భక్తి చేస్తున్నావ్!
దానిలో భయముందా?
——-▫️(part-1)▫️———
భయము లేని భక్తి వలన, భక్తిలేని భయము వలన కలిగే ప్రయోజనం శూన్యం. భయముతోకూడిన భక్తివలన శ్రేష్టమైన వాగ్ధానాలు స్వతంత్రించుకోగలము.
యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు. (కీర్తనల 34 : 9)
భయభక్తులు అంటే?
🔸దేవుని పట్ల, దేవుని వాక్యముపట్ల భయముతో కూడిన గౌరవం.
🔸దేవుని మహత్యాన్ని, గొప్పతనాన్ని, అధికారాన్ని గుర్తించి ఆయనకు వ్యతిరేకంగా ఏదైనా చెయ్యడానికి భయపడడం.
భక్తికి లోటేలేదు. కానీ ఆ భక్తిలో భయములేదు. భయములేని భక్తి , భక్తిపరులం అని చెప్పుకోవడానికి పనికివస్తుందేమోగాని, ప్రభువుతో సహవాసాన్ని మాత్రం నెలకొల్పలేదు. భయములేని భక్తి, నిన్ను నీవు ఘనపరచుకోవడానికి పనికివస్తుందేమోగాని, ఆ భక్తి అన్యజనులమధ్య దేవుని నామాన్ని ఘనపరచలేదు సరికదా, దూషణ పాలు చేస్తుంది.
👉మెడలో బంగారపు సిలువ
👉“యేసే గృహాధిపతి” అనే బోర్డులు
👉గోడలకు వాక్యాలు
🔸దేవుని మందిరానికి వెళ్లడం
👉దశమభాగాలివ్వడం
👉సేవకులకు ఆతిధ్యమివ్వడం
👉పేదవారికి సహాయపడడం
👉సంఘ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం
👉ప్రయిజ్ ది లార్డ్, వందనాలు
ఇట్లాంటివన్నీ భక్తిలో భాగమనుకొంటున్నాము. అయితే, ఆ భక్తిలో భయముందా? అనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న!
అంతరంగంలో లేని భక్తి, బాహ్యంగా ప్రదర్శించినంత మాత్రాన, అది నిజమైన భక్తి కానేరదు. (రోమా 2:28,29)
🔺మెడలో సిలువవేసుకున్న నీవు, నీ మాట్లాడేటప్పుడుగాని, ఏదైనా పని చేసేటప్పుడుగాని, నా మెడలో సిలువ వుందే? అనే తలంపు నీకొచ్చిందా?
🔺యేసే గృహాధిపతి అంటున్నావు. అస్సలు ఆయనకు ఇంట్లో స్థానం ఉందా? సినిమాలు, సీరియల్స్, మాట్లాడకూడని మాటలు యివన్నీ నీ గృహంలో నున్నప్పుడు, గృహాధిపతి ఎవరో ఎప్పుడైనా గుర్తొచ్చిందా?
🔺గోడలకు వాక్యాలు వ్రేలాడదీసావు. మంచిదే. అయితే వాక్యము అంటే, దేవుడే అనే గ్రహింపు నీకుందా? వాక్యమున్న ఇంటిలో నీ ప్రవర్తన ఏ రీతిగా వుంది?
♻️ దేవునియందు “భయం” వుంటే కనబడే లక్షణాలు:
పశ్చాత్తాపం:
సిలువలో దొంగ, దేవునికి భయపడ్డాడు. ఆ భయము అతనిని పశ్చాత్తాపము లోనికి నడిపించింది. ఆ పశ్చాత్తాపము ప్రభువును ప్రార్ధించడానికి కారణమయ్యింది. ఆ ప్రార్ధన అతనిని పరదైసుకు చేర్చగలిగింది.
అతడు ప్రభువునకు భయపడడానికి గల కారణమేమిటి? అతడు మూడు విషయాలు అర్ధం చేసుకోగలిగాడు.
🔸ఆయన ఒక రాజు
🔸ఆయనకొక రాజ్యముంది
🔸ఆయన తన రాజ్యముతో తిరిగి రాబోతున్నారు.
ఈ గ్రహింపు అతనిలో భయాన్ని పుట్టించింది.
వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచునీవు క్రీస్తువు గదా? నిన్ను నీవు రక్షించు కొనుము, మమ్మునుకూడ రక్షించుమని చెప్పెను. అయితే రెండవవాడు వానిని గద్దించినీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందు చున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసూ, నీవు నీ రాజ్యము లోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను.
లూకా 23 : 39-42
భయముతో కూడిన భక్తి చెయ్యాలంటే? ఆయన ఏమైయున్నాడో మొదట మనకు అర్ధం కావాలి. గతించిన ప్రతీక్షణం, మరణానికి మరింత దగ్గరగా చేరుస్తుంది. నేటికిని ఆయన ఏమై యున్నారో అర్ధం కాలేదా?
💮 ఆయన సృష్టికర్తయైన దేవుడు:
సమస్తమును ఆయన మూలముగా కలిగెను... లోక మాయన మూలముగా కలిగెను (యోహాను 1:2,10)
ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.
(కొలస్సి 1:15-17) దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది; (కొలస్సి 2:9)
💮 తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించేవాడు.
ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుం డెను. (హెబ్రీ 1:3,4)
నేటికిని అర్ధం కాకుంటే, ఆయనిచ్చే శ్రేష్టమైన వాగ్ధానాలను స్వతంత్రించుకోలేము. ఆయన రాజ్యములో మనముండలేము. లేకుంటే, అది ఊహలకు సహితం అత్యంత భయంకరం! ఆయన ఆధిపత్యానికి, అధికారానికి లోబడదాం! ఆయన మహిన్నతమైన నామమును గౌరవిద్దాం! ఆయనకు భయపడదాం! ఆయనిచ్చే నిత్యమైన వాగ్ధానాలను స్వతంత్రించుకొందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి