కోకండి. ఇలా చేసినట్లు పాత, కొత్త నిబంధనలో ఎక్కడా లేదు.*
భస్మ బుధవారం మొదలుకొని ఈస్టర్ ముందురోజు శనివారం వరకు *46* రోజులుంటాయి. వాటి మధ్యలో వచ్చే 6 ఆదివారాలను మినహాయించి మిగిలిన 40 రోజుల కాలాన్ని *'లెంట్ Lent' కాలమనియు,* (క్రీస్తు ప్రభుని) శ్రమల థ్యాన కాలమనియు అంటారు.
*ఆదివారాలను లెంట్ కాలంలో లెక్కించరు.*
👉 ఎందుకంటే ప్రతి ఆదివారం, ఒక ఈస్టర్ / పునురుథ్థాన దినమే! విజయోత్సవ దినమే !!
♻ *తారీఖులు నిర్ణయం* ♻
క్రిస్మస్, ప్రతి సంవత్సరం విధిగా డిసెంబర్ 25నే వస్తుంది ( తారీఖు మారదు, అయితే వారం మారుతుంటుంది).
*ఇక ఈస్టర్, దానిపైన ఆథారపడిన భస్మ బుధవారపు తారీఖులు ప్రతి సంవత్సరం మారుతుంటాయి ( వారం మాత్రం మారదు*
▪ *ఈస్టర్ ఆదివారమే వస్తుంది,*
▪ *గుడ్ ఫ్రై డే శుక్ర వారమే వస్తుంది,*
▪ *భస్మ బుధవారం, బుధవారమే వస్తుంది).*
👉 ముందుగా ఈస్టర్ రోజును నిర్ణయిస్తారు.
*మార్చి తర్వాత వచ్చే పౌర్ణమికి దగ్గరలోని ఆదివారాన్ని ఈస్టర్ రోజుగా నిర్ణయిస్తారు.*
👉 ఆక్కడనుండి 46 రోజులు వెనక్కి లెక్కించి, భస్మ బుధవారాన్ని నిర్ణయిస్తారు. ఈస్టర్ ఆదివారానికి ముందువచ్చే ఆదివారాన్ని 'మట్టల ఆదివారం: Palm Sunday' అంటారు. మట్టలాదివారం నుండి ఈస్టర్ ముందు శనివారం వరకున్న 7 రోజులను *'పరిశుద్ధ వారం Holy Week' అంటారు.*
ఏదైనా 40 రోజుల కాలాన్ని లాటిన్ భాషలో *'క్వాడ్రగెసిమ: Quadragesima',*
👉 తెలుగు భాషలో *'మండల కాలం'* అని పిలుస్తారు.
*క్రైస్తవ మండల కాలం భస్మ బుధవారంతో మొదలై, ఈస్టర్ ముందురోజైన పరిశుద్ధ శనివారం తో ముగుస్తుంది (ఆదివారాలు మినహాయించి).*
👉 ఇంగ్లీష్ లో ఈ కాలాన్ని *'లెంట్ Lent'* అంటారు. లెంట్ అనే పదం *'లెంక్టెన్ Lencten'* అనే పదంనుండి వచ్చింది.
👉 *దీని అర్థం= చీల్చుట, చిగుర్చుట.*
*ఆత్మీయంగా ఎండి, బెరడు కట్టిన జీవితాల బెరడును చీల్చుకొని, క్రొత్త చిగురులు ఏర్పడేందుకై ఈ 40 రోజుల శ్రమలకాల థ్యానాలు ఏర్పాటు చేయబడ్డాయి.*
♻ *మండల కాలం / 40 రోజులు* ♻
👉పరిశుద్ధ గ్రంధంలో అనేక సందర్భాలలో *'సిధ్ధపాటు'* కాలంగా 40 దినాలు కేటాయించడం చూస్తాము.
👉 *వీటిలో ఇవి కొన్ని ప్రథానమైనవి*
▪ *ప్రత్యక్ష్య గుడార నిర్మాణ విషయంలో,*
▪ *మోషే దేవును పర్వతంపై వేచివున్న కాలం (నిర్గమ 24:18); ఆజ్ఞలు స్వీకరించే ముందు మోషే కనిపెట్టిన కాలం (ద్వితీ 9:9,10)*
- ఆజ్ఞల సంఖ్య పది మాత్రమే అని బైబిల్లో ఎక్కడా కనిపించదు;
▪ *ఏలీయా దేవుని ప్రత్యక్షతను పొందడానికి చేసిన 40 దినాల ప్రయాణ కాలం (1 రాజులు 19:8-12).*
▪ *అన్నిటికి మించి, మన ప్రభువైన యేసుక్రీస్తు తన బహిరంగ పరిచర్య ప్రారంభానికి ముందు సిధ్ధపాటుగా అరణ్యములో గడిపిన 40 దినాల ఉపవాస కాలం (మాత్తయి 4 :2, లూకా 4:1).*
🔺 ఈ Lent Days ఎవరు ఎలా ప్రవేశపెట్టారో, ఏ ఉద్దేశ్యముతో ప్రవేశపెట్టారో అనేది పక్కన పెడితే ఈ 40 రోజులు కూడా చర్చికి వెళ్లి దేవుని ఆరాధిస్తున్నాము కదా, ఆధ్యాత్మికముగా అభివృద్ధి చెందుతున్నాము కదా అని అంటారు కొంతమంది.
1⃣ *సమాజముగా కూడుకొనండి* (హెబ్రీ 10:24-25) అయితే, ఈ 40 రోజులు మాత్రమే కాదు, మిగతా రోజులలో జరిగే సంఘ ఆరాధనలలో, కుటుంబ ఆరాధనలలో, బహిరంగ సభలలో కూడా పాల్గొనండి.
2⃣ *వాక్యం చదడం, ప్రార్థన చెయ్యడం ఈ 40 రోజులు మాత్రమే కాదు. మిగతా రోజులలో కూడా పాటించండి.*
(కీర్తనలు 1:1, కీర్తనలు 119, 1 థెస్సలోనిక 5:15-18)
3⃣ *ఉపవాస ప్రార్థన రహస్యముగా చేయండి.* (మత్తయి 6:5,16
*విశ్వాసి జీవితంలో ఉపవాసానికి, ఉపవాస ప్రార్థనలకు విశేషమైన స్థానముంది.*
👉 ప్రభువే ఈ విషయాన్ని కొండమీది ప్రసంగంలో స్వయంగా బోధించాడు (మత్తయి 6:16-18, మార్కు 9:29).
*లెంట్ కాలంలో చాలామంది విశ్వాసులు ప్రతి రాత్రి లేదా ప్రతి శుక్రవారం రాత్రి ఉపవాసం చేస్తారు.
*అలా చేసేవారు ఒక్క విషయం తప్పక గమనించాలి. వ్యాథిగ్రస్తులు, బలహీనులు, డయబిటీస్ వున్నవారు, చిన్న పిల్లలు ఉపవాసాలు చేయకూడదు. విశ్వాసులైనప్పటికీ, ఆరోగ్య సూత్రాలను అతిక్రమించకూడదు.*
👉 నిజానికి *'ఉపవాసం'* అనే పదం, *భోజనం మానివేయడంకన్నా, దేవునికి సమీపంగా జీవించడం అనే భావాన్ని ప్ర థానంగా తెలియజేస్తుంది.*
👉 బైబిల్లో *'ఉపవాస అథ్యాయం'* గా పిలువబడే *యెషయా 58వ* అథ్యాయంలో,
🔹 *ఉపవాసం ఏ విధంగా చేయకూడదో* (3-5 వ ),
🔹 *ఏ విధంగా చేయాలో* (6-14 వ) వివరంగా వ్రాయబడింది.
*దీర్ఘకాల ఉపవాసాలు అత్యంత అరుదైన సందర్భాలలో మాత్రమే దాదాపు ఒకరి జీవితకాలానికి ఒక్కసారిమాత్రమే చేసినట్లు చూస్తాము.*
4⃣ *ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు మీ వ్యాపారాలు చెయ్యకండి, నువ్వు నీ ఆఫీసుకు, లేదా నీ కాలేజికి వెళ్లి నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను అనుకోవడం మూర్ఖత్వం*
(యెషయా 58:3,4)
5⃣ *ఉపవాస ప్రార్థన దేవుని కొరకు చెయ్యకండి. అలా చెయ్యమని బైబిలు చెప్పలేదు. ఉపవాస ప్రార్థన ఎందుకు చెయ్యాలి, ఎవరి కొరకు చెయ్యాలి అనేది బైబిలు చదివితే తెలుస్తుంది.*
6⃣ *భస్మ బుధవారం ఆచరించకండి, అసలు బూడిదతో సిలువ వేసుకున్నట్లు బైబిలులో ఎక్కడైనా ఉందా?*
(మత్తయి 11:12, ఎస్తేరు 4:1, యోబు 2:8, దానియేలు 9:3) ఇలా చేసే వారు అందరూ చూపించే రిఫరెన్సులకు, చేసే పనికి అసలు సంబంధం ఉండదు.
▪ *మారుమనసు పొందితే వెళ్లి బాప్తిస్మము పొందండి*
(అపోస్తలుల కార్యములు 2:38).
▪ *తప్పు చేస్తే చేసిన తప్పు దేవుని సన్నిధిలో ఒప్పుకొనండి*
(1 యోహాను 1:19)
*ఇది వాక్యానుసారం,*
🔺 *అంతే కాని నుదుటి మీద బూడిదతో సిలువ వేస్కోకండి. ఇలా చేసినట్లు పాత, కొత్త నిబంధనలో ఎక్కడా లేదు.*
7⃣ *మట్టల ఆదివారం రోజు మట్టలను జాగ్రతగా తెచ్చి ఇంట్లో పెట్టుకొని ఒక సంవత్సరం వరకు వాటిని కాపాడటం, వాటిని దైవం లాగా చూడటం, ఆరాధించడం లాంటి పనులు చెయ్యకండి, ఇది కూడా బైబిలులో చెప్పబడలేదు.*
8⃣ *ఇంకా ఈ Lent Days లో కేవలం సిలువ పాటలే పాడాలి, ఏడుస్తూ వుండాలి, మాంసం తినకూడదు, భార్య భర్తలు కలవకూడదు, తెలుపు రంగు వస్త్రాలు మాత్రమే ధరించాలి, మెడలో సిలువ మాల వేస్కోవాలి, ఇవి శ్రమ దినాలు, దుఃఖ దినాలు కాబట్టి శుభ కార్యాలు జరుపుకోకూడదు అనేటటువంటి వ్యర్థమైన తీర్మానాలు చెయ్యకండి.*
👉 క్రీస్తు నందు ప్రియమైనవారలారా, మేము ఈ 40 రోజులు అధ్యాత్మికముగా మరింతగా బలపడడానికి కూడుకొంటున్నాము అనడంలో తప్పు లేదు. కాని *“అధ్యాత్మికముగా బలపడుతున్నాము అనే భ్రమలో దేవుని వాక్యానికి విరుద్ధముగా పనులు చెయ్యడం సరిఅయినది కాదు” అదే ఈ సందేశము యొక్క ఉద్దేశ్యము.*
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి