ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిల్ లో ఉన్న కపటోపాయములు* *(పార్ట్ - 3)*

*బైబిల్ లో ఉన్న కపటోపాయములు* *(పార్ట్ - 3)*

21. *బాప్తిస్మమిచ్చు యోహానుకు వ్యతిరేకముగా హేరోదియా కపటోపాయము* - బాప్తిస్మమిచ్చు యోహాను తాను చేయుచున్న వ్యభిచారమును గూర్చి బహిరంగముగా హెచ్చరించుచున్నందున ఈమె అతనిపై పగ తీర్చుకొనుటకు వేచి ఉండెను. హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు ఈమె కుమార్తె నాట్యమాడి హేరోదును సంతోషపరచగా అతడు ఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని ప్రమాణ పూర్వకముగా వాగ్దానము చేసినప్పుడు ఆమె బాప్తిస్మమిచ్చు యోహాను తలను పళ్లెంలో పెట్టి తనకు ఇప్పించవలసిందిగా కోరమని తన కుమార్తెను ప్రేరేపించెను. - *(మత్తయి 14 వ అధ్యా)*

22. *యేసుకు వ్యతిరేకముగా యూదా ప్రధానయాజకుల మరియు పరిసయ్యుల కపటోపాయము* - *(యోహాను 11:47-57)*

23. *లాజరుకు వ్యతిరేకముగా యూదా ప్రధానయాజకుల మరియు పరిసయ్యుల కపటోపాయము* - లాజరు చనిపోయి సమాధిలో నాలుగు దినములుంచబడగా యేసు ఇతనిని మృతులలో నుండి లేపెను. అందుచే యూదులలో అనేకులు తమను విడిచి యేసునందు విశ్వాసముంచేదరని వీరు భయపడి యేసు యొక్క మహిమాన్వితమైన సూచకక్రియకు సాక్షమైన లాజారును చంపచూచిరి. - *(యోహాను 12:10-11)*

24. *యేసుకు వ్యతిరేకముగా ఇస్కరియోతు యూదా యొక్క కపటోపాయము* - *(మత్తయి 26:14-16)*

25. *స్తెఫనుకు వ్యతిరేకముగా యూదా సమాజపు పెద్దల యొక్క కపటోపాయము* - స్తెఫను తీర్పును గూర్చి చెప్పిన సందేశము వ్యాపించకుండా వీరు అతనిని చంపుటకు దురాలోచన చేసిరి - *(అపో.కా. 6:8-15)*

26. *క్రైస్తవులను బంధించుటకు సౌలు యొక్క కపటోపాయము* - *(అపో.కా. 8:3; 9:1-2)*

27. *పౌలుకు వ్యతిరేకముగా దమస్కు యూదుల కపటోపాయము* - పరిసయ్యుడైన సౌలు పౌలుగా మారి క్రైస్తవుడైనందున వీరు అతనిని చంపనాలోచించి రాత్రింబగళ్ళు ఊరి ద్వారములయొద్ద కాచుకొనియుండిరి - *(అపో.కా. 9:22-25)*

28. *పౌలుకు వ్యతిరేకముగా యెరూషలేము యూదుల కపటోపాయము* - *(అపో.కా. 9:26-29; 21:31; 22:17-21; 23:6-14; 24:1; 25:1-3)*

29. *విశ్వాసులకు వ్యతరేకముగా హేరోదు యొక్క కపటోపాయము* - ఇతడు అవిశ్వాసులైన యూదులను సంతోషపరచుటకు యాకోబును చంపించెను. అదే విధంగా పేతురు కూడా చంపుటకు ప్రయత్నించుచుండెను - *(అపో.కా. 12 అధ్యా)*

30. *పౌలుకు వ్యతిరేకముగా ఆసియా యూదుల కపటోపాయములు:-*
A. పిసిదియలోనున్న అంతియొకయ పట్టణములో - (అపో.కా. 13:14,45,50)
B. ఈకోనియ పట్టణములో - (అపో.కా. 14:1-2)
C. లుస్త్ర పట్టణములో - (అపో.కా. 14:6,7,19)

31. *పౌలుకు వ్యతిరేకముగా గ్రీకు యూదుల కపటోపాయములు:-*
A. థెస్సలోనిక పట్టణములో - (అపో.కా. 17:1,5)
B. బెరయ పట్టణములో - (అపో.కా. 17:13)
C. కొరింధు పట్టణములో - (అపో.కా. 18:1, 13)
D. మాసిదోనియలో - (అపో.కా. 20:3)

32. *పౌలుకు వ్యతిరేకముగా దేమేత్రియ అను కంసాలి యొక్క కపటోపాయము* - ఇతడు అర్తెమిదేవికి వెండి గుళ్లను చేయించుట వలన మిగుల లాభము కలుగుచుండెను. అయితే పౌలు విగ్రహారాధనకు వ్యతిరేకముగా సువార్త చేయుచుండుట చేత ఇతనికి నష్టము వచ్చెను. అందుచే ఇతడు పౌలుకు వ్యతిరేకముగా దురాలోచన చేసెను - *(అపో.కా. 19:24-27*)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...