ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిల్ నందలి స్త్రీలు రెండవ భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳


 1⃣ *యేసు తల్లియైన మరియ.* ✳

 (రెండవ భాగము)


 *లోకరక్షకుని జనన కాలంలో దేవుని కృపపొందితి అని దేవదూత ద్వారా కొనియాడబడిన స్త్రీ యేసు తల్లియైన మరియ.*

 (లూకా 1:30)


👉 కన్యక గర్భవతియై కుమారుని కనును అతనికి *“ఇమ్మానుయేలు”* అను పేరు పెట్టబడును అనే ప్రవచనము క్రీస్తుకు పూర్వం దాదాపు 700 సం||ల క్రిందటనే ప్రవచింపబడినది. 

(యెషయా 7:14) 

👉దాని నెరవేర్పు క్రొత్తనిబంధనలో ఈ రీతిగా జరిగింది.


👉గబ్రియేలు దూత ద్వారా దేవుడు తన చిత్తాన్ని గలిలయలోని నజరేతు గ్రామ నివాసియైన యోసేపు అను పురుషునికి ప్రధానం చేయబడి పవిత్రురాలైన కన్య మరియకు బయలు పరచబడింది.


 *“మరియా, భయపడకుము! దేవుని వలన కృపపొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును”*

 (లూకా 1:30,33) 


👉ఈ మాట మరియకు భయాన్ని కలిగించగా అవిశ్వాసివలె నేను కన్యను. పురుషుని ఎరుగనిదానను నాకు ఇది ఎలా సంభవము? అని దూతను ప్రశ్నించింది. *అందుకు దూత పరిశుద్ధాత్మ వలననే నీవు గర్భం ధరిస్తావని చెప్పి ఇంకనూ ఆమెను ధైర్యపరచడానికి ని బంధువురాలును, వృద్ధురాలునైయున్న గోడ్రాలని పిలువబడే """ఎలీసబెతు""" కూడా గర్భము ధరించియున్నది. అమెకిప్పుడు ఆరవ మాసం అని చెప్పినప్పుడు,*

🔺 విశ్వాస-ముంచుటయందును,

 🔺ఆయన మాటలు విని లోబడుటయందును ఆసక్తిగల మంచి స్వభావమున్న మరియ 

🔺భయాన్ని, 

🔺బిడియాన్ని సంఘబహిష్కరణను లెక్కచేయక 

*ఇదిగో ప్రభువా! నీ దాసురాలను నీ చిత్తం చొప్పున జరుగునుగాక! అని ఆయన మాటకు విధేయత చూపింది.*

 (లూకా 1:38) 

👉ప్రభువు తల్లిగా వాడబడుటకు పూర్ణాంగీకారాన్ని తెలియజేసింది, ధన్యురాలైంది.


♻ *మనం కూడా మన దేహమనే దేవాలయంలో ఆయన్ను చేర్చుకోడానికి అంగీకరిస్తున్నామా?*


♻ *హృదయమనే ద్వారం వద్ద నిలుచుండి ప్రభువు తట్టుచుండగా దానిని తెరచి మరియ వలె ఆయనను మనలో చేర్చుకుంటున్నామా?*


♻ *మన దేహము దేవుని ఆలయమని గ్రహించిననాడే నిజమైన క్రిస్మస్ అని ప్రతివారు గ్రహించాలి.*


👉బంధువురాలైన *ఎలీసబెతును* చూడడానికి యూదా దేశముచేరి, వృద్ధురాలికి అభివాదము చేయుచున్న 

*మరియ స్వరాన్ని విన్న గర్భస్త శిశువు ఆనందంతో గంతులు వేశాడు.*

👉 ప్రభువు తల్లిని చుచాననే ఆనందాన్ని తల్లి గర్భంలో ఉండగానే ఆయన అనుభవించాడు. 


*క్రైస్తవ బిడ్డలమైన మనం బంధుమిత్రులను, ఇరుగు పొరుగువారిని కలిసినప్పుడు ఇట్టి ఆనందాన్ని పొందుతున్నామా? లేదా? అని ప్రశ్నించు-కుందాం.*


🔹పశుపాకలో లోకరక్షకుడు జన్మించగానే ప్రకృతి పులకించింది. 

🔹ప్రకాశ-వంతమైన నక్షత్రం పాకపై వెలసింది.

🔹 కాపరులు, 

🔹జ్ఞానులు ఆరాధించి కానుకలర్పించారు.

🔹 పరలోక సైన్యం పాటలు పాడారు. 


*ఇన్ని జరిగినా మరియ ఈ ఘనతంతా దేవునిదే నేను యిహలోకపు తల్లిని మాత్రమే అనే సత్యాన్ని మరువలేదు.*


👉 నీతిమంతుడైన యోసేపు, మరియలు ప్రభువును దేవునిదయలోనూ, మనుష్యుల దయలోనూ పెంచారు.


👉మరియ యోసేపుతో సాంసారిక జీవితాన్ని కొనసాగించి 

*యాకోబు, యోసేపు, సీయోను, యూదా అను కుమారులను, కుమార్తెలను కూడా పొందియున్నది.*

👉 కుటుంబ భారము ఎక్కువగా వరపుత్రుడైన యేసుపైననే మోపబడినది పెద్దకుమారుడగా యోసేపు మరణానంతరం వడ్రంగి పనిచేయుచూ ప్రభువు కుటుంబాన్ని పోషించాడు. 

*30 యేండ్ల ప్రాయం వచ్చే వరకు కుటుంబ సభ్యులను పోషించిన*

👉 ప్రభువు తన తండ్రి కార్యములు నెరవేర్చడానికి పూనుకున్నాడు. 

👉మరియ కూడా ఆయన శిష్యులతో  తిరిగింది. (అపో. 1:14) 


♻ *ప్రభువు అందరి స్త్రీలవలెనే ఆమే యెడల కూడా జరిగించాడు కాని ప్రత్యేకించి చూడలేదు.*


🔺కానా వివాహంలో ద్రక్షారసమై -పోయినప్పుడు తల్లి విజ్ఞప్తి చేయగా 

*“నాతో నీకేమి పని? నా సమయమింకా రాలేదు అన్నాడు”*

 (యోహాను 2:4) 


🔺మరియొక సందర్భంలో నీ తల్లియు, సహోదరులు వెలుపలనున్నారని చెప్పిన వ్యక్తితో 

*పరలోక-మందున్న నాతండ్రి చిత్తప్రకారం చేయువారే నా తల్లి, సహోదరులు అని చెప్పాడు.*

 (మత్తయి 12:46-50)


నవమాసాలు మోసి బాధకోర్చి, కని 30సం||ల వరకు ఒకే చోట జీవించి , ఆయనతో పాటు కొన్నిదినములు తండ్రి సేవలో తిరిగిన మరియకు 

*తన ప్రియాతి ప్రియమైన కుమారుడు సిలువ మ్రానుపై దారుణహింసలు, బాధలు పొందుచుచూచినా ఆమె హృదయవేదన ఎంతగా ఉన్నదో వర్ణించగలమా!*


👉 తనకు కలిగే బాధలు, జబ్బులు ఒంటరిగా భరించగలుగుతుంది. గాని బిడ్డలు పడే బాధలు మాతృమూర్తి చూస్తూ సహించలేదు. 

*సుమెయోను ప్రవక్త పసిబాలుని చూచి పలికిన ఆ ఖడ్గము తల్లి హృదయంలోకి దుసుకోనిపోగా ఆమె కన్నీరు మున్నీరుగా సిలువచెంత విలపించింది.*


♻ *యేసయ్యను కాక ఆయన తల్లి అయిన మరియమ్మను ఆరాధించవచ్చునా?*


👉 ఒక Lady treatment కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళింది...

డాక్టర్ ఆమె మెడలో శిలువను చూసి మీరు క్రైస్తవులా అని అడిగాడు...

ఆమె అవును యేసయ్య అంటే నాకు చాలా ఇష్టం అని జవాబిచ్చింది...

అయితే డాక్టర్ కోపంతో నేను Catholic ని ...

నాకు యేసయ్యను ఆరాధించేవారంటే నాకు చాలా కోపంగా వుంటుంది.

వారందరూ యేసయ్యను ఆరాధిస్తారు కాని ఆయనకు జన్మనిచ్చిన మరియమ్మను ఆరాధించటం మరచిపోతున్నరు...


ఆమె డాక్టర్ చెప్పిందంతా విని చిన్నగా నవ్వి ఇలా సమాధానమిచ్చింది...

*డాక్టర్ గారు ఒక వేళ మీరు లేకపోతే treatment కోసం మీ అమ్మగారి దగ్గరకు వెళ్ళమంటారా...*


డాక్టర్ కోపంతో... 

*మా అమ్మగారు దగ్గరకు ఎలా వెళ్తారు. అసలు ఆమెకు ఏం తెలుసు* 

👉మీ అనారోగ్యం గురించి...

మీ అనారోగ్యం గురించి నాకే తెలుసు...

👉 మిమ్మల్ని ఎలా ట్రీట్ చెయ్యాలో...

ఎలాంటి మందులు ఇవ్వాలో నాకు తెలుస్తుంది కాని 

*మా అమ్మగారికి ఎలా తెలుస్తుంది...*


👉నేను అదే చెబుతున్నాను డాక్టర్...

*నా పాపమును తీసివేసే అధికారం  నా పాపము కొరకు చనిపోయిన యేసయ్యకు వుంటుంది కాని ఆమె తల్లికి ఎలా వుంటుంది...*


 *నా గురించి పూర్తిగా తెలిసి నాకు నిత్యరాజ్యమిచ్చే యేసయ్య దగ్గరకు వెళ్ళాను*


👉 కాని ఆమె తల్లి దగ్గరకు ఎలా వెళ్ళగలను మీరే చెప్పండి ???


*యేసు క్రీస్తును ఆరాధించే మనసు నీకుంటే?*

 

*నీవు ఆయనను వెతుక్కుంటూ వెళ్ళాల్సిన పనిలేదు.*


👉కారణం? 

*ఆయన నిన్నే వెతుక్కుంటూ వచ్చాడు.*


*నీకోసం వచ్చిన ఆయనను నీ హృదయంలో చేర్చుకుంటేచాలు.*


*నీ హృదయమనే తలుపు నొద్దనుండి తట్టు చున్నాడు. కనీసం ఈ రోజయినా ఆయనను ఆహ్వానిద్దామా? ఆరాధిద్దామా?*


అట్టి కృప, ధన్యత 

దేవుడు మనకు అనుగ్రహించునుగాక!


*ఆమెన్! ఆమెన్! ఆమెన్!*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...