ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిల్ నందలి స్త్రీలు ఆరవ భాగము

✳ *బైబిల్ నందలి స్త్రీలు* ✳


  (ఆరవ భాగము)


 7⃣ 🌹  *పెనిన్నా*   🌹 


 *అసూయతోఓటమి పొందిన స్త్రీ*


ఎఫ్రాయిము మన్యమందు రామతయిమ్సోఫీము పట్టణపువాడు 

ఒకడుండెను 

 *అతని పేరు ఎల్కానా* అతడు ఎఫ్రాయీమీయు

డైన  సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు, *ఎల్కాకు ఇద్దరు భార్యలుండిరి.*


వీరిలో 

మొదటి భార్య *హన్నా* 

రెండవ భార్య *పెనిన్నా* 


*పెనిన్నాకు కుమారులు,కుమార్తెలు కలిగిరి*

*హన్నాకుపిల్లలులేకపోయిరి*


💥 *హన్నా*

ఎల్కానా మొదటి భార్య *హన్నా* సంతానం లేనందు వల్ల భార భరితమైన  జీవితాన్ని గడుపుతూంది.

కాలప్రభావాన్ని ఆమె జీవితంలో  అనుభవించి ఎరుగదు.ఎందుకంటే *ఆమె ఆలోచనల్లో దేవుణ్ని కేంద్రంగా వుంచుకుంది*

విశ్వాస సంబంధమైన కార్యాల్ని మాత్రమే ఆమె జరిగిస్తుంది. *ఆమె చాలా అందగత్తె, దీనురాలు*

ఈ ఇద్దరు స్త్రీలలో వున్న తేడాను స్పష్టంగా చూడగలిగాడు ఎల్కానా.

అందువల్లనే  *పెనిన్నా కంటే హన్నాను ఎక్కువగా ప్రేమించేవాడు*

హన్నా జీవితం పెనిన్నా జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని ముద్రించలేదు.

పైగా ఆమె ప్రవర్తన పూర్తి వ్యతిరేక ధోరణిలో వుంది.


💥   *ఎల్కానా*

ఎల్కానా యెరోహాము పుత్రుడు.ఎఫ్రామీయుడు

ఇతనికి ఇద్దరు భార్యలు.

దైవసంకల్పానికి దూరమై ఎల్కానా తన జీవితంలో కష్టాలు అనుభవించాడు.

ఇతరులు కూడ కష్టాలు భరించాల్సి వచ్చింది.

*తన ఇంట్లో వాతావరణాన్ని ఎంత మాత్రం భరించలేక పోయాడు.

పెనిన్నాకు పిల్లలు వుండడం, హన్నాకు లేకపోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లై పోరాటం ఎక్కువైంది. *ఎల్కానా కుటుంబ సభ్యులందరూ* *మతనిష్ఠల్ని ఆచరించినా*

*పెనిన్నాకు మాత్రం దేవుడు*దూరమయ్యాడు*

అసంతృప్తితో నిండిపోయింది.


 షిలోహులో సైన్యముల కధిపతియైన యెహోవా దేవుణ్ని ఆరాధించేందుకు   బలులు అర్పించేందుకు  ప్రతియేటా ఎల్కానా వెళ్తూ వుండే వాడు.ఎల్కానా తాను బల్యార్పణ చేసిననాడు తన భార్యయగు పెనిన్నాకును ఆమెకుమారులకును,

కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచు వచ్చెను గాని తనకు *అత్యంత ప్రియమైన హన్నాకు* మాత్రం రెండుపాళ్ళు  ఇచ్చేవాడు.

(1సమూయేలు 1:4)


💥  *పెనిన్నా*

ఎల్కానా రెండవ భార్య ఈ

పెనిన్నా. ఈమె చాలా మందిపిల్లల్ని కన్న గొప్పదనాన్ని చాటుకుంది.

అంతమంది పిల్లల్ని దేవుడు అనుగ్రహించాడనే

ఆలోచన ఆమె మనసులో 

ప్రవేశించనే లేదు.*దేవుని పట్ల కృతజ్ఞతా విహీనురాలై 

జీవితంలో శూన్యతకు లోనైంది.  *ఇతరులను ప్రేమించే స్వభావం ఆమెలో  లేకపోవడంవల్ల ఆమెకు ఈ పరిస్థితి దాపురించింది*

ఏ యూదా స్త్రీ యైనా కోరుకొనే విధంగా  పెనిన్నాకు చాలా మంది పిల్లలున్నారు.

*ఇది కేవలం దేవుని కృప*  ఆమె మరణా నంతం కూడ తన పిల్లల జీవితాల్లో  ,

*తన భవిష్యత్తులో కూడ జీవించగలదు*


పెనిన్నాకు హన్నామీద *అసూయ మెండుగా వుంది*.యూదుల శెలవు దినాలు వచ్చిన రోజుల్లో ఈమె *హన్నాను ఎక్కువగా శోధించి ,కష్టపెట్టి ,కోపం తెప్పిస్తూ ఉండేది*. పెనిన్నా కారణంగా హన్నా *మనోవేదనకు గురవుతూంది*.ఈ దినాల్లో పెనిన్నా హన్నా మీద అసూయతో విరగబడుతూంది.

శత్రుత్వం స్వార్థం డాంబికాల మిశ్రమమే ఈ అసూయ వృక్షంగా మారడానికి కారణం.ఎప్పుడూ స్వార్థాన్నే పోషిస్తుంది.

నాలుక విషయంలో ఇది సత్యం.(రోమా3:14)

అసూయ సాతానులోంచి 

మొలిచిన స్వభావం.మనుషులు స్వాభావికంగా అసూయాపరులవటంవల్ల సాతాను జయం పొందుతున్నాడు.


దీన్ని వెంటనే దేవుని దగ్గరకు తీసుకువచ్చి బంధించకపోతే వ్యక్తి ఆలోచనా శక్తిని శిథిలం చేసి మనుషులమధ్య వుండాల్సిన పరస్పర సంబంధాన్నిప్రతి

ఘటిస్తుంది.

(2కొరింథి 10:5)

*అసూయ* కు గురైన వ్యక్తి కంటే దీన్ని హృదయంలో వుంచుకొని 

పదిలపర్చుకొనే వ్యక్తి ఎక్కువ ప్రమాదానికి గురవుతాడు.

ప్రయోగించిన వ్యక్తినే బ్రద్దలుకొట్టే బాంబులాంటిది 

*ఈ అసూయ*


పెనిన్నా ఈ విషయాన్ని తన జీవితంలో అనుభవ పూర్వకంగా తెలుసుకుంది.

పరిష్కారము ఆమె సమీపంలో వున్నా సమస్యలను పరిష్కరించుకో లేక పోయింది.

*హన్నా విశ్వాసాన్ని గమనించి అలా నడచుకోవడమే ఆమె చేయాల్సిన పని*


*పెనిన్నా;*

*అసూయతో ఓటమి పొందిన స్త్రీ*

1సమూయేలు1:1-8

సామెతలు6:24,

                14:30,

                 27:4

              


8⃣  🌹    *హాగరు*   🌹


హాగరు ఐగుప్తీయురాలు.

*హాగరు అనగా*

 *పలాయనం*

అబ్రాము భార్య శారాకు

పిల్లలు లేనందున తన *దాసి హాగరును*

 తన పెనిమిటి అబ్రాముకు భార్యగా ఇచ్చింది.అతడు ఆమెతో శయనించగా.. హాగరుగర్బవతిఅయింది.

గర్బవతి అని తెలుసుకున్న హాగరు దృష్టికి తన యజమానురాలైనశారాయి నీచురాలిగ కనబడింది.


శారా ఆలోచించిన ఈ పరిష్కారం కేవలం *మానవసంబంధమైనది*

హాగరు విషయములో *దైవాశీర్వాదాన్ని ఎవరూ కోరలేదు ఇవ్వబడనూ*

*లేదు అసహనంతో* *దేవుడు అసమర్థుడనే విషయాన్ని సందేహించి శారా తన సొంత మార్గాన్నిఅవలంభించింది*  అబ్రాము ఆమె ప్రణాళిలను వద్దనలేక ఒప్పేసుకున్నాడు.

అందువల్ల దేవుని *సమాధానం ఆ గృహాన్ని వదలి వెళ్ళిందంటే ఆశ్చర్యంలేదు*.


వీళ్ళు ముగ్గురూ దైవాజ్ఞలను ఉల్లంఘించి *దేవుని దృష్టిలో సమానంగా పాపం చేశారు*


           హాగరు వైఖరి శారా మనసును తీవ్రంగా

బాధించింది. అందువల్ల శారా హాగరు యెడల అంత కఠినంగా ప్రవర్తించాల్సి వచ్చిందని చెప్పవచ్చు.

శారా ప్రవర్తనకు తట్టుకో లేనక    *హాగరు సహనం కోల్పోయి అరణ్యంలోకి పారిపోయింది*

ఇలా హాగరు తన పేరుకు తగ్గట్టుగా జీవించింది.


అంతులేని కష్టాల మయమైన అరణ్య జీవితంలోకివచ్చిపడింది.మైళ్ళకొద్ది ప్రయాణం చేసి సీనాయి ప్రాంతంలో షూరు మార్గానవున్న ఒయాసిస్సు

నీటిబుగ్గ కొంత ఊరట నిచ్చింది.హాగరు ఏకాకిగా తనను రక్షించగల ఏకైక దేవుడు..

అబ్రాము దేవుణ్ని తన హృదయాంతరాళ్ళోనుండి బిగ్గరగా పిలిచింది. ఆ దేవుడు హాగరును విడిచి పెట్టలేదు.

హాగరూ, అని ఆమెను బిగ్గరగా పిల్చాడు.

(ఆది.కా.16:7-9)

దైవదూత ఆమెకు విడుదల మార్గాన్ని చూపించాడు.

దీనత్వంతోపశ్చాత్తాప్తురాలై 

దైవానికివిధేయతచూపి వెనక్కిమళ్ళి అబ్రాము నివాసానికి తిరిగి వెళ్ళింది హాగరు.


💥 *హాగరు విధేయతను ఘనపరిచాడు దేవుడు*

(1పేతురు5:6)

💥దేవుడు హాగరుతో యెహోవా నీ మొర విన్నాడు.నీవు గర్బవతివి

*నీ వొక మగ శిశువును కంటావు.అతనికి "ఇస్మాయేల్ "అను నామకరణం చేస్తావు*

ఆ పేరుకు అర్థం *దేవుడు వింటాడు*  హాగరూ నీ సంతానము బహుగా విస్తరిస్తుంది.(ఆది.కా16:10-12)

*అతడు సాధుపర్చలేని మృగప్రాయమైన అడవి గాడిద లాంటి  స్వభావము కలిగివుంటాడు* అంటూ దేవదూత  హాగరుతో చెప్పిన మాట ప్రకారమే జరిగింది..అప్పుడు అబ్రాముఎనబైయారు(86)

ఏండ్లవాడు.

💥 పదిహేడుసంవత్సర

ముల తరువాత దేవుడు అబ్రాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్బవతియై కుమారునికంది.అబ్రాము తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాడు.

ఎనిమిది దినములైన ఇస్సాకుకు సున్నతిచేశాడు. 


💥 వంద సంవత్సరాల అబ్రాముకు,తొంబైయేండ్ల శారాకు పండువృద్దాప్యంలో

వాగ్దాన పుత్రుడు ఇస్సాకు 

జన్మించాడు.

పాలు విడిపించిఅన్నప్రాసం చేసే సమయమొచ్చింది.ఈ సమయంలో గొప్ప పండుగ

చేసుకొనే వారు.ఇతర పట్టణాలనుండి విచ్చేసిన ప్రజలు‌,ఇంటివారు,స్నేహితులు ఈ ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చారు.

*ఈ ఉత్సవ సంతోషాన్ని సహించలేనిపెద్దకుమారుడు ఇస్మాయేలు ఇస్సాకును ఎగతాళి చేయడంప్రారంభించాడు*

ఇద్దరు సోదరుల మధ్య ప్రజ్వరిల్లిన ఈ శత్రంత్వం అమాయకంతో ఇస్సాకుతో వైరం పెట్టుకున్నాడు. 

ప్రబలుతోన్న ఈ జ్వాలను శారా మాత్రమే  గ్రహించి *ఈ బానిస స్త్రీని ఆమె కుమారుణ్ని ఇక్కణ్నించి పంపివేయ్యి* అని అబ్రామునం గట్టిగా అరచింది.

*నా కుమారునితో* *సమానంగా*

*నీస్వాస్థ్యాన్ని*

*వాడు పంచుకోడం నేను భరించలేను* అని వాపోయింది.

(ఆది.కా.21:1౦)

భార్య మాటలు విన్న అబ్రాము మానసికంగా దిగజారిపోయి  ఈ వషయం దేవుణ్ని ప్రార్థించగా  కుమారుల వేర్పాటు అవసరమని సమాధానం లభించింది.

*రాబోయే ఇశ్రాయేలు జనాంగానికి   కర్తగాదేవుడు ఇస్సాకును యేర్పాటు చేసుకున్నాడు*

ఇశ్రాయేలు ప్రజలు దేవునికి సంబంధించిన జాతి.

*ఇస్సాకు మాత్రమే దేవుడు వాగ్దానము చేసినపుత్రుడు*

(గలతీ 4:22,23)

పంన్నెండు జాతులకు పునాదియైన ఒక కుటుంబానికి  ఇస్సాకు *మూలకర్త అవుతాడు*

(ఆది.కా 25:12-16)


అబ్రాము కుమారుడైన ఇస్మాయేలు కూడ వంశకర్త కావాలి. ఈ కారణం వల్ల అబ్రాము 

హాగరును,ఇస్మాయేలును అరణ్యానికి పంపివేయాల్సి వచ్చింది. 

ఎక్కువ నడవడం వల్ల శరీరంలో తేమ చచ్చి ఇస్మాయేలు బలహీనుడై అలసిపోయి నేలకొరిగాడు.

తన కుమారుడు నిశ్చయంగా మరణిస్తాడని తెల్సుకున్న హాగరు హృదయము బద్దలయ్యేలా రోదించింది.

అగస్మాత్తుగా పరలోకమునుండి ఒక స్వరాన్ని వింది.దైవదూత గతంలోలా *హాగరూ భయపడకు. పడిపోయిన బాలుడిస్వరాన్నివిన్నాడు*

*అతని వారసులను నేను గొప్ప జనముగా, దేశంగా, విస్తరింప జేస్తాను* అని అభయమిచ్చాడు.

(ఆది.కా 21:17,18)


హాగరు దిగ్గున లేచిదేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి ఇస్మాయేలుకు త్రాగనిచ్చింది.


ఆమె కుమారుడు నూతన జీవాన్ని పొందుకున్నాడు.

ఇస్మాయేలు వయసులో ఎదుగుతూ వుండగా హాగరు ఐగుప్తునుండి అతనికో భార్యను తెచ్చింది.

💥ఈ క్రియవల్ల హాగరు ఇంకా అన్యురాలిగా వున్నట్టు రుజువౌతూంది.

ఆమె హృదయంలో ఆ ప్రభువుకు స్థానం ఇవ్వలేదు.

💥 భద్రతాయుతమైన జీవితాన్ని అనుభవించా ల్సిన  హాగరు పిచ్చిదానిలా 

అరణ్యంపాలైంది.

అబ్రాము దేవుణ్ని ఆశ్రయించక తమపైతాము ఆధారపడినందువల్ల ప్రపంచ చరిత్ర ప్రభావితమై పోయింది.

💥 ఇస్మాయేలు అరబ్బు దేశాలకుస్థాపకుడయ్యాడు.

ఇస్సాకు సంతానం ఇశ్రాయేలీయులు.ఈ రెండు జాతుల మధ్య ఈనాటికీ శత్రుత్వజ్వాలలు చెలరేగుతూ మధ్య ప్రాశ్త్య ప్రాంతాలన్నియుధ్ధరంగంగా

మార్చివేశాయి.


👉🏾అవసరతలో ఆశ్రయించిన వారికి ఆయన *సమాధానం అనుగ్రహిస్తాడనే సత్యం హాగరు జీవితం ద్వారా మనకుఋజువౌతూంది*.

ఓ సాధారణ స్త్రీకి 

ప్రత్యక్ష పరచుకొని ఆదరించిన దేవుడు 

ప్రస్తుత సమయంలో కూడ ఆయనను వెదికే వారికి అందుబాటులోనే వున్నాడు.ఆమెన్.

           

9⃣ 🌹 *తామారు* 🌹


*తన హక్కుల్ని సాధించి* 

        *తిరష్కరింపబడ్డ స్త్రీ*

తామారు అనే పదానికి  *ఈతచెట్టు* అని అర్థం.


యాకోబు కుమారుడైన యూదా యొక్క పెద్ద కోడలు *తామారు* యూదా యొక్క పెద్దకుమారుడైన ఏరు దేవుని దృష్టికి  చెడ్డవాడైనందున యెహోవా అతని చంపెను.

అనగా తామారు తన భర్తను పోగొట్టుకొని విధవరాలాయింది.

యూదా అప్పటి పద్దతి తన రెండవ కుమారుడైన

*ఓనాను*  తామారుకు భర్తగా చేశారు. ఓనాను చేసిన తప్పిదాన్ని బట్టి దేవుడు ఈయనను కూడ చంపెను. తామారు రెండవమారు భర్త చనిపోయి విధవరాలుగా

మారింది. ఇంత దురదృష్టవంతురాలు ఎవరూ వుండరేమో అనిపిస్తుంది అందరికి.

తామారు కూడ అదేవిధంగానే తలంచి వుంటుంది.

మతంలో మానవుల్లో ఆమె కున్న నమ్మకం ఘోరంగా దెబ్బతింది.తన మామ యూదాలో మాత్రం ఆమెకు కొంచెం విశ్వాసం మిగిలి వుంది.


చివరికి మూడవ కుమారు

డు  "నా చిన్నకుమారుడు   షేలా పెద్దవాడయ్యేదాక కనిపెట్టుఅతడు నిన్ను పెళ్ళాడి నీకు భర్తవుతాడు" అన్నాడు యూదా.

(ఆది 38:16)

షేలా వివాహ వయస్సుకు ఎదిగేదాక వేచిచూచేందుకు

ఆమె తన పుట్టింటికి వెళ్ళింది.

ఆనాటి విధవరాలు చేయ గలిగిన పని అదొక్కటే.

స్వతంత్రంగ తనంతట తాను జీవించడంగానీ వ్యక్తి

గతాభివృద్దికోసం కృషిచేయడం గానీ కుదరని రోజులవి.

తామారు మూడవ భర్త కోసం ఎదురు చూస్తున్నది.


రోజులు వారాలు మాసాలు సంవత్సరాలూ గడచి పోయాయి.అయినా తామారు పరిస్థితిలో మార్పురాలేదు.ఆమె కోసం *షేలా* ఎన్నటికీ రాడని తెలుసుకుంది.ఆమెనుపెళ్ళి

చేసుకొంటే షేలాకూడ మరణిస్తాడనియూదా ఆమెదగ్గరకుపోకుండఅతడ్ని ఆపివేశాడు.తనవల్లనే ఇద్దరు కుమారులు చనిపోయారని ప్రజలు ఆమెను నిందిస్తన్నట్లు తెల్సుకుంది.

చివరకు *ఒక నిర్ణయము తీసుకున్నధైర్యవంతురాలు*

ఆమె యదార్థజీవితం ఆమెకు తెలుసు.ఆమె దేవుని మెప్పుకోరుకున్నది.

మనుష్యుల్నిలెక్కచేయలేదు.

ఒక రోజు తన మామ యూదాతో కలిసి కాపురం చేయాలని ఆవిధంగా సంతానము కని తన మామ అయిన యూదా యొక్క వంశము నిలబెట్టాలని రహస్యంగా వేశ్యా రూపంలో ఏనాయీము గ్రామద్వారం దగ్గర దారి పక్కన వున్న ఆమెను యూదాచూచాడు.

ఆ ముసుగులో ఆమెను గుర్తంపట్టలేదు.వ్యక్తిగా పరిచయం చేసుకోదలచలేదు.అతనిలైంగిక వాంఛల్ని ఆమె రగిలించింది.

లైంగిక వాంఛల్ని తీర్చినందుకు ఆమె మేకపిల్లను పంపుతావని నమ్మేందుకు గుర్తుగా ఏముంచుతావు ?

(ఆది.కా38:17)అని అడిగింది. *నీ ఇష్టం అన్నాడు* యూదా.

అతని గౌరవ, అధికారము లకు చిహ్నాలైన ముద్ర, చేతికర్ర.

ఆమెవద్ద వుంచమని కోరింది.

ఆలోచనారహితంగా వాటిని అతడు ఆమెకు. ఇచ్చేశాడు.ఇలా వాళ్ళు కలుసుకున్న తదుపరి యూదా తిమ్నాతుకు బయలుదేరాడు.

తామారు తన పుట్టింటికి తిరిగీ వెళ్ళి ఆ దుస్తులు వదలి వైవిధ్య దుస్తులు ధరించింది.కొంతకాలం ఏమీ జరగనట్లే గడచి పోయింది.

3నెలల తరువాత తామారు తన తండ్రియింట 

గర్బవతి అయినదని తెలిసింది.

యూదా ఆమెగురించి ఆమె పరిస్థితి గురించి ఆలోచించలేదు.వేరొక పెళ్ళిచేసుకోమని చెప్పలేదు.తన మూడవ కుమారునిచ్చి పెళ్ళి చేయలేదు.చేస్తానని చెప్పలేదు.

*తామార గర్బవతి* అని 

తెలియగానే యూదాకోపానికి అవధుల్లేక పోయాయి.తామారు *యూదా గోత్రానికి మచ్చతెచ్చింది*

తామారు చేసిన పాపానికి తీర్పుతీర్చేందుకు అతనికి బాధ్యతవుంది.దైవనిర్మితమైన,వివాహమనే పవిత్ర సంస్థ శిక్షారహితమని ఎవరూ అగౌరవపర్చలేరు.

(హెబ్రీ13:4)

అతని తీర్పు కఠినమైనది.

నేరాన్ని గూర్చిన విచారణ జరపకుండానే యూదా ఆమెకు మరణశిక్ష విధించాడు.

*ఆమెను బయటికి తీసుకుపోయి కాల్చి వేయండి*  అని గట్టిగా అరిచాడు.(ఆది.కా38:20)

శిక్షాస్థలానికి రాకముందు ఆమె కాపలా మనుషుల్లజ ఒకనికి ఏదో ఇచ్చి *వీటిని మీ యజమాని దగ్గ‌రకు తీసుకెళ్ళమని అంటూ గుర్తుముద్ర,చేతికర్రల్ని*

అతని అప్పగించింది.

వీటిని గుర్తుపట్టగలడేమో 

అడగండి.

*ఈ వస్తువులు ఎవరివో!* *అతడే నా కడుపులో* *పెరురుగుతున్న*

*బిడ్డకు తండ్రి*  అని ఖచ్చితంగా చెప్పింది


యూదా ప్రతిచర్య బహిర్గతమౌతోంది.భయపడిపోయాడు.తన పాపమే బహిర్గతమౌతోంది దాన్ని ఇంకెంత మాత్రం దాచి పెట్టలేదు.చట్టబద్దమైన హక్కులను పొందడానికి ఆమె ఆ పని చేసిందని సిగ్గుతో ఒప్పుకొన్నాడు.

*నా కంటే ఈమె మంచిమార్గములో ఉంది.ఎందుకంటే ఆమెకు నా కుమారుడు "షేలా" కు భార్యగా స్వీకరిస్తానని  చేసిన వాగ్దొనము నెరవేర్చలేక పోయాను*  అంటూ తన తప్పును ఒప్పుకున్నాడు.

‌(ఆది.కా38:26)


యూదా యధార్థవంతుడైతే

అతడు రెండు రకాల కొలబద్దలతో కొలిచాడని గుర్తించాల్సివుంది.తానుకూడ పాలిభాగస్తుడైన పాపం విషయంలో తామారుకు మాత్రమే మరణశిక్ష విధించి రెండు రకాల కొలతల్ని ప్రయోగించాడు.

ఆరు నెలల తరువాత 

*పెరసు,జెరహు* అనే ఇద్దరు కుమారులను తామారు ప్రసవించెను.

తామారుకు న్యొయం జరగడం వల్ల షేలా ఆమెను పెండ్లాడాల్సిన అవసరం లేదు.


💥 అనేక సంవత్సరాల తరువాత  మత్తయి యేసుక్రీస్తు వంశావళిగూర్చి వ్రాశాడు.(మత్తయి1:1-17)

పురుషుల పేర్లు అందులో

ఎక్కువగా ఉన్నాయి.

అందులో చెప్పబడ్డ 

*ఐదు గురు స్త్రీలలో తామారు మొట్టమొదటిది.*

*యేసు ప్రభువు తల్లి మరియతో ఆ జాబితా ముగుస్తుంది*


 💥 వేషధారణతో కూడిన యూదాపాపం,

మానవంలంతా పోరాడాల్సిన పోరాటం.

*ఇతరుల పాపాలకు తీర్పుతీర్చే వాళ్ళే ఆ పాపాల్ని జరిగిస్తే అలాంటి వాళ్ళను తీవ్రంగా ఖండిస్తున్నాడు*  భక్త పౌలు

(రోమా2:1,2)

💥 దూషణ పాలైన తామారు ‌యేసుక్రీస్త వంశావళిలో లిఖించబడ్డ 

మొట్టమొదటి స్త్రీ.

ఆమె పుత్రుడు  *పెరెసు*

*నజరేయుడైన యేసుక్రీస్తు*

*వంశావళికి* *పితరుడయ్యాడు*


👉🏾   *దేవుడు పాపాల్ని* *ఒప్పుకున్నాడనే* *విషయానికి ఇదో ఋజువు కాదు.ఓటమికి గురైన మనుషుల్నుంచే  దేవుడు సరాసరి చరిత్ర రాశాడని ఈ వాస్తవం స్థిరపరుస్తోంది*.


💥 యేసుక్రీస్తు వెలుగు ప్రకాశిస్తేనే  తామారు 

జీవిత గాథ వుద్దేశ్యం నెరవేరుతుంది. ఆమెకు వ్యతిరేకంగా చెప్పగల విషయాలు ఎన్ని వున్నా తామారు ఎప్పుడూ దేవుని చిత్తానికి సమీపంలోనే వుంది. యేసుక్రీస్తు,తన భూలోక జీవితానికి హేతువుగా 

*ఈమెను ఆది చరిత్రలో తల్లికుండే గౌరవాన్ని ప్రసాదించాడు*

 

ఈ లోకానికి నియమింపబడ్డ దైవ ప్రణాళిక లో తాము ఎలా

కూర్చబడ్డారో అనేది ఆనందకరమైన ఆశ్తర్యఞ.

*యేసుక్రీస్తులో దేవుని పథకాల ప్రారంభం,ముగింపు వాటి నెరవేర్పు ఇమిడి వున్నాయి*  ఆమెన్

    దైవాశ్శీస్సులతో

సేకరణ:

*శ్రీమతిజెవిమలకుమారి*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...