ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బైబిలు లో ఒక""ధైర్యవంతురాలైన #స్త్రీ""ఉన్నాది.

📖 *బైబిలు లో  ఒక""ధైర్యవంతురాలైన #స్త్రీ""ఉన్నాది.*??

ఈమె భర్త ఒక రాజు దగ్గర #గృహానిర్వాహకుడిగా పనిచేసేవాడు.

ఆ రాజు చాలా దుర్మార్గుడు, చెడ్డవాడు.
ఈ రాజుని మన "#యేసుప్రభువే"   '#నక్క' అని సంభోధించాడు. అంత చెడ్డవాడు ఈ రాజు.

బాప్తిస్మము ఇచ్చే యోహానుని కూడా చంపించేసిన క్రూరుడు ఈ రాజు.
మన ప్రభువును కూడా తృణీకరించి, అపహసించిన దుర్మార్గుడు ఈ రాజు.

ఈ రాజు దగ్గర పనిచేస్తున్న ఆ గృహానిర్వాహకుడి భార్య (ధైర్యవంతురాలైన స్త్రీ) యేసుక్రీస్తు వలన ఒక వ్యాధి విషయంలో స్వస్థత పొందింది.

అప్పటినుంచి గొప్ప విశ్వాసిగా మారి క్రీస్తుప్రభువుకు, ఆయన శిష్యులకు పరిచారము చేయటం ప్రారంభించింది.

నా యజమానునికి ఇష్టం లేని మనిషికి నేను పరిచర్య చేస్తున్నాను, *ఈ విషయం తెలిస్తే  రాజు నన్ను చంపేస్తాడేమో అని ఒక్కసారి కూడా భయపడని ధైర్యవంతురాలు ఈ స్త్రీ.*

తనకు కలిగిన ఆస్తితో ప్రభువుకు పరిచర్య చేసేది.
*తన చుట్టూ ఆపదలు పొంచివున్నా, మరణ భయాలు నీడ వలే తనను వెంబడిస్తున్నా కానీ ఏనాడు ప్రభువుకు దూరం అవ్వని గొప్ప విశ్వాసి ఈ స్త్రీ.*

కొన్ని రోజుల గడిచిన తరువాత *ప్రభువును సిలువ వేసి చంపేశారు.*
శిష్యులందరు భయముతో కాలం గడుపుతున్నారు *అటువంటి ప్రమాదకరమైన సమయంలో ప్రభువు తిరిగి లేచాడు అని అందరితో ధైర్యంగా చాటించిన స్త్రీలలో  ఈమె కూడా ఒకరు.*

ఆహా!!! ఈమె ధైర్యానికి దేవుడు ఎంత గొప్ప ధన్యత  ఇచ్చారో కదా..
*భక్తులకు, శిష్యులకు సహితం లేని ధన్యత (ప్రభువు తిరిగి లేచాడు అనే వార్త చాటించటం) ఈ స్త్రీకి దక్కింది.*

ఈరోజుల్లో అన్యుడైన యజమానుని దగ్గర పనిచేసే #క్రైస్తవ #బిడ్డలు తమ యజమానునికి భయపడి, విగ్రహారాధనలు చేసేస్తున్నారు.*

విగ్రహారాధన, పూజలు చేస్తున్నారు, *ఆదివారం సన్నిధికి మాని పనిలోకి వెళ్లిపోతున్నారు.*
దేవునికంటే ఎక్కువగా యజమానునికి భయపడి జీవాధిపతినే నిర్లక్ష్యం చేసేస్తున్నారు. అయ్యో ఎంత విచారం!!!

*ఈ స్త్రీ వలె ఈనాటి (నేను, నువ్వు) క్రైస్తవులు ధైర్యం కలిగి దేవునిలో ముందుకు నడిస్తే ఆ స్త్రీకి ఇచ్చిన ధన్యతను దేవుడు మనందరికి ఇస్తారు.*

ప్లీజ్ ఫ్రెండ్స్ *యజమానునికి, టీచర్స్, బంధువులకు, స్నేహితులకు భయపడి దేవునికి ఇష్టం లేని పని చేయకండి ప్లీజ్....*

ఇంతకీ ఆ #ధైర్యవంతురాలైన #స్త్రీ ఎవరో మీకు తెలుసా?????

తెలిస్తే జవాబు చెప్పండి ప్లీజ్...

అందరికీ
#మరనాత=యేసుప్రభువు త్వరగా వచ్చుచున్నాడు  #1కోరింది 16:22*

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

చెట్లు మరియు వృక్షములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *బైబిల్ లో చెట్లు🌳 మరియు 🌴వృక్షములు* 1. *అంజూరపు చెట్టు:-*    న్యాయా9:10,11; యెావే1:12 2. *అగరకారపు చెట్టు:-* Numbers 24:6,Psalms 45:8,Proverbs 7:17,song of solomon 4:14. 3. *దబ్బచెట్టు, దాల్చిన చెట్టు:-* సామెత...

శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు

📚 *ప్రతిరోజూ బైబిల్ వాస్తవాలు*📚 *💎 శిష్యుల పేర్లు ౼ అర్ధములు ౼ హత సాక్ష్యములు 💎* ◾ *మత్తయి = యెహోవాదానము.*            (మత్తయి 9:9)                ఇతియోపియా అను పట్టణములో కత్తి చేత చంపబడి హతసాక్షి ఆయెను. ◾ *యోహాను = యెహోవాదానము , యెహోవా కృప.*  (మార్కు 1:19)   మరుగుచున్న నూనెలో విసిరివేయబడినప్పటికి దేవుని అద్భుతం వలన మరణించలేదు చివరకు పత్మాసు లోయలో పడవేయబడి, ప్రకటన గ్రంధం వ్రాసెను. ◾ *పేతురు = బండరాయి*           (యోహాను 1:42)                    రోమాలో తలక్రిందులుగా సిలువ వేయబడెను. ◾ *యాకోబు = మడిమెపట్టుకొనువాడు , మోసగాడు.*  (మార్కు 1:19)                       యెరూషలేములో  శిరచ్చేదనము చేయబడెను. ◾ *చిన్న యాకోబు = మెడిమెపట్టుకొనువాడు.*       (మత్తయి 10:3)     ◾ *అంద్రెయ = పౌరుషం గలవాడు.*             ...

బైబిల్ నందలి స్త్రీలు మొదటి భాగము

✳ *భక్తి గల స్త్రీలు* ✳  1⃣ *ధన్యురాలైన మరియ*   (మొదటి భాగము ) *యెహోవా యందు భయభక్తంలు కలిగిన స్త్రీ కొనియాడ బడును.*  సామెతలు31:30 బైబిల్ చదవరులు  బైబిల్ నందు మొదట ఎంత మంది మరియలు ఉన్నారు ? తెలుసుకుందాం.  ♻ *ఆరుగురు మరియలు* ♻ ఏ చరిత్ర ఏ మరియను గూర్చినదో గ్రహించుట కష్టం.కానీ నూతన  నిబంధనలో పేర్కొనబడిన  *ఆరుగురు మరియలను* గూర్చి తెలుసుకొందాము. 1.యేసు తల్లియైన *మరియ* ఎప్పుడును సందర్భానుసారముగ  స్పష్టముగా గుర్తింపబడినది. 💥2 *మగ్దలేనేమరియ* లోనుండిఏడుదయ్యములు వెళ్ళగొట్టబడినవి. మగ్ధాలప్రాంతమునకు చెందిన స్త్రీ.(లూకా8:2) గుర్తించుటకు  *మగ్ధలేనే* అను పదములేకుండ యెప్పుడూ ఆమె పేర్కొన బడలేదు. 💥 3.అపోస్తులుడైన యాకోబు(చిన్నయాకోబు)యోసే అను వారి తల్లి అని పిలువబడినది. యోహాను19:25, మత్తయి27:56,మరియు మార్కు15:40 పోల్చి చూచినట్లయితే చిన్నయాకోబు తల్లియైన ఈ *మరియ* అల్ఫయి భార్య అనియు( *క్లోపా అని పిలువబడిన* యోహాను 19:25) యేసు తల్లి అయిన మరియ  సహోదరి మత్తయి 27:61 మరియు 28:1;లో తప్ప మరియొక మరియ అని గానీ (అనగా కన్య మరియ గాక ఆమె సహోదరి) మరియు యోహాను19:25 ఉన్న...