ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మరణమును దృవికరించిన

✳ *మరణమును దృవీకరించిన బళ్ళెపు పోటు....✍*

👉ముస్లీములు క్రైస్తవులని ఎక్కువగా అడిగే ప్రశ్న *యేసుక్రీస్తు సిలువలో చనిపోలేదు* అని..
వారికి సరైన సమాధానం ఇదిగో..
👉 *మరణమును దృవీకరించిన బళ్ళెపు పోటు*

ఇక్కడ ఒక అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు తెలియపరచాలని అభిప్రాయపడుతున్నాను. అదేమిటంటే,
*అందరూ అనుకొంటున్నట్టుగా సిలువపై వున్న నేరస్థున్ని చంపడానికి బళ్ళెపుపోటు పొడవరు."చనిపోయాడని నిర్థారించడానికి పొడుస్తారు".*
👉లేఖనం స్పష్టంగా తెలియజేస్తున్నది.

యోహాను 19: 33-34
- వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే
*“ఆయన మృతిపొంది యుండుట చూచి’’ ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.*

👉ఆయన మృతి పొందియుండుట వారు చూసారు అని యోహాను భక్తుడు ఇతిమిద్ధముగా వ్రాసాడు.

♻ *బళ్ళెపుపోటు ప్రయోగం చాలా శ్రద్ధతోనూ బాధ్యతతోనూ నిండివుంటుంది.*

👉 వందమంది రోమా సైనికాదళం సిలువలో వున్న నేరస్థుని యొద్దకు వెళ్లి అందరూ ప్రత్యక్షంగా చూస్తుండగా పొడవైన ఒక ప్రత్యేకమైన బళ్ళెముతో పొడుస్తారు.
*వాస్తవానికి వారు పొడిచేది ప్రక్కలోనే అయినప్పటికిని అది సరాసరి వెళ్ళి గుండెకు రంధ్రం చేస్తుంది. అనగా బళ్ళెపుపోటు గుండె పగొలిపోయేలా పొడవబడే పోటు.*
👉 ఒకవేళ ఆ సమయంలో ఆఖరిశ్వాస కనుక ఉన్నట్లైతే బలంగా పొడవబడిన ఆ బళ్ళెపుపోటు ద్వారా ఆ ఆఖరిశ్వాస సహితం గాలిలో కలిసిపోతుంది.
*కాళ్ళు విరగగొట్టుట మరియు బళ్ళెపుపోటు పొడుచుట ఈ రెండూ ఎంతో అనుభవంతో కూడినదై యుండుటచేత రోమా ప్రభుత్వం కేవలం నిపుణులను మాత్రమే ఎన్నుకునేది.*
👉 బళ్ళెపుపోటును గూర్చి
*“గేరీ హెబర్మాస్ ’’* గారు ఇలా వ్రాసారు :
*Anci రోమా చాలా కఠినమైనది ఖచ్ఛితమైనది.*

👉 రోమా సైనికుల ఆధీనంలో వున్న ఏ నేరస్థుడు తప్పించుకొనుటకు అవకాశం లేని విధంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు వారు కలిగియుండేవారు. ఒకవేళ లంచానికి కక్కుర్తిపడి నేరస్థుని వదలిపెట్టినా, లేదా ఆదమరచి అశ్రద్ధగా వున్న సమయంలో నేరస్థుడు పారిపోయినా
*ఆ శిక్షను కాపలా కాస్తున్న రోమా సైనికులు భరించాల్సిన దుస్థితి వస్తుంది.*
👉ఒకవేళ ఆ దుస్థితే గనుక వస్తే రోమా అధికారులు వేసే ఘోరమైన శిక్షను ఎరుర్కోనలేక సైనికులే ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కలిగేవి. ఆ భయంకరమైన కృరమైన శిక్ష నుండి తప్పించు కోవడానికే సైనికుడు కత్తితో పొడుచుకోబోయాడు

Ex:-
అ• కా• 16:27
 *అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, చెరసాల తలుపులన్నియు తెరచియుండుట చూచి, ఖయిదీలు పారిపోయిరనుకొని, కత్తిదూసి, తన్నుతాను చంపుకొనబోయెను.*

👉ఒక మామూలు హంతకుని విషయంలోనే రోమా సైనికులు ఇంత వివేకము కలిగి కాపలా కాస్తే మరి యేసుక్రీస్తు విషయంలో వారు అశ్రద్ధ వహించే అవకాశముందని మనం ఊహించగలమా ?
👉ఇటు రోమీయులు నింద ద్వారా అటు యూదా మతాధిపతుల అక్కసు ద్వారా యేసు సిలువవేయబడినప్పుడు ఆ సహస్రాధిపతి యేసును గూర్చి తప్పుడు సమాచారం ఇవ్వడం అసాధ్యం.
*అందుకే వందమంది గుంపు కలిగిన సైన్యం మరియు సైన్యాధిపతి యేసు యొద్దకు వెళ్ళి బళ్ళెముతో పొడిచి చనిపోయాడనే తిరుగులేని ఋజువు విన్న పిమ్మటనే అరిమతయియ యోసేపునకు క్రీస్తు పార్థీవ దేహము ఇచ్చుటకు పిలాతుకు మనస్సు అంగీకరించింది.*

మార్కు సువార్త 15: 44,45
*పిలాతుఆయన ఇంతలోనే చనిపోయెనా అని ఆశ్చర్యపడి యొక శతాధిపతినితన యొద్దకు పిలిపించిఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతని నడిగెను.శతాధిపతివలన సంగతి తెలిసికొని, యోసేపునకు ఆ శవము నప్పగించెను.*

ప్రభువైన క్రీస్తు కృప మీకు తోడై యుండును గాక..!
ఆమేన్..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...