ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

స్వాతంత్ర ఉద్యమంలో క్రైస్తవుల పాత్ర

✳ *స్వాతంత్ర ఉద్యమంలో క్రైస్తవుల పాత్ర....*

మిత్రులందరికి  *75వ  స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు* 

*స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను జ్ఞాపకం చేసుకొంటున్నాము. వారిని గౌరవిస్తున్నాము. సంబరాలు చేసుకొంటున్నాము. మంచిది.  నిజంగా ఇది మన జీవితాలకు సంతోషకరమైన దినము.*

*అయితే, రాజకీయ స్వాతంత్ర్యం, ఆత్మీయ బంధకాలనుండి విడిపించలేదు. ఆత్మీయ బంధకాల నుండి విడిపింపబడకపోతే? మన జీవితాలకు సార్ధకతలేదు. నిత్యజీవంలోనికి ప్రవేశంలేదు.*

*ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భాంగానైనా, ఏ బంధకాలచేత బంధించబడ్డామో? మనమెందుకు స్వపరిశీలన చేసుకోకూడదు? ఆత్మీయబంధకాలనుండి మనలను స్వతంత్రులను చేయగలిగేది ఏదైనా వుందంటే? అది సత్యమే. (సత్యము మనలను స్వతంత్రులను చేస్తుంది. యోహాను 8:32)*

*సత్యము అంటే? యేసు ప్రభువే సత్యము (యోహాను 14:6) ఆయన వాక్యమే సత్యము. (యోహాను 17:17). సత్యమైయున్న వాక్యము మనలను దేనినుండి స్వతంత్రులను చేస్తుందంటే? పాప బంధకాలనుండి.  “నీవు విడిపించబడ్డావా?*”

*ఇప్పటికే ఆత్మీయ బంధకాలనుండి విడిపించబడితే? నీ జీవితం ధన్యం. అయితే, ఒక్కమాట! లెక్కలేనంతమంది నశించిపోతుండగా, వారిని గూర్చిన భారం నీకుందా? నీ బాధ్యత గుర్తుందా?*

*జాన్ హైడ్ ఇంగ్లాండు నుండి ఇండియాకు మిషనెరిగా వచ్చి ప్రసవ వేధనతో ఇండియా రక్షణ కొరకు ప్రార్ధించేవాడట. అతని మోకాళ్ళ ప్రార్ధనతో ఆయన వేసుకున్న ప్యాంటుకు రంధ్రాలు పడేవట. అతని భార భరితమైన ప్రార్థనకు, ఎడమ ప్రక్కన వుండాల్సిన  గుండె సహితం, మధ్యలోకి చేరిందట.*

*ప్రభువా! ఆత్మలనివ్వు. లేకుంటే, నా ఆత్మను తీసుకో! అంటూ రోధించేవాడట. ఆయనకే అంత భారముంటే? ఒక భారతీయునిగా మనకెంత వుండాలి? దేశం రక్షణ కోసం ప్రార్ధించే ప్రార్ధనా యోధులు లేవాలి. అది నీవే కావాలి.  కనీసం ఈరోజైనా నీ దేశం కోసం ప్రభుపాదాలచెంత మోకరిల్లు!*

నా ప్రియ స్నేహితులారా. . . . బైబిల్ చెబుతుంది.... 
*“దేశం కోసం, అధికారుల కోసం, నాయకుల కోసం మీరు ప్రార్ధించండి అని.... నిజ క్రేస్తవుడు ఎప్పుడు దేశ క్షేమం కోసం పనిచేస్తూనే ఉంటాడు. ప్రార్ధిస్తూనే ఉంటాడు....*
🔹  ఆనాటి క్రేస్తవులు మన దేశ క్షేమం కోసం పనిచేశారు...
👉 నేడు కూడా ఎందరో క్రేస్తవులు కూడా పని చేస్తున్నారు.... 
*ఇంక ముందు కూడా క్రేస్తవులు దేశ క్షేమం కోసం పనిచేస్తూనే ఉంటారు.*

నా ప్రియ స్నేహితులారా....
చాలామంది క్రెస్తవ వ్యతిరేకులు కలసి క్రేస్తవులను భారతదేశానికీ విరోధులుగా రూపించే కార్యక్రమాలు చేస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. 
🔹క్రేస్తవ్యానికి వ్యతిరేకంగా అనేక పుస్తకాలు వ్రాస్తున్నారు,
🔹 క్రేస్తవ్యనికి వ్యేతిరేకంగా ఎన్నో మాటలు పలుకుతున్నారు.... 
*ఈ క్రమంలో వాళ్ళు ఉపయోగించుకునే ఒక విషయం స్వాతంత్ర ఉద్యమంలో క్రేస్తవులు ఎవ్వరు పాల్గొనలేదు అని...*
👉 పైగా క్రేస్తవులు బ్రిటీష్ వారితో కలసి పనిచేశారని వారు నిందలువేస్తున్నారు.

♻ *పదిసార్లు పెద్దగ అసత్యాన్ని పలికినంతమాత్రాన అసత్యం సత్యంగా మారిపోదు....*

♻ *క్రెస్తవ వ్యేతిరేకులు వేస్తున్న నిందలకు జవాబుగా చరిత్ర అనేక విషయాలు తనలో దాచి ఉంచుకుంది.*

👉 *స్వాతంత్ర ఉద్యమంలో దేశాన్ని ప్రేమించిన ప్రతి ఒక్కరు పాల్గొన్నారు, వారిలో కులమతాలకు అతీతంగా అనేక వర్గాలవారు ఉన్నారు, వారిలో అనేకులు క్రేస్తవులు కూడా ఉన్నారు.*
 గమనించండి చరిత్ర ఎప్పటికి అబద్దం కాదు.

*“Felix Wilfred”* అనే చరిత్రకారుడు
*స్వాతంత్ర ఉద్యమంలో క్రైస్తవుల పాత్ర గురించి అనేక విషయాలు అధ్యయనం చేసి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసిన కొందరి మిషనరీస్ పేర్లను సేకరించారు....* 

వారిలో  *“Stanley Jones “CF Andrews “* 
*JC Winslow ”* *“ Varrier Elwin”* *“Richard keithahn”* *“Ernest Forrester”*  అనే వారు ఉన్నారు వీరు అందరూ క్రేస్తవులు,
👉 ఇంక పరాయి దేశం వారు అయినప్పటికీ కూడా స్వాతంత్ర ఉద్యమంలో వీరు అనేకులను ప్రోత్సాహించి ముందుకు నడిపించిన వారే....

👉 *ఇలా కొందరు క్రేస్తవులు, మిషనరీస్ స్వాతంత్ర ఉద్యమానికి సహకరిస్తున్నారు అని తెలుసుకున్న బ్రిటీష్ ప్రభుత్వం ఆనాడు అనేకమంది క్రేస్తవ మిషనరీస్ ని భారతదేశం నుండి బలవంతంగా పంపివేసింది.*
👉 *ఆనాటి క్రేస్తవ మిషనరీస్ మనకి వైద్యం, విద్యరంగాలలో అనేక విధాలుగా సహాయ పడిన వారె అని మనం మరచిపోకూడదు.*

అలాగే... భారతదేశానికి చెందిన చరిత్రకారుడు *“George Thomas”* అనే అయన కూడా కొంత విషయం సేకరణ చేశారు... ఈ విషయాలు మనలను ఆశ్చర్యపరుస్తాయి....

 1885లో ప్రారంభించబడిన *“Indian National Congress”* లో  అనేక మంది క్రేస్తవులు ప్రధానమైన పాత్ర పోషించారు....

👉 మీరుకూడా చరిత్రను పరిశిలన చేస్తే 1887లో జరిగిన 3rd Annuel Session Of Congress *జాతీయ సదస్సులో మొత్తం 600 మంది కుడుకుంటే వారిలో 20 మంది క్రేస్తవులు ఉన్నారు అని చూస్తాము.*

  ఆ జాతీయ సదస్సులో ప్రసంగించిన వారి లిస్టులో
 ♻ *“Madhu Sudhan Das”* అనే గొప్ప వ్యేక్తి కనిపిస్తారు ఈయన ఒరిస్సా రాష్టానికి చెందిన క్రెస్తవ దైవజనుడు.

 ♻ అలాగే *“ Kali Cheran Benerjee”* అనే బెంగాలీ క్రేస్తావుడు కూడా తరచుగా ఆ జాతీయ సదస్సులో ప్రసంగించెవారు. స్వాతంత్ర ఉద్యమం కోరకు అనేకులను ప్రోత్సాహించేవారు.

*నా ప్రియ స్నేహితులారా....భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో అనేక రకాలైన ఘట్టాలు ఉన్నాయి...*

♻ 1905 లో స్వరాజ్యం ఉద్యమం దగ్గరి నుండి 1942లోని క్విట్ఇండియా ఉద్యమం వరకు చూస్తే క్రేస్తవుల పాత్ర మనకి కనిపిస్తుంది. *మన దేశానికీ చెందిన అనేక క్రెస్తవ నాయకులు వారి సంస్థలు కలసి ఈ ఉద్యమంలో పోరాడారు. ఆ సంస్థల వివరాలు మీకు అందిస్తున్నాము....*

1. All India Conference Of Indian Christians…. 
2. The National Christen Council Of India…. 
3. Christian Leaders And Student Groups Of UTC, Bangalore… 
4. Seampore Collage Bengal…. 
5. St.Paul’s College Calcautta…. 
6. Malabar Chrestian Colleag, Kerala… 
7. The Youth Christian Council Of Action…. 
8. The Students Christen Movement Of India…. 
9. The Indian Christian Association Of Bengal….
 10. A Conference Of Christians Of Bombay… etc. . . .

*ఈ క్రెస్తవ సంస్థలు అన్ని కూడా కలసి ప్రత్యక్షంగాను పరోక్షంగాను భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పోరాడాయి.*

అంతే కాదు.... 
1973లో మన పొరుగు రాష్టమైన తమిళనాడు ప్రభుత్వం *“Who Is Who Of Freedom Fighters”* అనే పుస్తకాన్ని విడుదల చేసారు... అందులో వందమందికి పైగా క్రేస్తవులు కనిపిస్తారు.

♻ *ఇలా చిన్న స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకూ కూడా క్రేస్తవులు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పని చేసినట్లుగా చారిత్రక ఆధారాలు చూస్తాము....*

అంతర్జాతీయ స్థాయిలో కూడా చూస్తే.... *“JC Kumarappa”* అనే నాయకుడు కనిపిస్తారు ఈయన స్వయంగా గాంధీ గారితో కలసి పనిచేసారు...  1929 ఆ కాలంలో గాంధీగారు *“Young India”* అనే పత్రికకు ఎడిటర్ గా పనిచేస్తుండేవారు ఈ *“JC Kumarappa”* ఆ పత్రకలో అనేక వ్యాసాలు వ్రాసారు స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసారు... 

సత్యాగ్రహం, దండి మార్చ్, క్విట్ ఇండియా ఉద్యమాల్లో గాంధితో కలిసి పోరాడారు.  *యంగ్ ఇండియా* అనే గాంధి యొక్క పత్రికకి ప్రధాన సంపాదకుడుగా వ్యవహరించే సమయంలో అతని రచనలకు గాను బ్రిటీష్ ప్రభుత్వం ఏడాదిన్నర జైలు శిక్ష విధించింది. గాంధి చొరవతో విడుదలైన కుమారప్ప ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి క్రైస్తవులంత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనేలా నాయకుడిగా ముందుండి నడిపించాడు.అనేక సార్లు జేలుకు వెళ్లారు అనేక శ్రమను అనుభవించారు, దేశంకోసం పోరాడారు....  కుమారప్ప నారాయణ్ కాంగ్రెస్ కేబినేట్ లో ప్రముఖ నాయకుడిగా సేవలందించారు.

👉భారతదేశానికి స్వాతంత్ర వచ్చిన తరువాత ఇతనికి AICC లో ఒక పదవికూడా ఇచ్చారు కానీ ఈయన *“నేను పోరాడింది పదవి కోసం కాదు నా దేశం కోసం”* అని చెప్పి ఆ పదవిని విడచిపెట్టి వెళ్ళిపోయారు...
*“JC Kumarappa”* ఒక అద్భుతమైన క్రేస్తవుడు.
అంతే కాదు....

♻ *పండిత రామబాయి సరస్వతి*
(23 ఏప్రిల్ 1858 - ఏప్రిల్ 5, 1922)
ఈ పేరు మనలో చాలా మందికి సుపరిచితమే
రామాబాయి ఒక భారతీయ సాంఘిక సంస్కర్త, మహిళల సాధికారత కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి , మరియు ఉత్తమ విద్యావంతురాలు. కలకత్తా విశ్వవిద్యాలయంలో సంస్కృత విద్యలో పట్టా పొందిన రామాబాయి *“పండిట్ అని బిరుదు పొందిన భారతీయ తొలి మహిళ”.*

ఈమె బ్రాహ్మణ కుటుంబం లో జన్మించినప్పటికీ తాను వివిధ మతగ్రంధాలను పరిశోధించి సత్యాన్ని తెలుసుకొని *క్రీస్తు మార్గంలో నడిచి క్రైస్తవురాలిగా గుర్తింపుపొందింది,*  క్రైస్తవ సమాజంలో మహిళా సమనత్వం గురించి మహిళలకు ఉపదేశాలిస్తూ మహిళా సాధికారత కోసం మరియు సువార్త వ్యాప్తికై పాటుపడింది,   స్వాతంత్రోద్యమం లో పాల్గొనుటకు బహు ప్రయాసతో తోడ్పడింది.
  *“స్వామీ వివేకానందుల వారు రమాబాయి గురించి గొప్ప క్రైస్తవ మహిళా అని ఉద్గాటించారు”*

*తరేవ్తుందియిల్ తితుస్* (తితుస్ జీ )
తితుస్ జీ  కేరళ క్రైస్తవుడు. నోట్ల రద్దు కాకముందు ఉన్న *500 రూపాయల నోటుపై గాంధిజీతో స్వతంత్ర సమారయోధులు నడుస్తున్న చిత్రంలో గాంధిజీ తర్వాత 7వ వ్యక్తీ తితుస్ జీ...*

 దండి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. తితుస్ జీ అనే పేరుని గాంధిజీ ముద్దుగా పిలిచేవారు.

♻ *సుశీల్ కుమార్ రుద్ర*
 (7 జనవరి 1861 - 29 జూన్ 1925)

*భారతీయ విద్యావేత్త మరియు మహాత్మా గాంధీ మరియు సి.ఎఫ్ ఆండ్రూస్ యొక్క సహచరుడు, ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో మొదటి భారతీయ ప్రిన్సిపాల్ గా పనిచేశారు.*

 స్వాతంత్రోద్యమంలో మొదటితరం వారితోను రెండవతరం వారితోను ఉద్యమాల్లో పాల్గొన్న సుషీల్ కుమార్ రుద్రా ఉద్యమ పోరాట స్పూర్తిని చూసిన సౌతాఫ్రిక పౌరులైన ఆండ్రూ మరియు విలియం పియర్సన్ గాంధీతో పాటు ఇండియా వచ్చి స్వాతంత్రోద్యమం లో పాల్గొన్నారు. 

*బెంగాలి క్రైస్తవుడైన సుషీల్ కుమార్ వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహంతో మిషనరీగా సేవలు కూడా అందించాడు.*

♻ *కాళీ చరణ్ బెనర్జీ* (1847-1902),
కాళి చరణ్ బెనర్జీ లేదా కే.సి. బెనర్జీ లేదా K.C. , 
*కలకత్తా క్రిస్టో సమాజ్(క్రైస్తవ సమాజం) యొక్క స్థాపకుడు.*
భారత స్వతంత్ర సాయుధ ఉద్యమ మార్గదర్శకులలో బేనర్జీ ప్రముఖుడు. భారత జాతి విముక్తి  ఉద్యమ స్థాపకుడిగా ఉన్నారు మరియు భారతదేశ స్వతంత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు.

బెంగాల్ హెరాల్డ్ పత్రికలో బెనర్జీ అన్న మాటలు ఇలా ఉన్నాయి.
 *"మేము క్రైస్తవులమే అయినప్పటికీ హిందువులుగా రద్దుచేయబడినవారంకాము,మేము హైందవ క్రైస్తవులం,మేము క్రైస్తవ్యన్ని అనుసరించువారం కానీ మా నర నరాన ఉన్నది జాతీయత్వం. మేము సహోదర భావం కలిగిన జాతీయవాదులం"*

బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలకు గాను కోల్ కత జైల్ లో బంధించబడి తీవ్ర మనోవ్యధకు గురిచేయబడుట చేత 1902 లో వీర మరణం పొందాడు.

*“KT Paul”* . . . . అలాగే... 1880లో *“Venkat Chakkarai”*. . . . అలాగే... 1906 లో *“Paul Ramaswamy*. . . . తమ పోరాటపటిమను చూపించారు....

♻ చివరిగా స్వాతంత్ర ఉద్యమానికి సంఘీభావంగా పనిచేసిన ఆనాటి ప్రింట్ మీడియా వివరాలు చూస్తే....

▪ *రాజ్య సమాజం (1847)*
 ▪ *పశ్చిమోదయం (1847)* 
▪ *పశ్చిమా తారక (1863)* 
▪ *సత్యనదకాలమ్ (1863)*
▪ *సత్యనాదం నజరని దీపీక (1887)* 
▪ *కేరళమిత్రమ్* మలయాళ మనోరామ (1890)…. 
ఇలా అనేక పత్రికలు తమ వంతు బాధ్యతను నిర్వహించాయి.... 

మీకు మరో ముక్య విషయం చెప్పాలి అండీ.... *ఈ పత్రకలకు ఆనాటి  ఎడిటర్లు అందరు క్రేస్తవులే,  యేసుక్రీస్తును విశ్వసించినవారే.*

నా ప్రియ స్నేహితులారా....

ఈ విషయాలు అనీ మీకు అందించటంలో మా ఉద్దేశం...
 *భారత దేశపు క్రేస్తవుడు తన దేశాన్ని ప్రేమిస్తాడు, తన దేశం కోసం పని చేస్తాడు అని చెబుతూ...*
👉 క్రేస్తవులు స్వాతంత్ర ఉద్యమంలో పని చెయ్యలేదు, క్రేస్తవుల పాత్ర ఏమిలేదు అంటూ చరిత్ర తెలియక మాటలాడుతున్న వారికీ జవాబుగా అందిస్తున్నాము.

👉కొందరు క్రేస్తవ్యం బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి భారతదేశానికి నేర్పించారు అని అనుకుంటారు....
వాస్తవం చూస్తే... 
*బ్రిటిష్ వాళ్ళ కన్న ముందే అంటే మొదటి శతాబ్దంలోనే యేసుక్రీస్తు ప్రభులవారి శిష్యుడు అయిన తోమా గారి ద్వారా క్రేస్తవ్యం భారత దేశాన్ని తాకింది....*

👉 *క్రేస్తవ్యం అమెరికా వాళ్ళది అని చెప్పే వారు ఉన్నారు... ఒక్క మాటలో చెప్పాలి అంటే క్రేస్తవ్యం భారత దేశానికి వచ్చిన రోజుకి అమెరికా కాదుకదా చాలా దేశాలు ప్రపంచాన్ని ఇంకా చూడలేదు.*

నా ప్రియ స్నేహితులారా....

ఈ విషయాలు అనీ మీకు అందించటంలో మా ఉద్దేశం...
 🔺నిజ క్రేస్తవుడు తన దేశాన్ని ఎప్పుడు ప్రేమిస్తాడు.

🔺అలాగే ఆనాడు స్వాతంత్ర ఉద్యమంలో కూడా క్రేస్తవులు తమవంతు సేవలు అందించారు. దేశంకోసం ప్రాణాలు అర్పించారు.
మతం ముసుగువైసుకుని దేశభక్తి విషయంలో క్రేస్తవులపై నిందలు వేసే వారు ఎందరో ఉన్నారు....

*నిజానికి దేశభక్తి విషయంలో క్రేస్తవులు కూడా ఎం తక్కువ కాదని ఈ రుజువులు ఆధారాలు చెబుతున్నాయి.దేవుని మనస్సులో మన దేశంపట్ల ఒక మంచి చిత్తం ఉంది....*
 
👉ఇండియా పేరు బైబిల్ లో రెండు సార్లు ప్రస్తావించబడిందని మనం మరచిపొకూడదు.

నా ప్రియ స్నేహితులారా. . . . బైబిల్ చెబుతుంది.... 
*“దేశం కోసం, అధికారుల కోసం, నాయకుల కోసం మీరు ప్రార్ధించండి అని.... నిజ క్రేస్తవుడు ఎప్పుడు దేశ క్షేమం కోసం పనిచేస్తూనే ఉంటాడు. ప్రార్ధిస్తూనే ఉంటాడు....*
🔹  ఆనాటి క్రేస్తవులు మన దేశ క్షేమం కోసం పనిచేశారు...
👉 నేడు కూడా ఎందరో క్రేస్తవులు కూడా పని చేస్తున్నారు.... 
*ఇంక ముందు కూడా క్రేస్తవులు దేశ క్షేమం కోసం పనిచేస్తూనే ఉంటారు.*

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...